ఉపాధ్యాయుడిని చితకబాదారు
ఖమ్మం: వైరా మండల పరిధిలోని ముసలిమడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌పై గురువారం దాడి జరిగింది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె. వెంకటేశ్వర్లు గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన నర్సింహారావు అనే వ్యక్తి టీచర్‌ను చితకబాదాడు. మధ్యాహ్నభోజనం వండే విషయంలో ఇటీవల జరిగిన వివాదమే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.