వన్ మోర్!
బిగ్స్క్రీన్పై కమెడియన్... రియల్ లైఫ్‌లో విలన్లా ఉన్నాడు హాలీవుడ్ నటుడు బిల్ కాస్బీ. అతడి కీచక పర్వానికి బలైనవారు తవ్విన కొద్దీ వెలుగు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఇరవై మందికి పైగా ఈ లిస్టులో ఉండగా... తనపైనా అఘాయిత్యం చేశాడంటూ తాజాగా మరొకరు వచ్చి చేరారు. 1970లో మిచిగాన్ హోటల్ రూమ్‌లో బిల్ తనను బలాత్కరించాడని శామీ డేవిస్ జూనియర్ మాజీ ప్రియురాలు క్యాథరిన్ మెక్కీ ఆరోపించింది. ప్రస్తుతం ఈమెకు 65 ఏళ్లు. బిల్‌కు 77 ఏళ్లు. నాడు బిల్ తనను కలవాలంటూ హోటల్ రూమ్‌కు పిలిచాడని, వెళ్లిన వెంటనే తనపై అఘాయిత్యం చేశాడని పేర్కొంది.