వేదఘోషతో పులకరించిన బాసర
బాసర : బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం వేదఘోషతో పుల కరలించింది. గురుపౌర్ణమి ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభ మైంది. తొమ్మిది గంటలకు ఆలయం నుంచి ఆలయ చైర్మన్ శరత్పాఠక్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వర్లు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలతో వేద వ్యాస ఆలయానికి బయలు దేరారు.
వేదవ్యాస ఆలయంలో అర్చకులు నిర్వహించారు. యాగ మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల «మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, మంటపారాధన, చండీపారాయణం, తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఆలయంలో అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం వేద వ్యాస ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేటి పూజ కార్యక్రమాలు ....
ఉదయం 8:30 లకు స్థాపిత దేవత ఆహ్వానం, మహావిద్యాపాయణం, చండీపారాయణం, సరస్వతీ హŸమం, తదితర పూజలను నిర్వహిస్తారు.