Honda scooter
-
పండక్కి వచ్చేస్తోంది... సరికొత్త రూపంలో హోండా యాక్టివా!
స్కూటర్ విభాగానికి యాక్టివా రూపంలో పవర్‌ని పరిచయం చేసిన హోండా సంస్థ పండక్కి కొత్త కబురు చెప్పేందుకు రెడీ అయ్యింది. సక్సెస్ ఫుల్ మోడల్ యాక్టివాతో పాటు డియో నుంచి కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు మార్కెట్లోకి తేబోతుంది. పండక్కి రిలీజ్ ఇటీవల హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తమ కంపెనీ రాబోతున్న కొత్త మోడళ్లకు సంబంధించి డాక్యుమెంట్లను ఆర్టీఏ కార్యాలయం ఢిల్లీలో సమర్పించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నట్టు పేర్కొంది. రాబోయే పండగ సీజన్లోనే ఈ కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎల్ఈడీ సొబగులు హోండా యాక్టివాకు సంబంధించి మార్కెట్లో ప్రస్తుతం 5జీ వెర్షన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా తాజాగా 6జీ వెర్షన్‌ను తెచ్చేందుకు హోండా సిద్ధమైంది. హోండా 6జీ, హోండా 6జీ ఎల్ఈడీ వెర్షన్లలో రెండు స్కూటర్లు మార్కెట్లోకి రాబోతున్నట్టు హోండా డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం హోండా యాక్టివాకు స్టీల్ వీల్స్ ఉండగా 6జీ నుంచి ఎల్లాయ్ వీల్స్‌ని పరిచయం చేయనుంది. డియో నాలుగు వెర్షన్లలో యాక్టివాతో పాటు హోండా డియోకు సంబంధించి మొత్తం 4 వెర్షన్లను మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందులో కాంపోజిట్కాస్ట్ వీల్స్, డిజిటల్ స్పీడోమీటర్, కాంపోసిట్కాస్ట్వీల్స్, 3డి ఎంబ్లెమ్ వేరియంట్లలో మార్కెట్లోకి తేబోతున్నట్టు తెలుస్తోంది. 110 సీసీ హోండా త్వరలో మార్కెట్లోకి తేబోతున్న 6జీ యాక్టివా, డియో మోడల్స్ రెండింటి ఇంజన్ సామర్థ్యం 109.51 సీసీ సింగిల్ సిలిండర్‌గా ఉంది. యాక్టివా 5జీ 7.68 హెచ్పీతో 8,000 ఆర్పీఎం శక్తిని విడుదల చేయనుంది. ఇక డియోకు సంబంధించి 7.65 హెచ్పీతో 8,000 ఆర్‌పీఎంని రిలీజ్ చేస్తుంది. చదవండి : పలు కార్లపై బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన హోండా..! -
హోండా బీఎస్-6 యాక్టివా 125 ఎఫ్1 లాంచ్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ టూవీలర్‌ను లాంచ్ చేసింది. 'నిశ్శబ్ద విప్లవం'లో భాగంగా బీఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తన మొట్టమొదటి స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, ఇంజీన్ అప్డేట్స్తో న్యూ జనరేషన్ యాక్టివాను తీసుకొచ్చింది. ముఖ్యంగా నాయిస్ లెస్ స్టార్టర్ మోటార్, ఇన్‌స్ట్రుమెంటల్‌ను క్లస్టర్ కొత్త యాక్టివా 125 ఎఫ్ 1 స్కూటర్లో సరికొత్త ఫీచర్లుగా ఉన్నాయి. 125 సీసీ ఇంజీన్, డిస్క్‌బ్రేక్ తదితర ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇంకా స్టాండ్ ఇండికేటర్‌ను కూడా జోడించింది. స్టాండ్ వేసి వుంటే ఇంజీన్‌స్టార్ కాదు అన్నమాట. అలాగే 6 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది.ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. ధరల విషయానికి వస్తే, సాధారణ హోండా యాక్టా 125 రూ 60,000 - రూ .64,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం. బీఎస్ 9(ఎఫ్-1) రెగ్యులర్ వేరియంట్ యాక్టివా స్కూటర్ ధర సుమారు 10శాతం పెరగనుంది. -
హోండా ‘క్లిక్’ లాంచ్..సరసమైన ధరలో
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద స్కూటర్ తయారీదారు హోండా మరో గేర్ లెస్ స్కూటర్‌ను అతి తక్కువ ధరలో మార్కెట్లోకి విడుదల చేసింది. రెండో అతిపెద్ద టూవీర్ల తయారీ కంపెనీ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’(హెచ్ఎంఎస్ఐ) తాజాగా 110 సీసీ స్కూటర్‌ను లాంచ్ చేసింది . 2016 ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించిన ఈ స్కూటర్ ను ‘హోండా క్లిక్’ పేరుతో మంగళవారం విడుదల చేసింది. ధరను రూ.42,499 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా హోండా నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా అధిక మైలేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను రూపొందించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ మార్కెటింగ్) యద్విందర్ సింగ్ గులెరియా తెలిపారు. ఇందులో ఆటోమేటిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. గ్రామీణ మార్కెటే ప్రధాన లక్ష్యంగా ఈ స్కూటర్‌ను ఆవిష్కరించామని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కటో తెలిపారు. దేశంలో ప్రస్తుతం విక్రయమౌతోన్న ప్రతి పది టూవీలర్లలో ఆరు వరకు 100-110 సీసీ విభాగానికి చెందినవని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని టాపకరా ప్లాంట్‌లో రూపొందించిన అదే రాష్ట్రంలో మొదటి అమ్మకాలను ప్రారంభించనుంది. తరువాత దేశవ్యాప్తంగా దశల వారీగా అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే స్పేసియస్ ఫుట్‌బోర్డ్, లార్జ్ అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, హోండా ఎకో టెక్నాలజీతో కూడిన 110 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్-4 ఇంజిన్, సీబీఎస్ (కాంబీ బ్రేక్ సిస్టం) వంటి పలు ప్రత్యేకతలుగాఉన్నాయి. అలాగే మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ట్యూబ్‌లెస్ టైర్లు , ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్లు ప్రామాణికంగా ఉన్నాయి. నాలుగు డిఫరెంట్ కలర్స్ లో ఇది లభ్యంకానుంది. కాగా హోండా యాక్టివా 4జీ రూ. 51,172 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో పోలిస్తే ఇది రూ .8,700 తక్కువ. మరోవైపు టీవీఎస్ స్కూటీ (రూ 40వేలు) గట్టి పోటీ ఇవ్వనుంది.