House Cost of construction
-
హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పెరుగుదల
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగారల్లో ఇళ్ల ధరలు జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 11 శాతం మేర పెరిగాయి. ఇందులో అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో 32 శాతం మేర ధరలు ఎగిసిపడగా, హైదరాబాద్‌లో 3 శాతం పెరిగాయి. ఈ వివరాలను రియల్టర్ల మండలి క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంస్థల సంయుక్త నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్టీ మార్కెట్లో బలమైన డిమాండ్ నమోదైంది. ఇళ్ల సగటు ధరలు వరుసగా 15వ త్రైమాసికంలోనూ వృద్ధి బాటలో నడిచాయి. ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 11 శాతం వృద్ధితో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.11,000కు చేరినట్టు ఈ నివేదిక వెల్లడించింది. పట్టణాల వారీగా..జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అత్యధికంగా 32 శాతం మేర ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది. ఎస్ఎఫ్టీ ధర రూ.11,438కి చేరింది.ఢిల్లీ తర్వాత అత్యధికంగా బెంగళూరులో ఇళ్ల ధరలు సగటున 24 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.11,743గా నమోదైంది. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు సగటున 3 శాతం పెరిగాయి. ఎస్ఎఫ్టీ రూ.11,351కి చేరింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.11,040గా ఉంది. పుణెలో ఎస్ఎఫ్టీ ధర 10 శాతం పెరిగి రూ.9,890కు చేరింది.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 4 శాతం పెరిగి ఎస్ఎఫ్టీ రూ.20,438గా ఉంది. కోల్‌కతాలోనూ 3 శాతం పెరుగుదల నమోదైంది. చదరపు అడుగు ధర రూ.11,351కి చేరింది. చెన్నై మార్కెట్లో చదరపు అడుగు ధర రూ.7,889గా నమోదైంది. మెట్రోల్లో అతి తక్కువ పెరుగుదల ఇక్కడే. అహ్మదాబాద్‌లో 16 శాతం వృద్ధితో ఎస్ఎఫ్టీ రూ.7,640కు చేరింది.సానుకూల సెంటిమెంట్..ఇళ్ల ధరల పెరుగుదల గృహ కొనుగోలుదారుల్లో నెలకొన్న సానుకూల సెంటిమెంట్, సానుకూల వాతావరణానికి నిదర్శనమని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. విక్రయాలు, ధరల పెరుగుదల కొనసాగడం అందుబాటు ధరలు, డిమాండ్‌ను తెలియజేస్తున్నట్ట లైసస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ వ్యాఖ్యానించారు. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ లగ్జరీ ఇళ్ల విభాగం ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పారు. ఎంఎంఆర్, పుణె, హైదరాబాద్ మార్కెట్లు విక్రయాలు, సరఫరాల్లో మార్పులేని స్థితికి చేరాయని.. ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, టైర్–2 పట్టణాల్లో సరఫరా తగ్గిందని తెలిపారు. ధరలు పెరుగుతున్నప్పటికీ.. ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ సరళీకరించడం, రెపో రేటు తగ్గింపు అంచనాలతో గృహ కొనుగోలుదారులకు సమీప కాలంలో ఉపశమనం లభిస్తుందని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ అభిప్రాయపడ్డారు.పెట్టుబడుల తీరు..రియల్టీ తర్వాత ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి అత్యధికంగా రూ.27,815 కోట్లు ఏఐఎఫ్‌ల ద్వారా వచ్చాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో రూ.25,782 కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీల్లోకి రూ.21,503 కోట్లు, బ్యాంకుల్లోకి రూ.18,242 కోట్లు, ఫార్మాలోకి రూ.17,272 కోట్లు, ఎఫ్‌ఎంసీజీలోకి రూ.11,680 కోట్లు, రిటైల్‌లోకి రూ.11,379 కోట్లు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలోకి రూ.10,672 కోట్లు, ఇతర రంగాల్లోకి రూ.2,29,571 కోట్లు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. దశాబ్ద గరిష్టానికి ఏఐఎఫ్ పెట్టుబడులు చేరాయని, మొత్తం ఏఐఎఫ్ ఫండ్స్ సంఖ్యలోనూ వృద్ధి నెలకొన్నట్టు తెలిపింది. ‘ఏఐఎఫ్ పెట్టుబడుల్లో కేటగిరీ 2 ఏఐఎఫ్‌ల పాత్ర కీలకంగా ఉంది. రియల్ ఎస్టేట్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ఇందులో భాగంగా ఉన్నాయి’ అని పురి తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో మొత్తం ఏఐఎఫ్ పెట్టుబడుల్లో కేటగిరీ–2 నుంచే 80 శాతం మేర ఉన్నట్టు అనరాక్ నివేదిక తెలిపంది. రియల్ ఎస్టేట్‌లో ఏఐఎఫ్ పెట్టుబడులు అధికంగా ఉండడం వెనుక ఈ రంగంలో భద్రత, రక్షణ ఎక్కువగా ఉండడమే కారణమని గోల్డెన్ గ్రోత్ ఫండ్ సీఈవో అంకుర్ జైన్ తెలిపారు.రియల్టీలోకి భారీగా ఏఐఎఫ్ పెట్టుబడులురియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్) పెద్ద ఎత్తున వస్తున్నాయి. దేశ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో ఏఐఎఫ్ పెట్టుబడులు రూ.75,000 కోట్లకు చేరినట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఏఐఎఫ్ మొత్తం పెట్టుబడుల్లో 17 శాతం రియల్ ఎస్టేట్ రంగంలోకే వచ్చినట్లు వెల్లడించింది. గడిచిన 10 ఏళ్లలో భారత్‌లో ఏఐఎఫ్‌లలో భారీ వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. మిగిలిన రంగాలతో పోల్చి చూసినప్పుడు ఏఐఎఫ్ పెట్టుబడులకు రియల్టీ ఆకర్షణీయ ఎంపికగా ఉన్నట్టు వివరించింది.ఇదీ చదవండి: చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ ఎత్తివేతరియల్ఎస్టేట్లో రూ.75,468 కోట్లు‘సెబీ తాజా డేటా ప్రకారం.. 2024–25 సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2) వరకు రూ.4,49,384 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినవి రూ.75,468 కోట్లు (17 శాతం)గా ఉన్నాయి’ అని అనరాక్ నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ తర్వాత ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్బీఎఫ్సీలు, బ్యాంక్‌లు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రిటైల్, రెన్యువబుల్ ఎనర్జీ, ఇతర రంగాలు ఏఐఎఫ్‌లతో ప్రయోజనం పొందినట్టు తెలిపింది. ‘ఏఐఎఫ్ ద్వారా రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన పెట్టుబడులు 2024 మార్చి నాటికి రూ.68,540 కోట్లుగా ఉంటే, 2024–25 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి రూ.75,468 కోట్లకు పెరిగాయి. కేవలం ఆరు నెలల్లోనే 10 శాతం మేర పెట్టుబడుల్లో వృద్ధి కనిపించింది’ అని అనరాక్ ఛైర్మన్ అనుజ్‌పురి వెల్లడించారు. -
హైదరాబాదా మజాకా! విలాసానికి 'సై'.. లగ్జరీ గృహాల ధరల్లో అత్యధిక వృద్ధి
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కోకాపేటలో ఎకరం భూమికి రూ.100 కోట్లు.. మోకిలాలో గజానికి రూ.1,0,5000 ధర పలికిన విషయం తెలిసిందే. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలోనూ మరో మైలురాయి సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రోనగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. విలాసవంతమైన ఇళ్లలో ఇలా... హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా, 2023 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగింది. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర మాత్రమే పెరిగాయి. కరోనా తర్వాత నుంచే లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.10,210గా ఉండగా, ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది. రెండోస్థానంలో హైదరాబాద్ ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.3,750గా ఉండగా, ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండోస్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.4 వేలుగా ఉంది. మధ్యతరగతిలోనూ మనమే టాప్ ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చదరపు అడుగుకు రూ.6,050లుగా ఉండగా, ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్ గృహాల ప్రారంభ ధర చదరపు అడుగుకు రూ.5,780గా ఉంది. దేశంలోని సగటు చూస్తే.. 2018 నుంచి 2023 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే, విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధిగా నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 2018లో 12,400గా ఉండగా, 2023 నాటికి 15,350కి పెరిగింది. -
‘డబుల్’ ఇళ్లకు వ్యాట్ మినహాయింపు
* ఇళ్ల నిర్మాణ వ్యయం తగ్గిస్తాం: సీఎం కేసీఆర్ * ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఇళ్లు కట్టిస్తాం సాక్షి, హైదరాబాద్: సిమెంటు, స్టీలుపై వ్యాట్ మినహాయింపు, తక్కువ ధరకు ఇసుక అందివ్వడం వంటి చర్యల ద్వారా రెండు పడక గదుల ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను తగ్గించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రస్తుతం 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలుగా యూనిట్ కాస్ట్‌ను నిర్ధారించామని, వ్యాట్ మినహాయింపుతో ఈ వ్యయాన్ని తగ్గించవచ్చన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో రెండు పడక గదుల ఇళ్లపై సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. కాంట్రాక్టర్లకు కూడా వ్యాట్ నుంచి ఊరటనివ్వనున్నట్టు సీఎం చెప్పారు. సిమెంటు, స్టీలు ధరలను తగ్గించే అంశంపై ఆయా కంపెనీల యాజమాన్యాలతో చర్చించనున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని... వరంగల్, మహబూబ్‌నగర్‌లకు ప్రత్యేకంగా హామీ ఇచ్చినందున వాటికి ఎక్కువ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. వ్యవసాయదారులుండే చోట వ్యక్తిగత పద్ధతిలో, వ్యవసాయేతర వ్యాపకాలుండే పట్టణ ప్రాంతాల్లో ‘జీ ప్లస్ వన్, జీ ప్లస్ టూ’ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. లేఅవుట్ చేసిన స్థలాలున్న ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే రెండు పడక గదుల ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని.. ఒక కుటుంబానికి ఇల్లు సమకూరితే అది రెండుతరాలకు ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. అవగాహన కల్పించండి: వ్యవసాయ పనుల కోసం కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను నడపడంతో రోడ్లు పాడవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. కొత్తగా వేసిన రోడ్లు కూడా ఏడాది తిరక్కుండానే పాడవుతున్నాయని, దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇక రాష్ట్రంలో పేకాట క్లబ్బులు లేకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో క్లబ్బులను నియంత్రించగానే వాటిని వేరే పట్టణాలకో, శివారు ప్రాంతాలకో, ఫామ్హౌస్లకో మార్చి కొనసాగిస్తున్నారని.. ఎక్కడా అవి కొనసాగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.