hyderabad city police
-
Hyderabad: పోలీసు ఫోన్ నెంబర్లు మారాయి.. కొత్త నెంబర్లు ఇవే
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లు మారాయి. ఇప్పటి వరకు వినియోగిస్తున్న వాటి స్థానంలో ఎయిర్‌టెల్‌కు చెందినవి సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. పాత సర్వీస్ ప్రొవైడర్ సేవల వల్ల నెట్వర్క్ పరమైన ఇబ్బందులు వస్తుండటంతో పోలీసులు అధికారులు మరో సంస్థ సేవలు తీసుకోవాలని నిర్ణయించారు. 4జీ, 5జీతో పాటు అనేక వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (వీఏఎస్) అందించడానికి ఎయిర్టెల్ సంస్థ ముందుకు వచ్చింది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ పోలీసు విభాగం ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తొలుత మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా ప్రస్తుతం ఉన్న నెంబర్లనే కొనసాగించాలని భావించారు. అయితే దీనికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తుండటంతో నెంబర్లు మార్చాలని నిర్ణయించారు. దీంతో సోమవారం నుంచి 9490616––– సిరీస్‌కు బదులుగా 8712660–––, 8712661––– సిరీస్‌ల్లో ఆరోహణ క్రమంలో నెంబర్ల వినియోగం మొదలైంది. క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల కొత్త నెంబర్లు ప్రజలకు అలవాటు అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికోసం నెల రోజుల పాటు పాత నెంబర్లూ అందుబాటులో ఉంచుతున్నారు. చదవండి: వికారాబాద్‌లో సీఎం కేసీఆర్.. కలెక్టరేట్, టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం అమలులోకి రాబోయే కొత్త నెంబర్లు ఇలా... ► పోలీసు కమిషనర్– 8712660001 ► అదనపు సీపీ (శాంతిభద్రతలు)– 8712660002 ► అదనపు సీపీ (నేరాలు)– 8712660003 ► సంయుక్త సీపీ (సీసీఎస్)– 8712660004 ► సంయుక్త సీపీ (ఎస్బీ)– 8712660005 ► సంయుక్త సీపీ (పరిపాలన)– 8712660006 ► సంయుక్త సీపీ (ట్రాఫిక్)– 8712660007 ► మధ్య మండల డీసీపీ– 8712660101 ► ఉత్తర మండల డీసీపీ– 8712660201 ► దక్షిణ మండల డీసీపీ– 8712660301 ► పశ్చిమ మండల డీసీపీ– 8712660401 ► తూర్పు మండల డీసీపీ– 8712660501 ► టాస్క్‌ఫోర్స్ డీసీపీ– 8712660701 ► ప్రధాన కంట్రోల్ రూమ్: 871266000, 8712661000 -
ఆఫర్ క్లోజెస్ సూన్.. ఇప్పుడు కె.జి.యఫ్ 2 వంతు
హైదరాబాద్: మిగిలింది మూడు రోజులే.. మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చ్ 31వ తారీఖులోపు చెల్లించండి. అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చు కోకండి. ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకు మిత్రమా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అంటూ కె.జి.యఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్‌లోని ఆఫర్ క్లోజెస్ సూన్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. వాహనదారులు.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికీ కూడా వాహనాల చలాన్లను క్లియర్ చేసుకోకుంటే.. వెంటనే ఆన్లైన్లో చెల్లించండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఇచ్చిన భారీ డిస్కౌంట్ల ఆఫర్ ముగిసిపోనుంది కాబట్టి. ఇప్పటికే తెలంగాణలో 50 శాతం ఛలాన్లు క్లియర్. హయ్యెస్ట్ ఎవరంటే.. ప్రత్యేకించి.. హైదరాబాద్ సిటీలో పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్‌లో ఉన్నాయి. ఓ స్కూటర్ ఓనర్‌కు.. అత్యధికంగా 178 చలాన్లు ఇంకా ఉన్నాయట. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకి ఈ చలాన్లు ఎక్కువగా పడ్డాయట. ఇక ఆగస్టు 2019 నుండి ఇప్పటివరకు 178 చలాన్ల మొత్తం 48,595 రూపాయలుగా ఉంది. రాయితీ పోను అతను చెల్లించాల్సి వచ్చేది కేవలం రూ. 12,490 మాత్రమే. మరో బైకర్‌కు రూ.73,690 చలాన్లు ఉన్నాయట. అతను ప్రత్యేక రాయితీని ఉపయోగించుకుని 19,515 చెల్లిస్తే సరిపోతుంది. మరి వాళ్లు ఉపయోగించుకుంటారో లేదో? చూడాలి. -
హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్: 8 రోజులు.. 1.66 లక్షల కేసులు!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో పోలీసు విభాగం ప్రత్యేక డ్రైవ్‌లకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 4 నుంచి వీటిని ప్రారంభించారు. అప్పటి నుంచి శనివారం వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్స్‌లో మొత్తం 1.66 లక్షల కేసులు నమోదు చేసినట్లు నగర కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. (జూబ్లీహిల్స్‌లో అదుపుతప్పిన బీఎండబ్ల్యూ.. 3 రోజుల కిందటే కొనుగోలు) ట్రాఫిక్ అధికారులు, శాంతిభద్రతల విభాగంతో పాటు సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్–క్వార్టర్స్ నుంచి సిబ్బందిని కలిపి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఈ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయని, ఈ విధానం కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. వాహనచోదకులకు, ఎదుటి వారికీ ప్రాణసంకటంగా మారే ఉల్లంఘనలతో పాటు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించే వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎనిమిది రోజుల్లో నమోదు చేసిన కేసుల గణాంకాలను కొత్వాల్ విడుదల చేశారు. (చదవండి: సారు చాలా బిజీ; కదలరు.. వదలరు..) -
Viral: ముందు మాస్క్ పెట్టుకో.. అలా చెబితేనే వింటారు!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న క్రమంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన రేపుతోంది. దీంతో తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. మాస్క్ ధరించాలని అవగాహనకు కల్పిస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘అందరూ మాస్క్ ధరించాలి’ అని కాప్షన్ జతచేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘చాలా బాగుంది.. ఇప్పుడు అందరికీ మాస్కు రక్ష’.. ‘ముందు మాస్క్ పెట్టుకో.. అలా చెబితేనే వింటారు!’ అని కామెంట్లు చేస్తున్నారు. #BeSafe Wear mask properly. pic.twitter.com/nQc98d4Z1z — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) December 4, 2021 -
అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!!
Ayyayo Vaddamma Sukhibhava Video: శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు.. పౌరుల వ్యక్తిగత భద్రత కోసం పోలీస్ వ్యవస్థ అహర్నిశలు శ్రమించడం చూస్తున్నాం. దేశంలో పలు రాష్ట్రాల పోలీసులు జనాలతో కనెక్టివిటీ కోసం సోషల్ మీడియా విరివిగా వినియోగిస్తున్నారు కదా!. అందులో హైదరాబాద్ పోలీసులు సైతం డిఫరెంట్ పంథాలో అవేర్నెస్ కల్పిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న ‘సుఖీభవ’ మీమ్‌ను సైతం ఇప్పుడు వాడేశారు. సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా ‘సుఖీభవ’ అనే వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. నల్లగుట్ట శరత్ అనే పిలగాడు ఓ టీ పౌడర్ యాడ్‌ను రీ-క్రియేట్ చేసి జోరుగా తీన్మార్ స్టెప్పులేయడం, అది కాస్త మీమ్స్ పేజీల ద్వారా ఇంటర్నెట్లో వైరల్ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైజ్‌మనీ గెలిచారంటూ లింకులు పంపి ఆన్లైన్ మోసాలకు పాల్పడే వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ మీమ్‌ను వాడేశారు. ‘అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి’ అంటూ ఒరిజినల్ యాడ్‌లోని స్క్రీన్ షాట్‌నే ఉపయోగించారు. అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి.... #సుఖీభవ #sukhibhava #cybersafety #yoursafetyisourfirstpriority pic.twitter.com/1GZ2zAbl59 — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 23, 2021 ఇక శరత్ వీడియో ఎప్పుడు, ఏ సందర్భంలో తీసిందో స్పష్టత లేనప్పటికీ.. విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో టిక్‌టాక్, యూట్యూబ్ ఇంటర్వ్యూలతో ట్రోలింగ్‌కు గురైన ఈ యువకుడు.. ఇప్పుడు ఓవర్నైట్సెన్సేషన్ కావడం విశేషం. ముఖ్యంగా మీమ్స్ పేజీలు ఈ వీడియో ద్వారా ఫాలోవర్స్‌కి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. సెలబ్రిటీలు, పొలిటీషియన్లను సైతం వదలకుండా ట్రోల్ చేస్తున్నారు మరికొందరు. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఈ-సెలబ్రిటీగా బుల్లితెరపై శరత్ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!! E video monnatnunchi chusthunna ..navvu agatla 😂#Sukhibhava pic.twitter.com/cJljiuHrhY — Teetotaler (@Imbuvan) September 20, 2021 Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి.. -
మోహన్‌బాబును తిడుతున్నారంటూ..
-
మోహన్‌బాబును తిడుతున్నారంటూ..
నటుడు మోహన్‌బాబును సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అయిన యూట్యూబ్‌లో కొందరు టార్గెట్ చేస్తూ తిడుతున్నారంటూ లీగల్ అడ్వైజర్ సంజయ్ శుక్రవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొలిటికల్ మోజో పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ ఛానల్లో మోహన్‌బాబును వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా.. బూతులు తిడుతూ వీడియోలు అప్లోడ్ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 4.65 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న బ్రహ్మాజీ!.. ట్వీట్ వైరల్
నటుడు బ్రహ్మాజీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలలో, కార్యక్రమాలలో ఆయన వేసే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక బ్రహ్మాజీ సోషల్ మీడియాలో సైతం పలు సంఘటనలపై తనదైన స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. తాజాగా ఆయన ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు వచ్చిన మెసెజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ ప్రైజ్‌మనీని తీసుకురావాల్సింది హైదరాబాద్ సిటీ పోలీసులను, సైబరాబాద్ పోలీసులను కోరుతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా మనలో చాలా మంది మీరు ఇంత డబ్బును గెలుచుకున్నారంటూ మీ పేరు, చిరునామా ఇవ్వాల్సిందిగా గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి తరచూ మనకు మెసెజ్‌లు వస్తూనే ఉంటాయి. అయితే గురువారం బ్రహ్మజీకి ఈ మెసెజ్ రావడంతో వెంటనే దానిని స్క్రీన్ షాట్ తీసి ట్వీటర్లో షేర్ చేశాడు. ఆ ఫోన్ నెంబర్ ట్వీట్లో పేర్కొంటూ ‘సార్ నాకు ఈ నెంబర్ నుంచి రూ.4.65 కోట్లు లాటరీ తగిలిందని యూకేకు చెందిన ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి మెసెజ్ వచ్చింది. దయ చేసి మీరు ఈ డబ్బులను తీసుకురాగలరు’ అంటూ సిటీ పోలీసులు, సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. ఇక బ్రహ్మజీ చమత్కారంగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చూసి నెటిజనలు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయన తీరుపై ప్రశంసలు కురిపిస్తూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. +91 80996 68183 Sirr..got a msg from above number..pl collect money @hydcitypolice @cyberabadpolice pic.twitter.com/GLLsiSgKkP — Brahmaji (@actorbrahmaji) June 17, 2021 చదవండి: పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్ -
ప్రభాస్ ఫోటోతో సిటీ పోలీస్ ట్వీట్..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ముందుండే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 2002లో ఈశ్వర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ నేటి వరకు 19 సినిమాలు చేశాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. బాహుబలి వంటి భారీ చిత్రంలోని తన నటనతో కేవలం తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అంతులేని అభిమానులను సంపాదించుకున్నాడు. నేడు డార్లింగ్ ప్రభాస్ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 42వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో అభిమానులు భారీగా బ్యానర్లు, కటౌట్లు ఏర్పరిచి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అయితే పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే రాధే శ్యామ్ సినిమా నుంచి వివక్రమాదిత్యగా ప్రభాస్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ రోజు మధ్యాహ్నం 12.02 గంటలకు బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ విడుదల చేయనున్నారు. ఈ సర్ప్రైజ్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్.. ప్రభాస్ లుక్ అదుర్స్ ఇక ప్రభాస్‌కు దేశం నలుమూలలా నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘హ్యపీ బర్త్‌డే డార్లింగ్ ప్రభాస్’ అంటూ ట్విటర్లో ట్రెండ్ క్రియెట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రబాస్ పెద్దనాన్న(కృష్ణం రాజు) కూతురు ప్రసీధ.. అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ‘నా అభిమాన హృదయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఇలా ప్రేమగా ఉండి రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలను అందుకోవాలి అన్నయ్య, మీ నుంచి ఎల్లప్పుడూ నేర్చుకోవటానికి చాలా సంతోషిస్తున్నాను. లవ్ యూ’. అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ప్రభాస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? Happy birthday, Prabhas! Wishing you infinite success, happiness and peace always😊 https://t.co/70j04zxG7G — Mahesh Babu (@urstrulyMahesh) October 23, 2020 ఇక సినీ ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు, వరుణ్ తేజ్,నటి రాశీ ఖన్నా, నిర్మాత బీఏ రాజు, బండ్ల గణేష్, గోపిచంద్ మలినేని, బాబీ, మెహర్ రమేష్, సరేందర్ రెడ్డి.. హ్యపీ బర్త్‌డే ప్రభాస్.. జీవితాంతం సంతోషంగా ఉండాలని, భవిష్యత్తుల్లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ సిటీ పోలీసులు సైతం సినిమా పోస్టర్లను ఉపయోగించి ట్రాఫిక్ నిబంధనలను, జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోని బైక్‌పై హెల్మెట్ ధరించిన ఫోటోతో సందేశం ఇచ్చారు. ‘నీ మీద మీ జీవితమే కాదు.. మీ కుంటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయ్. హెల్మెట్ ధరించండి.’ అని ట్వీట్ చేశారు. చదవండి: వరదలు : ప్రభాస్ భారీ విరాళం నీ మీద మీ జీవితమే కాదు.. మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయ్ హెల్మెట్ ధరించండి..#wearhelmet #safetyfirst #HyderabadCityPolice pic.twitter.com/3LNDbo58N2 — Hyderabad City Police (@hydcitypolice) October 23, 2020 కాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఇటలీలో మళ్లీ మొదలైంది. రాధే శ్యామ్ సినిమాను ప్యాన్ ఇండియన్ స్థాయిలో రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను 2021లో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. Here’s wishing the darling of millions #Prabhas, a very happy birthday! Wish him all the luck and love! 😇 — Raashi (@RaashiKhanna) October 23, 2020 Here’s wishing the darling of millions #Prabhas, a very happy birthday! Wish him all the luck and love! 😇 — Raashi (@RaashiKhanna) October 23, 2020 -
పోలీసుల ప్రశ్నలు.. విజయ్ సమాధానాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన విపత్తు లో ప్రాణాలకు తెగించి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ పోలీస్ అధికారులతో టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ సరదాగా ముచ్చటించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలకరించారు. నిరంతరం పనిచేస్తూ అలసట పొందుతున్న పోలీస్ సిబ్బందికి విజయ్ పలకరింపులు , మాటలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం పోలీస్ కమీషనరేట్ లో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో విజయ్ పాల్గొనడం తో పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ ఇతర సిబ్బందిలో కొత్త ఉత్సాహాం కనపడింది. చాలా మంది పోలీస్ అధికారులు విజయ్ కి థాంక్స్ చెబుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. పోలీసులలో ఉత్సహాన్ని నింపేందుకు సమయం ఇచ్చిన విజయ్ దేవరకొండ కు పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తో పాటు ఆయన సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ వారిని ఉత్సాహ పరుస్తూ సమాధానాలు ఇచ్చారు. మీరు ఒకసారి పోలీస్ చెక్ పోస్ట్ ల దగ్గరకు వచ్చి ప్రజలను బయటకు రావొద్దని కోరాలి తప్పకుండా వస్తాను కానీ నేను వచ్చినప్పుడు మీ లాఠీలకు పనిచెప్పకూడదు అలాంటి పర్మీషన్ లెటర్ నాకు ఇస్తే తప్పకుండా వస్తాను. కానీ మన సీఎం కేసీఆర్ సార్ చాలా క్లియర్ గా బయటకు రావొద్దు అని చెప్పారు. వాళ్లు చెప్పాక కూడా బయట తిరిగే వాళ్ళకు మీ పద్దతిలోనే సమాధానం చెప్పాలి. నేను వచ్చి చెబితే మంచి జరుగుతుంది అని మీరు నమ్మితే తప్పకుండా వస్తాను. లాక్ డౌన్ పీరియడ్ లో మీరు మీ అమ్మకు సహాయం చేస్తున్నారా? నేను షూటింగ్లలో బిజీ ఉండేటప్పుడు ఇంట్లో విషయాల్ని పట్టించుకునే వాడ్ని కాదు. కానీ ఇప్పుడు అమ్మ పడుతున్న కష్టం చూస్తే మాత్రం చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మ నీవల్ల మరింత పని పెరుగుతుందని కోప్పడుతుంది. కానీ ఇలాంటి సమయంలో డ్యూటీలు చేస్తూ ఇంటి పనిని చక్క బెడుతున్న మహిళా అధికారులకు హ్యాట్సాఫ్. పోలీస్ అధికారిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము తప్పకుండా మంచి స్క్రిప్ట్ వస్తే చేస్తాను. రెండు మూడేళ్లలో మంచి పోలీస్ పాత్రతో మీ ముందుకు వస్తా మీరు పోలీస్ అయితే ఈ పరిస్థితిలో ఎలా ఫీల్ అయ్యే వారు? చాలా బాధ్యతగా ఫీల్ అయ్యే వాడిని. కమిషనర్ గారి ఆదేశాల మేరకు పనిచేసే వాడిని. మీరందరూ మా కోసం పనిచేస్తున్నారు. మేము ఇంట్లో కూర్చుంటే మీరు పనిగంటలు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు మీ అందరికీ నా నమస్కారాలు మీరు డిప్రెషన్ లో ఉంటే ఏం చేస్తారు? నా పనే నాకు గుర్తింపు నిచ్చింది. మీ అందరి ప్రేమనిచ్చింది. నాకు ఫెయిల్యూర్స్ వచ్చినా ఎప్పుడైనా లో ఫీల్ కలిగినా నా పని మీద మరింత ఫోకస్ చేస్తాను. నేను చిన్నప్పుడు మహాభారతం ప్లే చేసాను స్కూల్లో. అప్పుడు కృష్ణ భగవానుడు అన్న ఆ మాట నా మీద బాగా బలంగా పడింది.. ఈ సమయం గడిచిపోతుంది...నిజమే ఏ సమయం అయినా శాశ్వతం కాదు.. కరోనా కూడా అంతే మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా కూడా మన లైఫ్ లో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. చదవండి: కరోనా కట్టడికి 7 సూత్రాలు చెప్పిన మోదీ పోలీసులతో జతకట్టిన అతిచిన్న మహిళ! -
హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో 5కే రన్
-
'ముస్కాన్'తో 445 మంది చిన్నారుల్లో చిరునవ్వు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో జూలై 1 నుంచి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-5 వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఏటా రెండు విడుతలుగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా నగరంలో జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్5 పేరుతో అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. హైదరాబాద్ సిటీలో మొత్తం 17 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ ముస్కాన్-5లో భాగంగా హైదరాబాద్‌లో మొత్తం 445 మంది వీధి బాలలు, బాల కార్మికులను అధికారులు కాపాడారు. వీరిలో 407 మంది బాలురు ఉండగా, 38మంది బాలికలు ఉన్నారు. పట్టుబడిన బాల కార్మికుల్లో 381 మంది చిన్నారులను గుర్తించి పునరావాస చర్యల్లో భాగంగా పోలీసులు వారిని తిరిగి తమ తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాకుండా వారికి చదువుకోవడానికి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందజేశారు, మరో 64 మంది చిన్నారులను రెస్క్యూ హోమ్ కు తరలించామని అధికారులు వివరించారు. పలువురు బాలురను సైదాబాద్ రెస్క్యూ హోమ్ కు, బాలికలను నింబోలిఅడ్డ రెస్క్యూ హోమ్ కు తరలించామని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపు చిన్నారులతో పని చేయించడం చట్టరిత్యా నేరం. కార్మిక శాఖ అధికారులు చట్టవ్యతిరేకంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు 7 కేసులు నమోదు చేసి 18 లక్షలకు పైగా జరిమానా వేశారు. కాగా జనవరిలో నిర్వహించిన ఆపకేషన్ స్మైల్‌లో భాగంగా 429మంది చిన్నారులను, ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 874 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించారు. -
రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘనపై ఆర్టీఏ కొరడా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత నిబంధనల ఉల్లం‘ఘను’లు ఠారెత్తిస్తున్నారు. రహదారులపై ఇష్టారాజ్యంగా పరుగులు తీస్తున్నారు. రహదారి భద్రతపై ఎన్ని కఠినమైన చట్టాలను తెచ్చినప్పటికీ వాహనదారులు పెద్దగా లెక్కచేయడం లేదు. నిబంధనల పట్ల అవగాహనారాహిత్యం, నిర్లక్ష్యం రోడ్డు భద్రతకు పెనుసవాల్‌గా మారింది. గత ఐదేళ్లలో ఇలా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన సుమారు 14 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులపై రవాణాశాఖ వేటు వేసింది. 3 నెలల కనిష్ట కాలపరిమితి నుంచి ఏడాది గరిష్ట కాలం వరకు డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. సెల్‌ఫోన్‌డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని తెలిసినప్పటికీ చాలామంది నిబంధనలు పక్కన పెట్టేసి ‘సెల్’మోహనరంగా అంటూ పరుగులు తీస్తున్నారు. మరోవైపు పరిమితికి మించిన ఓవర్లోడింగ్, అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలు ఎక్కువగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో రవాణాశాఖ ‘ఉల్లంఘనుల’పై సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రస్తుతం ఏడాది గరిష్ట కాలానికి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో శాశ్వతంగా రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు రవాణాశాఖ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడేవారిపైన మరింత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అలాంటి వాహనదారులు తిరిగి డ్రైవింగ్ చేయకుండా నియంత్రించనున్నట్లు చెప్పారు. పరిమితికి మించిన బరువుతో పరుగులు... రాత్రి, పగలు తేడా లేకుండా ఓవర్‌లోడ్ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రైవేట్ బస్సులు నిబంధనలను తుంగలో తొక్కి పరిమితికి మించిన ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్న సుమారు 1000 ప్రైవేట్ బస్సుల్లో 80 శాతం ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని బస్సులు పూర్తిగా సరుకు రవాణా వాహనాలుగా మారాయి. మరోవైపు వివిధ జిల్లాల నుంచి ఇసుక, కంకర, ఐరన్ వంటి వస్తువులను నగరానికి తరలిస్తున్న వాహనాలు సైతం ఓవర్‌లోడ్‌తో ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇలా రహదారి భద్రతకు ముప్పుగా మారిన ఓవర్‌లోడ్ వాహనాలు నడుపుతూ పట్టుబడిన 2532 మంది డ్రైవింగ్ లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది. ఓవర్‌లోడ్ వాహనాలను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు ఇలాంటి వాహనాలను సైతం జఫ్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జేటీసీ చెప్పారు. డ్రంకెన్ డ్రైవర్లు... ఓవర్‌లోడింగ్‌తో పట్టుబడి డ్రైవింగ్ లైసెన్సులు కోల్పోయిన వారి తరువాత ఈ ఐదేళ్లలో డ్రంకన్ డ్రైవింగ్‌లో పట్టుబడి లైసెన్సులు పోగొట్టుకున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ పోలీసులు నిరంతర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొంత వరకు ఫలితాన్నిచ్చాయి. గత ఐదేళ్లలో డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో 2117 మంది లైసెన్సులను రద్దు చేశారు. 2016లో 917 లైసెన్సులు రద్దు కాగా, 2017లో 580, 2018లో 439 చొప్పున లైసెన్సులు రద్దయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 123 లైసెన్సులను రద్దు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు భవిష్యత్తులో మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. యధేచ్ఛగా సెల్‌ఫోన్ డ్రైవింగ్... సెల్‌ఫోన్ డ్రైవింగ్ సైతం హడలెత్తిస్తోంది. ఒకవైపు ఫోన్లో మాట్లాడుతూనే మరోవైపు వాహనాలను నడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వాహనాల వల్లనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, చివరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు భద్రతకు సవాల్‌గా మారారు. ఇప్పటి వరకు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 720 మంది వాహనదారుల లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది. అలాగే పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 87 మంది లైసెన్సులపైన సస్సెన్షన్ విధించింది. ఇక రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు పాల్పడిన 1661 మంది సైతం తమ లైసెన్సులను కోల్పోయారు. వివిధ రకాల ఉల్లంఘనలపై ఇప్పటి వరకు రద్దయిన డ్రైవింగ్ లైసెన్సులు ఓవర్లోడింగ్ 2532 ఓవర్‌స్పీడ్ 87 ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడిన గూడ్స్ వాహనాలు 633 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 720 మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు 2117 ప్రమాదాలకు పాల్పడిన వారు 1661 కోర్టు తీర్పులతో లైసెన్సులు కోల్పోయిన వారు 908 ఇతర కేసులు 5313 వివిధ రకాల ఉల్లంఘనలపై గత 5 ఏళ్లలో సస్పెండ్ అయిన మొత్తం డ్రైవింగ్ లైసెన్సులు 13971 -
నగరంలో భారీ వర్షం: సీపీ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వర్షపు నీరు రోడ్డపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి సిబ్బంది అంతా విధుల్లోనే ఉన్నారని, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. పలుచోట్ల రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపి వాహనాలను పంపించామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ, మెట్రో అధికారలతో మాట్లాడి సమస్య సరిష్కారాలను కనుకుంటున్నట్లు సీపీ తెలిపారు. అవసరమైతే జేఎన్టీయూ సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామన్నారు. వర్షం కారణంగా ప్రజలకు కొంత ఇబ్బందులు కలిగాయన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, మలక్‌పేట, ఎల్బీ నగర్, సంతోష్‌నగర్, అల్వాల్, బొల్లారం, మెహదీపట్నంలలో ఆదివారం భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురవడంతో పలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులతోపాటు ఆయా కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కూకట్‌పల్లిలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. గంటపాటు వర్షం కురిస్తేనే రోడ్లు చెరవులను తలపించడంపై నగరవాసులు మండిపడుతున్నారు. మరోవైపు నేడు ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగస్తులు చల్లటి వాతావరణాన్నిఆస్వాదిస్తున్నారు. -
దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘డ్రైవింగ్‌లో ఉండగా దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే బండి పక్కకు ఆపి, ప్రశాంతమైన చోటు వెదుక్కుని ఆయనతో మాట్లాడండి. ఒకవేళ దేవుడిని చూడాలనుకుంటే డ్రైవింగ్‌లో ఉండగా మొబైల్లో మెసేజ్‌లు పెడుతుంటే నేరుగా ఆయనకు దగ్గరకు వెళ్లిపోవచ్చు’ ఇది ఒక వాహనం వెనుక భాగంలో రాసివున్న సందేశం. ఈ ఫోటోను హైదరాబాద్ నగర పోలీసు అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. పోలీసులకు ఈ ఫొటో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా? సెల్ఫోన్ల వినియోగం పెరగడంతో వాహనదారుల్లో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొబైల్ ఫోన్లలో మునిగిపోతూ రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో సెల్ఫోన్లలో మాట్లాడుతూ, ఛాటింగ్ చేస్తూ, మెసేజ్‌లు పంపుతూ.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు నిరంతరం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇలా వచ్చిందే ఈ ఫొటో. కాబట్టి సెల్‌ఫోన్ వాడుతూ వాహనాలు నడపకండి, ప్రమాదాలు కొనితెచ్చుకోకండి. -
నిల్చున్న చోటే నిగ్గుతేలుస్తారు!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు ఓ రోజు రాత్రి సిటీ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటుగా వచ్చిన వ్యక్తి కదలికలపై వారికి అనుమానం కలిగి ‘లైవ్ స్కానర్’ద్వారా పరీక్షించారు. ఎలాంటి ‘అలెర్ట్’ రాకపోవడంతో వదిలేశారు. అతడు పొరుగు రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉండటంతో ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. ఇలాంటి ఆస్కారం నేరగాళ్లకు ఇవ్వకుండా ఉండేందుకు, మిస్సింగ్, గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులను కొలిక్కి తెచ్చేందుకు రాష్ట్ర పోలీసు విభాగం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. తమ అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’లో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 2012 నుంచి రాష్ట్రంలో అరెస్టైన నేరగాళ్లల్లో 50 వేల మంది ఫొటోలతో ఏర్పాటు చేసిన డేటాబేస్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వాంటెడ్ లిస్ట్‌తో దీనిని అనుసంధానించారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ లింకును మరో వారం రోజుల్లో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. లైవ్ స్కానర్లతో... ఇప్పటికే పోలీసు విభాగం అనేక పోలీసుస్టేషన్లకు లైవ్ స్కానర్లు అందించింది. ఇవి అనునిత్యం గస్తీ పోలీసుల వద్ద అందుబాటులో ఉంటున్నాయి. రాష్ట్రంలో అరెస్టైన, వాంటెడ్‌గా ఉన్న పాత నేరగాళ్ల వేలిముద్రలను డిజిటలైజ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ బ్యూరో వాటిని ఓ సర్వర్‌లో నిక్షిప్తం చేసింది. ఈ డేటాబేస్‌ను యాప్ రూపంలో సిబ్బంది స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి కనెక్ట్ చేసుకోవడానికి, వేలిముద్రలు తీసుకోవడానికి అనువైన అత్యాధునికమైన స్కానర్లను సైతం పంపిణీ చేశారు. సిబ్బంది తనిఖీ సమయాల్లో అనుమానితుల వేలిముద్రను లైవ్ స్కానర్ ద్వారా సేకరిస్తారు. దీనిని పూర్తిస్థాయిలో సర్వర్ సెర్చ్ చేసి గతంలో ఇతడిపై కేసులు ఉన్నాయా.. ఎక్కడైనా వాంటెడ్‌గా ఉన్నాడా.. అనే విషయం గుర్తిం చి అప్పటికప్పుడే పోలీసులను అప్రమత్తం చేస్తుంది. లైవ్ స్కానర్ డేటాబేస్‌లో బయటి రాష్ట్రాలకు చెందినవారి వేలిముద్రలు ఉండవు. మరోపక్క అవతలి వ్యక్తి తన వేలిముద్రలను ఇవ్వడానికి నిరాకరిస్తే బలవంతం చేసే ఆస్కారం తక్కువ. ఫొటో తీస్తే సరి... ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి తనిఖీ సిబ్బంది యాప్‌లోని ఈ లింకులోకి వెళ్లి అనుమానిత వ్యక్తిని ఫొటో తీస్తే సరిపోతుంది. డేటాబేస్‌లోని నేరగాళ్ల ఫొటోలను క్షణాల్లో సెర్చ్ చేసి గుర్తిస్తుంది. గతంలో చిన్న, చిన్న నేరాలతో పోలీసు రికార్డులకు ఎక్కిన, కేసులు వీగిపోయినవారికి ఈ డేటాబేస్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదు. 90 శాతం కంటే ఎక్కువ పోలికలు సరిపోయినవారిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తారు. మరికొన్ని అంశాలు సైతం... ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థకు మరో మూడు అంశాలనూ చేరుస్తున్నారు. అంతర్జాతీయ పోలీసు ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సహా అనేక విభాగాలు తమకు వాంటెడ్‌గా ఉన్న వ్యక్తుల వివరాలను ఫొటోలతో సహా అధికారిక వెబ్సైట్లలో పొందుపరుస్తున్నాయి. ఈ కేటగిరీల నుంచి సేకరించిన ఫొటోలనూ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. వీటికి తోడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అదృశ్యమైనవారి ఫొటోలను డేటాబేస్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడైనా గుర్తుతెలియని మృతదేహం లభించినా, తాను ఎవరో చెప్పుకోలేని స్థితిలో దొరికినా సెర్చ్ చేస్తారు. ఆయా వ్యక్తులు ఎక్కడైనా అదృశ్యమైన వారు అయితే ఆ వివరాలను సర్వర్ గుర్తించి వెంటనే అప్రమత్తం చేస్తుంది. -
‘ఎలక్షన్’ పోలీస్?
సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల నేపథ్యంలో పోలీసింగ్‌కు సంబంధించి ప్రాథమిక, అత్యంత కీలక ఘట్టం బదిలీలు. వీటికోసం అధికారులు అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ పరిపాలన ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లిన తర్వాత భారీ స్థాయిలో బదిలీలు అనివార్యంగా మారుతున్నాయి. ఫలితంగా ఆయా స్థానాల్లోకి వస్తున్న కొత్త అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బదిలీపై బయటి కమిషనరేట్లకు వెళ్తున్న అధికారులు తిరిగి రావడం పెద్ద ప్రహసనంగా మారిపోతోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ‘ఎన్నికల బదిలీలకు’ కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో వీటికి గరిష్టంగా ఏడాది సమయం కూడా లేదు. ప్రతి సందర్భంలోనూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తరవాత బదిలీలకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అప్పుడు పరిపాలన మొత్తం ఈసీ చేతిలో ఉంటుంది. అధికారుల బదిలీపై ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందస్తు వ్యూహాల్లో భాగంగా అధికారులు సిబ్బంది జాబితాలను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల సందర్భంలో బదిలీలు అనివార్యమైన అంశంగా మారుతాయి. కమిషనరేట్లలో పోలీసుస్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా పిలిచే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తుంటారు. నిర్ణీత కాలం మించి (2 లేదా 3 ఏళ్లు) ఒకే చోట పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాల్సిందిగా ఈసీ స్పష్టం చేస్తుంది. వీటిలోనే ఆ వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారనేది పరిగణనలోకి తీసుకుంటుంది. 2009 ఎన్నికల సందర్భంలో జోన్‌ను యూనిట్‌గా తీసుకుని ఈసీ మార్గదర్శకాలను జారీ చేయగా... 2014 నాటికి కమిషనరేట్ యూనిట్‌గా మారింది. ఫలితంగా పొరుగు కమిషనరేట్‌తో పాటు జిల్లాల్లో ఉన్న వారికి ఇక్కడకు తీసుకువచ్చి, ఇక్కడి వారిని బయటకు పంపాల్సి వచ్చింది. ఆఖరి నిమిషంలో జరిగిన ఈ మార్పుతో కొత్తగా వచ్చిన పూర్తి కొత్త అధికారులు నిలదొక్కుకోవడం సమస్యగా మారుతోంది. దీని ప్రభావం ఎలక్షన్ పోలీసింగ్‌పై పడుతోంది. సాధారణంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ సొంత నియోజకవర్గాల్లో లేకుండా చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. శాంతిభద్రతల విభాగంతో పాటు ప్రత్యేక విభాగాలైన టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌లు, ట్రాఫిక్ విభాగాన్నీ పరిగణలోకి తీసుకుని బదిలీలు చేయాల్సి ఉంటుంది. ఈసీ నిబంధనలతో నగర కమిషనరేట్‌కు చెందిన వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరవాత పాత స్థానాలకే రావచ్చని అధికారులు చెప్తున్నారు. క్రతువు ముగిసిన తర్వాత దీని అమలు కోసం సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన అధికారులు తిరిగి రావడానికి ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం ఉండట్లేదు. 2014 సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ‘మూడేళ్ల నిబంధన’ విధించిన ఎన్నికల సంఘం ఆ గడువు పూర్తి చేసుకున్న వారిని కమిషనరేట్ నుంచి బయటకు పంపాల్సిందిగా స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో ఉన్న రెంటు కమిషనరేట్ల నుంచి భారీగానే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. అనేక మంది పొరుగు జిల్లాలకూ ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లారు. ఆ సమయంలో వీరిని పంపిన ఉన్నతాధికారులు ఎలక్షన్ కోడ్ ఉపసంహరించిన వెంటనే తిరిగి పాత స్థానాల్లోనే నియమిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇది పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో మరికొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రస్తుతం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్న ఉన్నతాధికారులు వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు–సెప్టెంబర్ నాటికి రెండేళ్ళ గడువు పూర్తి చేసుకున్న అధికారుల జాబితాను రూపొందించి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇలా చేస్తే ఎన్నికల నాటికి రెండు, మూడేళ్ళు పూర్తి చేసుకున్న వారు ఎవరూ ఉండరని భావిస్తున్నారు. ఇలా చేస్తే ఎన్నికల సమయానికి పెద్దగా జరిగే బదిలీలు ఉండవని, ఫలితంగా పోలీసింగ్, భద్రత, బందోబస్తుపై ప్రభావం ఉందని అధికారులు యోచిస్తున్నారు. -
హైదరాబాద్‌లో మళ్లీ పడగ విప్పిన డ్రగ్స్
-
సీపీ వర్సెస్ మీడియా...
‘హైదరాబాద్ సిటీలో నానాటికీ కేసుల సంఖ్య తగ్గుతోంది. దీన్ని చూస్తుంటే అసలు తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులను పోలీసులు కేసులుగా నమోదు చేస్తున్నారా? అనే సందేహం అనేక మందికి కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే జనవరి 1 నుంచి కమిషనరేట్‌లో ఓ వినూత్న విధానం అమలు చేస్తున్నాం. పోలీసుస్టేషన్లో ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదు కాకుంటే నేరుగా నా దగ్గరకే రావచ్చు. సివిల్ వివాదాలు కానివి, చట్ట పరిధిలో ఉన్న ప్రతి ఫిర్యాదునూ కేసుగా నమోదు చేయిస్తా. సీసీఎస్ లేదా స్థానిక పోలీసులతో దర్యాప్తు చేయిస్తూ... వీటిని పర్యవేక్షించేందుకు సీపీ ఆఫీస్ కేంద్రంగా సెంట్రల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం’ అని నగర ఇన్చార్జి కమిషనర్ వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక నేర గణాంకాలను విడుదల చేశారు. ప్రపంచ తెలుగు మహా సభల స్ఫూర్తితో పోలీసు విభాగం తొలిసారిగా తెలుగులో గణాంకాలు సిద్ధం చేశామని రానున్న రోజుల్లో మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో రెండేళ్ళల్లో నగరంలో 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు తమ లక్ష్యమన్నారు. సిటీలో ఒక్క సైబర్ నేరాల మినహా మిగిలినవి తగ్గాయని, సరాసరిన 13 శాతం నేరాలు తగ్గినట్లు సీపీ వివరించారు. మీకు పోలీస్ స్టేషన్లో ఏదైనా సమస్య ఎదురైందా... మీరు ఇచ్చిన ఫిర్యాదును కేసుగా నమోదు చేయలేదా...అయితే వెంటనే మీరు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మీ సమస్య సివిల్ వివాదం కాకుంటే..చట్ట పరిధిలో ఉంటే వెంటనే అక్కడే కేసు నమోదు అయ్యేలా చేస్తారు. మీకు న్యాయం జరిగేందుకు అన్నివిధాలా సహకరిస్తారు. ఇందుకోసం సీపీ ఆఫీస్ కేంద్రంగా సెంట్రల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది జనవరి 1వ తేదీ నుంచి పని చేస్తుంది. ఈ విషయాలను గురువారం ఇన్చార్జి సీపీ వీవీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే నేరాలకు సంబంధించిన వార్షిక గణాంకాలను ఆయన విడుదల చేశారు. నగరంలో ఈ ఏడాది క్రైమ్ రేట్ 13 శాతం తగ్గింది. లోక్ అదాలత్‌ల నేపథ్యంలో శిక్షల శాతం కూడా బాగా తగ్గింది. ఇక ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో పోలీసు విభాగం తొలిసారిగా తెలుగులో గణాంకాలు సిద్ధం చేసింది. వచ్చే రెండేళ్లలో నగరవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇన్చార్జి సీపీ వెల్లడించారు. రాజీలతో తగ్గిన శిక్షల శాతం... నగర కమిషనరేట్ పరిధిలో వివిధ నేరాల్లో శిక్షలు పడుతున్న శాతం 2017కు సంబంధించి కేవలం 24గా నమోదైంది. దీనికి భారీ సంఖ్యలో కేసులు లోక్ అదాలత్ పరిష్కారం కావడమే ఇందుకు కారణమన్నారు. వీలున్న ప్రతి కేసులోనూ పోలీసులు ఫిర్యాదుదారుడు–నిందితుల మధ్య సయోధ్యకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐదుసార్లు లోక్ అదాలత్‌లు నిర్వహించగా, 10,078 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. 2016లో కేవలం 3373గా ఉన్న ఈ సంఖ్య గణనీయంగా పెరగడంతోనే శిక్షల శాతం తగ్గిందని వివరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా 2012కు ముందు నమోదైన కేసుల దర్యాప్తు పూర్తి చేస్తున్నామన్నారు. వీటి సంఖ్య ఈ ఏడాది ప్రారంభంలో 10,276గా ఉండగా... యూఐ కేసు మేళాల ఫలితంగా ప్రస్తుతం 5410కి తగ్గిందన్నారు. రెస్పాన్స్ టైమ్‌లో రికార్డు... ఓ ఉదంతానికి సంబంధించి ఫిర్యాదు వచ్చిన తర్వాత బాధితుడి వద్దకు చేరుకోవడానికి పట్టే సమయాన్ని రెస్పాన్స్ టైమ్‌గా పిలుస్తారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో ఇది నాలుగు నిమిషాలుగా ఉంది. అయితే సిటీలో 2017కు సంబంధించి 3.85 నిమిషాలుగా రికార్డు అయిందని, దీన్ని ఇంకా వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని కొత్వాల్ తెలిపారు. నగర వ్యాప్తంగా 1,66,149 సీసీ కెమెరాలను జియో ట్యాగింగ్ చేశామని, మరో రెండేళ్ళల్లో వీటి సంఖ్య 10 లక్షలకు పెంచాలనే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. హాక్–ఐని 6.5 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని, దీన్ని బట్టి నగరంలో ఉన్న దాదాపు సగం కుటుంబాలు వినియోగిస్తున్నట్లుగా సీపీ వివరించారు. దర్యాప్తు సమయాల తగ్గింపు... నమోదైన కేసులను వీలైంనంత త్వరగా దర్యాప్తు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు. సీసీఎస్ ఆధీనంలోని మహిళా ఠాణాలో 2016లో సరాసరిన ఓ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి 190 రోజులు పట్టేదని, దీన్ని ఈ ఏడాది 87 రోజులకు తగ్గించామన్నారు. ఓ ఠాణాలో సరాసరిన రెండు–మూడు నెలల్లో ఎన్ని కేసులు నమోదవుతాయో లెక్కించి ఆ సంఖ్యకు మించి పెండింగ్ కేసులు లేకుండా ఉండాలని ఆదేశించామన్నారు. ప్రతిపాదిత మెట్రో రైల్ నిర్మాణంలో ప్రస్తుతం 30శాతం వినియోగంలోకి వచ్చిందని, దీనికి భద్రత స్థానిక పోలీసులే చూస్తున్నారని, ప్రాజెక్టు 100 శాతం పూర్తయ్యే నాటికి 1800 మంది శాశ్వత ఉద్యోగులతో ప్రత్యేక విభాగం అందుబాటులోకి వస్తుందన్నారు. దీనికి సంబంధించి 2–3 నెలల్లో పూర్తి రూపు వస్తుందని తెలిపారు. సీపీ వర్సెస్ మీడియా... వార్షిక సమావేశంలో ‘కెల్విన్ కేసు’కు సంబంధించి కొత్వాల్‌కు, విలేకరులకు మధ్య ఓ చిన్న ‘వార్’ జరిగింది. డ్రగ్స్ కేసు దర్యాప్తు చేసిన ఎక్సైజ్ సిట్ అధికారులు కెల్విన్‌ను అరెస్టు చేశారు. ఇతడి విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా అనేక మంది సినీ రంగానికి చెందిన వారికి నోటీసులు ఇచ్చి విచారించారు. ఎక్సైజ్ వారికి ముందే కెల్విన్‌ను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ప్రముఖుల పేర్లు ఎందుకు బయటకు రాలేదంటూ విలేకరులు కోరగా... కొత్వాల్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాము అంతకంటే ఎక్కువ కేసుల్నే నమోదు చేశామని, విచారణ వివరాలు వెల్లడిలో ఆచితూచి వ్యవహరిస్తామని కొత్వాల్ అన్నారు. ఓ సందర్భంలో విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు ‘సమాధానం చెప్పక్కర్లేదు’ అంటూ స్పందించారు. ఈ పరిణామాలతో కాస్సేపు యుద్ధ వాతావరణం నెలకొంది. -
సెల్ఫోన్లోనే సీసీ కెమెరా లైవ్..
నగరంలో నేరాల నియంత్రణ, బాధితులను ఆదుకోవడం, సత్వరం స్పందించడం, సమన్వయం, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించడం వంటి చర్యల కోసం పోలీసు అధికారిక యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఆధునిక హంగులు జోడిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు తమ సెల్ఫోన్లోనే కోరుకున్న ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను లైవ్‌లో చూసే ఆస్కారం కల్పిస్తున్నారు. ‘సీసీ కెమెరా లైవ్’ పేరుతో అందుబాటులోకి వచ్చే ఈ సౌకర్యం ద్వారా ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు తన సెల్ఫోన్ల ద్వారానే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకోవచ్చు. న్యూ ఇయర్ డే అయిన జనవరి 1 నుంచి ఈ ‘లైవ్’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సాక్షి, సిటీబ్యూరో: చిరాగ్ అలీ లైన్‌లోని ఓ చోట ఘర్షణ జరుగుతోందని అబిడ్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ ప్రాంతంలో పరిస్థితి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రస్తుతం సిబ్బందిని పంపాల్సి ఉంటుంది. వారు అక్కడకు వెళ్ళి, పరిశీలించి, సమాచారం అందించేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అధికారులు తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఓ నిరసన కార్యక్రమం నేపథ్యంలో అధికారులు కొందరు సిబ్బందిని మోహరించారు. అయితే ధర్నాకు ఊహించిన సంఖ్య కంటే ఎక్కువ మందే వచ్చారు. ఈ విషయం క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది తెలిపే వరకు ఉన్నతాధికారులకు తెలియదు. దీంతో అదనపు సిబ్బంది మోహరింపునకు జాప్యం జరుగుతోంది. ఇలాంటి ఇబ్బందుల్ని తొలగించేందుకు నగర పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. పోలీసు అధికారిక యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఆధునిక హంగులు జోడిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఇవి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే..ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు తమ సెల్ఫోన్లోనే కోరుకున్న ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను లైవ్‌లో చూసే ఆస్కారం కలుగుతుంది. ‘సీసీ కెమెరా లైవ్’ పేరుతో అందుబాటులోకి వచ్చే దీంతో ఉన్నతా«ధికారులు సైతం ఎప్పటికప్పుడు తన సెల్ఫోన్ల ద్వారానే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకోవచ్చు. సత్వర స్పందన, సమన్వయం, సమాచారమార్పిడి కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఈ తరహా హంగుల్ని చేరుస్తున్నారు. న్యూ ఇయర్ డే అయిన జనవరి 1 నుంచి ఈ లైవ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. క్రైమ్ మ్యాపింగ్‌లో హంగులు జోడిస్తూ... నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే సమయంలో ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి ‘క్రైమ్ మ్యాపింగ్’లో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ విభాగం ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఠాణాలు, సెక్టార్లు, బీట్లు తెలిసేలా సరిహద్దుల్నీ పొందుపరిచారు. దీన్ని మరింత అప్డేట్ చేస్తూ.. ఆయా ఠాణా పరిధిలో ఉన్న సున్నిత ప్రాంతాలు, మతపరమైన కట్టడాలు, సమస్యాత్మక ప్రాంతాలను మార్కింగ్ చేశారు. మ్యాప్ మీదే ‘సీసీ కెమెరాలు’... సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. కొన్ని రకాలైన నేరాలు జరిగినప్పుడు అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్‌కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్‌లోని ‘క్రైమ్ రాడార్’లోకి ప్రవేశిస్తే చాలు. ఈ నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది. తాజా దృశ్యాలూ కనిపించేలా... పోలీసుస్టేషన్ పరిధిలో చోట ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయనో, పెద్ద ప్రమాదం జరిగిందనో పోలీసుస్టేషన్‌కు సమాచారం వచ్చినప్పుడు ఉన్నతాధికారులు ఘటనాస్థలిలో పరిస్థితుల్ని ఎంత త్వరగా తెలుసుకోగలిగితే.. పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యల్ని అంతం వేగంగా చేపట్టే అవకాశం ఉంటుంది. దీనికోసం కేవలం సిబ్బంది పైనే ఆధారపడకుండా ‘సీసీ కెమెరా లైవ్’ సదుపాయం యాప్‌లో కల్పించారు. క్రైమ్ రాడార్‌లో కనిపించిన కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే చాలు.. దాని ఫీడ్ లైవ్‌లో కనిపించనుంది. ఈ సౌకర్యం యాప్ ద్వారా సిబ్బంది, ఉన్నతాధికారుల సెల్ఫోన్లలోకూ అందుబాటులోకి వస్తోంది. అన్ని స్థాయిల్లో సిబ్బందికీ, అన్ని ప్రాంతాల్లో ఉన్న ఫీడ్‌ను లైవ్‌లో చూసే సౌకర్యం కల్పిస్తే... కొన్నిసార్లు ఇబ్బందులకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా సిబ్బంది, అధికారులు విధులు నిర్వర్తించే ప్రాంతాల ఆధారంగా వారి ఫోన్లలోకి లింకేజ్ ద్వారా అందుబాటులో ఉంచాల్సిన లైవ్ ఫీడ్లను నిర్ణయిస్తున్నారు. ఉన్నతాధికారులకు మాత్రం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలతో లింకేజ్ ఇస్తారు. -
‘హైదరాబాద్ కాప్’కు అరుదైన గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం రూపొందించి, వినియోగిస్తున్న యాప్ ‘హైదరాబాద్ కాప్’కు అరుదైన గుర్తింపు లభించిందని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వరల్డ్ సమ్మిట్ అవార్డ్– 2017’ను గెల్చుకుందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న ప్రతి దేశం ఈ అవార్డుకు ఒక్కో నామినేషన్ సమర్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 180 దేశాలు ఎనిమిది కేటగిరీల్లో 400 ఎంట్రీలు పంపాయని, వాటిలో భారత్ నుంచి హైదరాబాద్ కాప్ నామినేట్ అయిందని కొత్వాల్ తెలిపారు. గత వారం జర్మనీలోని బెర్లిన్‌లో సమావేశమైన జ్యూరీ మొత్తం 40 యాప్స్‌ను అవార్డులకు ఎంపిక చేసిందన్నారు. హైదరాబాద్ కాప్ ‘గవర్నమెంట్ అండ్ సిటిజన్ ఎంగేజ్మెంట్’కేటగిరీలో అవార్డు దక్కించుకుందని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజంపై ప్రభావం చూపిన, ప్రజలకు ఉపయుక్తంగా మారిన యాప్స్‌ను ఈ వార్డుకు ఎంపిక చేస్తారని కమిషనర్ తెలిపారు. ప్రత్యేక కేటగిరీలో 24 దేశాల నుంచి వచ్చిన 39 ప్రాజెక్టులను అధిగమించి ‘హైదరాబాద్ కాప్’అవార్డు దక్కించుకుందని కొత్వాల్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 20–22 మధ్య వియన్నాలో జరగనున్న ‘వాస్ గ్లోబల్ కాంగ్రెస్’లో సిటీ పోలీసులు ఈ అవార్డును అందుకుంటారని చెప్పారు. -
చాంప్ హైదరాబాద్ సిటీ పోలీస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో హైదరాబాద్ సిటీ పురుషుల పోలీస్ జట్టు జూడోలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. వరంగల్‌లో జరిగిన ఈ పోటీల్లో మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 90 కేజీల కేటగిరీలో శివకృష్ణ (హైదరాబాద్) బంగారు పతకం సాధించగా, 100 కేజీల కేటగిరీలో సి. వెంకటేశ్ కాంస్యం, ప్లస్ 100 కేజీ కేటగిరీలో అశ్విన్ స్వర్ణం గెలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వరంగల్ కమిషనర్ సుధీర్ బాబు విజేతలకు పతకాలు అంజదేశారు. జూడో ఫలితాలు పురుషుల 81 కేజీలు: 1. గణేష్ (టీఎస్ఎస్పీ), 2. మధు (నిజామాబాద్), 3. వెంకటేశ్ (హైదరాబాద్ సిటీ); 90 కేజీలు: 1. శివకృష్ణ (హైదరాబాద్ సిటీ), 2. రమేష్ (వరంగల్ సిటీ), 3. శ్రీనివాస్ (టీఎస్ఎస్పీ); 100 కేజీలు: 1. నజీర్ (కరీంనగర్ రేంజ్), 2. నవీన్ (వరంగల్ సిటీ), 3. వెంకటేశ్ (హైదరాబాద్ సిటీ); ప్లస్ 100 కేజీలు: 1. అశ్విన్ కుమార్ (హైదరాబాద్ సిటీ), 2. రాజు (వరంగల్ రేంజ్), 3. ప్రసాద్ (టీఎస్పీఏ). -
ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్
-
బోరబండ ప్రాంతంలో పోలీసుల కార్డెన్ సర్చ్
హైదరాబాద్ : నగరంలోని బోరబండ ప్రాంతంలో పలు కాలనీల్లో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. బోరబండ, భరత్‌నగర్, బంజారానగర్, బాబాసాహెబ్నగర్ తదితర ప్రాంతాల్లో 586 ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడుగురు రౌడీషీటర్లను, ముగ్గురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 17 మంది విదేశీయులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 51 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 400 మంది పోలీసులు నలుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
-
కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : మగపిల్లవాడు పుడితే ఆడపిల్లిను ఇచ్చారంటూ బాలింత రజిత బంధువులు మంగళవారం కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాలింత రజిత బంధువులతో పోలీసులు మాట్లాడుతున్నారు. -
‘బాధ’వారం!
చోరీల్లో అత్యధికం జరిగింది బుధవారం రోజునే విశ్లేషించి స్పష్టం చేసిన ‘హైదరాబాద్ కాప్’ నిరోధానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు సిటీబ్యూరో: ‘లైఫ్‌స్టైల్’ భవనం యజమాని మధుసూదన్‌రెడ్డి ఇంట్లో రూ.1.33 కోట్ల ‘చోరీ’... జేఎన్టీయూలో విద్యనభ్యసిస్తున్న నైజీరియా విద్యార్థి రూమ్‌లో రూ.3.5 లక్షల చోరీ... ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంగీత మొబైల్స్ దుకాణంలో రూ.10 లక్షల సొత్తు చోరీ... బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఇంటి ముందు పార్క్ చేసిన ఎర్టిగా కారు చోరీ... నగరంలో బుధవారం చోటు చేసుకున్న దొంగతనాలకు ఉదాహరణలివి. కేవలం ఇవి మాత్రమే కాదు సిటీలో జరుగుతున్న చోరీల్లో అత్యధికంగా ఈ వారమే జరుగుతుండటంతో ‘వెన్స్డే’ బాధితులకు ‘బాధావారం’గా మారిపోయింది. నగర పోలీసు ఐటీ విభాగం అభివృద్ధి చేసిన యాప్ ‘హైదరాబాద్ కాప్’ ద్వారా ఈ అంశాన్ని గుర్తించిన అధికారులు కారణాలు విశ్లేషిస్తూ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారు. ‘కాప్’ విశ్లేషణలో వెలుగులోకి... నగర పోలీసులు ఈ యాప్‌లో నేరాలు జరిగే క్రైమ్ ప్రోన్ ఏరియాలతో పాటు అవి జరిగే సమయాలు, రోజుల్నీ నమోదు చేస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా ఈ వివరాలను యాప్‌కు సంబంధించిన సర్వర్‌లోని ఎంట్రీ చేయిస్తున్న అధికారులు నేరాల నిరోధం కోసం వివిధ కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు జరిగిన నేరాలను ఈ యాప్ సహాయంతో అధ్యయనం చేసిన పోలీసు విభాగం అత్యధిక నేరాలు బుధవారమే జరిగినట్లు గుర్తించారు. వలస దొంగలకు అనుకూలం... ఈ రోజునే నేరాలు చోటు చేసుకోవడానికి కారణాలను పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా ‘వలస దొంగలకు’ కలిసొచ్చే అంశంగా మారిందని చెప్తున్నారు. నగరంలో నేరాలు చేస్తున్న చోరుల్లో బయటి ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారూ ఎక్కువగానే ఉంటున్నారు. సాధారణంగా శని, ఆదివారాలు వీకెండ్స్ కావడంతో అంతా ఇంట్లోనే ఉంటారనే ఉద్దేశంతో వీరు ఆ రోజుల్లో, దానికి ముందు సిటీకి రావట్లేదని భావిస్తున్నారు. సోమవారం నగరానికి చేరుకునే వలస దొంగలు మంగళవారం రెక్కీ చేసి బుధవారం ‘పని’ పూర్తి చేసుకునే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే కారణాన్ని నిర్థారించడానికి కేసుల వారీగా లోతైన అధ్యయనానికి సన్నాహాలు చేస్తున్నారు. గస్తీ విధానంలో మార్పుచేర్పులు... ఈ యాప్ ద్వారా నేరాలు జరిగే ప్రాంతాలు, రోజులు, సమయాలను గుర్తించిన అధికారులు దానికి అనుగుణంగా గస్తీ విధానంలో మార్పుచేర్పులు చేస్తున్నారు. క్రైమ్ ప్రోన్ ఏరియాలను జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చారు. గస్తీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది పక్కాగా జరుగుతోందా? లేదా? అనే అంశాన్నీ సాంకేతికంగానే పర్యవేక్షిస్తున్నారు. మూడు నెలల గణాంకాలు ఇలా... నమోదైన మొత్తం సొత్తు సంబంధ నేరాలు: 704 నేరాల్లో రకాలు సాధారణ చోరీలు: 310 వాహనచోరీలు: 215 ఇళ్లల్లో పగటిపూట దొంగతనాలు: 30 ఇళ్లల్లో రాత్రి వేళ దొంగతనాలు: 58 దృష్టి మళ్లించే నేరాలు:38 -
హుస్సేనీఆలంలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సౌత్‌జోన్ పోలీసులు కార్డన్‌సెర్చ్ (నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ కత్తి, మూడు డాగర్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ఐదు మామిడిపళ్ల గోడౌన్లను సీజ్ చేశారు. ఆ క్రమంలో ఐదు బ్యాగుల కార్బైడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు రెండు బెల్ట్ షాపులను సీజ్ చేసి... 700 లిక్కర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 300 మంది పోలీసులు పాల్గొన్నారు. సౌత్ జోన్ డీసీపీ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. -
చార్మినార్ వద్ద తనిఖీలు:127 మంది అరెస్ట్
హైదరాబాద్ : పాతబస్తీలోని చార్మినార్, ఫలక్‌నుమా, చాంద్రయాణగుట్టలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 127 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 300 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించరాఉ. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
సిటీ యాప్.. సూపర్ కాప్..
పోలీసులకు అందుబాటులోకి ‘హైదరాబాద్ కాప్ యాప్ సాక్షి, హైదరాబాద్: నిఘా.. దర్యాప్తు.. పర్యవేక్షణ.. ప్రజా భద్రతలో ఇవే కీలకాంశాలు. వీటన్నింటినీ ఒకేసారి సమన్వయపరచడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసుల కోసం ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది నగర పోలీసు విభాగం. హైదరాబాద్ కాప్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం కమిషనరేట్‌లో ఆవిష్కరించారు. దర్యాప్తు అధికారులు క్షేత్రస్థాయి నుంచే కీలక వివరాలు సేకరించడానికి, నేరగాళ్లు, అనుమానితుల వివరాలు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపకరించనుంది. అలాగే నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా రికార్డవుతున్న దృశ్యాలను ప్రతి పోలీసు అధికారి తన సెల్‌ఫోన్ ద్వారానే పర్యవేక్షించే అవకాశం ‘హైదరాబాద్ కాప్’ యాప్ ద్వారా లభించనుంది. హైదరాబాద్ పోలీసులను సూపర్ కాప్లుగా మార్చే ఈ యాప్‌లో ఉండే ప్రధానాంశాలు ఏమిటంటే.. ఈ-బీట్ వ్యవస్థ.. ఠాణాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, కీలక ప్రదేశాలకు గస్తీ సిబ్బంది కచ్చితంగా వెళ్లిరావడం కోసం ఆయా చోట్ల బీట్ పుస్తకాలు ఏర్పాటు చేస్తారు. ఈ యాప్ ద్వారా ఈ-బీట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జీపీఎస్ పరిజ్ఞానం ఆధారంగా పని చేసే ఈ యాప్ అక్షాంశ, రేఖాంశాలను సంగ్రహించడం ద్వారా పక్కాగా, కచ్చితంగా ఆయా ప్రాంతాలకు వెళ్లేలా చేస్తుంది. క్రైమ్ స్పాట్స్.. గడిచిన నాలుగేళ్ల గణాంకాల ఆధారంగా పోలీసుస్టేషన్ల వారీగా క్రైమ్ ప్రోన్ ఏరియాలను గుర్తించి, జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. గస్తీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థ ఈ యాప్‌లో ఉంది. వెహికల్ డేటాబేస్ ఓ వాహనచోదకుడు వాహనానికి చెందిన పత్రాలను పోలీసులకు తనిఖీ సమయంలో చూపినప్పుడు ఆ జిరాక్సు ప్రతులు అసలో కాదో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు చోరీ వాహనాల జాబితా కూడా ఈ యాప్‌కు అనుసంధానిస్తున్నారు. ఎంవో క్రిమినల్స్.. సిటీకి చెందిన 3,600 మంది పాత నేరగాళ్లు నివసిస్తున్న తాజా చిరునామాలను జీపీఎస్ ఆధారంగా ట్యాగిం గ్ చేశారు. దీంతో పాటు జైలు నుంచి విడుదలవుతున్న వారి వివరాలనూ పొందుపరిచారు. ఫలితంగా క్షేత్రస్థాయి సిబ్బంది కచ్చితంగా వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడంతో పాటు ఏదైనా నేరం జరిగిన వెంటనే అలాంటి నేరాలు చేసే వాళ్లు ఎవరున్నారు? వారు ప్రస్తుతం ఎక్కడున్నారు? అనేవి తక్షణం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మిస్సింగ్‌కు చెక్.. సిటీలో నిత్యం తప్పిపోయిన, గుర్తుతెలియని శవాల కేసులు నమోదవుతుంటాయి. ఈ యాప్ సర్వర్‌లో ఎప్పటికప్పుడు మిస్సింగ్ కేసులు, లభించిన గుర్తుతెలియని మృతదేహాల పూర్తి వివరాలను అప్లోడ్ చేస్తారు. ఇవి అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులో ఉండటంతో ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే సరిచూడటానికి అవకాశం ఏర్పడుతోంది. పరిరక్షణ విధివిధానాలు నేర స్థలాల్లో లభించే ఆధారాలు దర్యాప్తునకు కీలకం. అధికారులు, సిబ్బందికి వీటిని ఎలా పరిరక్షించాలి? తదితర అంశాలపై పట్టుండట్లేదు. దీనికోసం క్రైం సీన్ మేనేజ్మెంట్ను యాప్‌లో అందించారు. దీని ద్వారా ఆధారాల సేకరణ, దర్యాప్తు విధివిధానాలు, నిబంధనలు అన్ని స్థాయిల సిబ్బందికీ అందుబాటులోకి వస్తున్నాయి. క్షణాల్లో చిరునామాలు వివిధ కేసుల దర్యాప్తులో వాహనాలు, సెల్‌ఫోన్, పాస్‌పోర్ట్ నంబర్లు తదితరాల ఆధారంగా సేకరించే ఆయా వ్యక్తుల చిరునామాలు కీలకంగా మారతాయి. ఇవి ఎంత త్వరగా తెలుసుకోగలిగితే దర్యాప్తు అంత వేగవంతం అవుతుంది. ఈ డేటాబేస్‌ను యాప్ సర్వర్‌కు అనుసంధానించారు. దీంతో కొన్ని రకాలైన ఫిర్యాదుల విచారణ, కేసుల దర్యాప్తుల్లో జాప్యాన్ని నివారించడానికి ఆస్కారం ఏర్పడనుంది. -
‘అరచేతి’లో సీసీ కెమెరా దృశ్యాలు
‘హైదరాబాద్ కాప్’తో ఉపయోగాలు ఎన్నో ఆవిష్కరణలో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడి విధుల్ని బట్టి సమాచారం అందుబాటు: సీపీ సిటీబ్యూరో: ‘నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను ప్రతి అధికారి తన సెల్‌ఫోన్ ద్వారానే పర్యవేక్షించే అవకాశం ‘హైదరాబాద్ కాప్’ యాప్ ద్వారా లభించనుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. సోమవారం నగర కమిషనరేట్‌లో ఈ యాప్‌ను ఆవిష్కరించిన డీజీపీ, ఆధునీకరించిన రిసెప్షన్ సెంటర్, పోలీసు క్యాంటిన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ‘ఈ యాప్ ద్వారా ప్రతి అధికారికీ చేతిలోనే సమీకృత సమాచారం లభిస్తుంది. ఏ ప్రాంతానికి వెళ్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా పోలీసులు తమ విధుల్ని వ్యూహాత్మకంగా నిర్వర్తించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు వీలవుతుంది. దర్యాప్తు తీరుతెన్నులు, విధి విధానాలు సైతం అధికారుల్ని అడగాల్సిన అవసరం లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు’ అని అన్నారు. అవసరాల మేరకే సమాచారం ఈ యాప్ ద్వారా దర్యాప్తునకు ఉపకరించే అనేక రకాలైన సమాచారాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. అయితే అందరికీ అన్ని వివరాలు తెలుసుకునే ఆస్కారం లేదు. యాప్‌ను వినియోగించే అధికారి హోదా, అతని విధి నిర్వహణ పరిమితులను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు మాత్రమే సమాచారం యాక్సిస్ చేసే ఏర్పాట్లు చేశాం. నగర పోలీసు విభాగాన్ని స్మార్ట్ కాప్స్గా మార్చడంలో ఈ యాప్ ఓ మైలురాయి. పోలీసు అధికారుల్లో 90 శాతం మంది క్షేత్రస్థాయిలోనే ఉంటారు. పోలీసుస్టేషన్లలో ఉన్న వారందరికీ సైతం కంప్యూటర్లు అందించలేం. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్‌నే దర్యాప్తు ఉపకరణంగా మార్చుకోవచ్చు. - ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసుల కమిషనర్ అధికారుల ఉరుకులు పరుగులు... నగర పోలీసులు ముందుగా అనుకున్న దాని ప్రకారం డీజీపీ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉంది. అనివార్య కారణాల నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందే అనురాగ్ శర్మ కమిషనరేట్‌కు చేరుకున్నారు. ఆ సమయానికి కమిషనర్ సహా అధికారులంతా తమ తమ ఛాంబర్స్‌లోనే ఉన్నారు. డీజీపీ రాక విషయం తెలిసి అంతా ఉరుకులు పరుగుల మీద కిందికి వచ్చారు. లిఫ్ట్ కోసమూ ఎదురుచూడకుండా మెట్ల వెంటే దిగివచ్చారు. పోలీసు టెక్నాలజీలో సిటీ ఆదర్శం రోమ్, లండన్, టోక్యో... ఇలా ప్రపంచంలోని ఒక్కో దేశం, నగరం ఒక్కో అంశానికి నాంది పలుకుతూ చరిత్రలో నిలిచిపోయి ఆద్శంగా మారాయి. పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మాత్రం హైదరాబాద్ సిటీ పోలీసులు ఇతర నగరాలు, రాష్ట్రాలను ఆదర్శంగా మారుతున్నారు. అందులో భాగంగానే దేశంలోనే తొలిసారిగా ఆధునిక సౌకర్యాలతో పోలీసు విభాగం ‘హైదరాబాద్ కాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. - అంజనీకుమార్, అదనపు సీపీ దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా.. ఈ యాప్ ద్వారా పోలీసు విభాగంలోని అన్ని స్థాయి అధికారులకు విలువైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. అది ఏమాత్రం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. దీనికోసమే నిత్యం పక్కాగా ఆడెటింగ్ చేస్తున్నాం. ఏ అధికారి ఎప్పుడు, ఏ సమాచారాన్ని తనిఖీ చేశారు? ఏ మేరకు డౌన్లోడ్ చేసుకున్నారు? తదితర అంశాలను గమనించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. - కె.శ్రీనాథ్‌రెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ -
సనత్‌నగర్‌లో కార్డన్ సెర్చ్: 45 మంది అరెస్ట్
హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్‌లో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 45 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 64 బైక్‌లు, 20 ఆటోలు, ఓ జీపు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఆడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు ఈ విస్తృత తనిఖీల్లో పాల్గొన్నారు. -
లంగర్‌హౌస్‌లో కార్డన్ సెర్చ్: 63 మంది అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌస్, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 63 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే సరైన పత్రాలు లేని 59 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. -
సంతోష్‌నగర్‌లో కార్డన్ సెర్చ్: అనుమానితులు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని సంతోష్‌నగర్‌లో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 300 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు జరుపుతున్నారు. సంతోష్‌నగర్ ప్రాంతాన్ని వారు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులోభాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 56 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 23 వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. -
హకీంపేట,టోలిచౌకీలో పోలీసుల కార్డెన్‌సెర్చ్
-
'వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు'
హైదరాబాద్: 'షీ' టీమ్స్ వల్ల మహిళలపై వేధింపులు తగ్గాయని హైదరాబాద్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా తెలిపారు. 'షీ' టీమ్స్ ఏర్పాటు చేసిన ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎవరు వేధించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. ఈ-మెయిల్, వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. 'షీ' టీమ్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 281 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని, 12 మందిపై నిర్భయ కేసులు పెట్టామని చెప్పారు. అరెస్టైన వారిలో 129 మంది మైనర్లు ఉన్నారన్నారు. ఏడాది మొత్తంలో 883 ఫిర్యాదు వచ్చాయని తెలిపారు. డయల్ 100 ద్వారా 575, ఫేస్ బుక్ ద్వారా 196 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. -
హైదరాబాద్‌లోని బాయ్స్ హాస్టళ్లలో కార్డన్‌సెర్చ్
-
ఉప్పల్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్
-
పోలీసు పోలీసు... నో పోలీసు
హైదరాబాద్ నగర పోలీసులు అంతర్జాతీయ ఖ్యాతీ నార్జించాలి.... హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కావాలి ... తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఏర్పడాలి... మూడు నెలల్లో అన్ని ప్రాంతాలలో అత్యాధునిక సీసీ కెమెరాలు.... గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమం (ఆగస్టు 14)లో భాగంగా మొదటి విడతలో 100 ఇన్నోవాలు, 300 బైక్‌లను పోలీసు శాఖకు అందజేస్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాటలివి. 100 ఇన్నోవాలు, 300 బైకులపై పోలీసులు నిరంతరం గస్తీతో తమకిక గుండెలమీద చేయి వేసుకుని పడుకోవచ్చనుకున్నారు నగరవాసులు. అయితే ప్రజల నమ్మకాన్ని ఖాకీలు మరోసారి వమ్ము చేశారు. సీనియర్ నటి శ్రీలక్ష్మి గొలుసు చోరీ ఉదంతమే పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. అంత పోలీసుల గస్తీలోను, కెమెరాల పహారాలోను ఆమె మెడలోని బంగారపు గొలుసును దుండగులు తెంపుకుని పోయారు. ఆ ఘటన నుంచి తేరుకునే లోపే దుండగులు పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన అప్పటికే వారు మామమైయ్యారు. శ్రీలక్ష్మి షాక్ నుంచి తెరుకుని పోలీస్, పోలీస్ అని పిలిచినా పలికే నాధుడే లేడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కోసం 100 డయల్ చేసినా అటువైపు నుంచి స్పందన శూన్యం. చేసేదీలేక ఆమె ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ దాకా వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత అట్టహాసంగా పెట్రోలింగ్ కోసం అంటూ వందల ఇన్నోవా... వందల బైకులు తీసుకువచ్చినా పోలీసులు స్పందనలో మార్పులేకపోవడం శోచనీయం.అదికాక ఇన్నోవా డ్రైవర్లు, నిర్వహణదారులకు ఏపీ పోలీసు అకాడమితోపాటు అడ్మినిష్ట్రేన్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ ఇప్పించారు. అంతేకాకుండా ఆ వాహనాల్లో ఏసీ, జీపీఎస్ సిస్టమ్, ట్యాబెట్లు పీసీలు, కెమెరాలు, వీహెచ్ఎఫ్ సెట్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఇన్ని చేసినా స్పందనారాహిత్యంతో పోలీసు వ్యవస్థ అభాసుపాలవుతోంది.హైదరాబాద్ మహానగరంలో గొలుసు చోరీలు అత్యధికంగా జరుగుతున్నాయి. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూన్నారు. కానీ ఆ కేసుల్లో మాత్రం పురోగతి ఎండమావిని తలపిస్తోంది. రక్షక భటులు ఇకనైనా మేల్కోపోతే సామాన్యులకు తిప్పలు తప్పవు. -
చెల్లిళ్ల గొంతునులిమి చంపిన అన్నయ్య
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పూసలబస్తీలో అర్థరాత్రి దారుణం జరిగింది. అరవింద్ అనే వ్యక్తి తన ఇద్దరు సొంత చెల్లెళ్లను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అరవింద్ పోలీసు స్టేషన్ వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
నారాయణగూడ వద్ద రూ. 60 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా మంగళవారం నారాయణగూడ వద్ద తనిఖీలలో భాగంగా ఓ కారు నుంచి రూ.60 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తమ స్వస్థలం ముంబై అని, వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చామని సదరు వ్యక్తులు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే నగదుకు సంబంధించి సరైన పత్రాలు వెల్లడించకపోవడంతో పోలీసులు ఆ ముగ్గురుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే నగదు, కారును కూడా స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. -
మా చావుకు ఆ పోలీసే కారణం!
హైదరాబాద్ క్రైం బ్రాంచ్ అధికారి వేధింపుల వల్లే చనిపోతున్నాం బెంగళూరులో సూసైడ్‌నోట్ రాసి ఓ కుటుంబం ఆత్మహత్య బెంగళూరు, న్యూస్‌లైన్: హైదరాబాద్ సిటీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారి ‘రెడ్డి’ వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ రాసి బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయినవారిలో భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలో ఉండే కౌశిక్ శర్మ మూడేళ్ల క్రితం బెంగళూరు వకీల్ గార్డెన్లో భవంతిని నిర్మించుకుని అప్పటినుంచి అందులో భార్య శ్రీలత, కుమారుడు కౌస్తుభ, కుమార్తె శ్రీరక్షలతో నివసిస్తున్నారు. నగరంలోనే ఉండే తన అన్న కుమార్తె సుమేఘకు గురువారం ఫోన్ చేసిన కౌశిక్.. శుక్రవారం ఉదయం తమ ఇంటికి తప్పకుండా రావాలని పిలిచారు. ఆమె శుక్రవారం అక్కడికి వెళ్లి చూడగా, నలుగురూ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన దంపతులు తర్వాత ఉరేసుకున్నారు. ఒక బ్యాగులో రూ.10 లక్షలు, మరో బ్యాగులో కిలోన్నర బంగారు నగలు కూడా పెట్టి ఉంచిన విషయాన్ని సుమేఘ గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి కౌశిక్ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో '‘హైదరాబాద్ సిటీ క్రైం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న రెడ్డి అనే అధికారి మా ఆస్తులు, నగదు, నగలు స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. నిత్యం వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నాం..’ అని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటిలో గొడలపై సైతం ‘ఏపీ పోలీస్ రెడ్డి, సీసీఎస్, అవర్ మనీ, గోల్డ్, సైట్’ అని రక్తంతో రాసినట్లు గుర్తిం చారు. తమ ఆస్తులతోపాటు నగలు, నగదు మొత్తం సుమేఘకు ఇవ్వాలని కౌశిక్ వీలునామా కూడా రాశారని పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉన్నందున నిందితుడు ‘రెడ్డి’ పూర్తి పేరును చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. అయితే నిందితుడికి కూడా వకీల్ గార్డెన్లో స్థలం ఉందని, తరచూ ఆ స్థలాన్ని చూసుకోవడానికి వచ్చిపోతూ.. కౌశిక్ పూర్తి వివరాలు తెలుసుకున్న ఆయన వారి ఆస్తిని కొట్టేసేందుకు కుట్ర పన్నారని సమాచారం. -
రెజ్లర్ సతీశ్ యాదవ్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు క్రీడల్లో భాగంగా జరిగిన రెజ్లింగ్ ఈవెంట్లో ఆర్. సతీశ్లాల్ యాదవ్‌కు స్వర్ణ పతకం లభించింది. హైదరాబాద్ సిటీ పోలీసులోని కమాండో వింగ్‌లో పనిచేస్తున్న 27 ఏళ్ల సతీశ్ పురుషుల 70 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచాడు. వైజాగ్‌లో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో సతీశ్ జూడో క్రీడాంశంలోనూ బరిలోకి దిగి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. రెండు పతకాలు సాధించిన సతీశ్‌ను నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అభినందించారు.