illegal sand mining
-
ఇసుక దోపిడీ అడ్డుకోవాల్సిన అధికారులే చోద్యం చేస్తున్నారు
-
ఇసుక దోపిడీ దారుణంగా ఉంది
మహారాణిపేట (విశాఖ): శ్రీకాకుళంలోని ఇసుక రీచ్‌లలో దళారుల దోపిడీ దారుణంగా ఉందని, వారి నుంచి తమను కాపాడాలని విశాఖ కలెక్టర్‌కు క్వారీ లారీ ఓనర్స్ మొరపెట్టుకున్నారు. విశాఖ జిల్లా క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే ఇసుక విధానం పారదర్శకంగా ఉండేదని చెప్పారు. కూటమి నాయకులు ఇసుక రీచ్‌ల వద్ద ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టన్ను ఇసుకకు అదనంగా రూ.300 వసూలు చేస్తున్నారని, ఎందుకు అదనంగా ఇవ్వాలని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే ఉచితంగా వస్తుందనుకున్నామని, కానీ డబ్బులు చెల్లించాలనడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. శ్రీకాకుళంలోని 11 ఇసుక రీచ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విశాఖలో ఇసుక అమ్మాలంటే టన్ను రూ.వెయ్యి కంటే తక్కువకు విక్రయించలేని పరిస్థితి ఉందన్నారు.సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే మీరు ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ తెలిపారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు. -
తవ్వుకో.. దోచుకో!
టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తున్నామని గొప్పులు చెప్పుకోవడం తప్పించి ఆచరణలో ఇది అమలు కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నడిపూడి ర్యాంపులో నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక తవ్వకాలతో టీడీపీ నేత ఒకరు పేట్రేగిపోతున్నారు. ఒక్క వారం రోజుల్లోనే రూ.50 లక్షలకుపైగా విలువైన ఇసుకను తరలించేశారు. టీడీపీ నేతకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.తవ్వకాలకు అనుమతి లేని రీచ్‌లో భారీ ఎత్తున టీడీపీ నేత ఇసుక కొల్లగొడుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు తూట్లు పొడుస్తూ నదీగర్భంలో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి నరసాపురం రూరల్ బియ్యపుతిప్ప వద్ద సముద్రంలో కలిసే వరకు వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వేవారు. సముద్రపు పోటుతో ఆయా ర్యాంపుల్లోని ఇసుకలో ఉప్పునీటి సాంద్రత పెరిగింది.దీంతో నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడం, తీర ప్రాంత పరిరక్షణలో భాగంగా ఈ ర్యాంపులు సీఆర్‌జెడ్ పరిధిలోకి వెళ్లడంతో ఈ రీచ్‌లు మూతపడ్డాయి. ఇసుక కొరత నేపథ్యంలో వీటిని తెరిచేందుకు అధికార యంత్రాంగం పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వీటిని తెరిచే వీలులేకపోవడంతో జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రు, ఔరంగాబాద్ ర్యాంపులను ప్రభుత్వం కేటాయించింది. – సాక్షి, భీమవరంచక్రం తిప్పిన శాండ్ కింగ్..తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలకు పేరొందిన టీడీపీ నేత కన్ను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపులపైనా పడింది. జట్టు కార్మికుల ప్రాబల్యం తక్కువగా ఉండటం, బాట అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో తన అక్రమ తవ్వకాలకు ఆయన నడిపూడి ర్యాంపును ఎంచుకున్నారు. సాధారణంగా ర్యాంపు తెరవాలంటే నీటిపారుదల, గనులు, కాలుష్యం, రెవెన్యూ తదితర శాఖల అనుమతులు తప్పనిసరి. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలను అనుసరించి తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతులో జట్టు కార్మికులతో తవ్వకాలు చేయించాలి. పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్ చేయాలి. అయితే ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ సదరు శాండ్ కింగ్ చక్రం తిప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో నడిపూడి ర్యాంపులో అనధికార తవ్వకాలకు తెరలేపారు. పొక్లెయిన్లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్ల లోతున ఇసుకను పైకి తోడి రాత్రివేళల్లో లోడింగ్ చేస్తున్నారు. నిర్మాణ పనులకు అనువు కాదని మూసివేసిన ర్యాంపులో వారం రోజులుగా యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.అదనపు చార్జీల రూపంలో భారీ వసూళ్లు..ఇతర ర్యాంపుల కంటే తక్కువ ధరకు ఇసుక లోడింగ్ చేస్తుండడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి లారీలు నడిపూడి ర్యాంపు వద్ద బారులు తీరుతున్నాయి. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని పలు ర్యాంపుల్లో ఐదు యూనిట్ల లోడింగ్‌కు ప్రభుత్వ నిర్ణీత ధరతో పాటు అదనపు చార్జీల రూపంలో రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు టీడీపీ నేత దండుకుంటున్నారు. ఈ అనధికార ర్యాంపులో రూ.2,500కే ఐదు యూనిట్ల ఇసుక లోడింగ్ చేస్తుండడంతో లారీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ర్యాంపు వద్ద నుంచి సిద్ధాంతం వంతెన వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర లారీలు లోడింగ్ కోసం వేచి ఉంటున్నాయి. రోజూ 200కు పైగా లారీలు ఇసుక కోసం వస్తున్నాయి.వీటి నుంచి రూ.6.50 లక్షలు – రూ.8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో దాదాపు రూ.అర కోటికి పైగా దండుకోగా ర్యాంపు నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన మొత్తం టీడీపీ అగ్రనాయకత్వానికి చేరుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అక్రమ తవ్వకాల్లో తమకు వాటా ఇవ్వకుండా మొత్తం పొరుగు జిల్లా నేత దోచుకుపోతున్నారని స్థానిక కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. అధికారులకు అందుతున్న ఫిర్యాదుల్లో పేర్లు లేకుండా టీడీపీ నాయకులే చేస్తున్నవే ఎక్కువగా ఉంటున్నట్టు సమాచారం. -
‘కూటమి’ కనుసన్నల్లో.. పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు సర్కార్ అండదండలతో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మున్నేరు నుంచి లారీల్లో ఇసుక తరలిపోతోంది. జేసీబీలతో ఇసుకను తోడేస్తున్నారు. అనుమతులు లేని ప్రదేశంలో ఇసుక అక్రమ తవ్వకాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.అక్రమ తవ్వకాలను పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు రైతులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు జరిగితే మున్నేరులో కోత ఏర్పడి తమ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల మంచినీటి స్కీం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.మరోవైపు, నిషేధిత యనమలకుదురు ఇసుక క్వారీలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. టీడీపీ నాయకుల అండదండలతో విజయవాడకు కూతవేటు దూరంలో ఇసుకమాఫియా పేట్రేగిపోతున్నా.. అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తిచూడటం లేదు. ఇసుక మాఫియా ఇక్కడ్నుంచి భారీగా ఇసుకను తరలిస్తూ సొమ్ముచేసుకుంటుండగా, టీడీపీ నేతలు అక్రమార్కులకు సహకరిస్తూ ఇసుకను కాజేస్తుండటం గమనార్హం.పొంచి ఉన్న ప్రమాదంకృష్ణానదిపై కనకదుర్గ వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత దశాబ్దకాలం కిందట యనమలకుదురు క్వారీని ప్రభుత్వం నిషేధిత క్వారీగా ప్రకటించింది. అపట్నుంచి ఇక్కడ ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.అయితే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక యనమలకుదురు క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ఇసుక అక్రమ తవ్వకాలతో కనక దుర్గవారధితోపాటు యనమలకుదురు గ్రామానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. -
ఏపీలో సంక్షోభంలో భవన నిర్మాణ రంగం
-
అనకాపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా
-
తిరుపతి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
-
టీడీపీ ప్రభుత్వ హయాంలో యధేచ్ఛగా సాగిన ఇసుక దందా
-
చేసేదే దొంగ పని.. అందులోనూ వైరం.. కాల్పులు జరపటంతో.. !
పాట్నా: ఇసుక అక్రమ రవాణాలో రెండు ముఠాల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకు వెళ్లింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపటంతో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిహార్‌లోని బిహ్తా నగరంలో గురువారం జరిగింది. సన్ రివర్ నుంచి అక్రమంగా ఇసుక తరలించటంలో రెండు గ్రూపులు నిమగ్నమయ్యాయి. ఈ విషయంపైనే మాటా మాటా పెరిగి దాడులు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తూటాలు తగిలి నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 13న బిహార్‌లోని బెగుసరాయ్‌లో జాతీయ రహదారులు 28, 31పై బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. కొద్ది రోజుల్లోనే ఇలా రెండు ముఠాలు కాల్పులు జరపటం గమనార్హం. ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి/ కాకినాడ: కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు పొందినట్లు చెప్పుకుంటూ.. జిల్లాల వారీగా అక్రమ విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వివిధ జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరిస్తూ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) టెండర్ల ద్వారా అనుమతి పొందిందినట్లు చెప్పారు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ‘జేపీవీఎల్ వారు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉంది. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అక్రమార్కులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా వివధ పేర్లతో కాకినాడ జిల్లా పరిధిలో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తాం.’ అని గట్టి హెచ్చరికలు జారి చేశారు. అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎస్ఈబీ ఏర్పాటు.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పడం జరిగిందన్నారు ఎస్పీ. ఎస్.ఇ.బి అధికారులు జిల్లాలో నిత్యం వాహన తనిఖీలు చెక్ పోస్టుల వద్ద నిర్వహిస్తూ ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు, అక్రమ రవాణా నిర్మూలన కొరకు SEB అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ 14500 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా అక్రమ రవాణా సమాచారాన్ని నిర్భయంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేయవచ్చునని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఖండించిన జేపీవీఎల్.. కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు పొందారని, జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను జేపీవీఎల్ పత్రికా ప్రకటన ద్వారా ఖండించింది. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎంటిసి ద్వారా నిర్వహింపచేసిన టెండర్లలో జయప్రకాశ్ పవర్ వెంచర్స లిమిటెడ్ (జేపీవీఎల్) ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఆపరేషన్స్ నిర్వహణను దక్కించుకుంది. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడుతూ జేపీవీఎల్ సాంకేతికంగానూ, ఆర్థికంగానూ తన సామర్థ్యంను చాటుకుని ఈ టెండర్లలో కాంట్రాక్ట్ పొందింది. టెండర్ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని నిబంధనలను జేపీవీఎల్ సంస్థ పాటిస్తోంది. జేపీవీఎల్ సంస్థ విద్యుత్, కోల్ మైనింగ్ రంగాల్లో వ్యాపార అనుభవం కలిగిన సంస్థ. జేపీవీఎల్ సంస్థకు ఎటువంటి రాజకీయ పార్టీలతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా జేపీవీఎల్ సంస్థపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలను, తప్పుడు వార్తలను జేపీవీఎల్ సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది.’ అని పత్రిక ప్రకటన విడుదల చేశారు జేపీవీఎల్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ గౌర్. ఇదీ చదవండి: పారదర్శకంగా ఇసుక విధానం -
అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులతో ఘర్షణ.... మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొబెట్టి...
Clashed With Police Women Handcuffed: బిహార్‌లోని గయా జిల్లాలో ఇసుక గనుల వేలంలో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తున్న పోలీసు అధికారులతో ఘర్షణ పడిన నిత్య గ్రామస్తులను అరెస్టు చేశారు. గ్రామస్తులు వారిపై రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పురుషులు, మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొని ఉన్న వీడియో ఆన్లైన్లో దుమారం రేపింది. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలను పరిష్కరించడానికి, బీహార్ స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ ఈ నెల ప్రారంభంలో అన్ని ఇసుక మైనింగ్ సైట్లలో పర్యావరణ తనిఖీని నిర్వహించే ప్రక్రియను ప్రారంభించింది. కసరత్తు చేసేందుకు నిమగ్నమైన ప్రైవేట్ సంస్థలు, ఇసుక బంకులను తనిఖీ చేయడానికి సాంకేతిక, డ్రోన్లను ఉపయోగించనున్నారు. -
తమ్ముళ్లు కాదు తోడేళ్లు..
సాక్షి, మైలవరం : అధికారం అండతో నాలుగున్నరేళ్లలో అందినకాడికి దండుకున్నారు. కాదేదీ అవినీతికి అనర్హం అన్న చందంగా సాగిపోయాయి టీడీపీ నాయకుల లీలలు. ఇసుక రేవుల నుంచి చెరువుల్లో మట్టిదాకా ప్రతి చోట అవినీతే. నీరు చెట్టు పనుల్లో రూ.కోట్లు కొల్లగొట్టినా.. అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేపట్టి రూ.కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టినా అడిగే నాథుడే లేదు. దేవినేని, అతని అనుచరులు కలిసి నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లు దోచుకున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు అవినీతి అక్రమాలు ఆయన పర్యవేక్షించిన శాఖ మాదిరిగానే భారీస్థాయిలో ఉండటం విశేషం. నియోజకవర్గంలో సహజ వనరులైన మట్టి, చెట్టు, ఇసుక, గ్రావెల్ ఇలా దేన్నీ వదలకుండా కోట్లు దండుకున్నారు. ఇక ఎత్తిపోతల పథకాల పేరుతో దేవినేనితో పాటు అతని అనుచరులు దోపిడీ అంతా ఇంతా కాదు. ఎందుకూ పనికిరాని వాగులు, వంకలపై 22 ఎత్తిపోతల పథకాలను నిర్మించి ప్రజాధనాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా మంత్రిగారి ఆజ్ఞలేనిదే పనులు మొదలు కాదంటే ఆయన ప్రభావం ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఎత్తిపోతల పథకాల్లో రూ.10కోట్ల అవినీతి మైలవరం నియోజకవర్గంలో రైతులకు సాగు నీరు అందించడమే లక్ష్యం అంటూ 22 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఎత్తిపోతల పథకాలను దశాబ్దాలుగా నీరు ప్రవహించని ఎన్ఎస్పీ కాలువలు, బుడమేరు, వాగులపై నిర్మించారు. వీటి నిర్మాణాలకు గానూ రూ.22.57కోట్లను కేటాయించారు. నాసిరం పైపులు, తక్కు ఖరీదు మోటార్లు, షెడ్ల నిర్మాణం తదితర పనుల్లో రూ.10కోట్ల మేర అవినతీకి పాల్పడినట్లు తెలుస్తుంది. నీరు–చెట్టులో కోట్లు పోగేశారు నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద రూ.118కోట్ల పనులు చేపట్టారు. ఈ పథకం కింద చెరువుల్లో పూడికతీత, కాలువల మరమత్తులు తదితర పనులన్నీ చేశారు. చెరువుల్లో పూడికతీసిన మట్టిని రైతులకు ఉచితంగా అందించాల్సి ఉండగా ఇటుక బట్టీలకు, రియల్ వెంచర్లకు తరలించి రూ.కోట్లు వెనకేసుకున్నారు. మొత్తం 48 చెరువులలో పనులు జరగ్గా మట్టిని విక్రయించి రూ.70కోట్ల వరకు పోగేసినట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. మైలవరం మండలంలోని వెల్వడం సమీపంలో ఉన్న మోదుగుల చెరువులో దేవినేని అనుచరుడు కోమటి సుధాకర్ గతేడాది నీరు–చెట్టు పనులు చేపట్టారు. అయితే చెరువులో 32వేల క్యాబిక్ మీటర్లు మాత్రమే తవ్వడానికి అనుమతులు ఉండగా 1,42,875 క్యాబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజుకు రూ.2 లక్షల చొప్పున రూ.5కోట్ల విలువైన మట్టిని చుట్టుపక్కల గ్రామాల్లోని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు పడమర చెరువు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు నుంచి 2017–18 సంవత్సరంలో 2లక్షల క్యాబిక్మీటర్ల మట్టిని తవ్వి తరలించారు. ఒక్కొక్క ట్రక్కు మట్టిని రూ.400 నుంచి 600కు విక్రయించారు. ఈ విధంగా రెండేళ్లలో రూ.12కోట్ల మేర గడించారు. అదేవిధంగా గొల్లపూడి మేజర్ పంచాయతీ పరిధిలో నీరు–చెట్టు కింద రూ.1.80కోట్ల మేర పనులు జరిగాయి. ఇక్కడ కూడా మట్టిని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బుడమేరులో అక్రమాలెన్నో.. మైలవరం నియోజకవర్గంలో చండ్రగూడెం నుంచి వెలగలేరు వరకు విస్తరించి ఉన్న బుడమేరు ఆధునికీకరణ పనుల్లో దేవినేని అనుచరులు చేతివాటం చూపించారు. ఈ పనులకు గానూ రూ.45కోట్ల మేర కేటాయించారు. అయితే బుడమేరులోని మొక్కలు తొలగించి కేవలం రూ.10కోట్లతో పనులు ముగించి, అక్రమ బిల్లులతో రూ.35కోట్ల మేర కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం అండతో.. ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి ఇసుకరేవుల్లో దేవినేని అనుచరులు నిబందనలకు విరుద్ధంగా నది నుంచి అక్రమంగా డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుకతోడుతున్నారు. రోజుకు 4వేల క్యూబిక్ మీటర్లు నది నుంచి తోడి లారీలతో రవాణా చేస్తున్నారు. రోజుకు రోజుకు సుమారు రూ.6లక్షలు వరకు సంపాడించారు. మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావుకు చెందిన సీలింగ్ భూమిని రాష్ట్రాభివృద్ధిలో భాగంగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే నేపథ్యంలో తన వాటా దక్కించుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. గుంటుపల్లిలో కృష్ణానది నుంచి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు సర్వే నంబర్ 144, 147లో సుమారు 70 ఎకరాల్లో అమరావతి అమెరికన్ వైద్యశాలకు 26 ఎకరాలు కేటాయించి తెరవెనుక మంత్రాంగంతో తనవాటా దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్టీటీపీఎస్ బూడిద చెరువులో సిమెంటు కంపెనీల పేరుతో అనుమతులు పొంది ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా బూడిద తరలించి కోట్లు గడించారు. కేతనకొండ, మూలపాడు, కొండపల్లి రాతిక్వారీల్లోనూ పర్మిట్లు లేకుండానే అక్రమ మార్గాన నడిపిస్తున్నారు. -
అక్రమ మైనింగ్ వెనుక ఉన్నదెవరు?
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేసానుపల్లి, దాచేపల్లి, కొండమోడు గ్రామాలతోపాటు మరికొన్ని చోట్ల జరిగిన అక్రమ లైమ్‌స్టోన్ తవ్వకాల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తేల్చాలని సీఐడీ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘భారీస్థాయిలో అక్రమ మైనింగ్ జరిగిన మాట వాస్తవం. ఖనిజాన్ని వాహనాల్లో తరలించిన మాట వాస్తవం. ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిన మాట వాస్తవం. కాబట్టి వీటన్నింటికీ కారణం ఎవరో తేల్చి, వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉంది’’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో, ఇప్పటిదాకా ఏం చేశారో తెలియచేస్తూ పురోగతి నివేదికను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేసానుపల్లి, దాచేపల్లి, కొండమోడులతోపాటు మరికొన్ని గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా య«థేచ్ఛగా లైమ్‌స్టోన్ తవ్వకాలు సాగిస్తున్నారని, ప్రభుత్వానికి రూ.31 కోట్ల మేర పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ మాజీ ఎమ్మెల్యే టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. యరపతినేని పాత్ర ఉన్నట్లు తేలలేదు యరపతినేని శ్రీనివాసరావు తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి కాలేదన్నారు. అక్రమ మైనింగ్‌లో ఎమ్మెల్యే యరపతినేని పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో ఇప్పటిదాకా తేలలేదని చెప్పారు. అందువల్ల ఈ వ్యాజ్యంలో ప్రతివాదుల జాబితా నుంచి యరపతినేని పేరును తొలగించాలని కోరారు. 612 మందిని విచారించాం.. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటిదాకా ఎంతమంది సాకు‡్ష్యలను విచారించారని ధర్మాసనం ప్రశ్నించగా.. 612 మంది సాకు‡్ష్యలను విచారించామని, ఇంకా మరింత మందిని విచారించాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్జీ) డి.రమేశ్ బదులిచ్చారు. విచారించిన వారిలో రెవిన్యూ అధికారులు, గనుల శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, రవాణా శాఖాధికారులు ఉన్నారని తెలిపారు. -
తవ్వుకో.. దండుకో
రాష్ట్రంలోని ఇసుక రేవులు టీడీపీ నేతల దోపిడీకి కేంద్రాలుగా మారాయి. ‘తవ్వుకో.. దండుకో’ అనే చందంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, ఉపనదులు, వాగులు, వంకలు ఇలా వేటిని వదలకుండా అక్రమ ఇసుకతవ్వకాలతో వేల కోట్లు దోచుకుంటున్నారు. ఇసుకకోసం తీస్తున్న భారీ గోతులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. వర్షాకాలంలో ఈ గోతుల్లో నీరు నిండుతోంది. ఈ విషయం తెలియక సరదాగాఈతకు వెళ్లినచిన్నారులు, సాధారణ ప్రజలు ఈ అగాథాల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. మరోవైపు అడ్డగోలు తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాగునీటికి, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఇసుకాసురుల తీరులో ఇసుమంతైనా మార్పు రావడం లేదు. వీరికి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో అధికారులుకూడా మిన్నకుండిపోతున్నారు. నాలుగున్నరేళ్లలో ఇసుక దందా ద్వారా అధికార పార్టీ నేతలు దండుకున్న మొత్తం రూ.10 వేల కోట్ల పైమాటే. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక రవాణా పేరుతో టీడీపీ నేతలు సాగిస్తున్న దందా మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలు చందంగా వర్ధిల్లుతోంది. 2014 అధికారంలోకి వచ్చాక తొలి రెండేళ్లు టీడీపీ నేతలు డ్వాక్రా సంఘాల ముసుగులో ఉండి ఇసుక అమ్మకాలు సాగించి రూ.4,400 కోట్లు దోచుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఉచిత ఇసుకను తెరపైకి తెచ్చింది. పేరుకు ఉచితమే అయినా ఆచరణలో దీనికి భిన్నం. అన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు ఇసుక రేవులను సొంత జాగీర్లుగా మార్చుకుని నచ్చిన రేటుకు ఇసుకను అమ్ముకోవడం ద్వారా గత రెండున్నరేళ్లలో రూ.5,600 కోట్లు దోచేశారు. ఇసుక కోసం ఎవరైనా క్వారీ దగ్గరకు వాహనాన్ని తీసుకెళ్లాలంటే టీడీపీ నేతలకు కప్పం కట్టాల్సిందే. దీనికి రహదారి నిర్వహణ ఖర్చు అనే ముద్దు పేరు పెట్టారు. డబ్బు ఇవ్వకపోతే వాహనాలను అడ్డుకుంటారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ ఇసుక కావాల్సిన వారు టీడీపీ నేతలకే చెబుతున్నారు. దీంతో వారు రవాణా, లోడింగ్ ఛార్జీల పేరుతో నచ్చిన రేట్లకు ఇసుకను విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగానే సాగుతున్నా తెరవెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నందున అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. నదులు, వాగుల్లో విధ్వంసం ఇటు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నుంచి అటు రాయలసీమలోని తుంగభద్ర, పెన్నా వరకూ అన్ని నదులు, వాగులూ అడ్డగోలు ఇసుక తవ్వకాలతో ధ్వంసమయ్యాయి. మీటరు లోతు మించి ఇసుక తవ్వరాదనే నిబంధనను తుంగలో తొక్కి నాలుగు మీటర్ల లోతు వరకూ ప్రొక్లెయిన్లతో, భారీ యంత్రాలతో ఇసుకను తోడేసి బావులను తలపించేలా మార్చేశారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులు ఈ గుంతల్లో చిక్కుకుని ప్రాణాలు సైతం కోల్పోయారు. కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో చాలామందిని ఇసుక గోతులు బలి తీసుకున్నాయి. నిబంధనలను గాలికొదిలేసి.. క్వారీల్లో మనుషులతోనే ఇసుక తవ్వకాలు సాగించాలని, ప్రొక్లెయిన్లు లాంటి యంత్రాలు వినియోగించరాదని నిబంధనలు ఉన్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. క్వారీల్లోకి లారీలను తీసుకెళ్లరాదని, ట్రాక్టర్లతోనే ఇసుకను తీసుకెళ్లాలనే నిబంధన కూడా ఉంది. వీటిని కాలరాస్తూ ప్రొక్లెయిన్లతో చాలా లోతుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాకుండా తనిఖీల కోసం బృందాన్ని పంపినప్పుడు సాక్షాత్తూ ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఇంటిపక్కనే డ్రెడ్జింగ్ యంత్రాలను దాచిపెట్టారు. ట్రిబ్యునల్ బృందం వెళ్లిపోగానే మళ్లీ యథాప్రకారం అక్రమ తవ్వకాలు సాగడం గమనార్హం. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా తదితర నదులు, వాగులపై 460పైగా అధికారిక, అనధికారిక ఇసుక రేవులుండగా వాటిలో 83 పెద్దవి ఉన్నాయి. వీటిలోనే కాకుండా ఎక్కడ ఉంటే అక్కడ ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నారు. వంతెనలకు వంద మీటర్ల దూరం వరకూ ఇసుక తీయరాదనే నిబంధన ఉన్నా దీన్ని కూడా కాలరాస్తూ తవ్వేస్తుండటంతో వాటి భద్రత గాలిలో దీపం చందంగా మారుతోంది. భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం అడ్డగోలుగా సాగిస్తున్న ఇసుక తవ్వకాల ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలమట్టం రోజురోజుకూ పాతాళానికి దిగిపోతోంది. ఏడాది కిత్రం (2018, జనవరి 12తో)తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున 6.72 అడుగుల మేర భూగర్భ జలమట్టం కిందకు పడిపోయింది. ఇదేకాలంలో రాయలసీమలో సగటున 20.27 అడుగుల మేర నీటి జాడ పాతాళానికి దిగిపోయింది. ఇక జిల్లాలవారీగా చిత్తూరులో 32.87, అనంతపురంలో 17.78, ప్రకాశంలో 14.43 అడుగుల మేర భూగర్భ జలమట్టం కిందకు పోయింది. ఈ గణాంకాలు ప్రమాద ఘంటికలకు సంకేతాలని భూగర్భ జల, పర్యావరణ శాఖల నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చలికాలంలోనే వేసవిని తలపించేలా భూగర్భ జలమట్టం పాతాళానికి చేరడానికి ఇసుక తవ్వకాలే కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. జిల్లాల వారీగా ఇసుక దోపిడీ ఇలా.. కృష్ణా జిల్లాలో ఒక మంత్రి, గూండాగా పేరొందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. బహిరంగంగా పట్టపగలే డ్రెడ్జర్లతో తోడేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు నిత్యం ఇసుకను పెద్ద పెద్ద లారీల్లో తరలించి కోట్లు దండుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఓ మంత్రితోపాటు, నలుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ దందాను నడిపిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో పెనుమూడి, రావిఅనంతవరం రేవుల్లో ఒక టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతో అనుచరులు రెచ్చిపోతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో మరో టీడీపీ ఎమ్మెల్యే ఇసుక రేవులను జాగీర్లుగా మార్చుకున్నారు. ‘నేనే మంత్రి.. నేనే రాజు’ అని చెప్పుకునే ఒక మంత్రి శ్రీకాకుళం జిల్లాలో హవా సాగిస్తున్నారు. ఆయనతోపాటు మంత్రి హోదా గల మరో ఎమ్మెల్యే గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో కలిసి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను తెరవెనుక ఉండి నడిపిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గంలో నాగావళి, వంశధార నదీ తీరాల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా పరిధిలో వంశధార నదిలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని స్వర్ణముఖి, కాళింగి, పెన్నా నదుల నుంచి చెన్నైకి ఇసుక తరలిపోతోంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పడిపోయి శ్రీకాళహస్తికి నీరందించే బావులు ఎండిపోయాయి. పూతలపట్టు, చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్ పేటలో ఇష్టానుసారం తవ్వకాలు సాగుతున్నాయి. వైఎస్సార్ జిల్లాలో ఏ నదినీ, వాగును, వంకనూ వదల్లేదు. కొండాపురం నుంచి ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి వద్ద ఇసుక క్వారీలో ఒక టీడీపీ ఎంపీ సోదరుల అండదండలతో దందా సాగుతోంది. పెన్నా, పాపాఘ్ని, చెయ్యేరు, చిత్రావతి నదుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలించడం ద్వారా టీడీపీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారు. తుంగభద్ర నదిలో రహదారి కర్నూలు జిల్లాలో టీడీపీ ముఖ్య నేతల అనుచరులు తుంగభద్ర, హంద్రీ నదిలో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్య నేత తనయుడి అనుచరులు గోరంట్ల, ఎర్రగుడి, మన్నెకుంట గ్రామాల పరిసర ప్రాంతాల్లో హంద్రీ నదిలో ఇసుకను రాత్రి వేళల్లో లారీలకు లోడ్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. తుంగభద్ర నది మధ్యలో ఇసుక అక్రమ రవాణా కోసమే కిలోమీటర్ల కొద్దీ రహదారి నిర్మించడం గమనార్హం. దీన్ని హైకోర్టు తీవ్రంగా తప్పబట్టడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సర్కారు అండ వల్లే రహదారి వేయగలిగారంటూ కోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రీచ్‌లోకి వెళ్లాలంటే కప్పం కట్టాల్సిందే రాష్ట్రంలో మొత్తం 460 ఇసుక రేవులు ఉండగా ప్రజలు సొంత అవసరాలకు ఎక్కడ నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక ఉచితంగా తీసుకెళ్లవచ్చని సర్కారు ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఎక్కడా సొంతంగా ట్రాక్టరు తీసుకెళ్లి ఇసుక నింపుకోవాలంటే ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు కప్పం కట్టాల్సిందే. ‘రీచ్‌లోకి దారి మేమే నిర్మించాం. అందువల్ల ట్రాక్టరు వెళ్లాలంటే డబ్బు ఇవ్వాల్సిందే’ అంటూ మాఫియా గ్యాంగులు బరితెగించి వసూళ్లు సాగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. ప్రైవేటు వ్యక్తులు రేవుల్లోకి లారీలను తీసుకెళ్లరాదు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే లారీలను తీసుకెళ్లవచ్చని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాగితాల్లోనే ఉచితం డ్వాక్రా సంఘాలను తప్పించి ఉచిత ఇసుక విధానాన్ని తెరపైకి తేవడం ద్వారా సర్కారు టీడీపీ నేతల దోపిడీకి మరిన్ని ద్వారాలు బార్లా తెరిచింది. 2016, మార్చి 4న ఉచిత ఇసుక విధానానికి సంబంధించి మార్గదర్శకాలతో మెమో నంబర్ 3065 జారీ చేసింది. ఆ వెంటనే రాష్ట్రంలోని 460 అధికారిక, అనధికారిక ఇసుక రీచ్‌ల్లో టీడీపీ నేతలు పాగా వేశారు. తమ జాగీర్లన్నట్లుగా అడ్డగోలుగా తవ్వి అమ్ముకుంటున్నారు. రేవుల్లోకి ఇతరుల వాహనాలను అనుమతించడం లేదు. ఉచిత ఇసుక అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత నెలాఖరు (2018, డిసెంబర్) వరకూ చోటా, మోటా నేతలు దండుకున్న మొత్తం పోనూ టీడీపీ పెద్దలు ఇసుక ద్వారా దోచుకున్న మొత్తం రూ.5600 కోట్లు పైమాటే. ఇసుక మాఫియా ఆగడాలను విన్నవించడానికి వెళ్లిన 15 మందిని ఇసుక మాఫియా గ్యాంగులకు చెందిన వాహనాలు గుద్ది చంపేశాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోని ఏర్పేడు ఈ దుర్మార్గానికి వేదిక కావడం గమనార్హం. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా వాస్తవమే : మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా వాస్తవమేనని, రేవుల్లో ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగిస్తున్న సంగతి కూడా నిజమేనని మంత్రివర్గ ఉప సంఘం అంగీకరించడం గమనార్హం. ఇసుక లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటిపోతున్నా అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం దీనికి కారణమని ప్రకటించింది. ఇసుక విధానంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కేఈ కృష్ణమూర్తి (రెవెన్యూ), చినరాజప్ప (హోం), సుజయ కృష్ణ రంగారావు (భూగర్భ గనులు) ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం మీడియా సమావేశంలోనే ఈ వివరాలు వెల్లడించారు. ప్రతినెలా మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇసుక విధానాన్ని సమీక్షించాలని, దీనికి నీటిపారుదల శాఖను కూడా ఆహ్వానించాలని నిర్ణయించినా సమావేశాలు జరిగిన దాఖలాలు మాత్రం లేవు. 25 అడుగులు తవ్వితే నీళ్లు పడేవి మా గ్రామంలో టీడీపీ నేతల విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతంలో నీటి పంపులు, బోర్ల కోసం భూమిలో 25 అడుగులు తవ్వితే నీళ్లు పడేవి. ఇప్పుడు 120 అడుగులు తవ్వినా నీరు పడటం లేదు. కృష్ణానదీ తీరం వెంట ఉన్న మా గ్రామంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం నిజంగా కలచివేస్తోంది. - ఆత్మకూరి నాగసురేశ్. ఊరు.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక. గోతుల్లో పడి మరణించారు.. నాగావళి నదిలో టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తవ్వుతుండటంతో భారీ గోతులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల వర్షాకాలంలో నది నిండుగా ప్రవహించినపుడు.. పలువురు ఈత కోసం దిగి తెలియక మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. - ఎస్.జగదీశ్. ఊరు.. శ్రీకాకుళం. -
ఎవరేమైపోతే మాకేంటి?
పల్లెల్లోకి వెళ్లాల్సిన నీటిసరఫరాకు ఆటంకం కలుగుతుందా... అయితే మాకేంటి? వంతెన స్తంభాలు బలహీనపడి వంతెన కూలిపోయే ప్రమాదముందా... అయితే మాకేంటి? నదిలో నీటి ప్రవాహానికి అవరోధం కలుగుతుందా... అయితే మాకేంటి? తవ్వకాల వల్ల ఏర్పడిన గోతుల్లో పడి పశువులు... మనుషులు ప్రాణాలు కోల్పోతారా... అయితే మాకేంటి? ఈ క్షణం తమ పబ్బం గడచిపోతే చాలన్నదే వారి ధ్యేయంలా ఉంది. కాసుల వేట సాగిపోతోందన్నదే వారి లక్ష్యంలా ఉంది. ఇదీ చంపావతి నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తున్న అక్రమార్కుల తీరు. డెంకాడ: విశాఖ – శ్రీకాకుళం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వంతెన ప్రాంతం... అదీ పట్టపగలు... యథేచ్ఛగా ఇసుక తవ్వకం సాగిపోతోంది. లక్షల్లో వ్యాపారానికి వేదికగా నిలుస్తోంది. ఏదో జాతరలా ట్రాక్టర్లను నదిలోకి దింపేసి దర్జాగా ఇసుక నింపేసి... తరలించేస్తున్నారు. కానీ వారిని అడ్డుకునేందుకు ఏ ఒక్కరూ చొరవ తీసుకోవడం లేదు. అధికారులు ఎందుకో చేష్టలుడిగి చూస్తున్నారు. అక్కడే మూడు మండలాలకు తాగునీటిని అందించే ఇన్‌ఫిల్టర్ బావులు, వంతెన కోసం నిర్మించిన స్తంభాలు చుట్టూ దొలిచేస్తున్నారు. మండలంలోని నాతవలస వద్ద ఉన్న చంపావతి నదిలో డెంకాడ మండలం నాతవలస, సింగవరం, అక్కివరం గ్రామాలకు చెందిన రక్షిత మంచినీటి పథకం బోర్లు ఉన్నాయి. అలాగే భోగాపురం మండల కేంద్రానికి చెందిన రక్షిత తాగునీరు సరఫరా చేసే బోరు ఇక్కడే ఉంది. వీటికి తోడు పూసపాటిరేగ మండలంలోని 32 గ్రామాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టు బోరు కూడా ఇక్క డే ఉంది. వీటికి అతిసమీపంలో విశాఖపట్నం–శ్రీకాకుళం జాతీయ రహదారిపై నిర్మించిన వంతెనలు కూడా అక్కడే ఉన్నాయి. ఇక డి.కొల్లాం పం చాయతీలోని ఆర్.ముంగినాపల్లి బ్రిడ్జి సమీపంలో ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఇక్కడ డెం కాడ మండలానికి చెందిన రక్షిత మంచినీటి పథకానికి చెందిన బోర్లున్నాయి. దీని ద్వారా డెంకాడ మండలంలోని 22 గ్రామాలకు, పూసపాటిరేగ మండలంలోని 5 గ్రామాలకు తాగునీరు సరఫరా జరుగుతోంది. దీనికి తోడు పూసపాటిరేగ మండలంలోని కుమిలి, డెంకాడ మండలంలోని ఆర్. ముంగినాపల్లి, చొల్లంగిపేట తదితర గ్రామాలకు చెందిన రక్షిత మంచినీటి పథకం బోర్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఇసుక తవ్వకాల వల్ల ఈ బోర్లలోకి ఊట నీరు వచ్చే అవకాశం లేదు.వంతెన స్తం భాలు బలహీన పడితే వంతెన నిలిచే అవకాశం లేదు. కానీ ఇవేవీ అక్రమార్కులకు పట్టడం లేదు. వాల్టా చట్టానికి తూట్లు వాల్టా చట్టం ప్రకారం రక్షిత మంచినీటి బావులు, బ్రిడ్జిలు వంటివి ఉన్న ప్రాంతం నుంచి 5 వందల మీటర్ల వరకూ ఎలాంటి తవ్వకాలు చేయరాదు. అలా తవ్వకాలు చేపడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అధికారం అధికార యంత్రాంగానికి ఉంది. పర్యవేక్షణ లేకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు చలరేగిపోతున్నారు. బావులు ఉన్న చోట ఇసుక తవ్వకాలు చేస్తే చాలా ప్రమాదం ఉంది. రక్షిత మంచినీటి బావుల చుట్టు ఇసుక ఉంటే నీరు ఇంకి బావిలోకి నీరు వెళ్తుంది. దాని ద్వారా గ్రామాలకు సరఫరా అవుతుంది. అలాకాకుండా బావుల వద్ద ఇసుక తవ్వకాలు చేపడితే నదిలో ప్రవహించే చెత్తనీరు కూడా బావుల్లోకి నేరుగా చేరుతుంది. నీరు కలుషితం అవుమౌతుంది. బావుల చుట్టూ ఇసుక తీసేయడం వల్ల భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోయి వేసవికి తాగునీటి సమస్య ఏర్పడుతంది. దీంతో ప్రజలకు అన్ని విధాలుగా నష్టం ఏర్పడుతుంది. ప్రశ్నిస్తే ఎదురు దాడులు నాతవలస వద్ద మూడు మండలాలకు చెందిన రక్షితమంచినీటి బావులు ఉన్నాయి. నాతవలస పథకానికి కూడా బోరు ఇక్కడే ఉండటంతో బోరు చుట్టూ ఇసుక తవ్వేస్తే గ్రామస్తులు తాగునీటికి ఇబ్బంది పడతారని అడిగినందుకు ఇసుక అక్రమంగా తవ్వేస్తున్న వ్యక్తి చేతిలో పారపట్టుకుని నా భర్త వెంకటరమణపైకి వచ్చారు. 50 ట్రాక్టర్లతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా బోర్లు ఉన్నాయన్న ఇంకితం లేకుండా తవ్వేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. – బమ్మిడి లక్ష్మి, మాజీ సర్పంచ్, నాతవలస. ఇలా తవ్వడం నేరం చంపావతి నదిలో బావులు, బ్రిడ్జిలకు చుట్టూ 5 వం దల మీటర్ల వరకూ ఎవరూ ఎలాంటి తవ్వకాలు చే యరాదు.అలాగే తవ్వకాలు చేస్తే వాల్టా చట్టం ప్రకా రం నేరం. అలాంటి వాహనాలను సీజ్ చేసి, యజ మానులపై కేసులు నమోదు చేస్తాం. ఇసుక అక్రమ రవాణా నియంత్రించడంలో పోలీస్, రెవె న్యూ, భూగర్భ గనులశాఖ ఇలా కొన్ని శాఖలకు బా ధ్యత ఉంది. వీటిని నియంత్రించేందుకు రెవెన్యూశాఖ పరంగా చర్యలు తీసుకుంటాం. పోలీసులు కూడా ఇలాంటి అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. దీనిపై కలెక్టర్‌కు విన్నవిస్తాం. – సీహెచ్.లక్ష్మణప్రసాద్, తహశీల్దార్, డెంకాడ -
అక్రమ ఇసుక తవ్వకాలకు నలుగురు విద్యార్థులు బలి
-
కడుపు కోత
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు వెళ్లిన విద్యార్థులను మృత్యువు కబళించింది. టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తవ్వడంతో.. అక్కడ ఏర్పడ్డ తాటి చెట్టంత లోతైన గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు గల్లంత య్యారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు స్నేహితులు కూడా నీటమునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామానికి చెందిన నీలం రమేశ్, శేషకుమారిల కుమారులు క్రాంతి(15), శశివర్ధన్ (9), తాడికోరు సాంబశివరావు, లక్ష్మి దంపతుల కుమారుడు శివ (15), మల్లంపాటి కృష్ణ, నాగలక్ష్మి దంపతుల కుమారుడు దినేష్ (10), మరో ముగ్గురు చిన్నారులు ఆటోలో వరదను చూసేందుకు గుండిమెడ గ్రామంలోని నది ఒడ్డుకు వెళ్లారు. ఆటోను నది ఒడ్డున ఆపి, డ్రైవర్ సురేశ్ బహిర్భూమికి వెళ్లాడు. నీలం క్రాంతి, శశివర్ధన్, శివ, దినేశ్ నది వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతలు గతంలో ఇసుకను తరలించేందుకు వేసిన రోడ్డులో వెళుతున్న క్రాంతి లోతైన ఇసుక గుంతల్లో పడిపోయాడు. క్రాంతిని కాపాడేందుకు శివవర్ధన్ ప్రయత్రించాడు. అయితే ఇద్దరూ నీటిలో జారిపోతూ భయంతో కేకలు వేశారు. స్నేహితులను కాపాడేందుకు దినేశ్, శివ ఒకరి చేతులు మరొకరు పట్టుకొని నీటిలోకి దిగడంతో వారు కూడా నీటమునిగి గల్లంతయ్యారు. దీనిని గమనించిన సురేశ్ హుటాహుటిన వచ్చి నలుగురిని కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీనిపై సమాచారం అందుకున్న గుండిమెడ గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా గుంతలు 20 నుంచి 30 అడుగులు ఉండటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొద్దిసేపటికి ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు బుధవారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో నీలం క్రాంతి మృతదేహాన్ని వెలికితీశారు. 1.45 గంటలకు నీలం శశివర్ధన్ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే ఎంత గాలించినా దినేశ్, శివ ఆచూకీ దొరకలేదు. చివరకు స్థానిక మత్స్యకారులు ముమ్మరంగా గాలించి నీటి అడుగున చిక్కుకున్న మల్లంపాటి దినేశ్ మృతదేహాన్ని, శివ మృతదేహాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో వెలికితీశారు. మృతిచెందిన తమ కుమారులను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఘటనా స్థలానికి వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విద్యార్థుల మృతిపట్ల సంతాపం తెలియజేశారు. ఆ సమయంలో గల్లాజయదేవ్‌ను, స్థానిక టీడీపీ నేతలను గ్రామస్థులు నిలదీశారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తామని టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ చెప్పారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి.. మృతిచెందిన నలుగురు విద్యార్థుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉన్నారు. కుమారులు క్రాంతి, శశివర్ధన్ ఇద్దరు మృతిచెందడంతో తల్లిదండ్రులు నీలం రమేశ్, శేషకుమారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విగతజీవులుగా ఉన్న కుమారులను చూసి తల్లిదండ్రులు స్పృహ తప్పిపడిపోయారు. అక్రమ ఇసుక తవ్వకాల నిగ్గు తేల్చాలి – వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో టీడీపీ నేతల అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామ పరిధిలోని ఇసుక రీచ్‌లో తాడిచెట్టు లోతు తవ్విన ఇసుక గుంతల్లో మృతి చెందిన నలుగురు చిన్నారులే ఇందుకు సాక్ష్యమన్నారు. ఘటనా స్థలాన్ని బుధవారం ఆయన సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గతంలోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ తెలిపిందని గుర్తు చేశారు. నలుగురు చిన్నారుల ప్రాణాలు కోల్పోయారని, వారి తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారో సీఎం చంద్రబాబు చెప్పాలని వేమారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లి ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. చిన్నారుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు పాటిబండ్ల కృష్ణమూర్తి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, మేకల సాంబశివరావు తదితరులు ఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
శ్రీకాకుళం జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా
-
నెల్లూరు జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా
-
చింతమనేని అనుచరుల ఇసుక అక్రమ తవ్వకాలు
పెదవేగి రూరల్ : ఒకపక్క ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర 200 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా బుధవారం పెదవేగి మండలంలో పాదయాత్ర చేపట్టిన నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరికి ఇసుక అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో అబ్బయ్య చౌదరి కార్యకర్తలతో కలిసి వెళ్లి తమ్మిలేరులో అక్రమంగా ఇసుకను తవ్వుతున్న పొక్లెయిన్‌కు అడ్డంగా బైఠాయించారు. జిల్లా అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. మీరు వస్తే కాని ఇక్కడ నుంచి కదిలేది లేదని చెప్పి అక్కడే భైఠాయించారు. దీంతో పెదవేగి తహసీల్దార్ ఎండి నజిముల్లాషా, ఎస్సై కాంతిప్రియ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరులో చింతమనేని ప్రభాకర్ పొక్లయిన్‌తో తవ్వకాలు చేసి, యంత్రంతో ఇసుకను జల్లించి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోతున్నాయని తమ్మిలేరు పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చి ఇసుక గోతులను పరిశీలిస్తే ఎంత మేర దోచుకున్నారో అర్థం అవుతుందన్నారు. ఈ తవ్వకాలపై నడిపల్లి, ఎల్లాపురం సమీప ప్రాంత రైతులు హైకోర్టుకు వెళ్లి తమ్మిలేరులో ఇసుక తీయకుండా ఆర్డర్ తీసుకువస్తే తాత్కాలికంగా పది రోజులు నిలిపి మళ్లీ ఎమ్మెల్యే అండదండలతో తవ్వుతున్నారన్నారు. బాధ్యులైన వారిపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో అధికారులు పొక్లయిన్‌ను సీజ్ చేశారు. -
ఏపీలో ఇసుక దోచేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భారీస్థాయిలో అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతూ రోజూ రూ.కోట్లు దోచుకుతింటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రాజ్యవర్థన్రాథోర్ బెంచ్ సోమవారం విచారించింది. ఏపీలో యంత్రాలతో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశాలు ఇచ్చిందని,అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో రోజూ రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. ఈ వ్యవహారంలో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే గతంలో ఈ కేసును ఎన్జీటీ చైర్మన్ నేతృత్వంలోని బెంచ్ విచారించడంతో ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడంపై ఆ బెంచ్‌కే ఈ కేసును రిఫర్ చేస్తున్నామని జస్టిస్ రాజ్యవర్థన్ తెలిపారు. వారికి పరిహారమివ్వండి.. పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాం, డయా ఫ్రం వాల్ నిర్మాణంవల్ల తమ జీవనోపాధికి గండి ఏర్పడిందని బాధిత మత్స్యకారులు ఎన్జీటీని ఆశ్రయించారు. కేజీ బేసిన్లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు అక్కడి మత్స్యకారులకు నెలకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందించారని, పోలవరం విషయంలోనూ అదే పరిహారాన్ని అందించాలని పిటిషనర్లు కోరారు. కేసు విచారణకు స్వీకరించిన జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ పోలవరం అథారిటీ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. ‘పురుషోత్తపట్నం’ పోలవరంలో భాగమేనా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. నిర్వాసితులు సత్యనారాయణ, రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ పోలవరం ప్రాజెక్టులో పురుషోత్తపట్నం ప్రాజెక్టు భాగమా? కాదా?, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా?లేవా? అన్న విషయాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖ, పోలవరం అథారిటీలకు నోటీసులు జారీ చేసింది. -
ఏపీలో అక్రమ మైనింగ్: కేంద్రంపై ఎన్జీటీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న ఇసుక అక్రమ మైనింగ్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) శనివారం విచారణ జరిపింది. ఈ కేసులో కేంద్ర పర్యావరణ శాఖ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు నెలల కిందట నోటీసు ఇచ్చినా.. ఇప్పటివరకు స్పందించకపోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణశాఖ తీరు మారకపోతే.. అధికారులు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ రోజే కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. -
గుంటూరు జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు
-
ఆ అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
పర్యావరణానికి, ఆరోగ్యానికి, భద్రతలకు పెనుముప్పుగా మారుతున్న ఇసుక మైనింగ్ అక్రమాలపై కేంద్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇసుక మైనింగ్ అక్రమ తరలింపు, దానివల్ల తలెత్తుతున్న పరిణామాలను విజయసాయిరెడ్డి రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఏళ్లలో నిర్మాణ రంగం 157 బిలియన్ డాలర్ల(రూ. 10,58,556కోట్ల)కు ఎగుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఇసుకకు, ఇతర ఖనిజాలకు భారీగా డిమాండ్ ఏర్పడి అక్రమాలు విపరీతంగా చోటుచేసుకునే ప్రమాదముందని హెచ్చరించారు. ఇసుక మైనింగ్ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో అక్రమ మైనింగ్ భారీగా ప్రబలుతుందని తెలిపారు. రోజుకు 2000 ట్రక్కుల ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు తరలివెళ్తుందన్నారు. విచక్షణారహితంగా ఇసుకను వెలికితీయడం పర్యావరణ, ఆర్థిక, సామాజిక ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు. భూముల సారవంతం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. వరదల ముప్పు కూడా అత్యధికంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. -
తెలుగు తమ్ముళ్లకు షాక్
అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో ఫైన్ రూ.98లక్షలు చెల్లించాలంటూ టీసులు జారీ కంగుతిన్న అధికార పార్టీ నాయకులు మినహాయింపునకు రాజకీయ పైరవీలు నక్కపల్లి: అధికార పక్ష నాయకుల అండతో జిరాయితీ భూములను లీజుకు తీసుకుని అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి రూ. కోట్లు ఆర్జించిన కొందరికి, రైతులకు మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. రూ. 98 లక్షలు జరిమానా విధించడానికి నిర్ణయించారు. ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి. ప్రాథమికంగా వీరందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, తదుపరి డిమాండ్ నోటీసులు ఇచ్చి అపరాధ రుసుం వసూలు చేస్తామని అనకాపల్లి మైనింగ్ ఏడీ సూర్యచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. పాయకరావుపేట మండలంలోని మాసయ్యపేట, కేశవరం గ్రామాల్లో 4900 క్యూబిక్ మీటర్ల ఇసుక నిబంధనలకు విరుద్ధంగా తవ్వినట్టు గుర్తించామని తెలిపారు. ఊహించని పరిణామానికి తెలుగుతమ్ముళ్లు షాక్ తిన్నారు. ఇసుకాసురుల అవతారమెత్తిన వీరంతా పరిహారం చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదయి జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం ఇక్కడ జోరందుకుంది. పాయకరావుపేటమండలం మాసయ్యపేట, కేశవరం గ్రామాల పరిధిలో కొందరు టీడీపీ నాయకులు తమ పొలాలకు ఆనుకుని ఉన్న రైతులకు చెందిన జిరాయతీ భూములను లీజుకు తీసుకున్నారు. గతంలో వచ్చిన తుఫాన్లు, భారీ వర్షాలకు ఈ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇసుకను ఉచితంగా తవ్వుకోవచ్చన్న సర్కారు ఆదేశాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. పొక్లెయినర్ల సాయంతో రోజూ లక్షలాది క్యూబిక్‌మీటర్ల ఇసుకను తవ్వి లారీలు, ట్రాక్టర్లపై ఇతర జిల్లాలకు తరలించి విక్రయించారు. రూ.కోట్లు ఆర్జించారు. తమవైపు అధికారులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు వారంతా నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నాయకుడు ఒకరితోపాటు, అతని అనుచరులకు రూ. లక్షలు సమర్పించుకున్నారన్న వాదన ఉంది. ఇలా మేనేజ్ చేసే బాధ్యతను తీసుకున్న వ్యక్తి, ఇసుక తవ్వకాలు జరిపే ప్రాంతానికి చెందిన మరో టీడీపీ నేత ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు. జిరాయితీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీకే చెందిన మరోవర్గం నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పదిహేను రోజుల క్రితం రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టి సుమారు రూ.4కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తర లిపోయిందని నిర్ధారించారు. తవ్వకాల కోసం వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అది తునిపట్ణాణానికి చెందిన వ్యక్తిది కావడంతో, అతను తన పలుకుబడిని ఉపయోగించి సీజ్ చేసిన పొక్లెయినర్‌ను దౌర్జన్యంగా పట్టుకుపోయాడు. ఈ విషయం తెలిసిన అధికారులు అతనిపై నామమాత్రంగా ఫిర్యాదు చేసి ఊరుకున్నారే తప్ప ఇంతవరకు దానిని తిరిగి స్వాధీనం చేసుకోలేదు. యజమానిపై చర్యలు చేపట్టలేదు. దాడుల్లో గుర్తించిన మేరకు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపిన తొమ్మిది మందికి మైనింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అపరాధ రుసుం కింద రూ.98లక్షలు చెల్లించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ మొత్తం నుంచి మినహాయింపు ఇవ్వాలని కొందరు నాయకులు రాజకీయ పైరవీలు చేస్తున్నట్లు భోగట్టా. దాడులు జరగకుండా చూస్తామని హమీ ఇచ్చిన అధికారపార్టీ నాయకులు ఇప్పుడు ముఖం చాటేశారు. దీంతో లీజుకని తీసుకుని తమకు తెలియకుండా టీడీపీ నాయకులు తమ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపారని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చేయని తప్పుకు తమకు నోటీసులు జారీ చేయడం భావ్యం కాదని అంటున్నారు. -
మంత్రులు, ఎమ్మెల్యేలతో బెదిరిస్తారా?
శ్రీకాకుళం టౌన్ : జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తాలని చూస్తున్నారు. ఇక్కడ వాడుకోవాల్సిన ఇసుకను విశాఖకు తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డకుందామంటే ఎమ్మెల్యేలు, మంత్రులతో ఫోన్లు చేయించి అధికారులను బెదిరించే స్థాయికి ఎదిగిపోయారంటూ జిల్లా కలెక్టరు డాక్టర్ పి.లక్ష్మీనరసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఇసుక రీచ్‌లున్న పంచాయతీ సర్పంచులు, జన్మభూమి కమిటీ సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడారు. మాతల వద్ద పంటపొలాల్లో ఇసుక మేటలు ఉన్నాయని ఎమ్మెల్యే కలమట వెంకటరమణతోపాటు స్థానికులు అభ్యర్థన మేరకు జిరాయితీ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే ఏకంగా నదిలోనే యంత్రాలతో తవ్వకాలు చేపడతారా?. ఇక్కడ ఇసుకను విశాఖపట్నం తరలించి రూ.కోట్లు ఆర్జించాలని ప్రయత్నించారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్న అధికారులకు ఎమ్మెల్యేలు, మంత్రులతో ఫోన్లు చేయించి, బెధిరించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు ప్రయత్నించడం తప్పా? అని అన్నారు. ఇంకా మార్పు రాకపోతే యంత్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తక్షణమే అక్రమ రవాణాను నిలిపి వేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి.రజనీకాంతరావు, మైన్స్ ఏడీలు రమణరావు, ప్రసాదరావు, ఆర్డీఓలు గున్నయ్య, దయానిధి, జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ మైనింగ్ అడ్డుకోండి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గార మండలం శ్రీకూర్మం పంచాయతీ సతివాడ పరిధిలోని టీజీఐ కర్మాగార యాజమాన్యం సముద్ర తీరంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక మైనింగ్‌ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకూర్మం సర్పంచ్ రామశేషు, వందల సంఖ్యలో గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహంకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీనరసింహం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. జేసీ-2 పి.రజనీకాంతారావు, డ్వామా పీడీ కూర్మనాథ్, డీఆర్డీఏ పీడీ కిశోర్‌కుమార్, సీపీఓ శివరామనాయకర్, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, డీఈఓ దేవానందరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆదిత్యలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వర్లు, వయోజన వద్య డీడీ కృష్ణారావు, డీఎస్ఓ వి.సుబ్రహ్మణ్యం తదితర జిల్లా అధికారులు హాజరయ్యారు. వింతరోగం నుంచి ఆదుకోండి.. వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన లచ్చుబుక్త సాయికుమార్ (16), వర ప్రసాద్ (11) తీవ్రమైన చర్మవాధులతో బాధపడుతున్నారు. ఎందరు వైద్యులకు చూపించినా.. వ్యాధిని నిర్దారించడం లేదని వారి తల్లిండ్రులు గోపి, కుమారి కలెక్టర్ వద్ద వాపోయారు. మెరుగైన వైద్యం అందించాలని, పింఛన్ మంజూరు చేయాలని వారు గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ను విన్నవించారు. చేనేత రుణాలు మాఫీ చేయాలి ప్రభుత్వ హామీ మేరకు చేనేత రుణాలు మాఫీ చేయాలని ఎల్‌ఎన్‌పేట మండలం భోగలింగేశ్వర చేనేత సంఘం సభ్యులు కోరారు. సంఘంలో వంద మంది సభ్యులు ఉండగా, 2014లో ఒకొక్కరు *25 వేల వంతున రుణం పొందారని, నేటికీ రుణమాఫీ చేయలేదని సంఘ సభ్యులు కె.లక్ష్మీకాంతం, చిట్టమ్మ, ఈశ్వరమ్మ, పార్వతి, సావిత్రి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మొగదాలపాడును రెవెన్యూ గ్రామంగా గుర్తించాలి గార మండలం మొగదాలపాడును రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని గ్రామంకి చెందిన పి.అప్పలస్వామి, అప్పన్న, పి.కృష్ణ, జి.వెంటస్వామి, సీహెచ్ సూర్యనారాయణ తదితరులు కోరారు. ఈ గ్రామం ప్రస్తుతం వత్సవలన పంచాయతీలో ఉందని వివరించారు. పరిహారం చెల్లించండి వంశధార ప్రాజెక్టు పరిధిలోని పాత హిరమండలం హరిజన వీధి, కొత్తగౌడవీధి, కోణంగి వీధి, కుమ్మరి వీధి, నాయుడు వీధులను నిర్వాసిత ప్రాంతాలుగా గుర్తించి పరిహారం చెల్లించాలని సర్పంచ్ సూర్యకుమారి, ఎ.అబ్బాయి, కె.మల్లేశ్వరరావు, ఎం.మురళి, పి.నారాయణరావు, కె.లచ్చన్న తదితరులు కలెక్టర్‌ను కోరారు. ఈ ప్రాంతం మీదుగా వంశధార కుడి కాలువ వెళ్లడంతో సుమారు 600 కుటుంబాలకు నష్టం వాటిల్లుతుందని వివరించారు. హిందీ పండితులకు న్యాయం చేయాలి 2002-డీఎస్సీలో హిందీ పండితులుగా ఎంపికైన అభ్యర్థులకు కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టులు ఇవ్వాలని హిందీ పండితులు జె.ఉమామహేశ్వరరావు, బి.మోహనరావు, ఎం.వెంకటరమణ కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. రిమ్స్ సెక్యూరిటీలకు జితాలు చెల్లించాలి అవుట్ సోర్సింగ్ విధానంలో రిమ్స్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు జీతాల బకాయిలు చెల్లించాలని ఆ సంఘ నాయకులు కె.శ్రీనివాసరావు, ఎ.సూర్యనారాయణ, ఆర్. భీమశంకర్, లక్ష్మణరావు తదితరులు కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు పెంచాలని కోరారు. -
'అమరావతికి పర్యావరణ అనుమతి లేదు'
విజయవాడ: పర్యావరణ అనుమతులు లేకుండా అమరావతి నిర్మాణం జరుగుతోందని సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ ఆరోపించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానం అవలంభిస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూములు తీసుకోవద్దని శివరామకృష్ణన్ కమిటీ ముందే చెప్పిందని గుర్తు చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని గ్రామాల్లో భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల హక్కులను హరిస్తూ రాజధాని నిర్మాణం జరుగుతోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. వరదొస్తే మునిగిపోయే ప్రాంతంలో రాజధాని కడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఇంటిపక్కనే ఇసుక క్వారీల పేరుతో నదిని కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఇదంతా చంద్రబాబు ఆశీస్సులతోనే జరుగుతోందన్నారు. రాజధాని ప్రాంతంలో దళితుల హక్కులను కాలరాస్తున్నారని మేధా పాట్కర్ ధ్వజమెత్తారు. -
పట్టుకున్నారు.. వదిలేశారు!
పూసపాటిరేగ : మండలంలోని కొప్పెర్ల సమీపంలో చంపావతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన పలు ట్రాక్టర్లను అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వదిలేశారు. ఈ ట్రాక్టర్లను నాలుగురోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, దీనిపై అధికారపార్టీ ఒత్తిళ్లు తీవ్రస్థాయికి చేరినట్లు భోగట్టా. రాష్ట్రస్థాయి అధికారుల వరకూ విషయం వెళ్లింది. దీంతో కలెక్టర్, ఎస్పీ చర్చించిన తర్వాత ఇసుక ట్రాక్టర్లను విడిచిపెట్టేశారని సమాచారం. నివేదికలో మార్పులు? పట్టుబడిన ట్రాక్టర్లకు సంబంధించి తొలుత స్థానిక అధికారులు నివేదికలను ఒకలా ఇచ్చినట్లు తెలిసింది. వంతెనలు, తాగునీటి బావులకు 500 మీటర్ల దూరంలో తవ్వాల్సి ఉందని, ఆ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతుండగా సదరు ట్రాక్టర్లను పట్టుకున్నామని తొలుత ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు సమాచారం. పై నుంచి ఒత్లిళ్లు రావడంతో అ తర్వాత నివేదికలో మార్పులు చేసినట్లు భోగట్టా. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి తుది నివేదిక పంపించాలని తహశీల్దార్ జయదేవికి ఆదేశాలు వచ్చాయి. -
ఇసుక మాఫియా ఆగడాలపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఉమ్మడి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మాఫియా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రతిరోజూ తమ ముందు దాఖలవుతున్న వ్యాజ్యాలే ఇసుక మాఫియా ఆగడాలకు ఉదాహరణలని పేర్కొంది. ఈ వ్యాజ్యాల విచారణకే తాము అధిక సమయం వెచ్చించాల్సి వస్తోందని, దీని ప్రభావం ఇతర కేసులపై పడుతోందని తెలిపింది. ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని తాము ఇలా పర్యవేక్షణ చేయలేమని స్పష్టం చేసింది. ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో పర్యావరణ, గనులశాఖల ముఖ్య కార్యదర్శులు, ఓ స్వచ్ఛంద సంస్థకు స్థానం కల్పిస్తామని తెలిపింది. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, వాటిపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవడంతోపాటు లీజు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. సదరు లీజును రద్దు చేసే అధికారాన్ని కూడా ఈ కమిటీకి కట్టబెట్టాలన్నదే తమ అభిప్రాయమని పేర్కొంది. శాశ్వత ప్రాతిపదికన ఈ కమిటీ ఉండాలన్నదే తమ ఆలోచనగా వివరించింది. తమ ఈ ప్రతిపాదనలపై అభిప్రాయం చెప్పాలని ఉభయ రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను పదిరోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నివేదిక సంగతేంటి? పశ్చిమగోదావరి జిల్లా ప్రక్కిలంక గ్రామ పరిధిలో ‘ప్రక్కిలంక శాండ్ మైనింగ్ కోఆపరేటివ్ సొసైటీ’ అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతోందంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. దీన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం... ఇసుక మాఫియా ఆగడాల అడ్డుకట్టకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను తీసుకొచ్చి పలు వ్యాఖ్యలు చేసింది. తర్వాత గత విచారణ సమయంలో తామిచ్చిన ఆదేశాల గురించి ప్రస్తావించింది. ‘ప్రక్కిలంక శాండ్ మైనింగ్ కోఆపరేటివ్ సొసైటీ’ ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతోందంటూ పిటిషనర్ తమ ముందుం చిన ఫొటోల వాస్తవికతను తేల్చి, అందుకు సంబంధించి ఓ నివేదికను తమ ముందుం చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ను ఆదేశించామని, దాని సంగతేమిటని ప్రశ్నించింది. జాయింట్ కలెక్టర్ తరఫున ఏజీ పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టులో దాఖలు చేసిన ఫోటోలతో సరి పోల్చేందుకు తాజాగా ఫోటోలు తీసి సిద్ధం చేశామని ఆయన తెలిపారు. మరి నివేదిక సంగతేమిటని ధర్మాసనం ప్రశ్నించగా.. తయారు చేయలేదని ఏజీ చెప్పారు. దీంతో తాము నవంబర్ 19న ఆదేశించిన విధంగా నివేదికను తయారుచేసి త మ ముందుంచాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. -
ప్రభుత్వ వైఖరి చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను విచారణార్హమైన (కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియచేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జరిమానా విధించడానికి బదులు ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను కాగ్నిజబుల్, నాన్ బెయిల్‌బుల్ నేరాలుగా ఎందుకు పరిగణించకూడదో స్పష్టం చేసి తీరాల్సిందేనని గనుల శాఖ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసింది. అంతేకాక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాతో సంబంధం ఉన్న వారిలో ఎంత మందిని అరెస్ట్ చేశారో, నెలల వారీగా గణాంకాలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రవాణా చేస్తున్న తమ వాహనాలను అధికారులు సీజ్ చేశారని, ఈ విషయంలో వారు చట్టం నిర్ధేశించిన ప్రక్రియను అనుసరించలేదని, తమ వాహనాలను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మెదక్ జిల్లాకు చెందిన బండారి పాపిరెడ్డి, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు గనులశాఖ సంయుక్త కార్యదర్శి తన కౌంటర్ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. అయితే ఈ అఫిడవిట్లో కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా ఎందుకు పరిగణించకూడదన్న కోర్టు ప్రశ్నకు ఎటువంటి సమాధానం లేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అదనంగా హైకోర్టు ఏవైనా సూచనలు, సలహాలిస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే విషయంలో వైఖరి స్పష్టం చేయకుండా, కోర్టు సూచనలు, సలహాలు పాటిస్తామనడాన్ని తప్పుపట్టారు. కోర్టు ఆదేశించిన విధంగా వైఖరిని తెలియచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అక్రమ మైనింగ్, రవాణా తగ్గిందన్న ప్రభుత్వ న్యాయవాది, అందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచకపోవడాన్ని కూడా న్యాయమూర్తి ఎత్తి చూపారు. 371 ట్రక్కులను జప్తు చేశామన్న ప్రభుత్వ న్యాయవాది, అందుకు సంబంధించి ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పలేదన్నారు. తదుపరి విచారణ సమయానికి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశించారు. -
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
టేకులపల్లి (ఖమ్మం) : కూపన్లు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను సోమవారం టేకులపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం శంబునిగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న ఎస్సై సురేష్ విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. -
ఇసుక తవ్వకాలను వ్యతిరేకిస్తూ ధర్నా
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : అక్రమ ఇసుక తవ్వకాలను వ్యతిరేకిస్తూ సుండుపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో గ్రామస్తులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసులు మధ్య తోపులాట జరిగింది. -
నిర్లక్ష్యాన్ని సహించను
అవసరమైతే తీవ్ర చర్యలకు వెనుకాడను ఇసుక, మట్టి తవ్వకాలపై తహశీల్దార్లకు కలెక్టర్ వార్నింగ్ అమలాపురం టౌన్ : ‘జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు పెరుగుతున్నాయి. గణాంకాలు పరిశీలిస్తుంటే ఇసుక అనధికారికంగా తరలిపోతున్నట్లు తెలుస్తోంది. లంక భూముల్లో మట్టి తవ్వకాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ వీఆర్వోలను సస్పెండ్ చేశాం. ఇకనుంచి మిమ్మల్ని కూడా ఉపేక్షించేది లేదు. అవసరమైతే చార్జిషీట్లు జారీ చేసేందుకు కూడా వెనుకాడను. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే సహించేది లేదు’ అని తహశీల్దార్లను కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, అమలాపురం డివిజన్లోని తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెచ్చుమీరుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై సీరియస్‌గా చర్చించారు. జిల్లాలో మట్టి తవ్వకాలను పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ ఆదేశించారు. డి-పట్టా భూములను కేవలం వ్యవసాయానికి మాత్రమే ఇస్తామని.. అందులో మట్టి తవ్వడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. మామిడికుదురు మండలం నుంచి ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అక్కడ తక్షణ చర్యలు తీసుకోవాలని మామిడికుదురు తహశీల్దార్‌ను ఆదేశించారు. అలాగే కోనసీమలో సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో మట్టి తవ్వకాలు ఎక్కువగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. సొంత భూముల్లో కూడా మట్టి తవ్వకూడదని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై ఇటీవల పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయని గుర్తు చేశారు. ఇకనుంచి ఈ అంశంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా, పత్రికల్లో కథనాలు వచ్చినా తహశీల్దార్లు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమలాపురం డివిజన్లో అనధికార చెరువులు తవ్వుతున్నారని కలెక్టర్ ప్రస్తావించారు. చేపలు, రొయ్యల చెరువులవల్ల పక్కన ఉన్న పంట పొలాలు దెబ్బతింటున్నాయని.. ఇటువంటిచోట్ల అక్రమ చెరువులను అదుపు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ పద్మ, ఆర్డీఓ గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తరలివచ్చిన జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్, జేసీ సహా వివిధ శాఖల జిల్లా అధికారులంతా సోమవారం అమలాపురం ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇక్కడ నిర్వహించిన ప్రజావాణిలో వారు పాల్గొనడంతో అర్జీదారులవద్దకు జిల్లా యంత్రాంగమంతా కదిలివచ్చినట్లు కనిపించింది. మండల స్థాయి ప్రజావాణిలో వినతి ఇచ్చినా, తమ సమస్య పరిష్కారం కాక, వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయలేకపోయిన ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. ఎప్పుడూ జిల్లా కేంద్రంలోనే ప్రజావాణి నిర్వహించే సంప్రదాయాన్ని కొద్దిగా మార్చి, ఒక్కో వారం ఒక్కో డివిజన్‌కు జిల్లా అధికార యంత్రాంగమంతా తరలివచ్చే ఏర్పాట్లు చేశారు. -
ఇసుక క్వారీల్లో ఆగని దందా
కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలింపు పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రశ్నించిన మ్యాక్స్ సొసైటీ అధ్యక్షురాళ్లకు హెచ్చరికలు గుంటుపల్లి ఇసుక రీచ్‌పై విచారణ చేసిన సబ్ కలెక్టర్ విజయవాడ : జిల్లాలో ఇసుక అక్రమ దందా ఆగ లేదు. అధికార పార్టీ అండ చూసుకుని కొందరు రెచ్చిపోతున్నారు. ప్రజల ప్రాణాలు కూడా హరిస్తున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారు. అధికారులు కూడా వీరి దందాకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. మహిళా మ్యాక్స్ సొసైటీల ముసుగులో వీరి దందా మరీ ఎక్కువైంది. ఇసుక క్వారీలు ఉన్న గ్రామాల్లో మహిళా డ్వాక్రా సంఘాలను రంగంలోకి దించిన ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండేవారిలో కొందరిని ఎంపిక చేసి మ్యాక్స్ సొసైటీలుగా ఏర్పాటుచేసింది. ఈ సొసైటీల్లో డ్వాక్రా సంఘాల సభ్యులను చేర్చి వారితో ఇసుక వ్యాపారం చేయిస్తున్నట్లు చెప్పింది. అయితే ఇది నటనేనని అక్కడి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. మ్యాక్స్ సంఘాలతో రికార్డులు రాయించి ఎవరైతే దందాదారులు ఉన్నారో వారే ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు. ఒకే బిల్లుపై 20 నుంచి 30 లారీల ఇసుక విక్రయం ఇసుక రీచ్‌ల్లో లారీ ఇసుకకు బిల్లు తీసుకుని దాదాపు 20 నుంచి 30 లారీల ఇసుకను అదే బిల్లుపై యథేచ్ఛగా విక్రయించుకుని కొందరు సిండికేట్లు కోట్లు గడిస్తున్నారు. దీనికి పంచాయతీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరించటంతో అక్రమ వ్యాపారం లక్షల స్థాయి నుంచి కోట్లకు చేరింది. ఇదంతా అక్రమంగా సాగుతుందని రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకూ తెలుసు. ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి ఇసుక రీచ్‌లో అక్రమ దందా సాగుతూనే ఉంది. ఇసుక రీచ్‌ను బోట్స్‌మెన్ సొసైటీ గతంలో నిర్వహించింది. ప్రస్తుతం ఈ బాధ్యతను గుంటుపల్లి శాండ్ మైనింగ్ ఉమెన్స్ మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీకి ప్రభుత్వం ఇచ్చింది. ఇసుకను నది నుంచి బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులకు చెందిన పడవల్లో తీసుకువస్తారు. అందుకు గానూ వారికి లేబర్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఆరు క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్న లారీ లోడ్‌కు రూ.3,900గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. లారీ లోడ్‌కు లేబర్ చార్జ్ కింద రూ.1,380 బోట్స్‌మెన్ సొసైటీకి ఇస్తారు. నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మహిళా సంఘం కమీషన్ తీసుకుని మిగిలిన డబ్బును ప్రభుత్వానికి చెల్లిస్తుంది. నదీ ప్రవాహం ఇక్కడ 365 రోజులూ ఉండటంతో నాణ్యమైన ఇసుక లభ్యమవుతుంది. బోట్స్‌మెన్ సొసైటీలోని కొందరు సభ్యులు చక్రంతిప్పి అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ఇదేమిటని ప్రశ్నించిన ఇక్కడి మ్యాక్స్ సంఘం అధ్యక్షురాలిని ఇటీవల బెది రించారు. అధ్యక్షురాలి ఫిర్యాదు మేరకు గతనెలలో సబ్ కలెక్టర్ నాగలక్ష్మి విచారణ నిర్వహించారు. అక్రమాలు ఇలా... మహిళా సంఘం పర్యవేక్షణలో ఇసుక రీచ్‌లో కంప్యూటర్లు ఉంటాయి. కంప్యూటర్లపై పనిచేసేందుకు సంఘం ఆపరేటర్లను నియమించుకోవాలి. మ్యాక్స్ సొసైటీ ఇస్తున్న బిల్లు ఆన్లైన్లో సక్రమంగా నమోదుకావటం లేదు. నిత్యం ఈ రీచ్ నుంచి 70 లారీల ఇసుక తరలుతుంటే 20 వరకు మాత్రమే ఆన్లైన్లో రశీదులు నమోదవుతున్నాయి. అధికారికంగా నమోదు చేస్తున్న లారీల్లో కూడా తేడాలు వస్తున్నాయి. ఒకే బిల్లును రెండు మూడుసార్లు నమోదు చేస్తే రెడ్‌మార్క్ వచ్చి వివరం నమోదు కాదు. అనేక రీచ్‌లలో ఆన్లైన్లో నిత్యం రెడ్‌మార్క్ వస్తూనే ఉంది. ప్రతిచోటా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు పెత్తనం చేస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని పెద పులిపాక ఇసుక క్వారీలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు హవా సాగిస్తున్నారు. ఇక్కడ కూడా అక్రమ తరలింపు జరుగుతోంది. ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక క్వారీలో నిబంధనలు పాటించడం లేదు. పలువురు చీకటి వ్యాపారులు పగటి పూట కాకుండా రాత్రి పూట క్వారీయింగ్ చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఈ కారణంగా గత నెలలో చల్లపల్లిలో ఇసుక ట్రక్ కింద పడి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినా వారి దందా ఆగలేదు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన క్వారీలు 11 ఉన్నాయి. అనుమతులు లేకుండా కృష్ణా తీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రోజుకు సుమారు రూ.11కోట్లపైనే ఇసుక వ్యాపారం చేస్తోంది. అధికారికంగా 11 ఇసుక క్వారీలు ఉన్నాయి. రాత్రుల్లో అనధికారికంగా జరిగే ఇసుక దందా మరో రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎక్కడక్కడ స్థానికులతో కలిసి అధికార పార్టీ నేతలు దందాకు పాల్పడుతున్నారు. జిల్లాలో రోజుకు రూ.15 కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలుతోంది. -
ఎమ్మెల్యేల పేరిట టిప్పర్ల దూకుడు
బూర్జ : మండలంలోని కాఖండ్యాం ఇసుక ర్యాంపువద్ద ఎమ్మెల్యే కూన రవికుమార్ పేరు చెప్పి కొంత మంది టిప్పరు డ్రైవర్లు దూసుకు పోతున్నారని లారీ డ్రైవర్లు మంగళవారం సాయంత్రం ఉవ్వపేట వద్ద ఆందోళన చేశారు. అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పిన వారికే ఇక్కడ ఇసుక వెనువెంటనే లోడ్‌చేసి పంపిస్తున్నారని, రికమండేషన్ లేనివారికి 5 నుంచి వారం రోజులు వరకు వేచి ఉండా ల్సి వస్తోందని విశాఖ, విజయవాడ, పలాస, నరసన్నపేట వంటి దూరప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు గగ్గోలు పెట్టారు. ఇసుక ర్యాంపుల వద్ద స్థానికుల హవా కొనసాగుతోందని, ఈ ర్యాంపులో వారి ఇష్టానుసారంగా జరుగుతోందని, ఏ ఒక్క టిప్పరునూ విడిచి పెట్టేదిలేదని ఆగ్రహిస్తూ రోడ్డుపై లారీలను అడ్డంగా పెట్టారు. ఇక్కడ తినటానికి కూడా ఏమీ దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మమ్మ ల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారు వాపోయారు. దీనిపై ఇసుక రీచ్ నిర్వహిస్తున్న గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మామిడి కమల వద్ద ప్రస్తావించగా కొన్ని టిప్పర్లు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి వస్తున్నాయని, ఏమీ అనలేక వారి టిప్పర్లు ముందుగా లోడ్‌చేసి పంపిస్తున్నమాట వాస్తవమేనని చెప్పారు. రెండు జేసీబీల వల్ల సకాలంలో ఇసుకను లోడ్ చేయలేకపోతున్నామని మరో జేసీబీ అవసరముంటుందని చెప్పారు. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులకు విన్నవించామని, బుధవారం నాటికి పంపిస్తామన్నారని ఆమె చెప్పారు. ఇక నుంచి జాప్యం జరగదని హామీ ఇవ్వటంతో లారీడ్రైవర్లు శాంతించారు. -
ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట
కర్నూలు(అగ్రికల్చర్): ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి.. డ్వాక్రా సంఘాలకు కేటాయించిన రీచ్‌ల నుంచి నిబంధనల ప్రకారం తరలిస్తామని జాయింట్ కలెక్టర్ కన్నబాబు అన్నారు. గురువారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా అధికారులతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌లను గుర్తించినా.. నిడ్జూరులో మాత్రమే తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ఇసుక ధర, రవాణా చార్జీలను ఇప్పటికే ఖరారు చేశామన్నారు. ఇప్పటి వరకు వినియోగదారులు డీడీలు చెల్లించి ఇసుక తరలిస్తున్నారని.. ఇకపై మీసేవ కేంద్రాల్లో నగదు చెల్లించి రశీదులను ఇసుక రీచ్‌ల వద్ద డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు అందిస్తేనే ఇసుక సరఫరా అవుతుందన్నారు. వాల్టా చట్టాన్ని వంద శాతం అమలు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇందులో భాగంగానే రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి కొనుగోలుకు చర్యలు పత్తి ధర పడిపోవడంతో కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలో సీసీఐ కొనుగోలు కేంద్రాలతో ఎంఎస్పీతో పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ, ఆముదం దిగుబడులను ఈ-టెండర్లతో కొనుగోలు చేస్తున్నారని.. త్వరలోనే పత్తిని కూడా అదేవిధంగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
దోచుకున్న వారికి దోచుకున్నంత..!
- ఇసుక మాఫియాకు కాసుల వర్షం - బళ్లారిలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు - అనుమతులు రద్దయినా యథేచ్ఛగా తరలింపు - ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి - మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు - చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం సాక్షి, బళ్లారి : తాలూకాలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా సాగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. బళ్లారి తాలూకా పరిధిలోని మోకా, రూపనగుడి, హగరి తదితర నది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతాల పరిధిలో మూడు కంపెనీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏడాదికి ఒకసారి ఇసుక కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయడమో లేక కొత్త వారికి అనుమతులు ఇవ్వడమో చేసి ఇసుక తవ్వకాలు చేపట్టాలనే నిబంధనలు ఉన్నాయి. నెల రోజుల క్రితం బళ్లారి తాలూకాలో ఉన్న ఇసుక కాంట్రాక్టర్ల టెండర్ల గడువు ముగిసింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకాలకు రూ.670లు చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలి. క్యూబిక్ మీటర్‌కు రూ.670లు ప్రకారం నెలకు మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోవచ్చు. తద్వారా ప్రభుత్వానికి నెలకు దాదాపు రూ.21 లక్షలు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం టెండర్ల గడువు ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. పాత కాంట్రాక్టర్లు గడువు ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, ఇసుక తవ్వకాలను యథేచ్ఛగా అధికార పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. ఇసుక తవ్వకాలు రద్దు చేశారని అధికారికంగా పేర్కొంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రభుత్వ భనన నిర్మాణాలకు ఇసుక కొరత సృష్టిస్తూ, బళ్లారిలో అక్రమంగా ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. బళ్లారితో పాటు బెంగళూరుకు కూడా ఇక్కడ నుంచి ఇసుకను భారీగా తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండదండలతో ఇసుక తవ్వకం దారులు పెట్రేగిపోతున్నారు. భారీగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల హగరి నది పరివాహక ప్రాంతాలైన చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీనిపై రైతులు ఆందోళనలు చేపట్టినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అటవీశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగంలోని ప్రముఖ అధికారులకు, పోలీసులకు మామూళ్లు సమర్పిస్తూ ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి జిల్లా పంచాయతీ సమావేశంలోను ఈ అక్రమాలపై సంబంధిత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీ మెంబర్లు నిలదీసినా ప్రయోజనం శూన్యం. ఈ సమస్య పరిష్కారంపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పరమేశ్వర నాయక్ చొరవ చూపకపోవడం శోచనీయం. -
ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న కార్మికులు
పెరవలి/నిడదవోలు రూరల్ : ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కటై జరుపుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ర్యాంప్ కార్మికులు, స్థానికులు అడ్డుకున్న ఘటన గురువారం రాత్రి పెండ్యాల-కానూరు ర్యాంప్‌లో చోటుచేసుకుంది. దీంతో అధికారులు చేసేది లేక వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెండ్యాల ర్యాంపులో కొంతకాలంగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. గురువారం రాత్రి అక్రమంగా ఇసుకను తవ్వడానికి రెండు ప్రొక్లెయినర్లు, ట్రాలీలు తీసుకువచ్చి లారీలతో ర్యాంపులోకి దిగి ఇసుకను లోడు చేశారు. ఇదిలా ఉండగా 20 రోజుల క్రితం ఇక్కడ ఇసుకను మూటలుగా కట్టి అమ్ముకుంటున్న ర్యాంప్ కార్మికులు, కూలీలను సమిశ్రగూడెం ఎస్సై అడ్డుకుని తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై కార్మికులు గుర్రుగా ఉన్నారు. ర్యాంప్‌ను మూసివేయడంతో ఉపాధి కోల్పోయామని, ఇసుక మాఫియా ప్రజాప్రతినిధుల అండతో అక్రమంగా తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం మాని తమపై చర్యలేమిటని కొందరు అప్పుడు ప్రశ్నించారు. ఈ ఘటన నేపథ్యంలో కార్మికులు అవకాశం కోసం ఎదురు చూస్తుండగా గురువారం రాత్రి ర్యాంప్‌లో తవ్వకాలు జరుపుతున్నారని తెలియడంతో 100 మంది కార్మికులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో నిడదవోలుకు చెందిన సీపీఎం నేత జువ్వల రాంబాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వచ్చారు. ఇసుక తవ్వకందారులు తాము ఎమ్మెల్యే అనుచరులమని, తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కార్మికులు, రాంబాబును హెచ్చరించారు. రాంబాబు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి రాకపోతే పరిస్థితులు చేయిదాటతాయని చెప్పడంతో ఎట్టకేలకు సమిశ్రగూడెం ఎస్సై ఎస్ఎస్ఎస్పి కుమార్, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు. రెండు లారీలను, రెండు పొక్లైన్లు, ఒక ట్రాలీ, ఒక ట్రాక్టరును స్వాధీనపర్చుకున్నారు. అధికారులపై ప్రజాప్రతినిధి ఆగ్రహం వాహనాలను పోలీసులు పట్టుకోవడంతో స్థానిక ప్రజాప్రతినిధి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆయన అధికారులకు, పోలీసులకు అనేకమార్లు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో బదిలీలు తప్పవంటూ హెచ్చరించారు. -
ఇసుక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
రాజమండ్రి: రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రిలో నెహ్రు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణ యధేచ్చగా సాగుతుందని ఆరోపించారు. శాండ్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని అన్నారు. పోలవరం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. అలాగే ఏలేరు ఆధునికీకరణకు కూడా ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. -
ఇసుక మాఫియా వల్లే బియాస్ విషాదం
సిమ్లా: బియాస్ నది నుంచి ఇసుక అక్రమ రవాణ సాగుతోందని, విద్యార్థులు గల్లంతు కావడానికి కొంతవరకు ఇది కూడా కారణమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖష్ అగ్నిహోత్రి ఆదివారం ప్రమాద సంఘటనను సందర్శించారు. బియాస్ నది నుంచి ఇసుక అక్రమ రవాణ అరికట్టేందుకు లింక్ రోడ్లన్నంటినీ మూసివేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నది దగ్గరకు ట్రాక్టర్లు వెళ్లేందుకు వీలుగా ఇసుక మాఫియా చిన్నచిన్న దారులను ఏర్పాటు చేసిందని అధికారులు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను తీసుకెళ్లిన బస్సు హైవే దిగిన తర్వాత ఇలాంటి మార్గంలోనే సంఘటనా స్థలానికి చేరుకుందని తెలిపారు. అంతేగాక లార్జీ డ్యామ్ నిర్వాహకులు ఇసుక మాఫియాతో చేతులు కలిపారని, అక్రమ రవాణకు వీలుగా అప్రకటిత సమయంలో డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారని అధికార వర్గాలు తెలిపాయి. విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 24 మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
ఇసుక తవ్వకాలు వాస్తవమే
చెన్నూర్/చెన్నూర్‌రూరల్, న్యూస్‌లైన్: మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమేనని అధికారులు నిర్వహించిన విచారణలో తేలింది. అక్కెపల్లి, చింతలపల్లిలోని గోదావరి, బతుకమ్మ వాగు పరీవాహక ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో వేసిన ఇసుక మేటలు తొలగించేందుకు అనుమతి పొందిన పట్టాదారులు అక్రమంగా గోదావరి, వాగుల నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యుడు రేగళ్ల విజయానంద్ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ దీనిపై విచారణకు ముగ్గురు అధికారులతో త్రిసభ్య కమిటీ వేశారు. ఈ మేరకు గురువారం కమిటీ సభ్యులు భూగర్భజల శాఖ డెప్యూటీ డెరైక్టర్ కుమారస్వామి, ఏడీ ప్రదీప్‌కుమార్, ఆర్ఐ నిరంజన్ ఇసుక క్వారీలపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పట్టా భూముల్లో వేసిన ఇసుక మేటలు తొలగించేందుకు మాత్రమే పట్టాదారులకు అనుమతి ఉందన్నారు. పట్టాదారులు ఆ అనుమతిని అతిక్రమించి గోదావరి, వాగు నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టారని పేర్కొన్నారు. పట్టా భూముల్లో ప్రస్తుతం ఇసుక లేదన్నారు. చింతలపల్లి ప్రాంతంలో 92, 93, 94 సర్వే నంబర్లలోని భూములను స్థానిక అధికారులు చూపించకపోవడంపై కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదికను క లెక్టర్‌కు సమర్పిస్తామని చెప్పారు. వారి వెంట తహశీల్దార్ విజయ్‌కుమార్, మండల సర్వేయర్ ప్రసాద్, వ్యవసాయాధికారి ప్రేమ్‌కుమార్, గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యులు మదాసు మధు, రేవేల్లి మహేశ్, పోగుల పురుషోత్తం, అంజన్న, వెంకటేశ్వర్‌గౌడ్ ఉన్నారు. -
2013లో ఉమన్ ఆఫ్ ఇయర్:దుర్గాశక్తి నాగ్‌పాల్