తొలిసారి మహిళా ఫుట్‌బాల్ లీగ్
న్యూఢిల్లీ: భారత క్రీడారంగం చరిత్రలో మరో కొత్త లీగ్‌కు తెర లేవనుంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి తొలిసారిగా ఇండియన్ ఉమెన్స్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) జరగనుంది. వచ్చే నెల 14 వరకు జరిగే ఈ లీగ్‌ను మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగే పోటీల్లో జెప్పియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎఫ్‌సీ (పుదుచ్చేరి), ఎఫ్‌సీ అలఖ్‌పురా (మిజోరం), ఎఫ్‌సీ పుణే సిటీ (మహారాష్ట్ర), రైజింగ్ స్టూడెంట్ క్లబ్ (ఒడిషా), ఈస్టర్న్ స్పోర్టింగ్ యూనియన్ (మణిపూర్) పేరిట ఆరు జట్లు పాల్గొంటాయి.
రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్‌తోపాటు ఐడబ్ల్యూఎల్ చైర్పర్సన్ సారా పైలట్ కూడా పాల్గొన్నారు.