షి క్రియేట్స్: నేర్చుకోండి, మొదలెట్టండి, సంపాదించండి!!
ప్రతిష్టాత్మక గూగుల్ భాగస్వామ్యంతో ఇన్ఫినిటమ్ మీడియా "షి క్రియేట్స్’’ విశాఖ యువతలో కొత్త జోష్ నింపింది. వైజాగ్ సిటీ, చుట్టుపక్కల నుంచి 2000 మంది యువతతో భారీ కార్యక్రమాన్ని విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ వేదికగా ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ మరియు భారీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ మర్నాథ్ పాల్గొన్నారు. గూగుల్‌తో కలిసి ఇన్ఫినిటమ్ మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందించిన మంత్రి యువతకు తోడ్పాటునందించే ఇలాంటి కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో VMRDA చైర్మన్ అక్కరమాని విజయ నిర్మల ఇన్ఫినిటమ్ మీడియా అధినేత వందన బండారు, ఎండీ సత్యదేవ్,యూ ట్యూబ్ సంస్థ నుంచి రవిరాజ్,తపన ఫౌండేషన్ చైర్మన్ గారాపాటి చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సాక్షి గ్రూప్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.
నేర్చుకోండి, మొదలెట్టండి, సంపాదించండి
ఆయా రంగాల్లో ఉన్న వారి టాలెంట్‌ను గుర్తించి ప్రతిభావంతులైన లేడీ కంటెంట్ క్రియేటర్లను కంటెంట్ క్రియేషన్ వైపు నడిపించడం, మహిళల్లో ఉన్న టాలెంట్ గుర్తించి ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిల దొక్కుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. గూగుల్ తో కలిసి ఇన్ఫినిటమ్ సుమారు 200 మంది లేడీ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి వారికి ఫ్రీగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి వారి కంటెంట్ క్రియోషన్ పై అవగాహన కల్పించింది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ప్రోగ్రాం
విశాఖపట్నంలో సక్సెస్ ఫుల్ గా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత గూగుల్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ఇన్ఫినిటమ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని టైర్-2 సిటీలలో కూడా నిర్వహించనుంది. మహిళలను ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయడం. అలాగే డిజిటల్ కంటెంట్ క్రియేటర్లుగా ఒక గుర్తింపు తెచ్చే ఉద్దేశంతోనే ఇన్ఫినిటమ్ అధినేత వందన బండారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టడమే కాక వారిని చూసి మరి కొంతమంది ఇన్స్పైర్ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపోందించారు.