iodine salt
-
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ...ఆ మాత్రలకు పెరిగిన డిమాండ్! ఎందుకలా..
Potassium Iodide Pill block Radioactive Iodine: ఉక్రెయిన్ రష్యా మధ్య నిరవధికంగా యుద్ధం కొనసాగుతోంది. ఎటునుంచి చూసిన ఈ యుద్ధం ఆగుతుందని ఎవరికి అనిపించటంలేదు. అలాంటి విధ్వంసకర పోరు సమయంలో పొటాషియం అయోడైడ్ మాత్రలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీనికి గల కారణం రష్యా ఉక్రెయిన్‌లోని అణుకర్మాగారం పై దాడుల జరపడంతోనే ఈ మాత్రలకు అనుహ్యంగా డిమాండ్ పెరిగింది. అసలు పొటాషియం అయోడైడ్(కేఐ) అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏమిటంటే..సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ప్రకారం పొటాషియం అయోడైడ్ అనేది స్థిరమైన అయోడిన్ ఉప్పు. ఇది రేడియోధార్మిక అయోడిన్‌ను థైరాయిడ్ గ్రంథి గ్రహించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. తద్వారా ఈ గ్రంధిని అణుధార్మిక రేడియేషన్ భారి నుంచి కాపాడుతుంది. అంతేకాదు థైరాయిడ్ గ్రంధిలోకి రేడియోధార్మిక అయోడిన్ రాకుండా నిరోధించడానికి మన వద్ద ఉన్న టేబుల్ స్పూన్ ఉప్పు, అయోడిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలలోని అయోడిన్ సరిపోదని సీడీసీ పేర్కొంది. అంతేకాదు థైరాయిడ్ గ్రంధి స్థిరమైన అయోడిన్, రేడియోధార్మిక అయోడిన్ మధ్య వ్యత్యాసాని గుర్తించలేదు. అయితే ఒక వ్యక్తి కేఐ మాత్ర తీసుకున్నప్పుడూ స్థిరమైన అయోడిన్ని మాత్రమే గ్రహిస్తుందని, రేడియోధార్మిక అయోడిన్‌ను ప్రవేశించకుండా అడ్డుకుంటుందని సీడీసీ వెల్లడించింది. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయంతో చాలామంది యూరోపియన్లు అయోడిన్ మాత్రలను నిల్వ చేసుకున్నారు. అంతేగాక బెల్జియంలో, దాదాపు 30 వేల మంది నివాసితులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు నిరోధక దళాలను హై అలర్ట్‌లో ఉంచాలని ప్రకటించిన నేపథ్యంలో ఉచిత మాత్రల కోసం ఫార్మసీలకు వెళ్లారని స్థానిక మీడియా పేర్కొంది. పైగా యూఎస్‌లోని ఫార్మాస్యూటికల్ కంపెనీ పొటాషియం అయోడైడ్ ఉత్పత్తులకు సంబంధించిన అధిక డిమాండ్‌ను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. (చదవండి: ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత) -
అయోడిన్ సాల్ట్ వినియోగించాలి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): అయోడిన్ సాల్ట్ వినియోగించేలా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. అయోడైజ్డ్ సాల్ట్ వినియోగించకపోతే థైరాయిడ్, గాయిటర్ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ సెంటర్లలో అయోడిన్ సాల్ట్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 19 సాల్ట్ శాంపిల్స్‌ను పరిక్షించామన్నారు. వాటిలో 7 శాంపిల్స్‌లో అయోడిన్ తగినంత మోతాదులో లేదని తెలిందన్నారు. అటువంటి ఉప్పు విక్రయిస్తున్న వారికి జరిమానా విధించినట్లు తెలిపారు. సమావేశంలో గజిటెడ్ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ వి.ఆనందరావు, తూనికలు కొలతలు, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు పాల్గొన్నారు.