అయోడిన్ సాల్ట్ వినియోగించాలి
-
జేసీ ఇంతియాజ్
నెల్లూరు(పొగతోట): అయోడిన్ సాల్ట్ వినియోగించేలా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. అయోడైజ్డ్ సాల్ట్ వినియోగించకపోతే థైరాయిడ్, గాయిటర్ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ సెంటర్లలో అయోడిన్ సాల్ట్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 19 సాల్ట్ శాంపిల్స్‌ను పరిక్షించామన్నారు. వాటిలో 7 శాంపిల్స్‌లో అయోడిన్ తగినంత మోతాదులో లేదని తెలిందన్నారు. అటువంటి ఉప్పు విక్రయిస్తున్న వారికి జరిమానా విధించినట్లు తెలిపారు. సమావేశంలో గజిటెడ్ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ వి.ఆనందరావు, తూనికలు కొలతలు, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు పాల్గొన్నారు.