IPL council
-
ముంబై జట్టులో సిమ్మన్స్
జలజ్ సక్సేనా స్థానంలో తీసుకున్న ఫ్రాంచైజీ దుబాయ్: వరుస ఓటములతో కుదేలైన ముంబై ఇండియన్స్ జట్టు ఓ కీలక మార్పు చేసింది. వెస్టిండీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లెండిల్ సిమ్మన్స్‌ను జట్టులోకి తీసుకుంది. జలజ్ సక్సేనా స్థానంలో సిమ్మన్స్‌ను తీసుకోవడానికి ఐపీఎల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. అయితే జలజ్‌ను ఎందుకు తీశారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మధ్యప్రదేశ్ క్రికెటర్ జలజ్ సక్సేనాను రూ.90 లక్షలకు ముంబై కొనుక్కుంది. కానీ సీజన్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. మరోవైపు వెస్టిండీస్ క్రికెటర్ సిమ్మన్స్ ఇప్పటివరకూ ఎప్పుడూ ఐపీఎల్లో ఆడలేదు. -
ఐపీఎల్ వేలం జాబితాలో 25 మంది
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కించుకునే హైదరాబాద్ క్రికెటర్లు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో తేలనుంది. వేలం కోసం ఐపీఎల్ కౌన్సిల్ ఫ్రాంఛైజీలకు పంపించిన అన్క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాలో హైదరాబాద్ నుంచి 25 మంది ఉన్నారు. ఈ సీజన్లో రంజీ ఆడిన ఆటగాళ్లందరూ జాబితాలో ఉన్నారు. భారత అండర్-19 జట్టుకు ఆడుతున్న సీవీ మిలింద్ కూడా జాబితాలో ఉన్నాడు. మిలింద్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు కాబట్టి.. వేలానికి అర్హత వచ్చింది. నగరం నుంచి ఈ జాబితాలో ఉన్న అండర్-19 క్రికెటర్ మిలింద్ ఒక్కడే. అయితే ఈ జాబితాలో ఎంతమంది పట్ల ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆసక్తిచూపుతాయో చూడాలి.