సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కించుకునే హైదరాబాద్ క్రికెటర్లు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో తేలనుంది. వేలం కోసం ఐపీఎల్ కౌన్సిల్ ఫ్రాంఛైజీలకు పంపించిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాలో హైదరాబాద్ నుంచి 25 మంది ఉన్నారు.
ఈ సీజన్‌లో రంజీ ఆడిన ఆటగాళ్లందరూ జాబితాలో ఉన్నారు. భారత అండర్-19 జట్టుకు ఆడుతున్న సీవీ మిలింద్ కూడా జాబితాలో ఉన్నాడు. మిలింద్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు కాబట్టి.. వేలానికి అర్హత వచ్చింది. నగరం నుంచి ఈ జాబితాలో ఉన్న అండర్-19 క్రికెటర్ మిలింద్ ఒక్కడే. అయితే ఈ జాబితాలో ఎంతమంది పట్ల ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆసక్తిచూపుతాయో చూడాలి.
ఐపీఎల్ వేలం జాబితాలో 25 మంది
Published Fri, Jan 31 2014 12:25 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement