ఇష్రత్ గురించి వ్యక్తిగతంగా తెలియదు: హెడ్లీ
ముంబై: ఇష్రత్ జహాన్ గురించి తనకు వ్యక్తిగతంగా తెలియదని, ఆమె కేసు వివరాలను మీడియా ద్వారానే తెలుసుకున్నానని పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. ముంబై దాడుల కేసులో ఆయన శనివారం ముంబై కోర్టు అమెరికా నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈమేరకు తెలిపాడు.ఇష్రత్ లష్కరే తోయిబా తరఫున పనిచేసిందని హెడ్లీ గత నెల ఇదే కోర్టుకు చెప్పడం గమనార్హం. ‘లఖ్వీ(లష్కరే కమాం డర్) నాకు ముజామిల్ భట్‌ను పరిచయం చేశాడు.
లష్కరే టాప్ కమాండర్లలో భట్ ఒకరని నాతో చెప్పాడు. అక్షరధామ్, ఇష్రత్ జహాన్ వంటి ఆపరేషన్లను చేపట్టాడన్నాడు. మిగతాదంతా నా ఆలోచనే’ అని హెడ్లీ తెలి పాడు. భారత్‌లో హతమైన లష్కరే సభ్యురాలు ఇష్రత్ అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి చెప్పానని, ఆ సంస్థ ప్రకటనలో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదో తనకు తెలియదన్నాడు. ఇషత్ ్రసహా నలుగురు 2004లో గుజరాత్లో జరిగిన ఎన్కౌంటర్ చనిపోవడం, నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ హత్యకు వీరు కుట్రపన్నారని ఆరోపణలు ఉండడం తెలిసిందే.