మద్యం పాలసీ ఖరారు
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర సర్కారు కొత్త మద్యం విధానాన్ని శుక్రవారం ప్రకటించింది. దీంతో లెసైన్స్‌ల జారీ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. లాటరీ పద్ధతిలో కేటాయించే ఈ లెసైన్స్‌లు ఈ ఏడాది జూలై ఒకటి నుంచి 2015 జూన్ ఒకటి వరకు అమల్లో ఉంటాయి. వైన్‌షాపుల కేటాయింపులో ఆరు స్లాబ్‌లను ప్రభుత్వం ప్రకటించింది.
దుకాణాలు పొందేందుకు చెల్లించాల్సిన ఫీజు విషయంలో గతానికి, ప్రకటించిన విధానానికి మధ్య వ్యత్యాసం ఉంది. జిల్లాలో 207 మద్యం దుకాణాలు, 23 బార్లు ప్రస్తుతం లెసైన్స్ పొంది ఉన్నాయి. గిరాకీ ఉండదనే ఉద్దేశంతో వ్యాపారులు ఆసక్తి చూపకపోవడం, ఇతరత్రా కారణాలతో మరో 60 వైన్‌షాపులు లెసైన్స్ పొందకుండా మిగిలిపోయాయి. వారం రోజుల క్రితం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అబ్కారీ మంత్రి, అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా లెసైన్స్‌లు పొందకుండా షాపులు మిగలవద్దని అధికారులకు సూచించారు. ఒక్కో దుకాణానికి లెసైన్‌స ఫీజులు కింది విధంగా ఉన్నాయి.