కృష్ణమ్మ వెలవెల..గోదారి కళకళ
రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాధారమైన గోదావరినది కళకళాడుతుండగా కృష్ణా నది వెలవెలబోతోంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద తోడు కావటంతో గోదావరి, ఉపనదులు పరవళ్లు తొక్కుతున్నాయి. నిజామాబాద్ మొదలుకొని భద్రాచలం వరకు ఇదే ఒరవడి.
కాగా, ఎగువ నుంచి వచ్చే వరదే ప్రధాన వనరుగా ఉన్న కృష్ణా నది నీరు లేక కళ తప్పింది. కర్ణాటక లోని ప్రాజెక్టులు నిండితేనే రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద చేరుతుంది. ఇప్పటి వరకు ఆ జాడలే లేకపోవటంతో నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం డెడ్స్టోరేజి దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులోడెడ్డ్ స్టోరేజీ 510 కంటే కూడా తక్కువగా.. 504 అడుగుల నీరు మాత్రమే ఉంది.