ఓక్రిడ్జ్ శుభారంభం
రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల సెవన్ ఏ సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల శుభారంభం చేసింది. ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ జట్టును 4-2 స్కోరుతో ఓడించింది. కెన్నడీ గ్లోబల్స్కూల్ జట్టు 5-1 స్కోరుతో ఆగాఖాన్ అకాడమీ జట్టును ఓడించింది. శనివారం ఫైనల్ పోటీలను నిర్వహిస్తారు.
నగరంలోని 14 పాఠశాలలకు చెందిన ఫుట్‌బాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ పోటీలను మాజీ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మహ్మద్ హబీబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బిజుబేబి, పీపుల్స్ కంబైన్ ప్రతినిధి రాజన్, పాఠశాల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మార్టిన్, కోచ్‌లు, వివిధ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.