గంగా నదిని కలుషితం చేస్తే జరిమానా!
న్యూఢిల్లీ: గంగా నదిని కలుషితం చేసే వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. గంగా నదిని శుభ్రంగా ఉంచడానికి, నదిలో ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడకుండా చూడటానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురానుంది. ఇందుకోసం జస్టిస్ గిరిధర్ మాలవ్య నేతృత్వంలో బిల్లు రూపొందుతోంది. బిల్లు రూపు రేఖలు ఖరారయ్యాక మంత్రివర్గం ముందుకు వస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి చెప్పారు.
‘గంగా నది జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు శుభ్రంగా, ప్రవహిస్తూనే ఉండేలా చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ నదిని కలుషితం చేసే వారికి, ప్రవాహాన్ని అడ్డుకునే వారికి జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు ఉంటాయ’ని ఆమె అన్నారు.