సింగపూర్ వర్సిటీ ఛాన్సలర్‌గా భారతీయుడు
సింగపూర్: మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి పొరుగుదేశంలో గొప్ప గౌరవం దక్కింది. జేవై పీలే(81) అనే భారత సంతతికి చెందిన వ్యక్తి సింగపూర్‌లోని సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ(ఎస్ఎంయూ)కు ఛాన్సలర్ గా నియామకం అయ్యారు. ఈయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. అంతకుముందు ఛాన్సలర్‌గా పనిచేసిన యాంగ్ పంగ్ హో నుంచి పీలే బాధ్యతలు స్వీకరించినట్లు వర్సిటీ యాజమాన్యం తెలిపింది.
మలేసియా నుంచి సింగపూర్ విడివడిన తర్వాత ఆ దేశం సాధించిన ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తుల్లో పీలే కూడా ఒకరు. ఇప్పటికే ఆయన పలు పాలక వర్గ సర్వీసులకు విధులు నిర్వర్తించిన అనుభవం కూడా మెండుగా ఉంది. సింగపూర్ ఎక్సేంజ్‌కు ఏడాదిపాటు చైర్మన్‌గా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సింగపూర్ వైమానిక సంస్థ కూడా ఆయన ఆధ్వర్యంలోనే కీలకంగా ఎదిగిందంటే ఆశ్చర్యపోవాల్సిందే.