Kamareddi
-
పోయొద్దాం..! పోచారం..!! పచ్చదనంతో పలకరిస్తున్న పోచారం ప్రకృతి
మెదక్‌జోన్: కోయిల కిలకిల రావాలు.. చెంగుచెంగున ఎగిరి దూకే జింకలు.. పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు.. గాంభీర్యాన్ని ప్రదర్శించే మనుబోతులు.. నీల్గాయి, సాంబార్లు, మనసుకు ఆహ్లాదానిచ్చే పచ్చని అటవీఅందాల మధ్య నెలకొన్న సుందర దృశ్యాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అడవమ్మ ఒడిలో స్వేచ్ఛగా విహరిస్తూ.. అందాలను వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులు పట్టణాలను విడిచి పోచారం అభయారణ్యానికి పయనం అవుతున్నారు. ► జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో బోధన్–మెదక్ ప్రధాన రహదారి పక్కన కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దు గ్రామం పోచారం శివారులో ఉందీ ఈ అభయారణ్యం. ► ఈ 600 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. ఇందులో 1983లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. ►వైల్డ్ డాగ్, చిరుత, వోల్ఫ్, జాకల్, ఫారెస్ట్ క్యాట్, బద్ధకం బేర్, సాంబార్, నీల్గాయి, చింకారా, చిటల్, నాలుగు కొమ్ముల జింకలను చూడొచ్చు. ► అభయారణ్యం పక్కనే నిజాం కాలంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులకు అడ్డాగా మారింది. ► హైదరాబాద్‌కు కేవలం 115 కిలోమీటర్లు దూరంలో ఉన్న అభయారణ్యానికి వారంతంలో పిల్లలు, పెద్దలు కుటుంబంతో కలిసి వచ్చి ఆనందంగా గడుపుతారు. ► నిజాంపాలనలో ఈ అభయారణ్యం వేట ప్రాంతంగా పేరుగాంచగా, నేడు వన్యప్రాణుల ఆవాసంగా మారింది. ► హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, కరీంనగర్, బోధన్ ప్రాంతాల నుంచి పర్యాటకులు సందర్శనకు వస్తుంటారు. ► వసతి కోసం పోచారం, మెదక్ వద్ద అతిథి గదుల్లో సేదతీరవచ్చు. మెదక్ వద్ద ఫారెస్ట్ రెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇలా చేరుకోవచ్చు.. హైదరాబాద్ నుంచి వయా నర్సాపూర్, జేబీఎస్ నుంచి వయా తూప్రాన్ మీదుగా మెదక్‌కు రావొచ్చు. మెదక్ నుంచి పోచారం అభయారణ్యం 15 కిలోమీటర్లు అక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సీఎస్ఐ చర్చి, ఖిల్లా, ఏడుపాయల, 3 కిలోమీటర్ల దూరంలో జైనమందిర్ ఉంటాయి. -
ఇదీ నిజామాబాద్‌లో అధి‘కార్ల’ దందా
జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు గతంలో అద్దె కారు ఉండేది. అయితే, గతంలో పని చేసిన ఓ అధికారిణి అద్దె కారును పక్కన పెట్టి.. తన సొంత వాహనాన్ని ‘అద్దె’కు వినియోగించుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి తెల్ల నెంబరు ప్లేటు గల వాహనాన్ని కొన్ని నెలల పాటు నడిపించి నెలనెలా అద్దె డబ్బులను పర్సులో వేసుకున్నారు. సాక్షి, ఇందూరు(నిజామాబాద్): జిల్లాలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అద్దె వాహనాల పేరుతో వేల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. సొంత వాహనాలనే వినియోగిస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి దొరక్కుండా పోతోంది. ప్రభుత్వ శాఖ ల్లో అధి‘కార్ల’ దందా కొనసాగుతున్నా అడిగే వారు లేరు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు కార్యాలయాల్లో సంబంధిత శాఖకు సొంత కార్లు లేకపోతే అధికారుల పర్యటనలకు అద్దెకు తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అద్దె వాహనం తీసుకోవాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ కలిగిన వారికి అవకాశం కల్పించాలి. పసుపు రంగు (ట్యాక్సీ) నెంబరు ప్లేట్ కలిగి ఉండడంతో పాటు వాహనం పూర్తి కండిషన్‌తో ఉండాలి. అగ్రిమెంట్ సమయంలో ఆయా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నెలకు 2,500 కిలో మీటర్లు తిరిగితే ఇంధనం (పెట్రోల్/డీజిల్), కారు అద్దె, డ్రైవర్ బత్తా అన్నీ కలిపి గతంలో రూ.24 వేలు ఇచ్చే వారు. అయితే, ప్రభుత్వం దీనిని రూ.33 వేలకు పెంచింది. దీంతో అధికారుల కన్ను ‘అద్దె’పై పడింది. తెల్ల నెంబరు ప్లేటు ఉన్న తమ సొంత వాహనాలను అద్దెకు పెట్టి ‘ఆన్ గోవ్ట్ డ్యూటీ’ అని రాయించుకుని మరీ యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు కలిపి సుమారు 40 మంది అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తూ నెలకు రూ.13 లక్షల వరకూ ‘అద్దె’ వసూలు చేస్తున్నారు! తిరగకున్నా.. సొంత వాహనం లేదా బినామీ పేర్లతో బంధువుల వాహనాలను ప్రభుత్వ శాఖల్లో అద్దెకు వినియోగిస్తున్న అధికారులు.. ఇతర వాహనాల విషయంలో మాత్రం నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. నిరుద్యోగులు తమ వాహనాన్ని అద్దెకు పెడితే నిబంధనల పేరుతో మెలికలు పెడుతూ సతాయిస్తున్నారు. బిల్లులు ఆలస్యంగా ఇస్తున్నారు. అయితే, వేతనానికి కారు అద్దె తోడవుతుందనే ఆశతో అధికారులు సొంత వాహనాలు, బంధువుల పేరిట కలిగినవి ఉపయోగిస్తున్నారు. నెలకు 2,500 కిలో మీటర్లు తిరగకున్నా, తిరిగినట్లు రీడింగ్ చూపి నెలనెలా అద్దెను కాజేస్తున్నారు. ⇔ పై చిత్రంలో కనిపిస్తున్న స్విఫ్ట్ కారు జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో అద్దెకు నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె వాహనం జిల్లా/రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే, తెల్ల నెంబరు ప్లేటు కాకుండా పసుపు రంగు (ట్యాక్సీ) ప్లేటు ఉండాలి. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన తెల్ల నెంబరు ప్లేటుతో ఏడు నెలలుగా ఆ శాఖ అధికారులు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఢిల్లీ నెంబరు ప్లేటు ఉండడంతో అద్దె బిల్లులు చేయడానికి వీలు కావడం లేదు. అయితే, పాత కారు పేరిట బిల్లులు కూడా లేపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘కామారెడ్డి’లో కూడా.. అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తున్నారని తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. సొంత వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని గత కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అందుకు ప్రభుత్వ శాఖల్లో ట్యాక్సీ ప్లేటు గల వాహనాలను వినియోగించాలని సూచించారు. కానీ చాలా మంది అధికారులు సొంత వాహనాలే వినియోగిస్తున్నారు. -
తండ్రీ- ఇద్దరు కొడుకులు కరోనాతో మృతి..
-
కరోనా నియంత్రణలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది
-
తల్లడిల్లిన తల్లి గుండె
-
తండ్రిని చంపింది పెద్ద కొడుకే..
సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్) : ఆస్తి మొత్తాన్ని తన తమ్ముడికే ఇస్తున్నాడని ఎన్నిసార్లు అడిగినా తనకు ఇవ్వడం లేదని కన్న తండ్రిపైనే కక్ష పెంచుకున్నాడు. తండ్రి పట్టించుకోకపోవడంతోనే తన బతుకు ఆగమైందని భావించాడు. పథకం ప్రకారం తండ్రిని హత మార్చాడు. బీబీపేట గ్రామ శివారులోని డాక్ బంగ్లా వద్ద మే 6న జరిగిన బోయిని నర్సయ్య హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడైన మృ తుని పెద్ద కొడుకు రాజయ్యను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు భిక్కనూరు సీఐ రాజశేఖర్ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని నర్సయ్య(60)కు ఇద్దరు కుమారులు. ఐదేళ్ల క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మృతిచెందింది. పెద్దకొడుకు రాజయ్య తండ్రితో వేరుపడి అదే గ్రామంలో మరో చోట ని వసిస్తున్నాడు. నర్సయ్య చిన్న కొడుకు రాములుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆస్తులన్నీ అతని పేరిటే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడని చాలాసార్లు పెద్దకొడుకు పంచాయితీలు పెట్టాడు. అయినా అతడికి ఆస్తులు ఇవ్వలేదు. ఆస్తి కేటాయింపుల విషయంలో జరిగిన ఘర్షణలో బీబీపేట ఠాణాలో ఇదివరకే రాజయ్యపై కేసు నమోదైంది. నర్సయ్యకు పొలంలో రెండు బోర్లు ఉండగా పక్కనే ఉన్న అతని పెద్ద కొడుకు రాజయ్య పొలానికి నీరు ఇవ్వలేదు. నీళ్లు లేక భూమి బీడుగా మారిపోయింది. దీంతో రాజయ్య కొంతకాలంగా ట్రాక్టర్ నడిపిస్తు డిచ్‌పల్లిలో పనిచేసుకుంటున్నాడు. రాజయ్య పెద్ద కొడుకు హైదరాబాద్‌లో ట్యాంకర్ క్లీనర్‌గా పనిచేసుకుంటు చదువుతున్నాడు. రాజయ్య భార్య చిన్న కొడుకులు గ్రామంలోనే ఉంటున్నారు. తన తండ్రి పట్టించుకోకపోవడంతోనే తన బతుకు, తన కుటుంబం ఆగమైందని భావించాడు రాజ య్య. ఎలాగైనా తండ్రిని చంపాలనుకున్నాడు. ఈ క్రమంలో మే 6న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో టీవీఎస్ ఎక్సల్ వాహనం నర్సయ్య పొలం వద్దకు రాగా అప్పటికే అక్కడున్న రాజయ్య ఆస్తివాటా గురించి అడిగాడు. తండ్రి ఇవ్వను అనడంతో కర్రతో బలంగా తలపై బాదాడు. దీంతో నర్సయ్య చనిపోయాడు. ఎవరికి అనుమానం రాకుండా రాజయ్య అక్కడి నుంచి వెళ్లిపోయా డు. దర్యాప్తులో భాగంగా రాజయ్యను విచారించగా నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. -
కామారెడ్డి వాసి మృతదేహం తరలింపుకు తొలగిన అడ్డంకి
సాక్షి, కామారెడ్డి : ఈ నెల 2న బహరాస్‌లో జరిగిన ప్రమాదంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు(37) మృతి చెందాడు. రంజాన్ సెలవులు ఉండటంతో మృతదేహాన్ని భారత్‌కు పంపే ప్రక్రియలో జాప్యం జరిగింది. దాంతో మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి పంపించాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఇండియన్ ఎంబసీకి, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్య శాఖకు ‘మదద్’ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన బహరాస్ ఎంబసీ ప్రభుత్వం నుంచి డెత్ సర్టిఫికెట్ అందాల్సి ఉందని.. అది రాగానే మృత దేహాన్ని భారత్‌కు పంపడానికి తగిన చర్యలు తీసుకుంటామాని భీం రెడ్డికి ఈ మెయిల్ ద్వారా తెలిపింది. పని నిమిత్తం బహరాస్ వెళ్లిన రాజు ఈ నెల 2 యాక్సిడెంట్‌కు గురయ్యాడు. డ్రైవర్ చూసుకోకుండా ట్రక్కును నడపడం వలన వెనక టైరు కింద పడ్డ రాజు తల నుజ్జు నుజ్జు అయింది. దాంతో రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు రాజుకు భార్య లావణ్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. ప్రవాసీ బీమాకు దూరం ఈసీఆర్(ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్) పాస్‌పోర్టు కలిగిన రాజు.. చట్టబద్దమైన ఇ-మైగ్రేట్ సిస్టం ద్వారా కాకుండా అక్రమ పద్దతిలో పుషింగ్ ద్వారా బహరాస్‌కు వెళ్లాడు. ఫలితంగా ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 10 లక్షలు విలువ చేసే ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’(పీబీబీవై) ప్రయోజానికి అనర్హుడు కావడంతో బీమా ప్రయోజనం పొందలేకపోతున్నాడు. మూడున్నర నెలల క్రితం ‘జాస్కో’ కంపెనీలో ఉద్యోగంలో చేరిన రాజు.. ఇలా అనూహ్యంగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. రైతుబంధులాగా ప్రవాసీలను ఆదుకోవాలి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రూ. 5 లక్షల రైతు బీమా ఇచ్చినట్లుగానే గల్ఫ్ ప్రవాసీ కార్మికులకు కూడా రూ. 5 లక్షల బీమా లేదా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ సురేందర్ సింగ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో తెలంగాణకు చెందిన సుమారు వెయ్యి మంది ప్రవాసీలు గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ధన సహాయం అందలేదని పేర్కొన్నారు.ఇబ్బందుల్లో ఉన్న గల్ప్ కార్మికులు తన ఫోరం హెల్ప్ లైన్ నంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు. హెల్ప్‌లైన్ నంబర్ - 93912 03187 మంద భీంరెడ్డి - 98494 22622 -
టోల్‌ప్లాజాపైకి దూసుకెళ్లిన లారీ
కామారెడ్డి: వేగంగా వెళ్తున్న లారీ ముందు టైరు పేలడంతో అదుపుతప్పి టోల్‌ప్లాజా లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన భిక్నూర్ టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. లారీ టైర్ పేలడంతో అదుపుతప్పిన లారీ టోల్‌ప్లాజాలోని స్టాల్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టోల్ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
అభివృద్ధి ఓర్వలేకే.. బీజేపీ ఆందోళన
సాక్షి, కామారెడ్డి: హరిత తెలంగాణను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే ఓర్వలేని బీజేపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ధర్నాకు దిగారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి బీజేపీ నేతలు ఈ ధర్నా చేశారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రూ. 17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు. గతంలో పంట నష్టపోయిన రైతులకు రూ. 480 కోట్లు పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్నామన్నారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందించామని, 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తూ రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. -
పోలీస్ అధికారులకు కొత్త వాహనాలు
కామారెడ్డి ఎస్పీకి ఇన్నోవా డీఎస్పీలకు స్కార్పియోలు నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లాతో పాటు కొత్తగా ఏర్పడనున్న కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులకు ప్రభుత్వం కొత్త వాహనాలను సమకూర్చింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ కోసం ఇన్నోవా, అడిషనల్ ఎస్పీ కోసం స్కార్పియో (బ్లాక్)తో పాటు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి డీఎస్పీల కోసం స్కార్పియో(వైట్)లను ప్రభుత్వం మంగళవారం రాత్రి జిల్లాకు పంపించగా, బుధవారం సాయంత్రం వాహనాలను కామారెడ్డికి తీసుకెళ్లారు. ఇది వరకు డీఎస్పీలు వాడిన సుమోలను సీఐలకు కేటాయించనున్నారు. -
‘ఎజెండా’పై గందరగోళం
వాకౌట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు 327 అంశాలపై చర్చించిన కౌన్సిల్ పలు పనులకు అనుమతి మంజూరు కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మళ్లీ రసాభాసగా మారింది. ఎజెండా అంశాలపై అధికార, విపక్షాల మధ్య గందరగోళం చెలరేగింది. సమావేశం ఏకపక్షంగా సాగుతోందంటూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. చైర్పర్సన్ పిప్పిరి సుష్మ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తొలిసారి హాజరయ్యారు. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కౌన్సిల్ సమావేశంలో 327 అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ వాకౌట్.. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ కౌన్సిలర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. గత సమావేశంలో చర్చించిన అజెండా అంశాలను ఇప్పుడు సభ ముందు ఎలా ఉంచుతారని నిలదీశారు. గత ఎజెండా అంశాలు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయని, హైకోర్టుకు సమాధానం పంపాల్సిన అధికారులు.. అదేమీ పట్టించుకోకుండా పాత ఎజెండాను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశం టీఆర్ఎస్ సమావేశంలా మారిందంటూ నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నిమ్మ దామోదర్‌రెడ్డి, జమీల్, రామ్మోహన్, బట్టు మోహన్, లక్ష్మణ్‌రావు, శశిరేఖ, పద్మ, సునీత వాకౌట్ చేశారు. పనుల నిర్వహణకు అనుమతులు.. అనంతరం సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన నిధులతో చేపట్టే ప్రగతి పనులకు కౌన్సిల్ సమావేశం అనుమతించింది. సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు, పైప్‌లైన్ నిర్మాణాలు, సీసీ డ్రైనేజీలు, మురుగుకాలువ నిర్మాణాలు,అవుట్ సోర్సింగ్ సిబ్బంది టెండర్, సెంట్రల్ లైటింగ్ పనులకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. నీటి సమస్య నివారణకు టాస్క్‌పోర్సు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటర్‌వర్క్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్, టౌన్‌ప్లానింగ్ విభాగాలను ప్రక్షాళన చేయాలని కౌన్సిలర్ భూంరెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ను కోరారు. స్పందించిన ఆయన మిగులు సిబ్బందిని అవసరమున్న చోటుకు పంపించాలని కమిషనర్ విజయలక్ష్మికి సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది పైరవీలు చేస్తున్నారని కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్, రవియాదవ్ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ సూచించగా.. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేస్తానని కమిషనర్ తెలిపారు. స్టేషన్ రోడ్డులోని మడిగెలకు, మటన్ మార్కెట్ మడిగెలకు అద్దె నిర్ణయించాలని, తద్వారా మున్సిపల్ ఆదాయం పెరుగుతుందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వైస్ చైర్మన్ మసూద్‌అలీ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. చేపల మార్కెట్‌గా బల్దియా: ప్రభుత్వ విప్ మున్సిపల్ కార్యాలయం చేపల మార్కెట్‌గా మారిందని విప్ గంగ గోవర్ధన్ వ్యాఖ్యానించారు. దీన్ని మార్చాలని ఆయన అధికారులకు సూచించారు. కామారెడ్డి నూతన జిల్లా కానున్న తరుణంలో మున్సిపల్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. కౌన్సిల్ సమావేశంలో పట్టణాభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై జోక్యం చేసుకుంటూ అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ ఎజెండాపై కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం కామారెడ్డి: మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండాలో చేర్చిన 1, 2, 3, 4 అంశాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మకు డీసెంట్ నోట్ అందజేశారు. ఈ బాక్స్ టెండర్లకు సంబంధించి ఎటువంటి నోటీసులను ప్రదర్శించ లేదని, నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి రహస్య టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎజెండా అంశంలోని 179వ అంశంపై బీజేపీ కౌన్సిలర్ భారతమ్మ డీసెంట్ నోట్ అందించారు. మున్సిపల్ జనరల్ ఫండ్‌ను మసీదులు, మందిరాల వద్ద వాడవచ్చా లేదా అని ప్రశ్నించారు. -
బహిరంగ చర్చకు మేం సిద్ధమే..
మద్నూర్ : మద్నూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కలిపితేనే అభివృద్ధి జరుగుతుందని, దీనిపై మండల జేఏసీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగమేశ్వర్ సవాల్ విసిరారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయంలో శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో మద్నూర్ మండలాన్ని కొనసాగిస్తే మండల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడమే కాకుండా నష్టం తప్పదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయమై జేఏసీ నాయకులు ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కామారెడ్డి జిల్లాలో మద్నూర్‌ను కలిపితే కలిగే ఉపయోగాల గురించి తెలియకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సాయిలు, మొయిన్ పటేల్, దరాస్ సురేష్, బాబు పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
10న కామారెడ్డిలో పొంగులేటి రైతు దీక్ష
కేంద్ర, రాష్ట్రాలకు కనువిప్పు కలిగించేందుకే... రైతు సమస్యలను సర్కార్ పట్టించుకోవట్లేదు:ఎడ్మ కిష్టారెడ్డి మొత్తం తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 10న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఒక రోజు రైతు దీక్ష చేయనున్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొననున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేందుకు, రైతుల్లో మనోస్థైర్యం నింపేందుకు దీక్షను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని (లోటస్‌పాండ్‌లోని) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కె. శివకుమార్ , నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డిలతో కలసి ఆయన రైతు దీక్ష వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 800 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా రైతు సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని కిష్టారెడ్డి ధ్వజమెత్తారు. కేవలం మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ చేతల్లో మాత్రం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ర్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు తాండవిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఇప్పటికైనా మొత్తం తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతుల పక్షాన పోరాడుతున్న ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీయేనని కె.శివకుమార్ ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో దీక్షలు చేశారని, రైతులకు భరోసానిచ్చేలా పార్టీపరంగా కార్యక్రమాలను చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. కామారెడ్డిలోనే ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, అక్కడి రైతులే అధికంగా నష్టపోయినందున అక్కడ దీక్షను చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అనైతిక చర్యలకు పాల్పడుతూ నీతి బోధలా?: కొండా గౌతమ బుద్ధుడు, సత్యహరిశ్చంద్రుడు సిగ్గుపడేలా సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్‌లో నీతి బోధలు చేశారని అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఎద్దేవా చేశారు. వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి అనైతికంగా చేర్చుకోవడమే కాకుండా వారిని పక్కన పెట్టుకుని నీతులు వ ల్లించడం ఆయనకే చెల్లిందని ఎగతాళి చేశారు. కేసీఆర్ సింహంపై స్వారీ చేస్తున్నారని, నేలవిడిచి సాము చేస్తే ఏమవుతుందో ఆయనకు తెలిసొస్తుందన్నారు. సర్కార్‌పై భ్రమలు పోయాయి.. రాష్ట్ర ప్రభుత్వంపై భ్రమలు పోయాయని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ప్రజల ఆశలు నెరవేరలేదని కిష్టారెడ్డి విమర్శించారు. ఓవైపు కరువు విలయతాండవం చేస్తున్నా, రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆత్మహత్యల బారినపడిన రైతుల కుటుంబాలతో దీక్ష చేయించాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. అకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురుగాలులతో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగానికి వెంటనే పెద్ద ఎత్తున సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా రైతుల ఆత్మబంధువుగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నారన్నారు. పిడుగుపాట్లకు గురై మృతిచెందిన వారితోపాటు గొర్రెలు, మేకలకు కూడా నష్టపరిహారాన్ని వైఎస్ గతంలో చెల్లించిన విషయాన్ని గుర్తుచేశారు. -
వైద్యం.. దైన్యం
జిల్లాలో ఈ ఏడాది ప్రజా వైద్యం ఒడిదుడుకులకు లోనైంది. ఎన్నడూ లేనివిధంగా డెంగీకి ముగ్గురు చనిపోయారు. డయోరియా, మలేరియా, విజృంభించాయి. 27 మంది చనిపోయారు. వైద్యవిధాన పరిషత్‌కు చెందిన ఆస్పత్రులు ఓపీలకే పరిమితమయ్యాయి. వైద్య విద్యకు మాత్రం కలిసొచ్చింది. జిల్లా కేం ద్రంలోని వైద్య కళాశాలకు రెండవ సంవత్సరం ఎంబీబీఎస్‌కు అనుమతి లభించింది.ఉప ముఖ్యమంత్రి సందర్శించిన జిల్లా ఆస్పత్రి తీరుమారలేదు. విజృంభించిన డెంగీ వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది జిల్లాలో వ్యాధులు విజృంభించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ తీవ్రప్రభావం చూపింది. అధికారుల లెక్కల ప్రకారమే ముగ్గురు డెంగీ బారిన పడి చనిపోయారు. మొత్తం 115 కేసులు నమోదయ్యాయి. బోధన్‌లోని రాకాసిపేటలో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపింది. గీత అనే మహి ళ ప్రాణాలు కోల్పోయింది. జిల్లాకేంద్రం, బాన్సువాడ, మోర్తాడ్, కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, గాంధారి, ఆర్మూర్ ప్రాంతాల్లోనూ డెంగీ కేసులు నమోదయ్యాయి. 2013లో జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 115కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు వివిధ రకా ల వ్యాధులు గ్రామీణ ప్రజలను పీడించాయి. డయేరియా-61, మలేరి యా-216, విషజ్వరాలు-281, ఇతర వ్యాధులు నమోదయ్యాయి. వివిధ వ్యాధుల కారణంగా 27మంది చనిపోయారు. ఈలెక్క అనధికారికంగా 100కు పైగా ఉండొచ్చు. ప్రైవేటు ఆస్పత్రుల నిరసన ఈ ఏడాది పలు ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల శైలి వివాదస్పదంగా మారింది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతిచెందడంతో, అనంతరం వారి రోగి బంధువులు ఆస్పత్రిపై దాడిచేశారు. దీంతో ఆగ్రహించిన ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు నాలుగు రోజుల పాటు తమ సేవలను నిలిపివేసి, నిరసన తెలిపారు. దీంతో వైద్యం అందక ధర్పల్లికి చెందిన జ్యోత్స్న అనే బాలిక మృతి చెందింది. దీంతో ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల వారు వైద్యుల తీరుపై మండిపడ్డారు. వైద్యశాఖలో మార్పు లేదు జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 375 ఉపకేంద్రాలు ఉన్నాయి. 120 మంది వైద్యులు , 14 క్లస్టర్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో ఖాళీల కొరత తీవ్రంగా ఉండటం వైద్యసేవలపై ప్రభావం పడింది. తెలంగాణ ఏర్పడడం, కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని వైద్యశాఖకు చెందిన 430మంది భావించారు. కానీ వారి కల ఈ ఏడాదికి నెరవేరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవల కోసం చేపట్టిన 104 సేవలు నామమాత్రంగానే కొనసాగాయి. ఈ ఏడాది కొత్తగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తొమ్మిది సంచార వైద్యబృందాలు ఏర్పాటు చేశారు. కళాశాలకు కలిసొచ్చింది జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు 2014 కలిసొచ్చింది. ఈ ఏడాది కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరానికి అనుమతి లభించింది. ఫిబ్రవరి, మే నెలల్లో తనిఖీ చేసిన ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) బృందం జులై 16న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 100 సీట్లతో అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 6న డీఎన్బీ(డిప్లొమా ఇన్ నేషనల్ బోర్డు) కోర్సుల ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ కళాశాలకు మెడిసిన్, గైనిక్, సర్జరీ, ఫిజిషియన్, మత్తుమందు వైద్య కోర్సుల ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. డిసెంబర్లో అదనంగా 50ఎంబీబీఎస్ సీట్లకు ప్రతిపాదనలు పంపగా ఎంసీఐ సానుకూలంగా స్పందించింది. కళాశాలకు ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలం కేటాయిస్తూ రిజిస్ట్రేషన్ జరిగింది. నర్సింగ్‌కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తి చేశారు. కానీ పోస్టుల భర్తీని మాత్రం ఇప్పటి వరకూ చేపట్టలేదు. వివిధ విభాగాల కోసం సుమారు 200 మంది ఉద్యోగుల నుంచి డిప్యూటేషన్ ఆప్షన్లు తీసుకున్నారు. కానీ విధుల్లో మాత్రం చేరలేదు. దీంతో సిబ్బంది కొరత ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది మెడికల్ కళాశాలకు ప్రొఫెసర్లు, పీజీ వైద్యుల కేటాయింపు జరిగింది. దీంతో 200 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చినట్లయింది. సీనియర్ రెసిడెన్సియల్ డాక్టర్లు -109 మంది, కళాశాలకు కేటాయించబడిన-110 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కేటాయించబడ్డారు. కానీ వైద్యులు మాత్రం ఆస్పత్రికి వచ్చి సేవలు అందించడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం 30 నుండి 35 మంది వైద్యులే అందుబాటులో ఉంటున్నారు. కలెక్టర్, డీఎంఈ హెచ్చరించినా వైద్యుల తీరులో మార్పు రాలేదు. వైద్య‘విధానం’ మారలేదు జిల్లాలో వైద్య విధాన పరిషత్‌కు చెందిన ఆస్పత్రుల్లో ఈ ఏడాది మెరుగైన పరిస్థితులు నెలకొనలేదు. ఆస్పత్రులన్నీ కేవలం అవుట్ పేషెంట్ విభాగాలకే పరిమితమయ్యాయి. మెడికల్ కళాశాల ఏర్పడిన తర్వాత వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంది. ఈ ఏడాదిలో బదిలీ అవుతుందని ప్రకటించినా ఇప్పటికీ జరగలేదు. దీంతో మెడికల్ కళాశాల వైద్యులు , వైద్య విధాన పరిషత్ వారి మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, మద్నూరు, ఎల్లారెడ్డి ఆస్పత్రుల్లోనూ ఖాళీల కొరత వేధిస్తోంది. జిల్లాలో 36 మంది వైద్యులు, 32 స్టాఫ్‌నర్సులు, 52 మంది నాల్గోతరగతి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గైనకాలజీ సేవలు, చిన్నపిల్లలకు సంబంధించి, అత్యవసర చికిత్సకు సంబంధించి సేవలు అందడం లేదు. ఏరియా ఆస్పత్రులకు రెగ్యులర్ డీసీహెచ్ఎస్ లేక రెండేళ్లు గడుస్తోంది. -
మన సంస్కృతి మహోన్నతం
కామారెడ్డి : ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పదని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఆ సంస్కృతి పరంపరను కొనసాగించాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయ రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న మహాపడిపూజ కార్యక్రమాన్ని స్వామీజీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి పరిపూర్ణానంద స్వామి ప్రవచనామృతాన్ని అందించారు. భారతీయుల చింతన, భావన విలక్షణమైనవన్నారు. విలక్షణమైన భావన వెనుక ఒక సంస్కారం, ఒక సంస్కృతి, ఒక మహత్తరమైన సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. సంస్కారాన్ని, సంస్కృతిని, చరిత్రను అర్థం చేసుకోకపోతే వెర్రిలా కనబడుతుందన్నారు. అర్థం చేసుకోలేనివానికి ఏదైనా తప్పుగానే కనబడుతుందన్నారు. దీనిని అర్థం చేసుకోలేనివారే దేవునిపేరు మీద పెద్ద వ్యాపారం జరుగుతోందని విమర్శిస్తుంటారన్నారు. ఆచరించే ధర్మం వెనుకనున్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాలు నిర్వహించే విషయంలో భుజానికెత్తుకునేవారికి అవగాహన ఉండాలని, లేకపోతే విమర్శలపాలవుతారని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంస్కారం, చరిత్రను చాటేందుకు చేపడుతున్న కార్యక్రమాలను నాస్తికులు సైతం అర్థం చేసుకోగలుగుతారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు రాధాకృష్ణశర్మ, గంగవరం ఆంజనేయశర్మ, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు చీల ప్రభాకర్, ప్రతినిధులు ఉదయ్, లక్ష్మీకాంతం, శ్రీనివాస్, రమేశ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప ఆలయ రజతోత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జిల్లాలోనూ పెన్సి‘డీల్’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పెన్సిడిల్ (దగ్గు మందు) సిరప్ బాటిళ్ల అక్రమ రవాణా తీగలాగితే డొంక కదులుతోంది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి కేంద్రంగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా సరఫరా అవుతున్న పెన్సిడిల్ సిరప్ బాటిళ్ల వ్యవహారంలో కరీంనగర్ జిల్లా వ్యాపారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దగ్గు మందు బాటిళ్ల అక్రమ రవాణాపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తాజాగా జరిపిన విచారణలో కరీంనగర్, కోరుట్ల కేంద్రాలుగా జిల్లాలోనూ నార్కోటిక్ డ్రగ్ వ్యాపారం సాగినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ అంశాలను బయటకు వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడటం లేదు. మత్తు కోసమే దగ్గు మందు! బంగ్లాదేశ్‌లో మద్యనిషేధం ఉండడంతో వంద మిల్లీలీటర్ల పెన్సిడిల్ దగ్గు మందును మత్తు కోసం అక్కడి యువత వాడుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. వారి వ్యసనాన్ని ఆసరాగా చేసుకున్న రష్యా, బంగ్లాదేశ్ ప్రాంతాల స్మగ్లర్లు మన రాష్ట్రానికి చెందిన కొందరు మెడికల్ రిప్రజెంటేటివ్‌లతో కుమ్మక్కై భారీ మొత్తంలో పెన్సిడిల్ బాటిళ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తేలింది. మన జిల్లాలోని కరీంనగర్, కోరుట్లలోని రెండు మెడికల్ హోల్‌సేల్ స్టాకిస్ట్‌లు గత రెండు నెలలుగా భారీ ఎత్తున పెన్సిడిల్ సిరప్‌లను సరఫరా చేసినట్లు అధికారుల విచారణలో బయటపడింది. వంద మిల్లీలీటర్ల దగ్గు మందు బాటిల్ ధర రూ.96 ఉండగా, మరో రూ.50 అదనంగా కలిపి ఒక్కో బాటిల్‌ను రూ.146 చొప్పున ఐదువేల బాటిళ్లను సరఫరా చేసినట్లు తెలిసింది. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి ఈ బాటిళ్లను హైదరాబాద్‌కు సరఫరా చేయగా, అటు నుంచి ఎటు వెళ్లాయనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.అత్యధికంగా లాభం వస్తుందన్న ఆశతోనే హోల్‌సేల్ స్టాకిస్టులు నేరుగా స్మగ్లర్లకు సరఫరా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. పెన్సిడిల్ సిరప్‌లో క్లోడిన్ పాస్ఫేట్ (నార్కోటిక్ డ్రగ్) ఉండడంతో వైద్యుల సిఫారసు మేరకే ఈ మందును రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇష్టారీతిన దగ్గు మందును విక్రయించే అవకాశం లేకపోవడం, దీనికితోడు ఆశించిన లాభం కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో అక్రమ రవాణాకు పూనుకున్నట్లు తెలుస్తోంది. రిటైల్ వ్యాపారుల సంఘం ప్రతినిధి హస్తం? కరీంనగర్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి ఈ అక్రమ దందాలో భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ రిటైల్ వ్యాపారుల సంఘం ప్రతినిధికి చెందిన డ్రగ్ ఏజెన్సీ ద్వారా సదరు వ్యాపారి పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు పెన్సిడిల్ మందును సరఫరా చేసినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కోరుట్లకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ సైతం ఎక్కువ సంఖ్యలో పెన్సిడిల్ సిరప్‌లను సరఫరా చేసినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలో డ్రగ్ అధికారులు హోల్‌సేల్ వ్యాపారంపై అంతగా దృష్టి సారించకపోవడంతోనే ఈ అక్రమ వ్యాపారం సాగినట్లు భావిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ఈ అక్రమ దందా పట్టుబడడంతో ఔషధ నియంత్రణ అధికారులు జిల్లాలోనూ లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే పలువురు ప్రముఖులకూ ఇందులో ప్రమేయం ఉండడంతో చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ జరుపుతున్నాం..వెంకటేశ్వర్రావు, ఔషధ నియంత్రణశాఖ ఏడీ పెన్సిడిల్ అక్రమ రవాణాపై విచారణ జరుపుతున్నాం. మా డ్రగ్ ఇన్స్పెక్టర్లు హోల్‌సేల్ షాపులను తనిఖీ చేసి పెన్సిడిల్ మందుల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. తప్పులు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. -
కామారెడ్డి అటేనా!
కొత్త జిల్లాల ఏర్పాటు విషయం జిల్లాలో కలవరం రేపుతోంది. అసలే చిన్నగా ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి మరి కొన్ని మండలాలు ఇతర జిల్లాలలో కలుస్తాయని వినిపిస్తున్న వార్తలతో ప్రజలలో ఆందోళన మొదలైంది. అప్పుడే ఎవరు ఎటువైపు వెళతారనేది చర్చ కూడా జరుగుతోంది. నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ మొట్టమొదట ఇందూరు జిల్లాగా క్రీ.శ.1876లో ఏర్పడింది. అప్పుడు ఇందులో నిజామాబాద్, నిర్మల్, ఆ ర్మూర్, భీమ్‌గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ముథోల్, న ర్సాపూర్ తాలుకా కేంద్రాలు ఉండేవి. 1905లో జరిగిన జిల్లాల పునర్విభజనలో నిర్మల్, నర్సాపూర్ తాలుకాలు కొత్తగా ఏర్పడిన ఆదిలాబాద్ జిల్లా లో కలిశాయి. ఆదిలాబాద్ ప్రాంతంలోని ముథోల్, బాన్సువాడలోని కొం త భాగాన్ని నాందేడ్ జిల్లాలో కలిపారు. ఈ సమయంలోనే ఇందూరు ని జామ్ పేరుతో నిజామాబాద్ జిల్లాగా రూపాంతరం చెందింది. ఈ జిల్లా లో కేవలం ఐదు తాలూకాలు నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ ఉండేవి. 1931లో ఎల్లారెడ్డి, బోధన్ తాలుకాల నుంచి పలు గ్రామాలను విడదీసి బాన్సువాడను తాలూకాగా ఏర్పాటు చేశారు. 1956 లో నాందేడ్ జిల్లా మహారాష్ట్ర పరిధికి వెళ్లింది. అక్కడి దెగ్లూర్ తాలుకాలోని బిచ్కుంద, జుక్కల్ కేంద్రాలను నిజామాబాద్‌లో కలిపారు. 1958 లో మెదక్ జిల్లా నారాయణఖేడ్ తాలుకాలోని కొన్ని గ్రామాలను, మద్నూర్ ప్రాంతంలోని మరికొన్ని గ్రామాలను తీసుకుని మద్నూరు తాలుకాను ఏర్పాటు చేశారు. 1979 డిసెంబర్ నెలలో కామారెడ్డి తాలుకాలోని కొన్ని గ్రామాలను విడదీసి దోమకొండ కేంద్రంగా, ఆర్మూర్‌లోని కొన్ని గ్రామాలను విడదీసి భీమ్‌గల్ పేరుతో కొత్త తాలుకాలను ఏర్పర్చారు. వీటితో కలుపుకొని నిజామాబాద్ జిల్లాలో తాలుకాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. తరువాత ఇవి 36 మండలాలుగా విడిపోయాయి. ఇప్పుడిలా! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సర్కారు కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇందుకోసం రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఏడు జిల్లాలను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. మెదక్ జిల్లాలోని సిద్ధిపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. ఈ జిల్లా పరిధిలోకి నిజామాబాద్‌లోని కామారెడ్డి డివిజన్ బదిలీ కానుందని తెలుస్తోంది. ఈ డివిజన్లోని ఏడు మండలాలు ఆ జిల్లా పరి ధికి వెళ్తాయని సమాచారం. దీంతో జిల్లాలోని 36 మండలాలలో ఏడు మండలాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కామారెడ్డినే జిల్లా కేంద్రంగా చేయాలని కొంత కాలంగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తే కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలు జగిత్యాలకు బదిలీ అవుతాయని భావిస్తున్నారు. అవసరమైతే భీమ్‌గల్ మండలాన్ని చేర్చే విషయం కూడా పరిశీలిస్తారని అంటున్నారు. దీంతో నిజామాబాద్ అతి చిన్న జిల్లాగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. -
‘కామారెడ్డి’ కోసం కొట్లాడుదాం
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పునర్విభజిస్తే కామారెడ్డికేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనోద్యమ స్ఫూర్తితో జిల్లా ఏర్పాటు కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని నిర్ణయించారు. స్థానిక మండల పరిషత్ సమావేశమందిరంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహిం చారు. టీ జేఏసీ డివి జన్ కన్వీనర్ జి.జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సత్తా, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు టీటీఎఫ్, టీఎల్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ తదితర సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చివరకు పలు తీర్మాణాలు చేశారు. కామారెడ్డిని మెదక్‌లో కలుపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తీర్మాణించారు. కామారెడ్డి జిల్లాకేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా సాధన కోసం ‘కామారెడ్డి జిల్లా సాధన సమితి’ అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీలు, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల భాగస్వామ్యంతో సాధన సమితి పోరాడుతుందన్నారు. తొలిదశలో ఆర్డీఓ, కలెక్టర్, ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందించడం, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల్ని చైతన్యవంతం చేయడం చేపట్టాలని తీర్మాణించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాను సాధించేందుకు ముందుకు సాగుదాం. జిల్లా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారిని చైతన్యపర్చడం, ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తూ ఒత్తిడి తేవడం, చివరగా ఉద్యమానికి సన్నద్ధం కావడం ద్వారా జిల్లాను సాధించుకుందాం. -జి.జగన్నాథం, జేఏసీ డివిజన్ కన్వీనర్ కొట్లాడి సాధించుకోవాలె కామారెడ్డిని జిల్లా చేసుకోవడం కోసం జరిగే ప్రతీ ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుంది. జిల్లా కావడానికి అన్ని రకాలుగా కామారెడ్డి సౌలభ్యంగా ఉంది. ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. జిల్లా సాధన కోసం జరిగే ఏ ఉద్యమంలోనైనా సంపూర్ణ సహకారంతో పాల్గొంటాం. -బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు -
మేడే రోజే కార్మికుడిపై దౌర్జన్యం
కామారెడ్డి, న్యూస్‌లైన్ : ప్రపంచ కార్మిక దినోత్సవం రోజునే ఓ కార్మికుడిపై అధికారి చేయిచేసుకున్న సంఘటన గురువారం ఉదయం కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో అద్దె బస్సును తనిఖీ చేస్తున్న సమయంలో డిపో మేనేజర్ జగదీశ్వర్ బస్సు అపరిశుభ్రంగా ఉందంటూ డ్రైవర్ ఎండీ మజీద్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో విస్తుపోయిన డ్రైవర్ ఎందుకుసార్ ఇలా కొడతారని ప్రశ్నించగానే మరోసారి చెయ్యి చేసుకున్నారు. దీంతో డ్రైవర్ బస్సును డిపోలోనే నిలిపివేసి తోటి అద్దె బస్సు డ్రైవర్లు, యూనియన్ల నేతలకు సమాచారం అందించారు. అద్దె బస్సు డ్రైవర్లు వచ్చి కొంతసేపు ఆందోళన చేశారు. బాధితుడు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ సంఘటనపై కార్మికులు, డీఎం మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరిగాయని సమాచారం. డిపో మేనేజర్ కార్మిక దినోత్సవం రోజునే కార్మికుడిపై దౌర్జన్యం చేసిన సంఘటన కార్మికుల్లో ఆగ్రహం తెప్పించింది. అద్దె బస్సు తనిఖీ సమయంలో బస్సులో లోపాలుంటే సంబంధిత వాహనం యాజమానికి నోటీసు ఇవ్వడమో, ఇంకా ఏదైనా ఫైన్ వేయడమో చేయాలని, ఇలా డ్రైవర్‌పై చేయి చేసుకోవడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. డీఎంను సస్పెండ్ చేయాలి మేడే రోజున కార్మికుడిపై అకారణంగా దాడి చేసిన డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ఎన్ ఆజాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన డీఎంపై చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్‌ను కొట్టాననేది అవాస్తవం -డీఎం జగదీశ్వర్, కామారెడ్డి బస్సు ఫిట్నెస్ను పరిశీలించగా ఎన్నో లోపాలు కనిపించాయి. లోపాలను ఎత్తిచూపి సదరు వాహనం డ్రైవర్‌ను మందలించాను. అయితే ఆ డ్రైవర్ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు ఆరోపణ చేశారు. మందలించిన పాపానికి చేయిచేసుకున్నానని దుష్ర్పచారం చేస్తున్నారు. -
‘అన్నల’ ఊరు.. మారెను చూడు
కామారెడ్డి, న్యూస్‌లైన్: జిల్లాలోని మాచారెడ్డి మండలంలో మారుమూలన ఉన్న ‘మద్దికుంట’ చరిత్ర ఇది. ఈ గ్రామాన్ని అప్పటి పీపుల్స్‌వార్ నాయకత్వం విముక్తి గ్రామంగా ప్రకటించుకుని తమ మార్కు అభివృద్ధి నమూనాను అమలు చేసింది. పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీగా మారిన తరువాత కూడా రాష్ట్ర కమిటీతోపాటు, కేంద్ర కమిటీ నేతలు సైతం మద్దికుంటలో రోజుల తరబడి మకాం వేసేవారు. అంతర్జాతీయ విప్లవ సంస్థల ప్రతినిధులు సైతం మద్దికుంటకు వచ్చేవారు. ఆ ఊరి ప్రజలు కూడా అందరిదీ ఒకే మాట, ఒకే బాటగా నడుచుకుంటూ ముం దుకు సాగారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. 2005 తరువాత మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడం తో మద్దికుంట అన్ని గ్రామాలలాగే రాజకీయ కార్యకలాపాలకు వేదికైంది. అక్కడ అన్ని పార్టీలకు చెందిన వాళ్లు ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రూపు ాజకీయాలకు ఆ గ్రామం ఇప్పుడు నిలయంగా మారడం ఆందోళన కలిగి స్తోంది. ‘‘అన్నలున్నపుడే మా ఊరు మంచిగుండె. ఇప్పుడు తాగుడుకు బాగా అలవాటు పడి ఒకనిమీద ఒకరు లొల్లులకు దిగున్నరు’’ అంటూ గ్రామానికి చెందిన 70 వృద్ధుడొకరు గతాన్ని గుర్తు చేసుకున్నారు. రెండు దశాబ్దాలు అన్నల చేతులలో 1982 ప్రాంతంలో అప్పటి పీపుల్స్‌వార్ నేత శీలం నరేశ్ అలియాస్ జగన్ నేతృత్వంలో నక్సల్స్ కార్యకలాపాలు మొదలయ్యాయి. అటవీ అధికారు ల వేధింపులు,పెత్తందారుల ఆగడాలకు అడ్డుపడింది. అప్పటి నుంచి మద్దికుంట ప్రజలు నక్సల్స్‌కు కొం త అనుకూలంగా మారారు. అప్పు డు వారు ప్రజల పాలన ఎలా ఉం టుందోనన్న విషయాన్ని అర్థం చేయించారు. ఆ రోజు మొదలైన అన్నల పాలన రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. ఎందరో మావోయిస్టు నేతలు ఆ గ్రామంతో సంబంధాలు నెరిపారు. వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగా యి. నక్సలైట్లకు సహకరిస్తున్నారంటూ పోలీసులు గ్రామంపై వందల పర్యాయాలు విరుచుకుపడి దొరికినవారిని దొరికినట్టు చితకబాదేవారు. వివిధ కేసులలో 250 మందికి పైగా అరెస్టయ్యారు. ఇంటికొకరు ఏదోరకంగా ఇబ్బందిపడ్డవారే. ఒకసారి ఓ మిలిటెంట్‌ను పోలీసులు పట్టుకెళుతుంటే గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్న సందర్భంలో 72 మందిపై కేసులు నమోదయ్యాయి. మరో సందర్భంలో 91 మందిపై కేసులు పెట్టారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో అమలు చేయడం మొదలైంది. మొదట్లో విద్యాభివృద్ధికి కృషి జరిగింది. పాఠశాలకు స్థలం లేకపోవడంతో గ్రామస్థుల సహకారంతో రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అదనపు గదులు నిర్మించడానికి ప్రజలు శ్రమదానం చేశారు. అన్నల హవా కొనసాగిన కాలంలోనే గ్రామంలో పదో తరగతి వరకు పాఠశాల అప్‌గ్రేడ్ జరిగింది. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండడంతో విద్యా వాలంటీర్లను నియమించుకున్నారు. సబ్‌స్టేషన్ కోసం శ్రమదానం లోవోల్టేజీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే వారు. విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల ప్రజలు అప్పటి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ద్వారా అప్ప టి సీఎం ఎన్టీఆర్‌ను కలిశారు. తాము శ్ర మదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సబ్‌స్టేషన్ మంజూరు చేయాలని విన్నవించుకున్నారు. దీంతో ప్రభుత్వం సబ్‌స్టేషన్ మంజూరు చేసింది. స్తంభాలకు గుంతలు తీయడం, లాగడం, స్తంభాలను తరలించడం వంటి పనులన్నీ ప్రజలు శ్రమదానంతో చేపట్టారు. దీంతో ఆ గ్రామంలో లోఓల్టేజీ సమస్య తీరింది. గ్రామంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. పశువులకు నీటితొట్టెలు నిర్మించారు. పంట పొలాలకు వెళ్లడానికి రోడ్డు వేయించారు. రైతుల కోసం సొసైటీ ఏర్పాటు మద్దికుంటలో అధిక శాతం రైతులు పేద, మద్య తరగతివారే. వ్యవసాయానికి పెట్టుబడులు కూడా దొరకని పరిస్థితులు ఎదుర్కొనేవారు. అప్పుడు పీపుల్స్‌వార్ నాయకత్వం గ్రామంలో ఓ సొసైటీని ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేసింది. పంట చేతికొచ్చిన తరువాతనే డబ్బులు చెల్లించేలా చూసేవారు. తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలిగింది. ప్రతీ సీజన్లో గ్రామానికి ఆరు లారీల ఎరువులు తీసుకువచ్చేవారని గ్రామస్థులు తెలిపారు. ప్రతీ రైతుకూ నాలుగు, ఐదు బస్తాల ఎరువు అందేదన్నారు. ఎరువుల కోసం కామారెడ్డికి వెళ్లి ఇబ్బందులు పడే పరిస్థితులు లేకుండా ఇంటిదగ్గరే దొరికేవని పేర్కొన్నారు. గ్రామంలో పేద రైతులకు సాగునీటి వసతి కల్పించేందుకుగాను నలుగురైదుగురికి కలిపి ఒక బోరు వేయించి మోటార్ బిగించి ఆదుకున్నా రు. ఇలా గ్రామంలో నాలుగైదు బోర్లు తవ్వించడం ద్వారా 20 మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. ఎన్నికల బహిష్కరణలో రికార్డు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగినపుడల్లా నక్సల్స్ పిలుపు మేరకు గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించేవారు. పోలీసులు గ్రామానికి వెళ్లి ప్రజలపై ఒత్తిడి తెచ్చే వారు. ఎన్నికలకు ముందు రోజే గ్రామస్తులు పొలాల వద్దకు పరుగులు తీసేవారు. కొన్ని సందర్భాలలో పోలీసులు బలవంతంగా ఓట్లేయించేవారు. 2006 వరకు ఏకగ్రీ వంగా పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలను ఎన్నుకునేవారు. -
ఇద్దరు మిత్రుల బలవన్మరణం
చిలకలగూడ, న్యూస్‌లైన్: కలిసి చదువుకున్న ఇరువురు స్నేహితులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వీరి మృతి మిస్టరీగా మారింది. చిలకలగూడ పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మెదక్‌జిల్లా దౌలతాబాద్ మండలం రామసాగర్‌కు చెందిన చంద్రమౌళి కుమారుడు బిక్కుమళ్ల సంపత్ (27), నిజామాబాద్జిల్లా కామారెడ్డికి చెందిన శ్రీనివాస్ కుమారుడు కొత్త సంపత్‌కుమార్ (27)లు నగరంలో ఎంబీఏ చదువుకున్నారు. ఆ సమయంలో పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారారు. చదువు పూర్తయ్యాక సంపత్ మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండగా, కంప్యూటర్ కోర్సులు చదవిన సంపత్‌కుమార్ బేగంపేటలోని సెల్యుజెనిక్ సంస్థలో స్టాఫ్‌వేర్ ఇంజినీర్‌గా చేరాడు. వారాసిగూడ అంబర్‌నగర్‌లోని ముకుందం ఇంటి పెంట్‌హౌస్‌ను ఆరునెలల క్రితం సంపత్ అద్దెకు తీసుకుని ఉంటుండగా, సంపత్‌కుమార్ తన సోదరుడు సతీష్‌తో కలిసి చింతల్లో ఉంటున్నాడు. చింతల్నుంచి బేగంపేట దూరం కావడంతో పదిరోజుల క్రితం అంబర్‌నగర్‌లోని సంపత్ గదికి వచ్చి ఉంటున్నాడు. సోమవారం ఉదయం సంపత్ బంధువులతో కలిసి షాపింగ్‌కు వెళ్లి మధ్యాహ్నం 1.30కి గదికి వచ్చాడు. గజ్వేలులో ఉంటున్న సంపత్ సోదరుడు 2.30కి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి అదేప్రాంతంలో ఉంటున్న బాబాయ్ రాజును సంపత్ వద్దకు పంపాడు. తలుపు తట్టినా తీయకపోవడంతో రాజుకు అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఇద్దరూ అపస్మారకస్థితిలో కనిపించారు. స్థానికుల సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా సంపత్ చనిపోయి ఉన్నాడు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సంపత్‌కుమార్ ను గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతు మృతిచెం దాడు. గోపాలపురం ఏసీపీ వసంతరావు, చిలకలగూడ డీఐ ఖాజామొయినుద్దీన్ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మూడురోజుల్లో మెడికల్‌షాప్ ప్రారంభం.. మరో మూడురోజుల్లో గజ్వేల్‌లో మెడికల్‌షాపు ప్రారంభించేందుకు బిక్కుమళ్ల సంపత్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగావిలపిస్తున్నారు. ఏడాదికి రూ. 8 లక్షలకు మరో కంపెనీ ఆఫర్.... కొత్త సంపత్‌కుమార్‌కు మరో కంపెనీ నుంచి ఏడాదికి రూ. 8 లక్షల జీతంతో మంచి ఆఫర్ వచ్చింది. ఈనెల 25వ తేదీలోగా చేరాలంటూ ఆఫర్ లెటర్ అందింది. ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరుడు సతీష్కుమార్కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే కాగా తండ్రి శ్రీనివాస్ క్లాత్ మర్చంట్. మిస్టరీగా మారిన ఆత్మహత్యలు.... సంపత్, సంపత్‌కుమార్‌లు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అనేది మిస్టరీగా మారింది. ఇద్దరూ విద్యావంతులే. తమ ఫీల్డ్స్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆరాటపడేవాళ్లే. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడవలసిన ఆగత్యం ఏమోచ్చింది? తలుపులు లోపలకు వేసుకున్నారంటే ప్రాణాలు తీసుకునేందుకే అనేది స్పష్టం అవుతోంది. ఉదయం వరకు బంధువులతో షాపింగ్ చేసిన సంపత్ గదికి వచ్చిన తర్వాత స్నేహితునితో కలిసి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు గదిలో ఏం జరిగింది అనేది తెలియడంలేదు. ఇరువురు ఉపయోగించిన మూడు సెల్ఫోన్లు కాల్‌డేటా ఆధారంగా మిస్టరీని ఛేదించేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, బిక్కుమళ్ల సంపత్ మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాలకు తన ఫోన్ నుంచి తన ఫోన్‌కే ఓ ఎస్ఎంఎస్ పంపుకున్నాడు. అందులో ‘ఇంట్లో గొడవలు తగ్గిపోవాలన్పది నా చివరి కోరిక.. మనీకి కాదు మనుషులకు విలువ ఇవ్వాలి’ అని ఉంది.