Kariff season
-
ఖరీఫ్ సీజన్: దండిగా యూరియా
ఖరీఫ్ సీజన్‌కు ముందే వ్యవసాయానికి అవసరమైన ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో జూన్ నెల్లోనూ జలవనరులు తొణికిసలాడుతున్నాయి. జిల్లాలో ముందస్తుగా ఎడగారు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో సాగు విస్తీర్ణం చాలా తక్కువ. అయినా ఎరువుల కొరత రైతాంగాన్ని పట్టి పీడించేది. గతంతో పోల్చుకుంటే.. జిల్లాలో గడిచిన మూడేళ్లలో ఖరీఫ్, రబీ సీజన్లలో మూడింతల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసింది. సాక్షి,నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో 2022 ఖరీఫ్ సీజన్ ముందస్తుగానే ప్రారంభమవుతోంది. ఇప్పటికే సాగు విస్తీర్ణం అంచనాకు అనుగుణంగా విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయశాఖ తాజాగా అవసరమైన మేరకు ఎరువులు కూడా సిద్ధం చేస్తోంది. వ్యవసాయానికి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందే గత నెల్లోనే పెట్టుబడి సాయంగా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద రూ.7,500 జమ చేసింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎడగారుకు ముందుగానే ఎరువుల నిల్వలు ఉంచాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. 109 సొసైటీల ద్వారా సరఫరా జిల్లాలో 561 ఆర్బీకేల ద్వారా ఎరువులను గ్రామాల్లోనే రైతులకు సరఫరా చేస్తుంటారు. జిల్లాలో 470 ప్రైవేట్ డీలర్స్ కూడా ఎరువుల విక్రయాలు చేస్తున్నారు. తాజాగా జిల్లాలో వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న మార్క్‌ఫెడ్ సంస్థ పరిధిలో 109 సొసైటీల ద్వారా కూడా రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వివిధ రకాల ఎరువులను సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రబీ ముగిసిన తర్వాత ఖరీఫ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఎరువుల సమస్య రాకుండా నిల్వ చేశారు. జిల్లాలో యూరియా 18 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 5 వేల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,700 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 13 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2 వేల మెట్రిక్ టన్నులు చొప్పున 39,700 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఎరువులు అవసరం అవుతాయని అంచనా. మరో 32 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల ఈ వారంలో రానున్నాయి. ప్రతి నెలా 20 వేల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల వరకు అవసరానికి అనుగుణంగా జిల్లాకు పంపిణీ చేస్తున్నారు. ఎరువుల కొరత ఎక్కడా లేదు జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి నెలా కావాల్సినంత ఎరువులు జిల్లాకు వస్తున్నాయి. ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ నెలకు కావాల్సిన స్టాక్ కన్నా ఎక్కువగానే నిల్వ ఉంది. రైతులు ఎవరూ ఎరువులు లేవనే అసత్య ప్రచారాలు నమ్మవద్దు. రైతులకు ఎక్కడకు వెళ్లినా ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. – సుధాకర్‌రాజు, జేడీ వ్యవసాయశాఖ -
వరదొచ్చేదాకా ... ఎదురుచూపే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది విస్తారంగా కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదలతో ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై భారీ ఆశలే నెలకొన్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ఖాళీ అవగా నైరుతి రుతుపవనాల రాక సకాలంలో ఉంటుందన్న అంచనాలు రాష్ట్రానికి ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు బేసిన్ల పరిధిలో 525 టీఎంసీల లోటు ఉండగా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే సకాలంలో సమృద్ధిగా కురిసే వానలపై భవిష్యత్తు ఆధారపడి ఉంది. వరదలొస్తేనే ప్రాజెక్టులకు ఊతం.. రాష్ట్రంలో ఖరీఫ్, యాసంగి సాగు అవసరాలకు భారీగా నీటి వినియోగం చేయడంతో ప్రాజెక్టులు నిండుకున్నాయి. అంతకుముందు ఏడాదులతో పోలిస్తే నిల్వలు కొంత మెరుగ్గానే ఉన్నా అవి తాగునీటికి తప్ప సాగు అవసరాలను తీర్చలేవు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకుగాను ప్రస్తు తం 327 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో ప్రస్తుతం 172 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా ఇందులో కనీస నీటిమట్టాలకు ఎగువన ఉన్నది కేవలం 35 టీఎంసీలే. ఈ నీటినే జూలై చివరి వరకు రాష్ట్రం వినియోగించుకోవాల్సి ఉంది. ఇక శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను కేవలం 35 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిండాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లోనే 210 టీఎంసీల నీటి కొరత ఉంది. అవి నిండితే కానీ శ్రీశైలానికి వరద కొనసాగే పరిస్థితి లేదు. గతేడాది భారీ వరదల కారణంగా జూలైలోనే 220 టీఎంసీల మేర నీరొచ్చింది. ఈ ఏడాది సైతం అలా వస్తేనే శ్రీశైలం నిండే అవకాశం ఉంది. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీల్లో) -
ఎత్తిపోతలు మొదలైనా చేరని పుష్కర జలాలు
సాక్షి, తుని(తూర్పు గోదావరి): ఖరీఫ్‌లో సకాలంలో వరినాట్లు వేద్దామని భావించిన రైతులకు నిరాశే మిగులుతోంది. ఈ నెల మొదట వారంలో వేసిస నారుమళ్లు సాగునీటి ఎద్దడితో ఎండిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు, రిజర్వాయర్లలో చుక్కనీరులేక వెలవెలబోతున్నాయి. ఈ నెల పదో తేదీన పురుషోత్తంపట్నం వద్ద పుష్కర ఎత్తిపోతలు పథకాన్ని ప్రారంభించినా మెట్టప్రాంతానికి గోదావరి జిలాలు చేరనేలేదు. వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్ నాట్లు సాధ్యమవుతాయని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వివిధ దేవాలయాల్లో వేదపండితులు, అర్చకులు వర్షాలు కురవాలంటూ వరుణ జపాలు, విరాటపర్వం పారాయణాలు చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తేనే ఈ సంవత్సరం ఖరీఫ్ గట్టెక్కుతుందని రైతులు అంటున్నారు. నియోజకవర్గంలో 29 వేల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉంది. ఇందుకు పంపా, తాండవ రిజర్వాయర్లతో పాటు పుష్కర ఎత్తిపోతలు, పిఠాపురం బ్రాంచి కెనాల్, చెరువులు, విద్యుత్ బోరుబావులతో పాటు వర్షాధారం సాగునీరు అందాల్సి ఉంది. ఏటా మెట్ట ప్రాంతంలో రైతులు జూన్‌లో తొలకరి వర్షాలకు నారుమళ్లు, జూలైలో వర్షాలకు వరినాట్లు వేస్తున్నారు. అందుకు భిన్నంగా ఈ సంవత్సరం వర్షాలు పూర్తి స్థాయిలో కువలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు ఆరుతడి పంటలతో పాటు రైతులు వరినార్లు వేశారు. డెడ్ స్టోరేజీల్లో రిజర్వాయర్లు నియోజకవర్గంలో తొండంగి మండలానికి పంపా రిజర్వాయర్, కోటనందూరు మండలానికి తాండవ రిజర్వాయర్లు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తుని మండలంలో కొంత భాగానికి పుష్కర జలాలు, మరికొంత భాగానికి తాండవ జలాలు, మిగిలిన భూములను చెరువులు, విద్యుత్ బోర్ల ఆధారంగా సాగుచేస్తున్నారు. తొండంగి మండలంలో 13500 ఎకరాలకు సాగునీరు అందించే పంపా రిజర్వాయర్ నుంచి విడుదల చేసేందుకు చుక్కనీరు అందుబాటులో లేదు. 105 అడుగుల నీటి నిల్వ సామార్థ్యం గల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటాయి. భారీ వర్షాలు, పుష్కర జలాలు చేరితేనే పంపాకు జల కళ వస్తుంది. అప్పుడు ఆయకట్టుకు సాగునీరు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కోటనందూరు మండలంలో తొమ్మిది వేల ఎకరాలకు తాండవ రిజర్వాయర్ నుంచి సాగునీరు చేరాల్సి ఉంది. 380 అడుగుల నీటి నిల్వ సామార్థ్యం గల రిజర్వాయర్‌లో 345 అడుగుల నీరు ఉంది. డెడ్ స్టోరేజీ 340 కంటే ఐదు అడుగులు నీరుంది. దిగువకు విడుదల చేసేందుకు అవసరమైన నీటి నిల్వలు లేవు. వర్షాధారంగానే తాండవ జలాశయంలోకి నీటి నిల్వలు చేరాల్సి ఉంది. భారీ వర్షాలు కురిస్తేనే తాండవకు జల కళ వస్తుంది. ఆ నీటినే దిగువకు విడుదల చేయాల్సి ఉంది. తుని మండలంలో సాగునీటి పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. పుష్కర కాలువ ద్వారా 6500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా గత ఐదేళ్లలో రెండు వేల ఎకరాలకే నీరు ఇస్తున్నారు. తాండవ నుంచి డి.పోలవరం చెరువుకు నీరు చేరడం ద్వారా ఆయకట్టుకు నీరు అందుతుంది. ఇప్పుడా పరిస్థితులు సన్నగిల్లాయి. తాండవలో చుక్కనీరు లేకపోవడం, వర్షాలు కురవకపోవడంతో సాగునీటి జాడ కనిపించడంలేదు. మండలంలో 77 చెరువులు ఉన్నా 70 చెరువులు ఎండిపోయాయి. ఎటుచూసినా నీటి అవసరాలు తీరే మార్గం కనిపించడంలేదని రైతులు వాపోతున్నారు. అన్నిటికి ఒక్కటే పరిష్కారంగా భారీ వర్షాలు కురవాలని రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వరుణుడు కరుణిస్తేనే.. సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నా వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్ సాగు చేయగలం. పుష్కర ఎత్తిపోతల నుంచి నీరు విడుదలైనా పూర్తి స్థాయిలో పంట పొలాలకు చేరదు. వర్షాలు కురిస్తే కొంత మేరకు రైతులందరికీ సాగునీరు లభిస్తుంది. భారీ వర్షాలు కురిస్తేనే పుష్కర, తాండవ, పంపా రిజర్వాయర్లకు జలకళ వస్తుంది. – పి.మాణిక్యాలరావు, రైతు, టి.తిమ్మాపురం వారంలో పుష్కర జలాలు ఈ నెల పదో తేదీన పుష్కర ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల్లో 50 కిలో మీటర్ల వరకూ కాలువకు నీరు వచ్చింది. వారం రోజుల్లో తుని మండలానికి పుష్కర జలాలు చేరుతాయి. పంపా రిజర్వాయర్‌కు నీరు మళ్లించి తొండంగి, తుని మండలాలకు సాగునీరు అందిస్తాం. – డి.సూర్యనారాయణ, పుష్కర ఏఈ. తుని -
ఖరీఫ్సాగు ప్రశ్నార్థకమేనా?
సాక్షి, ధరూరు: వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. వాస్తవానికి మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలోనే ఏటా సమృద్ధిగా వర్షాలు కురిసి ఈపాటికే నెలరోజుల పంట సాగయ్యేది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఒక్క ఎకరంలో కూడా పంటసాగును చేయలేకపోయారు. ఇప్పటికే పంటపొలాలను దున్నుకొని సిద్ధం చేసుకున్న రైతులు ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసుకొని వరుణదేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఊరిస్తున్న మబ్బులు.. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు కురుస్తూ రైతులను ఊరిస్తున్నాయి. ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుంది. ఆరుతడి పంటలతో పాటు మెట్టపంటల సాగును చేసుకునేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక్క భారీ వర్షం కూడా కురవకపోవడంతో ఎటు చూసినా వ్యవసాయ పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. ఏ రైతును కదిలించినా దీనగాథలే బయటకు వస్తున్నాయి. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. భూగర్భ జలాలు కూడా రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల్లో నుంచి నెలరోజుల క్రితం వరకు రెండు ఈంచుల నీళ్లు వచ్చే బోర్లు, ఒక్క నెలరోజుల వ్యవధిలోనే ఈంచు, అర ఈంచుకు తగ్గిపోయాయి. దీంతో పంటలను సాగు చేసుకునేందుకు బోరుబావులు ఉన్న రైతులు కూడా ముందుకు రావడం లేదు. ధైర్యం చేసి కొంతమంది రైతులు సీడ్‌పత్తి పంటను సాగు చేసుకున్నారు. బోర్లలో రోజురోజుకు నీళ్లు తగ్గుముఖం పడుతుండటంతో వేలాది రూపాయలు ఖర్చుపెట్టి సాగుచేసిన పత్తి పంటపై కూడా రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమయ్యే సబ్సిడీ ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులోకి తేలేదు. మరో పది పదిహేను రోజులు ఇదే గడ్డు పరిస్థితి ఉంటే ఖరీఫ్ పంటసాగు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవకపోవడంతో జూరాలకు సైతం నీళ్లు రాలేదు. ప్రాజెక్టుకైనా నీళ్లు వచ్చి ఉంటే నెట్టెంపాడు ఎత్తిపోతల పంపుల ద్వారా రిజర్వాయర్లను నింపి కాస్తో, కూస్తో పంటలను సాగు చేసుకునే వారమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో తమ పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైందని వాపోతున్నారు. -
ప్రత్యామ్నాయం వైపు..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : వరుణుడు కరుణించడం లేదు. ఖరీఫ్ సీజను ప్రారంభమై పక్షం రోజులు గడిచినా వర్షం జాడ లేకుండా పోయింది. రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారు. కనీసం లోటు వర్షపాతం కాదు, ఏకంగా డ్రైస్పెల్ నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మోస్రా మండలంలో ఈ సీజనులో కనీసం జల్లులు కూడా పడలేదని వర్షపాతం రికార్డులు పేర్కొంటున్నాయి. అలాగే మిగిలిన 28 మండలాల్లోనూ డ్రైస్పెల్ కొనసాగుతోంది. కరువుకు సంకేతాలుగా చెప్పుకునే డ్రైస్పెల్ కొనసాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా సాధారణ సగటు వర్షపాతం 1,042 మిల్లీమీటర్లు. ఈనెల 19 వరకు సగటున 111 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉంది. కేవలం 10 మిల్లీ మీటర్లు మాత్రమే వర్షపాతం రికార్డు అయ్యింది. మోస్రా, కోటగిరిల్లో అసలు వర్షమే కురవలేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశం జిల్లాలో డ్రైస్పెల్ కొనసాగుతుండటంతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈనెలారులోగా వర్షాలు కురవకపోతే చేపట్టనున్న ప్రణాళికను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా ఏరువాక శాస్త్రవేత్తలను సంప్రదించారు. ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాని పక్షంలో రైతులకు ఆరుతడి పంటల విత్తనాల సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఆందోళనలో రైతన్నలు.. వరుణుడి జాడ లేకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్‌లోనూ ఆశించిన మేరకు వర్షం కురవలేదు. దీనికి తోడు ఎండల తీవ్రతకు భూగర్భజలాలు కూడా అడుగంటి పోయాయి. సీజను ప్రారంభమై మూడు వారాలు దగ్గరపడుతున్నప్పటికీ చుక్క వర్షం కురవకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముదురుతున్న నారు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ముందుగా నాట్లు వేసుకుంటారు. వర్ని, బోధన్, ఎడపల్లి, నవీపేట్, కోటగిరి వంటి మండలాల్లో ముందుగా వరి నాట్లు వేస్తారు. ఈసారి కూడా చాలా మంది రైతులు నారుమడులు వేసుకున్నారు. ఈనెల 25లోగా నాట్లు వేసుకుంటేనే నారు పనిచేస్తుంది. లేనిపక్షంలో నారు పనికిరాకుండా పోతుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో నారు పోసి 15 నుంచి 20 రోజులవుతోంది. మరో వారం, పది రోజుల్లో వర్షాలు కురవకపోతే ఈ నారు పనిచేయకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులు.. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బోర్ల కింద సాగు చేసుకునే రైతులు నీటి వాడకం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బోర్ల వద్ద వరి సాగు చేసే రైతులు స్వల్ప కాలిక, మధ్యకాలిక రకాలను వేసుకోవాలని డాట్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. -
రుణ ప్రణాళిక ఎప్పుడో?
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతాంగం సిద్ధమైంది. ఇటీవల కొన్ని వర్షాలు పడడంతో కొందరు రైతులు విత్తనాలను విత్తుకోగా.. కొంతమంది భూములను చదును చేస్తూ విత్తనాలను వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో రైతులు పొలాల బాట పట్టారు. అయితే ఖరీఫ్ రుణ ప్రణాళిక మాత్రం జిల్లాలో ఇప్పటి వరకు ఖరారు కాకపోవడం రైతులకు శాపంగా మారింది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పంటల పెట్టుబడులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ఖరీఫ్ రుణ ప్రణాళిక ఆలస్యం చేయడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. ప్రతి ఏటా బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. గతేడాది కూడా రుణ లక్ష్యంలో 67 శాతం మాత్రమే పూర్తి చేశారు. రుణాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఖరీఫ్, రబీకి బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. 2.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు.. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ లక్ష్యం 2,35,213 హెక్టార్లు కాగా వీటిలో వరి, మొక్కజొన్న, జొన్న, కందులు, ఇతర అన్ని కలిపి 1,04,248 హెక్టార్లు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. 1,30,965 హెక్టార్లలో పత్తి పంట సాగుకానుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తనాలు వేశారు. వర్షాలు కురిస్తే మరింత జోరందుకోనుంది. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు, దాని అనుబంధ రంగాలకు రుణాలు అందించేందుకు గతనెల 30వ తేదీన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఎల్బీసీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి అన్ని జిల్లాల వార్షిక ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల రుణాలను కలిపి రూ.1.46లక్షల కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాకు సైతం గతేడాది లక్ష్యం కంటే 6 నుంచి 10 శాతం పెంచి ఆ నిధులను కేటాయించే అవకాశం ఉంది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, బ్యాంకుల వారీగా కేటాయించాల్సి ఉంటుంది. ఆ పనిలోనే అధికారులు నిమగ్నం అయినట్లు తెలుస్తుంది. ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గతేడాది రూ.1874.13కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకోగా వాటిలో రూ.1,255.66కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. అంటే 67శాతం మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాదైనా లక్ష్యం పూర్తవుతుందా వేచి చూడాలి. రుణం కోసం ఎదురుచూపులు ఖరీఫ్ సాగు జిల్లాలో ఇప్పుడిప్పుడే జోరందుకుంది. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా రూ.5 వేలు ఇవ్వడం పెట్టుబడికి రైతులకు కొంత ఉపశమనం ఉన్నప్పటికీ అవి సరిపోవడం లేదు. ఈ ఏడాది రైతుబంధు డబ్బులు ఇంకా ఖాతాల్లో జమ కాలేదు. దానికి తోడు పత్తి, మొక్కజొన్న, తదితర విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందు, కూలీల ధరలు విపరీతంగా పెరగడం వల్ల రైతులకు సాగు మరింత భారంగా మారింది. బ్యాంక్ అధికారులు స్పందించి వెంటనే రుణ ప్రణాళికను ఖరారు చేయాలని కోరుతున్నారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా జిల్లాలో పత్తిసాగు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. వర్షాలు కరిస్తే మరింత సాగు పెరిగే అవకాశం ఉంది. పంట రుణాలకు రాయితీలు రైతన్నలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి ఎకరాకు రూ.5వేల చెప్పున రైతుబంధు చెక్కుల పంపిణీని ప్రారంభించారు. అదే విధంగా రుణాల విషయంలోనూ రైతాంగానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అందించే పంట రుణాలకు వడ్డీ రాయితీలను వర్తింపజేస్తున్నాయి. స్వల్పకాలిక రుణాలు తీసుకొని, సకాలంలో తిరిగి చెల్లించే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా బ్యాంకులు పంట రుణాలకు 9శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇందులో రెండు శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకర్లకు చెప్పింది. అందుకు అన్ని బ్యాంకుల యాజమాన్యాలు సమ్మతించాయి. దీంతో 7 శాతానికికే రుణాలు అందిస్తున్నారు. రూ.1లక్ష లోపు రుణం తీసుకొని ఏడాది లోపు పూర్తి బకాయి చెల్లిస్తే వడ్డీ ఉండదు. 7 శాతం వడ్డీలో కేంద్రం 3శాతం భరిస్తుండగా, మిగిలిన 4 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. అదే విధంగా రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణం తీసుకొని దానిని సకాలంలో చెల్లిస్తే వడ్డీలో 4 శాతం రాయితీ రైతులకు అందుతుంది. అందులో 3శాతం కేంద్రం, ఒక్కశాతం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లిస్తుంది. చాలా మంది రైతులకు రుణ వడ్డీ రాయితీపై అవగాహన లేని పరిస్థితి ఉంది. ఈ ఏడాదైనా వ్యవసాయ అధికారులు గానీ బ్యాంకు అధికారులు గానీ రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
వానమ్మ.. రావమ్మా
సాక్షి, ఆదిలాబాద్: వానమ్మ.. రావమ్మా.. అంటూ తొలకరి వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో మృగశిర కార్తె ప్రవేశంతోనే రైతులు పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ చిన్నపా టి చినుకులు పడడమే తప్పా పెద్ద వర్షాల జాడలేదు. అయినా నీటివసతి ఉన్న రైతులు వితనాలు వేసేశారు. దీం తో మిగతా రైతులు ఆగమాగం అవుతున్నారు. ఒకరిని చూసి మరొకరు భూమిలో విత్తనం వేస్తున్నారు. ఇప్పటికే 20 నుంచి 30 శాతం మంది పత్తి విత్తనాలు పెట్టారు. ఇక వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండుమూడు రోజుల్లో వర్షాలు కురువని పక్షంలో పెట్టుబడిలోనే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అప్పటికి.. ఇప్పటికీ గతేడాది తొలకరి వర్షాలు రైతులను మురిపించాయి. పోయినేడు ఇదే సమయానికి 70 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. సాధారణంగా జిల్లాలో రైతులు పత్తి పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2 లక్షల హెక్టార్ల వరకు సాగయ్యే పరిస్థితి ఉండగా, అందులో పత్తి పంటనే 1.47 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఏడాది వర్షా ల రాక ఆలస్యం కావడంతో రైతులు పత్తి విత్తనా లు నాటడంలో డోలయాన పరిస్థితి కనిపిస్తోంది. నీటి సౌకర్యం ఉన్న కొంత మంది బడా రైతులు పత్తి విత్తనాలు నాటడంతో వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వారిని చూసి పలు వురు చిన్న, సన్నకారు రైతులు కూడా విత్తనాలు వేశారు. ఈ రెండుమూడు రోజులు వర్షాలు పడితే నే ఆ విత్తనం మొలకెత్తే అవకాశం ఉంది. లేదంటే భూమిలోనే విత్తు నాశనమయ్యే పరిస్థితి ఉంది. అంతా రెడీ.. వర్షాకాలం పంటలకు ముందు రైతులు సర్వం సిద్ధం చేసుకున్నారు. దుక్కులు దున్ని చదును చేశారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇం ట్లో పెట్టుకుంటున్నారు. వర్షాలు మంచిగ పడిన పక్షంలో పత్తి విత్తనాలు జోరుగా నాటే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తొలకరి ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ధైర్యం చేసి తెచ్చిన విత్తనాలను నాటితే వర్షాలు రాక చెయ్యికి అందదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విత్తనాలు నాటాల్సి వస్తోంది. అప్పటికీ వర్షాలు సహకరిస్తేనే రైతుకు మేలు జరుగుతుంది. ఏటా ప్రకృ తి వైపరిత్యాలతో కర్షకుడు ఏదో రీతిన నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది తొలకరి జోరుగా మురిపించగా, ఆ తర్వాత వర్షాలు ము ఖం చాటేయడంతో పెట్టుబడి గణనీయంగా పెరిగి రైతు ఆర్థిక పరిస్థితి కుదేలైంది. పంట చేతికొచ్చే సమయంలో అతివృష్టి కారణంగా పం టలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇసుక మేటలతో చేల్లు ధ్వంసమయ్యాయి. రైతులు నష్టపోయా రు. ఇలా రైతన్నను భారీ వర్షాలు అప్పట్లో దెబ్బతీ శాయి. సాహసం చేయడం పత్తి రైతుకు అలవా టైంది. ప్రధానంగా ఇప్పుడు విత్తనాలు నాటి వ ర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశంతో పత్తి విత్తనం నాటిన పక్షంలో సరైన స మయంలో పత్తికి పూత, కాత వస్తుందనే నమ్మకంతో రైతులు ఈ సమయంలో విత్తు నాటేందుకు సాహసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వరుణ దేవు డు కరుణిస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి ఉంది. తీవ్ర వర్షాభావం గతేడాదితో పోల్చితే ఈసారి తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్ మండలాల్లో తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. సాధారణ వర్షం కంటే –60 శాతం నుంచి –99 శాతం వరకు తక్కువ వర్షపాతం ఉంటే దానిని తీవ్ర వర్షాభావంగా పరిగణిస్తారు. ప్రస్తుతం పై మూడు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. –20 శాతం నుంచి –59 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని వర్షాభావ పరిస్థితిగా పరిగణిస్తారు. జిల్లాలోని బేల, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్‌లలో ఈ పరిస్థితి ఉంది. సాధారణ వర్షపాతం కంటే –19 శాతం నుంచి +19 శాతం వరకు వర్షం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇక సాధారణ వర్షపాతం కంటే +20 శాతం, అంతకంటే ఎక్కువ కురిస్తే దానిని అతివర్షపాతంగా పరిగణిస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఒక తాంసి, భీంపూర్ మండలాల్లోనే అధిక వర్షపాతం కురిసింది. స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి రుతుపవనాలు కేరళను తాకాయి. మనదగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండుమూడు మంచి వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు వేయాలి. తక్కువ వర్షపాతంలో విత్తనాలు వేయొద్దు. తేమ లేకపోవడంతో మొలక సరిగ్గా రాదు. సోయాబీన్‌ను జూలై 15 వరకు వేసుకోవచ్చు. వర్షాలు ఆలస్యంగా కురుస్తున్న దృష్ట్యా పత్తి, సోయా, తొగర్లు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. సోయాబీన్‌కు అంతరపంటగా తొగర్లను నాటడం ద్వారా ఒకవేళ సోయాలో నష్టపోయినా తొగర్ల ద్వారా రైతులకు కొంత లాభం జరుగుతుంది. పత్తి రైతులు వర్షాలు పడకముందే తొందర పడొద్దు. – సుధాన్షు, శాస్త్రవేత్త -
కోటి ఆశలతో
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలకరి పలకరింపుతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. సమృద్ధిగా పంటలు పండాలని ఆకాంక్షిస్తూ సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే దుక్కులు సిద్ధం చేసుకుంటున్న దృశ్యాలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశముందో అంచనా వేసిన ఆ శాఖ అధికారులు.. దీనికి అనుగుణంగా ఆయా పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది. గతేడాది తరహాలోనే ఈ సీజన్లోనూ 1.68 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావొచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను వాణిజ్య పంటైన పత్తి మినహా ఇతర పంటల విత్తనాలు సుమారు 26 వేల క్వింటాళ్లు అవసరమవుతాయని లెక్కగట్టారు. సబ్సిడీపై విత్తనాలు సిద్ధం పత్తి మినహా ఇతర పంటల విత్తనాలు రైతులకు సబ్సిడీ లభిస్తున్నాయి. పంటను బట్టి విత్తనాలపై సబ్సిడీ ధరలో మార్పులు ఉంటాయి. సోయాబీన్ క్వింటా ధర రూ.6,150 కాగా.. సబ్సిడీపై రూ.2,500 లకే రైతులకు అందజేశారు. అలాగే క్వింటా జీలుగ ధర రూ.5,150, రాయితీపై రూ.3,350కు విక్రయిస్తారు. జొన్న, కొర్రలు, సజ్జలు, అండ్రు కొర్రలు తదితర చిరుధాన్యాలపై 65 శాతం, వేరుశనగ, నువ్వులు, ఆముదంపై 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ విత్తనాలు అధికారుల వద్దకు చేరుకున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్), రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్కే), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) తదితర కేంద్రాల నుంచి రైతులు విత్తనాలు తీసుకోవచ్చు. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ పత్రాలను సమీప ఏఈఓను సంప్రదించి సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చు. ఏఈఓలు ఆన్లైన్లో జనరేట్ చేసిన టోకెన్‌ను రైతులు అందిస్తే సమీపంలోని పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే కేంద్రాల్లో ఇచ్చి విత్తనాలు కొనుగోలు చేయవచ్చు. పత్తి విత్తనాల ధర ఇలా.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలి. ఇతరులు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది నేరమే. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు పకడ్బందీగా వ్యహరిస్తున్నారు. అంతేగాక ఎమ్మార్పీకి మించి విక్రయించకూడదు. వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ధరను నిర్ణయించింది. 450 గ్రాముల తూకం కలిగిన బీజీ–1 విత్తనాలను రూ.635, బీజీ–2 విత్తనాలను రూ.730కు మాత్రమే రైతులకు అమ్మాలి. 15 రోజుల్లో ఎరువులు ఈ సీజన్లో సాగయ్యే పంటలకు సుమారు 1.03 లక్షల టన్నుల వివిధ రకాల రసాయనిక ఎరువులు అవసరం. రైతులు అత్యధికంగా యూరియా వినియోగిస్తున్నారు. వీటిని ఇప్పటికే రైతలకు అందుబాటులో ఉంచారు. -
అమ్మో.. జూన్!
కరీంనగర్‌ఎడ్యుకేషన్: జూన్ అంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.. ఇదే నెలలోనే విద్యాసంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. అటు స్కూల్ ఫీజులు, పుస్తకాలకు, ఇటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు కోసం డబ్బులు అవసరం అవుతాయి. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్, యూనిఫాంలు, పెన్నులు, పెన్సిల్ ఇతరత్రా వస్తువుల ధరల విపరీతంగా పెరిగిపోయాయి. వీటన్నింటిని పిల్లలకు సమకూర్చలేక సామాన్య ప్రజానీకం సతమతం అవుతున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం నానా తిప్పలు పడుతున్నారు. విత్తనాలు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు ఎలా సమకూర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అప్పుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పేద, మధ్య తరగతి కుటంబీకుల జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది. శనివారం నుంచి కళాశాలలు, ఈ నెల 12 నుంచి 2019–20 విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై విద్యార్థులు తల్లిదండ్రులు బేరీజు వేసుకుంటున్నారు. కొత్తగా పిల్లల్ని పాఠశాలలో అడ్మిషన్ తీసుకునేవారు ఆయా ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యాలు బెంబెలెత్తించేలా వసూలు చేస్తున్న అడ్మిషన్, డొనేషన్ ఫీజులను చూసి సామాన్య ప్రజలు జంకుతున్నారు. ఇదివరకే చదువుతున్న వారికి పుస్తకాలు, యూనిఫాం, బెల్ట్, టై, షూ, వాటర్‌బాటిల్స్, లంచ్‌బ్యాగు, పుస్తకాల బ్యాగు తదితర వస్తువుల కొనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడనుంది. దీంతో ‘అమ్మో.. జూన్’ అంటూ తలపట్టుకుంటున్నారు. ఒకవైపు తమ పిల్లలకు ఏ పాఠశాలలో చేర్పించాలి.. ఆయా పాఠశాలల్లో ఏయే స్థాయి ఫలితాలు వచ్చాయి.. అక్కడి వాతావరణం, ఫీజులు తదితర అంశాలపై పిల్ల ల తల్లిదండ్రులు విశ్లేషించుకుంటున్నారు. తమ ఆదాయ పరిమితి, చదువుకు ఖర్చు పెట్టేస్థాయి బేరీజు వేసుకుంటూ ఏ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించాలనే ఆలోచనలో కొందరు తలమునకలైతే.. ఇదివరకే చదువుతున్న పిల్లలకు ఈ యేడాది ఎంత ఖర్చు వస్తుందనే ఆలోచనతో మరికొందరు ఆందోళన చెందుతున్నారు. అప్పు చేసైనా పైసలున్న బడికి... జిల్లా వ్యాప్తంగా సుమారు 700కు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో వాటి విద్యాప్రమాణాలు, ఇతర అంశాలతో కూడిన స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి మొదలుకుని రూ.లక్షకు పైగా ఏడాది ఫీజులున్నాయి. అందులోనూ ఐఐటీ, ట్యూషన్, సాంస్కృతిక, కరాటే తదితర అంశాలు నేర్పించేందుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రైవేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని తోకల పేరుతో 1వ తరగతికే రూ.లక్షల్లో వసూలు చేయడం విశేషం. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పాఠశాలలైతే అధిక ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఏదేమైనా మరో పది రోజుల్లో బడిగంటలు మోగనున్న నేపథ్యంలో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అప్పు చేసైనా ప్రైవేట్ స్కూల్ అనేది వేళ్లూనుకుపోవడంతో దిగువ మధ్య తరగతి జనం కూడబెట్టుకున్న దానికి మరికొంత అప్పు చేసి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ప్రైవేట్‌పై మోజు.... పుట్టగొడుగుల్లా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రైవేట్ విద్యాసంస్థలు వెలుస్తున్నాయి. అందులో ఇంటర్నేషనల్, వరల్డ్, టెక్నో, ప్లేస్కూల్, డిజిటల్, టాలెంట్ ఇలాంటి వినూత్న పేర్లతో పాఠశాలలను నెలకొల్పుతున్నారు. తమ పాఠశాలలో అవి ఉన్నాయి.. ఇవి ఉన్నాయంటూ ప్రచారంలో అద్భుతాన్ని చూపుతూ.. తమ పాఠశాలల్లో చదివితే ఏదో తెలియని జ్ఞానం వస్తుందనేలా సామాన్య జనాన్ని మభ్యపట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు. దీని ఫలితంగా మధ్య తరగతి కుటుంబాలు సైతం ఆకర్షితులై వారి పిల్లల్ని ఎంతటి కష్టమైనా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అంచనాలపై తర్జన భర్జనా.. రెండు, మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ఖర్చులను అంచనా వేయడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టంగా మారింది. జూన్ వస్తుందంటే చాలా మంది నెల రోజుల ముందు నుంచే లెక్కలతో కుస్తీ పడుతుంటారు. తమ వద్ద ఉన్న డబ్బు ఎంత... కావాల్సింది ఎంత... అప్పులు ఎన్ని తీసుకురావాలి.. ఎవరి వద్ద తీసుకురావాలి... అనుకుని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఈ ఏడాది సదరు వ్యక్తుల అంచనాలు లెక్క తప్పుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. మారని విద్యాశాఖ తీరు... ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అధికార యంత్రాగం, పాలకులు మాత్రం ఎప్పుడెప్పుడు సర్కారు బళ్లను మూసేద్దామా..? అన్న తీరుగా వ్యవహరిస్తుండడం విశేషం. రేషనలైజేషన్ పేరుతో 2017–18 విద్యాసంవత్సరంలో జిల్లాలో 128 ప్రభుత్వ పాఠశాలలను మూసీవేయగా తాజాగా ఆ గూటికి మరికొన్ని పాఠశాలలు ఈ విద్యాసంవత్సరంలో చేరనున్నట్లు సమాచారం. అదే విధంగా విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు సమాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో నమ్మకం కోల్పోతున్న సగటు మధ్య తరగతి ప్రజలు అందుబాటులో సర్కారు విద్య లేకపోవడంతో గత్యంతరంలేక దిగువ మధ్య తరగతి కుటుంబాలు సైతం వారి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైతులకు ఖరీఫ్ భారం... ఏటా రైతులకు వ్యవసాయం చేయడం కూడా భారంగా మారుతోంది. ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండినా ధాన్యం డబ్బు చేతికి రాని దైన్య స్థితిలో రైతులు ఉన్నారు. వ్యవసాయ పనులు అంతంతా మాత్రం. ఇతరత్రా కూలీ పనులు దొరుకక గ్రామీణ ప్రాంతాల్లోని జనం ఉపాధి పనులకు వెళ్లారు. ఆ పనుల కోసం వెళ్లిన ప్రజలకు గత నాలుగు మాసాలుగా ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు సైతం అందకపోవడంతో గ్రామీణ ప్రజల పరిస్థితి గందరగోళంగా ఉంది. మండుతున్న ఎండల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రైతులు ఉపాధి పనులకు వెళ్లితే 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్‌కు కావాల్సిన ఎరువులు, విత్తనాల కోసం కావల్సిన డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా రుణాలు లభించక రైతులు అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పిల్లల చదువుల ఖర్చు వ్యవసాయ ఖర్చులు అంచనా వేయలేని స్థితి ఏర్పడడంతో పేద, మధ్య తరగతి కుటుంబీలకు తలలు పట్టుకుంటున్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయాలి: గట్టు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్(పునాస) సీజన్‌కు సంబంధించిన ప్రణాళికను వ్యవసాయ శాఖ తక్షణమే సిద్ధం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయడంలో తాత్సార్యం తగదని విమర్శించారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడు దల చేశారు. రైతులు అమ్మిన వరి ధాన్యానికి ప్రభుత్వం రూ.1,500 కోట్లు చెల్లించాలని కోరా రు. విత్తనాలు, ఎరువులు కొనటానికి డబ్బుల్లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయాలని కోరారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే కంపెనీలపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి వాటి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి రైతులకు ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని కోరారు. ఇప్పటికైనా రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
వాడుతున్న ఆశలు
► రైతుల్లో కలవరం.. ► వెంటాడుతున్న వర్షాభావం ► వాన కోసం ప్రత్యేక పూజలు ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు సరైన వర్షం లేక మొలక దశలోనే ముదిరిపోతున్నాయి. రాయదుర్గం డివిజన్ వ్యాప్తం గా 35,200 హెక్టార్లలో వేరుశనగ, 5వేల హెక్టార్లలో సద్ద, ఉలవ, జొన్న, ఆముదం, ఇతర చిరు ధాన్యాల పంటలు సాగైనట్టు వ్యవసాయాధికారుల రికార్డులు స్పష్టంచేస్తున్నాయి. మొలక వచ్చిన నాటి నుంచి సరైన పదును వర్షం కురవలేదు. దీనికితోడు గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తుండడంతో ఉన్న అరకొర తేమ సైతం ఒట్టిపోయింది. క్రమేణా ఉష్ణోగ్రతలు కూడా పెరిగి ఎండలు భగ్గుమంటుండటంతో కళకళలాడాల్సిన మొలక ముదిరిపోతోంది. అదిచూసిన అన్నదాతల్లో మళ్లీ కలవరం మొదలైంది. ఏ నలుగురు కలిసినా పసికందు లాంటి మొలకకు వర్షం పడి ఉంటే బాగుండేదని.. ఆ భగవంతుడు ఈ సారైన కష్టాలనుంచి గట్టెక్కిస్తాడో లేదోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురవాలని భజనలు, కప్ప ఊరేగింపు, బొడ్డురాయికి నీళ్లుపోయడం లాంటి పూజలను రైతులు చేస్తున్నారు. వారంలోగా పదును వర్షం కురిస్తే మొలక ఎదుగుదలకు దోహదపడుతుందంటున్నారు. -
‘రుణమాఫీ’కి కొత్త మెలికలు
* రెండో విడత నిధుల విడుదలపై అయోమయం * బోగస్ రైతులు, బినామీలు ఉన్నారంటూ మళ్లీ తనిఖీలు * వినియోగపత్రాలు ఇవ్వాలంటూ బ్యాంకులకు సర్కారు ఆదేశం * ఆ వివరాలు ఇస్తేనే ‘రెండో విడత’ నిధులిస్తామని స్పష్టీకరణ * బ్యాంకుల నిర్లక్ష్యం.. ఇప్పటికి అందజేసింది 46 శాతమే * ప్రభుత్వం ‘మాఫీ’కి నిధులివ్వకపోతే రైతులకు రుణాలు కష్టమే! * వారంలో ప్రారంభం కానున్న ఖరీఫ్.. ఆందోళనలో రైతన్న * ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతన్నకు మళ్లీ కష్టకాలం వచ్చింది. వారం పదిరోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలుకానున్నా.. బ్యాంకుల నుంచి రుణాలు అందే అవకాశం కనిపించడం లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితీ తప్పేటట్లు లేదు. ఇప్పటికీ రెండో విడత రుణమాఫీపై సర్కారు ప్రకటన చేయకపోవడం, మొదటి విడత రుణమాఫీ వినియోగ పత్రాలు (యూసీలు) ఇస్తేనే రెండో విడత మాఫీ ప్రకటిస్తామనడం, మళ్లీ కొత్తగా తనిఖీలంటూ మెలికపెట్టడం వంటివాటితో ‘రుణమాఫీ’పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా ప్రభుత్వానికి యూసీలను అందజేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. దీంతో రైతులు ఆందోళనలో కూరుకుపోతున్నారు. అంతటా నిర్లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు మాఫీ ప్రకటించింది. ఈలెక్కన మొత్తంగా 35.82 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. మొదటి విడతగా గత ఏడాది రూ.4,230 కోట్లను జిల్లాల్లోని బ్యాంకులకు విడుదల చేసింది. అందులో బ్యాంకులు ఇప్పటివరకు రూ.4,086.22 కోట్లను రైతుల ఖాతాలో మాఫీ చేశాయి. మిగతా రూ.143 కోట్లను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించాయి. చాలా చోట్ల రైతులకు రుణ హామీ పత్రాలను కూడా అందజేశాయి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రుణమాఫీకి కొర్రీలు పెడుతోంది. మొదటి విడతగా విడుదల చేసిన నిధులకు సంబంధించి.. వినియోగపత్రాలు (యూసీలు) ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. యూసీలు ఇస్తేనే రెండో విడత రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే పూర్తి వివరాలు అందుబాటులో ఉండి కూడా బ్యాంకులు యూసీలు అందజేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. జిల్లాల్లో ఇప్పటివరకు 104 నోడల్ బ్యాంకులు (46 శాతం) మాత్రమే యూసీలు అందజేశాయి. ఇంకా 138 నోడల్ బ్యాంకులు (54 శాతం) ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాల్సిందిగా సర్కారు పదేపదే కోరినా స్పందించకపోవడం గమనార్హం. అసలు రెండో విడత రుణమాఫీ నిధులు అందకుంటే.. రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకాడుతాయి. ఇది రైతులకు శాపంగా మారనుంది. మళ్లీ తనిఖీల మెలిక రుణమాఫీ అంశంలో సర్కారు కొత్త మెలికలు పెడుతోంది. అనేకచోట్ల బోగస్ రైతులు, బినామీలు మొదటి విడత రుణమాఫీ సొమ్ము పొందారంటూ మళ్లీ తనిఖీలు మొదలుపెట్టింది. అలాంటివారిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ప్రతీ జిల్లాలో 10 గ్రామాల చొప్పున ర్యాండమ్‌గా తీసుకుని పరిశీలించాలని.. సోమవారం నాటికి నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ప్రస్తుతం జిల్లాల్లో అధికారులు ఈ పనిలోనే నిమగ్నమయ్యారు. అయితే అనేక సార్లు తనిఖీలు చేసి, ఎమ్మార్వో ధ్రువీకరణ ఇచ్చాకే సంబంధిత రైతులకు రుణమాఫీని వర్తింపచేశారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ తనిఖీలు చేపట్టడంలో మతలబేమిటో అంతుపట్టడం లేదని వ్యవసాయశాఖ అధికారులే పేర్కొంటున్నారు. వినియోగపత్రాలు, తనిఖీల పేరుతో రెండో విడత రుణమాఫీని వీలైనంత ఆలస్యం చేయాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చే అవకాశముంది. బ్యాంకుల్లో రుణమాఫీ, వినియోగపత్రాల వివరాలు జిల్లా రుణమాఫీ బ్యాంకుల వినియోగపత్రాలు (రూ.కోట్లలో) సంఖ్య ఇచ్చిన బ్యాంకులు ఆదిలాబాద్ 366.17 28 0 కరీంనగర్ 415.69 25 11 ఖమ్మం 426.85 31 25 మహబూబ్‌నగర్ 681.46 35 3 మెదక్ 488.39 28 4 నల్లగొండ 588.25 27 20 నిజామాబాద్ 400.45 24 16 రంగారెడ్డి 251.72 28 27 వరంగల్ 467.24 29 11 మొత్తం 4,086.22 255 117 -
రాష్ట్ర ప్రభుత్వం హామీలను విస్మరిస్తోంది..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. ఇటీవల చేపట్టిన కాకతీయ మిషన్, వాటర్‌గ్రిడ్ పథకాల అమలు లోపభూయిష్టంగా ఉందన్నారు. నిబంధనల పేరుతో అర్హులైన కాంట్రాక్టర్లను తొలగించడం సరికాదన్నారు. ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎన్నికల హామీ మేరకు సింగరేణిలో డిస్మిస్డ్ కార్మికులను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాసం కల్పించాలని కోరారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర కన్వీనర్ కొదమసింహం పాండురంగాచార్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి ముత్తయ్య, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రవిబాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.