కాంట్రాక్టర్ చేతికి కోడెల టికెట్లు
కౌంటర్‌కు తాళం
వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలోని కోడె టికెట్లను ప్రైవేట్ వ్యక్తులు విక్రయిస్తున్నారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు కోడి మెుక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం క్యూలైన్లో నుంచి టికెట్లు తీసుకునేందుకు వెళ్లిన భక్తులకు కౌంటర్‌కు తాళం వేసి కనిపించింది. పక్కనే కోడెలకు గట్టి కట్ట, అరటిపండు విక్రయించే కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వ్యక్తి వద్ద కోడెల టికెట్లు కనిపించాయి. కౌంటర్ అతను లేడని, కోడెల టికెట్లు తీసుకోండని సదరు వ్యక్తి టికెట్లు ఇచ్చాడు.
టికెట్‌తోపాటు గడ్డి, అరటికాయ కూడా కొనాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో అక్కడికి చేరుకుని యామ తిరుపతి అనే భక్తుడు.. గడి ఎందుకు కొనాలి, కోడె టికెట్ ఇవ్వాలన్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయమై కౌంటర్ వద్ద విధులు నిర్వహించే ఉద్యోగిని వివరణ కోరగా, తనకు అత్యవసరం ఏర్పడడంతో కౌంటర్‌కు తాళం వేసి వెళ్లానని, భక్తులు ఎవరైనా వస్తే కోడెల టికెట్లు ఇవ్వాలని చెప్పినట్లు వివరించాడు.