K.venkatesh
-
గోపాలమిత్రలను తొలగించడం అన్యాయం
అనంతపురం అగ్రికల్చర్: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అడిగిన పాపానికి 67 మంది గోపాలమిత్రలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని గోపాలమిత్రల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశు శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలమిత్రలను తొలగించినట్లు ‘సాక్షి’లో పత్రికలో ప్రచురితమైన కథనంపై వివరణ కోరేందుకు డీఎల్డీఏ కార్యాలయానికి వెళ్లగా సీఈఓ ఇచ్చిన పత్రికా ప్రకటనతో తమకు సంబంధం లేదని చైర్మన్, ఈఓలు చెప్పారన్నారు. 16 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న తరుణంలో ఉన్నఫలంగా తొలగిస్తే ఆయా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కల్పించారన్నారు. తొలగించిన వారికి విధుల్లోకి తీసుకోకుంటే రైతులు, ప్రజల సాయంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. తీసుకునే ప్రసక్తేలేదు: తొలగించిన 67 మంది గోపాలమిత్రలను మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని ఏపీ ఎల్డీఏ సీఈఓ డాక్టర్ ఈడీ కొండలరావు స్పష్టం చేశారు. వరుణయాగం కోసం శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడుతూ... అవకాశం ఇచ్చినా వారి నుంచి స్పందన లేకపోవడంతో తొలగించినందున మరో అవకాశం ఉండబోదన్నారు. -
అలా ఎవరుంటారండీ బాబు...
అబ్బాయి అంటే రాముడిలా, అమ్మాయి అంటే సీతలా ఉండాలంటారు. కానీ ఈ మధ్య కాలంలో అలా ఎవరుంటున్నారు.... కాలం మారిపోయిందంటున్నారు దర్శకుడు కె.వెంకటేశ్. ఆయన దర్శకత్వంలో ప్రశ్నాథ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండీ బాబు’. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. ‘‘రెండు యువజంటల మధ్య సాగే అందైమైన ప్రేమకథగా, సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నేటి యువతకు సందేశమిచ్చే చిత్రమిది’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.జగన్, సంగీతం: రమేశ్ దాసరి.