అలా ఎవరుంటారండీ బాబు... | ippatlo ramudila sithila yavaruntarandi babu | Sakshi
Sakshi News home page

అలా ఎవరుంటారండీ బాబు...

Published Mon, Aug 10 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

అలా ఎవరుంటారండీ బాబు...

అలా ఎవరుంటారండీ బాబు...

అబ్బాయి అంటే రాముడిలా, అమ్మాయి అంటే సీతలా ఉండాలంటారు. కానీ ఈ మధ్య కాలంలో  అలా ఎవరుంటున్నారు.... కాలం మారిపోయిందంటున్నారు దర్శకుడు కె.వెంకటేశ్. ఆయన దర్శకత్వంలో ప్రశ్నాథ్ నిర్మిస్తున్న  చిత్రం  ‘ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండీ బాబు’.
 
 ఈ సినిమా  షూటింగ్ 70 శాతం పూర్తయింది. ‘‘రెండు యువజంటల మధ్య సాగే అందైమైన ప్రేమకథగా, సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నేటి యువతకు సందేశమిచ్చే చిత్రమిది’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.జగన్, సంగీతం: రమేశ్ దాసరి.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement