ద్యుతీ చంద్‌కు స్వర్ణం
కోల్‌కతా : వివాదాస్పద అథ్లెట్ ద్యుతీ చంద్ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. రైల్వేస్ తరఫున 100మీ. బరిలోకి దిగిన ద్యుతీ 11.68 సెకన్ల టైమింగ్‌తో సత్తా చాటుకుంది. పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా నిషేధం ఎదుర్కొన్న 19 ఏళ్ల ఈ ఒడిషా స్ప్రింటర్‌పై స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ గత జూలైలో వేటును ఎత్తేసింది. అలాగే లలితా బాబర్ (3000మీ. స్టీపుల్‌చేజ్), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్) తమ విభాగాల్లో మీట్ రికార్డులు నెలకొల్పుతూ స్వర్ణాలు సాధించారు. ఇప్పటిదాకా ఈ చాంపియన్‌షిప్‌లో తొమ్మిది స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, రెండు కాం స్యాలతో ఓఎన్జీసీ అగ్రస్థానంలో ఉంది.