హీరో, నిర్మాత, డైరెక్టర్ ఒక్కరే.. కత్తి మీద సాములా బాధ్యతలు
Aye Bujji Neeku Nene Audio Launched By Producer Bekkam Venugopal: సాధారణంగా హీరోగా నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడం కష్టమైన పని. అలాంటి కథానాయకుడిగా, కథ రచయితగా, స్క్రీన్ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వ బాధ్యతలను చేపట్టడం కత్తిమీద సాము లాంటిదే. వాటన్నింటికి ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయినా సక్సెస్ సాధిస్తామన్న గ్యారెంటీ లేదు. అయినా కూడా అన్ని బాధ్యతలను నెత్తిన వేసుకుని 'ఏయ్ బుజ్జి నీకు నేనే' అనే చిత్రంతో ముందుకు వచ్చాడు సతీష్ మేరుగు.
సతీష్ మేరుగు, హృతికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’. హీరోగానే కాకుండా ఈ చిత్రా నికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వ బాధ్యతలను సతీష్ మేరుగు నిర్వహించాడు. సంజన చరణ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆడియోను నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఆవిష్కరించారు. ‘‘ఈ సినిమాలో మంచి ప్రేమకథే కాకుండా.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఉంటాయి’’ అని సతీష్ మేరుగు తెలిపాడు.
చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ
బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్
1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి