మహేష్ నా రోల్ మోడల్ - కృష్ణమాధవ్
మహేష్ నా రోల్ మోడల్ - కృష్ణమాధవ్
Published Thu, Nov 28 2013 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
‘‘నా ‘ఖలేజా’, ‘దూకుడు’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశాడు కృష్ణమాధవ్. నా సిస్టర్ ద్వారా తనతో పరిచయం ఏర్పడింది. రికమండేషన్‌తో వచ్చినా కూడా చాలా హార్డ్‌వర్క్ చేశాడు. తను హీరోగా నటిస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మహేష్‌బాబు. రాష్ర్ట మంత్రి గల్లా అరుణకుమారి మేనల్లుడు కృష్ణమాధవ్ హీరోగా సంస్కృతి షినయ్, అనూష హీరోయిన్లుగా పవన్ మంత్రి ప్రగడ, సంజయ్ ముప్పనేని నిర్మించిన చిత్రం ‘హృదయం ఎక్కడున్నది’. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలందించారు.
ఈ ఆడియో సీడీని మహేష్‌బాబు ఆవిష్కరించి గల్లా అరుణకుమారికి ఇచ్చారు. మాధవ్ సినిమాల్లోకి వెళ్తానంటే వద్దన్నానని, కానీ తన తపన చూసి చివరకు అంగీకరించానని అరుణకుమారి చెప్పారు. కృష్ణమాధవ్ మాట్లాడుతూ -‘‘మహేష్‌బాబు నుంచి క్రమశిక్షణ, అంకితభావం అలవరచుకున్నాను. నా రోల్‌మోడల్ ఆయనే. సినిమాల్లో నటించాలనే నా కల, నాన్నగారి కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.
Advertisement
Advertisement