law and order discussion
-
పోలీసుల ఎన్నికల అ‘‘టెన్షన్’’!
సాక్షి, కర్నూలు: ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు పలువురు కొత్త పోలీసు అధికారులు వచ్చారు. ఎస్పీ మొదలుకొని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల వరకు అంతా కొత్తవారే. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికల నిర్వహణ కోసం జరుగుతున్న కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాజకీయ పార్టీలు జిల్లాలో హోరాహోరీగా పోరాడుతున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 11 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. అదే స్థాయిలో పట్టును నిలుపుకోవాలని వైఎస్సార్సీపీ, గతం కంటే ఎక్కువ స్థానాల్లో పాగా వేయాలని అధికార టీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ ‘భద్రత’పై ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక నుంచే జాగ్రత్త వహిస్తూ పల్లెల వారీగా పట్టు బిగించే దిశగా ఇరు పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు. పల్లెల్లో కార్యకర్తలను పెంచుకోవడం నుంచి నేతలను బలోపేతం చేయడం వరకు ఇరు పార్టీల్లో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో అనేక పల్లెలు అతి సమస్యాత్మక గ్రామాల జాబితాలో ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది. కొన్ని ఫ్యాక్షన్ గ్రామాల్లో కొన్నేళ్లుగా నిరవధికంగా పోలీసు పికెట్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి చోట ఇప్పుడు భద్రత కట్టుదిట్టం చేయాల్సి వస్తోంది. ఫ్యాక్షన్ గ్రామాల్లో సవాలుగా మారినశాంతిభద్రతలు... జిల్లాలోని ఫ్యాక్షన్ మూలాలు ఉన్న గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసు శాఖకు సవాలుగా మారింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక సాధారణ గ్రామాలను గుర్తించే పనిలో పోలీసు శాఖ తలమునకలైంది. ఈసారి ‘క్రిటికల్ విలేజ్’ పేరుతో తగాదాలు జరిగే ప్రాంతాలను గుర్తిస్తోంది. ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గతంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల పేరును ఈ ఎన్నికల్లో క్రిటికల్ విలేజ్‌గా మార్చారు. ఏయే ప్రాంతాల్లో అధికంగా తగాదాలు జరుగుతాయో గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. 71 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం జిల్లాలోని 28 గ్రామాల్లోని 71 పోలింగ్ కేంద్రాలను ఇప్పటివరకు పోలీసు శాఖ అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. 740 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అందుకు అవసరమైన బందోబస్తు ప్రణాళికలను సిద్ధం చేశారు. సుమారు 20 కంపెనీల కేంద్ర బలగాలను జిల్లాకు కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. జిల్లాకు చెందిన సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ బలగాలతో కలిపి సుమారు 12 వేల మందితో బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. నగదు, కానుకల తరలింపు, అక్రమ మద్యం రవాణాపై నిఘా కోసం జిల్లా వ్యాప్తంగా 42 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. -
ఇప్పటి హత్యలకు అప్పటినుంచే నాంది
వరుస ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారిందని, ఇప్పుడు జరుగుతున్న హత్యలకు అక్కడే నాంది పలికిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సభ నుంచి వాకౌట్ చేసి, బయట గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో చర్చకోసం పట్టుబడుతున్న సందర్భంలోనే గుంటూరుజిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఇద్దరిని చంపేశారని, అనంతపురం జిల్లా శింగనమలలో మరొకరిని హత్యచేశారని చెప్పారు. మొత్తం 3 నెలల కాలంలో 14 హత్యలు జరిగాయన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ''వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు, ఘర్షణలు ఉండొచ్చు. అవి సమసిపోయేలా పోలీసులు చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పైనుంచి అధికార పార్టీ వారు ప్రోత్సహిస్తున్నారు. జరిగిన ఘటనలు హత్యకాదంటారా? 100 రోజుల్లో జరిగినవి హత్యలు కాదా? అసెంబ్లీ చర్చలో అ 14 కుటుంబాలకు ఏం భరోసా ఇస్తారన్నదానిపై మాట్లాడటం లేదు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యహరించేలా ఎందుకు చేయడంలేదు? మేం దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెడితే.. దాన్ని హాస్యాస్పదం చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఈ ఘటనలగురించి కాకుండా పాత అంశాలను తీసుకొస్తున్నారు. గతంలోకి పోవద్దని, అలా పోతే అవాస్తవాలు, ఆరోపణలు తప్ప చర్చ ముందుకెళ్లదని చెప్పాం. ముందుగా ఈ ఘటనలపై దృష్టిపెట్టాలని మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. పథకం ప్రకారం మా గొంతులు వినబడనీయకుండా వారి గొంతులు మాత్రమే వినపడేలా సభ జరుగుతోంది. బాబు ప్రమాణస్వీకారం చేయడానికి ముందు హత్యలు జరిగితే విచారణ చేయరా? 19సార్లు అధికార పార్టీ సభ్యులు అప్రజాస్వామిక భాషను ఉపయోగిస్తే సభాపతి అడ్డుకోరు. మేం ఒకే ఒక్కసారి మాట్లాడితే.. దాని గురించి మాట్లాడతారు. మేం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నామని స్పీకర్ అంటారు. ఆ మాటను ఆయన అనడం కూడా అప్రజాస్వామికమే. వాస్తవానికి ఇవాళ బడ్జెట్‌పై మాట్లాడాల్సి ఉంది... అదికాకుండా శాంతిభద్రతల అంశాన్ని ముందుపెట్టారు. పోనీ చర్చ పెట్టారు అంటే, మాకు మైకు ఇవ్వరంట. చనిపోయిన కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిందిపోయి.. వారిపై నిందలు మోపారు. పదేళ్ల కిందట కథలకు పోతున్నారు. పరిటాల రవిహత్యకేసులో దర్యాప్తు జరిగింది, కోర్టుల్లో విచారణకూడా ముగిసింది. ఈకేసులో దోషులకు శిక్షకూడా పడింది. అయినా అవే ఆరోపణలను పదేపదే చేస్తున్నారు. ఒకవేళ మాకు మైకు ఇచ్చిఉంటే, మాకూ సభను పక్కదోవ పట్టించే ఆలోచన మాక్కూడా ఉంటే మేంకూడా అడిగేవాళ్లం. వంగవీటి మోహన రంగాని దగ్గరుండి చంపించింది చంద్రబాబే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబునుకూడా గట్టిగా నిలదీయాలంటే వంగవీటి మోహనరంగా కేసులో 11వ ముద్దాయి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ఇదే అసెంబ్లీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈకేసులో ముద్దాయి. ఆయన చంద్రబాబు పక్కన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే చంద్రబాబును మేం ప్రశ్నించాలనుకుంటే వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్ ఆరోజు హోంమంత్రిగా లేరా? అవాళ ఆయన బాధ్యుడు కాదా? బాధ్యత తీసుకోరా? రాజీ నామా చేయాల్సిన పరిస్థితుల్లో పదవి వదులుకున్నారు. సభను పక్కదోవ పట్టించడానికి మేంకూడా ఇవన్నీ ప్రస్తావించి ఉండొచ్చు. విషయం పక్కదోవ పట్టకూడదని గట్టిగా మేం చర్చకోసం పట్టుబట్టాం. కానీ అధికారపక్షం వాళ్లు తెలిసీ, తెలియని విషయాలతో అవాస్తవాలు చెబుతున్నారు. సభా సమయాన్ని పూర్తిగా వృథా చేశారు. ఒక శాసనసభలో ఒక ఎమ్మెల్యే లేదా ప్రతిపక్షనేత వాకౌట్ చేస్తున్నప్పుడు మైకు ఇస్తారు. కానీ దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా మైకు ఇవ్వకుండా స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ఆయన తెలుగుదేశం కార్యకర్తా? మంత్రా? టీడీపీ ఎమ్మెల్యేనా? స్పీకరే నిర్ణయించుకోవాలి. మా గొంతు నొక్కుతున్నప్పుడు నిరసన తెలపడం మినహా మాకు మరో మార్గంలేదు. పోలీసులతో రాయించిన ఎఫ్ఐఆర్లు కాకుండా మరణించిన వారి కుటుంబాల మాటలు వినాలి. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. హత్యకు గురైన కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. చిన్నచిన్నగొడవలు హత్యలవరకూ వెళ్తున్నాయంటే రాజకీయ వ్యవస్థ చెడిపోతున్నట్టే. అధికారంలో ఎవ్వరున్నా.. హత్యలను ప్రోత్సహించకూడదు. మైకులు ఇవ్వకపోవడం వల్లే మేం వాకౌట్ చేశాం. మా గొంతులు వినే అవకాశం లేదుకాబట్టి వాకౌట్ చేశాం. శాంతిభద్రతలపై చర్చ ముగిశాక బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటాం. అక్కడ రుణమాఫీ అంశంపై చంద్రబాబును గట్టిగా నిలదీస్తాం. రైతులకు, డ్వాక్రా మహిళలకు తోడుగా ఉంటాం. ఈ సందర్భంగా జరిగే చర్చను రాష్ట్రం మొత్తం చూడాలి. దీన్నికూడా ఆపడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను దేశంమొత్తంచూడాలి ఇంటింటికీ రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. దీనిపైకూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీ జరుగుతున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి. రాజకీయ లబ్ధి కోసమే అధికారపక్ష సభ్యులు తీర్పువచ్చిన కేసులను కూడా ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఇలాగే వ్యవహరిస్తే... వ్యవస్థ కుప్పకూలిపోతుంది'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. -
వాళ్లు19సార్లు అమర్యాదగా మాట్లాడారు
హైదరాబాద్ : అసెంబ్లీలో తమకు మాట్లాడే స్వేచ్ఛ లేనందునే సభ నుంచి వాకౌట్ చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలంతా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో స్పీకర్ వ్యవహార శైలిపై చూస్తుంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేనా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సభాపతా అనే అనుమానం వ్యక్తం అవుతుందన్నారు. అసెంబ్లీలో శుక్రవారం అధికారపక్షం నేతలు 19సార్లు అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగిస్తే ఏమీ అనని స్పీకర్, తాము ఒక్కసారి 'బఫూన్' అనే పదం ఉపయోగిస్తే దానికి అభ్యంతరం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. స్పీకర్ కోడెల కూడా తనను 'ఇర్రెస్పాన్సిబుల్' అన్నారని, అలా అనడం కూడా అన్ పార్లమెంటరీయేనన్న విషయం ఆయనకు తెలుసో లేదోనని చెప్పారు. సభలో తమ గొంతు వినిపించే అవకాశం లేనందునే బయటకు వచ్చి తమ తెలుపుతున్నామన్నారు. గత మూడు నెలల్లో వైఎస్ఆర్ సీపీకి చెందిన 14మంది చనిపోయారని, వాటిపై విచారణ చేపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో చర్చ జరుపుతున్నారన్నారు. అవి తప్పుడు ఆరోపణలు అని చంద్రబాబుకు తెలుసు కాబట్టే ....జేసీ బ్రదర్స్‌కు టికెట్లు ఇచ్చారన్నారు. 14 మంది రాజకీయ హత్యలకు గురైతే కనీసం వాళ్ల గురించి ఒక్క మాట మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన చెప్పారు. -
మా గొంతు నొక్కేసి వాళ్లతో మాట్లాడిస్తారా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనలు అసెంబ్లీ చరిత్రలోనే సిగ్గుచేటుగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అసెంబ్లీ నుంచి ప్రతిపక్షం వాకౌట్ చేసిన తర్వాత ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''అసెంబ్లీలో జరిగిన సంఘటన అసెంబ్లీ చరిత్రలోనే సిగ్గుచేటు. ఒక శాసనసభ్యుడికి మైకిచ్చి, చర్చ మొదలుపెట్టమంటే.. హత్యలు, ఊచకోతలపైన మాట్లాడమంటే దాని మీద వివరించాల్సిన మా గొంతు నొక్కేసి బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు. ఆయనేమో అసలు విషయం వదిలేసి ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీం, విదేశాలు అంటున్నాడు. మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఆయన అలాంటి అసత్య ఆరోపణలు చేస్తుంటే స్పీకర్ గారికి చెవికి ఇంపుగా ఉన్నాయా, జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే ఆనందంగా ఉందా? అలాంటి సందర్భంలోనే స్పీకర్ గారిని ప్రతిపక్ష నాయకుడు అడిగారు. అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని అంటుంటే.. పది సెకన్లు కూడా మాట్లాడనివ్వకుండా మైకు కట్ చేసి మళ్లీ బుచ్చయ్య చౌదరికే అవకాశం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు వాకౌట్ చేస్తానన్నప్పుడు కనీసం మైకు ఇచ్చి ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. వీటిని అధికార పార్టీ, స్పీకర్ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మీరే నిబంధనలు పట్టించుకోకుండా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు అసలు స్పీకర్ ఎందుకు ఉన్నారని అడుగుతున్నా. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారా.. ప్రజల తరఫున మాట్లాడటానికి, ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షంగా మేముంటే, మా గొంతు నొక్కేస్తారా, ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వరా అని అడుగుతున్నా. నిండు సభలో ప్రతిపక్ష నాయకుడి మీద నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేస్తుంటే పట్టించుకోకపోవడం నిజంగా బ్లాక్ డే. అడిగినా మైకు ఇవ్వకుండా వ్యవహరించడం సరికాదు. మంత్రులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకు పుచ్చలపల్లి సుందరయ్య పేరు ఎత్తే అర్హత లేదు. వాళ్లే బతికుంటే మీ తీరు చూసి కన్నీళ్లు పెట్టుకునేవారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంలా మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఇది దుర్మార్గం, అమానుషం. ప్రజలను, ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేయడం. యనమల రామకృష్ణుడు పెద్ద నీతిమంతుడు అయినట్లు హితోపదేశం చేస్తున్నారు. అదేదో వాళ్ల పార్టీ శాసనసభ్యులకు చెప్పాలి. కవి చౌడప్ప వారసుల్లా మాట్లాడుతున్నారు'' అని ఆయన అన్నారు. -
అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యం ఖూనీ
పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని యథేచ్ఛగా రాష్ట్ర అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతూ, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక శాసన సభ్యుడు తన ఇష్టంవచ్చినట్లు అబద్ధాలు చెబుతుంటే, ఆ అబద్ధాలు చెప్పుకోనివ్వండంటూ సమయం కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 'ఇదేంటి అధ్యక్షా.. ఆయన నోటికొచ్చినట్లు తప్పులు మాట్లాడుతుంటే, మీరు అనుమతిస్తూనే ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి నేను సూటిగా అడుగుతున్నాను' అని చెప్పారు. ఆ సమయంలో స్పీకర్ కలగజేసుకుని, అధ్యక్ష స్థానం మీద ఆరోపణలు చేస్తున్నారని, అది సరికాదని చెప్పారు. శాంతిభద్రతలపై చర్చలో వాళ్లకు సమయం ఇచ్చామని, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పుకోవాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తే ఆయన స్పీకర్ మీదే ఆరోపణలు చేస్తున్నారని పదే పదే చెప్పారు. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అవకాశం ఇచ్చామని అన్నారు. తాను పూర్తి నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నానన్నారు. ఆ తర్వాత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్లు మాట్లాడాలని, స్పీకర్ మీద ఆరోపించడం కూడా సరికాదని, సభా మర్యాదలను కూడా పాటించాలని, స్పీకర్ అనుమతించడం వల్లే ఆయన మాట్లాడారని చెప్పారు. ఆ సమయంలో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఒక్కసారిగా అధికార, విపక్ష సభ్యులు నేరుగా ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగడంతో సభ ఏమాత్రం అదుపులో లేకుండా పోయింది. దాంతో అధికారపార్టీ సభ్యుల వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శాసనసభను ఇడుపులపాయ, లోటస్‌పాండ్ అనుకుని సొంత పాలన చేస్తున్నారని అంటూ.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగా తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురూ ఇతర సభ్యులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అంతకుముందు శనివారం నాడు చర్చను ప్రారంభించిన బుచ్చయ్య చౌదరి వైఎస్ పాలనను ఉద్దేశించి దోపిడీ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మధ్యమధ్యలో విపక్ష సభ్యులను ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎవరో భూమిని ముఖ్యమంత్రి సారథ్యంలో ఆక్రమించారంటూ దివంగత ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారు. ఆయుధాలు దిగుమతి చేసుకున్నారని, బాంబే ముఠాలను ఇక్కడకు రప్పించారని, ఛోటా రాజన్ హత్య చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి గ్యాంగును దుబాయ్ నుంచి అనంతపురం రప్పించారని అన్నారు. దీనిపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. 'ఉండవయ్యా, ఉండు' అంటూ సభ్యులను తానే అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రక్షణకు వాడుతున్న వాటికంటే అత్యాధునిక ఆయుధాలు తెప్పించారని చెబుతూ.. ఓ పోలీసు అధికారి కూడా ఆయుధాల ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. -
రికార్డుల నుంచి తొలగిస్తున్నాం
శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా జరిగిన వివాదానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాలకు చెందిన కొంతమంది సభ్యులు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పావుగంట వాయిదా అనంతరం సభ పునఃప్రారంభమైనప్పుడు ముందుగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు ఆవేశానికి లోనైనప్పుడో, పొరపాటునో కొన్ని వ్యాఖ్యలు చేస్తారని, ఆ తర్వాత దానికి వాళ్లు క్షమాపణలు చెప్పడం కూడా సర్వసాధారణమని ఆయన అన్నారు. ఇంతకుముందు సభలో ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ప్రతిపక్ష నాయకులు కూడా పొరపాటుగా మాట్లాడితే క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని, సభలో ఎవరూ ఇగోలకు పోకూడదని ఆయన చెప్పారు. అన్‌పార్లమెంటరీ పదాలు మాట్లాడినవాళ్లు వాటిని స్వచ్ఛందంగా ఉపసంహరించుకుని, సభకు క్షమాపణ చెబితే హుందాగా ఉంటుందని అన్నారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేసి, చర్చను సజావుగా సాగించాలని సూచించారు. అనంతరం స్పీకర్ కోడెల మాట్లాడుతూ, ''నిన్న చర్చ సందర్భంగా సభ గౌరవం, మర్యాద, హుందాతనాలకు భంగం కలిగించేలా ఇరుపక్షాలకు చెందిన కొందరు సభ్యులు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాం. ఎవరైనా ఉపసంహరించుకుంటున్నామంటే చేయొచ్చు, లేకపోతే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది'' అని, ఆ తర్వాత ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. -
హంతకులు, స్మగ్లర్లు అంటారా?
శాంతిభద్రతలపై జరిగిన చర్చ అసెంబ్లీలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసింది. అధికారపక్షం సభ్యులు సంయమనం కోల్పోయి వ్యవహరించి.. నోటికి వచ్చినట్లల్లా వ్యాఖ్యానించారు. దాంతో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనను నరరూప రాక్షసుడని అన్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను స్మగ్లర్లుగా అభివర్ణించారని, ఇదే నిండు సభలో తనను హంతకుడని కూడా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. తనను, తన పార్టీ వాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వాళ్లు ఉపసంహరించుకుంటే.. తాను కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు చేసిన వ్యాఖ్యలమీద వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పోడియంలోకి రావడంతో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ చర్చ జరిగింది. సభలో లేని దివంగత నేతలను కించపరిచేలా అధికారపక్షం వ్యాఖ్యలు చేస్తోందని, వైఎస్ఆర్, వైఎస్ జగన్ లక్ష్యంగా అధికారపక్షం వ్యాఖ్యలు చేస్తోందని విపక్ష సభ్యులు మండిపడ్డారు. మరోవైపు అధికార పక్షం కూడా వెల్‌లోకి దూసుకొచ్చి పోటాపోటీగా నినాదాలు చేయడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను శనివారానికి వాయిదా వేశారు. -
'డాక్టర్ వైఎస్‌కు ప్రాణాలు పోయడమే తెలుసు'
-
'డాక్టర్ వైఎస్‌కు ప్రాణాలు పోయడమే తెలుసు'
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ అని.. ఆయనకు ప్రాణాలు పోయడమే తెలుసు గానీ, ప్రాణాలు తీయడం తెలియదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికార పార్టీ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై పదే పదే ఆరోపణలు చేయడంతో ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు రెండు రాష్ట్రాల్లోను ఎంతోమంది నిరుపేదల ప్రాణాలను కాపాడాయని, ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. గొట్టిముక్కల గ్రామం జాతీయరహదారికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, అక్కడ తమ పార్టీ తరఫున చురుగ్గా వ్యవహరిస్తున్న డిప్యూటీ సర్పంచిని తెలుగుదేశం పార్టీకి చెందినవారు దారుణంగా హతమార్చినట్లు అక్కడివారు చెబుతున్నారన్నారు. అక్కడకు తాము వెళ్లినప్పటికి కూడా ఇంకా పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదని, అందుకు కారణం మంత్రి ఒత్తిడేనని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారని కొడాలి నాని అన్నారు. ఇలా అధికార పార్టీ ప్రోద్బలంతోనే అరాచకాలన్నీ జరుగుతున్న విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. -
మృతుల కుటుంబాలను ఆదుకుందాం: వైఎస్ జగన్
శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాట్లాడేందుకు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ''శాంతిభద్రతలపై చర్చను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పరిటాల రవీంద్ర హత్య కేసు విషయంలో విచారణలు జరిగాయి. అందులో తాను చేసినవి సత్యదూరమైన ఆరోపణలని చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే ఆయన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు టికెట్లు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. పరిటాల రవీంద్ర హత్య విషయంలో వచ్చిన ఆరోపణలు నిజమే అయితే ఆయనలా చేస్తారా? కేవలం చర్చను తప్పుదోవ పట్టించడానికే లేనిపోని అభాండాలు వేస్తున్నారు. వాళ్లు పరిటాల రవి అంటే, మావాళ్లు వంగవీటి మోహనరంగా అంటారు. ఇలా అంటుంటే ఇంకా ఎంత దూరమైనా వెళ్తుంది. వాళ్లను ఆ ప్రస్తావన మానమనండి, మావాళ్లు ఈ ప్రస్తావన మానేస్తారు. చనిపోయిన 14 మంది కుటుంబాలకు ఏదైనా మేలు చేయడానికి ప్రయత్నిద్దాం. మనకు ఎవరైనా తెలియనివాళ్లయినా సరే.. మనుషులు చనిపోతే కొంతమందికి ఐదు లక్షలు, మరికొందరికి ఇంకా ఎక్కువగా ఎక్స్‌గ్రేషియాలు ఇస్తున్నాం. ఇక్కడ మాత్రం ఓ పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులను వరుసపెట్టి హతమారుస్తున్నారు. ఇక్కడ వ్యవస్థలో మార్పు రావాలి. రేపు అధికారంలోకి మేమొస్తాం. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ హత్యారాజకీయాలను మానుకోవాలని అందరికీ సలహా ఇస్తున్నా'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. -
శాంతిభద్రతలపై చర్చ.. సభలో తీవ్ర ఉద్రిక్తత
రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభలో లేని వ్యక్తులపై అభాండాలు వేయడం ఏమిటంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై టీడీపీ సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌ను దీనిపై రూలింగ్ ఇవ్వాలని కోరినా.. స్పీకర్ పరిశీలించి రూలింగ్ ఇస్తారంటూ ఆయన మళ్లీ టీడీపీ సభ్యులకు అవకాశం ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. సభలో లేని వ్యక్తులు, ఆరోపణలకు సమాధానం ఇవ్వలేని వ్యక్తుల మీద అసెంబ్లీలో ఎలాంటి ఆరోపణలు చేయకూడదని అసెంబ్లీ నియమ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని, దీనిపై రూలింగ్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీకి చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి నిబంధనను ప్రస్తావిస్తూ డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. అయినా మళ్లీ మళ్లీ టీడీపీ సభ్యులకు అవకాశం రావడం, వాళ్లు మళ్లీ మళ్లీ ఆరోపణలు చేయడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చారు. అయినా కూడా స్పీకర్ నిబంధనలను పరిశీలించి ఆ తర్వాత రూలింగ్ ఇస్తారని, అప్పటివరకు కూర్చోవాలని డిప్యూటీ స్పీకర్ అన్నారు. మరోవైపు బొండా ఉమామహేశ్వరరావుకు, ధూళిపాళ్ల నరేంద్రకు మాత్రం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ధూళిపాళ్ల నరేంద్ర నిబంధనలను చదువుతుండగా పోడియం వద్దకు వైఎస్ఆర్సీపీ సభ్యురాలు రోజా రాగా, ఆమెపై నరేంద్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.