జాతీయజెండాకు అవమానం
లింగంపేట,న్యూస్‌లైన్ : లింగంపేట మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం వద్ద ఆది వారం ఉదయం జాతీయ జెండాకు అవమానం జరిగింది. డిప్యూటీ రేంజ్ అధికారి చంద్రకాంత్‌రెడ్డి జెండాను ఎగురవేయగా జెండా కు చివరకు ఉంచిన వైరుతీగ తెగిపోవడం తో జాతీయ పతాకం కింద పడిపోయింది. వెంటనే అటవీ అధికారులు జెండాను తిరిగి ఎగుర వేయడానికి ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు జాతీయ జెండాను అవమానిస్తారా అంటూ డిప్యూటీ రేంజర్‌తో వాగ్వాదానికి దిగారు. అటవీ అధికారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహిద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తలకిందులుగా జెండాను ఎగరవేసిన తహశీల్దార్
కోటగిరి,న్యూస్‌లైన్: కోటగిరిలో అధికారులు,నాయకుల సమక్షంలోనే జాతీయ జెండాకు అవమానం జరిగింది. మండల తహశీల్ కా ర్యాలయం వద్ద తహశీ ల్దార్ మోహన్ జాతీయజెండాను తలకిందులు గా ఎగురవేశారు. జెం డాలో ఉన్న మూడురంగుల్లో కాషాయం పైభాగంలో మధ్యలో తెలుపు, పచ్చరంగు కిందకు ఉండేలా జాతీయజెండాను ఎగురవేస్తారు. కాని తహశీల్దార్ నిర్లక్ష్యం వల్ల జెండా తలకిందులుగా ఎగురుతున్న జెండాకు తహశీల్దార్‌తో సహా రెవెన్యూ, మండల,పోలీసు అధికారులు,పలువురు రాజకీయ ప్రముఖులు వందనం చేయడం గమనార్హం. ఇది గమనించిన కొందరు జనగణమన పూర్తిగాకుండానే జెండాను కిందికి దింపడం విశేషం.