లింగంపేట (నిజామాబాద్) : ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం రాంపల్లి కోన తండాలో శనివారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.