local body bypoll election
-
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ), ఉపాధ్యక్ష, కో– ఆప్షన్ సభ్యుల పదవులకు శుక్రవారం జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ఏడు మండలాల్లో ఎంపీపీ పదవుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా చిత్తూరు జిల్లా రామకుప్పం మినహా మిగిలిన ఆరు మండలాల్లో పూర్తయ్యాయి. ఆరుకి ఆరు ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. మరో 11 మండలాల్లో ఉపాధ్యక్ష పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించగా రామకుప్పం మినహా మిగిలిన 10 మండలాల్లో పూర్తయ్యాయి. పదిలో తొమ్మిది చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందగా ఒక్క చోట స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించారు. రామకుప్పం మండలంలో ఎంపీటీసీ సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు రెండూ వాయిదా పడినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. ఇక ఆరు మండలాల్లో కో– ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగగా ఐదు చోట్ల పూర్తయ్యాయి. ఐదు చోట్లా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులే కో – ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. చిత్తూరు మండలంలో కో– ఆప్షన్ సభ్యుడి పదవికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దాచేపల్లి అధికార పార్టీదే పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ పదవికి శుక్రవారం నిర్వహించిన ఉప ఎన్నికలో 10వ వార్డు నుంచి గెలుపొందిన వైఎస్సార్సీపీ సభ్యురాలు కె.సుబ్బమ్మ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 29 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉప సర్పంచి ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం 25 పంచాయతీల్లో ఉప సర్పంచి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవగా సభ్యులు హాజరు కాని కారణంగా మూడు చోట్ల తిరిగి ప్రకటించే వరకు వాయిదా పడ్డాయి. ఒక్క చోట మాత్రం నిబంధనల ప్రకారం శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్థానిక ఎన్నికల అధికారి ప్రకటించారు. -
‘ఈసీకి అంతుపట్టని వైరస్ సోకింది’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అంతుపట్టని వైరస్ సోకిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలను వాయిదా వేయించడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులను అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని మండిపడ్డారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రమేష్‌కుమార్ ఎలా నిర్థారణకు వచ్చారని సురేష్ ప్రశ్నించారు.స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటు ఎవరెవరు చేతులు కలిపారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంతో చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడతారని తెలిపారు. (ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ లేఖ) పెద్ద కుట్రే జరిగింది.. తూర్పుగోదావరి: ఎన్నికలను నిలుపుదల చేయించి..రాష్ట్రానికి నిధులు రాకుండా చేయడానికి పెద్ద కుట్రే జరిగిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ మండిపడ్డారు. చంద్రబాబు కుల రాజకీయాన్ని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల్లో మరోసారి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. (ఎన్నికలకు ఎల్లో వైరస్) -
బీజేపీ అదే జోరు.. కాంగ్రెస్‌కు భంగపాటు
జైపూర్: ఇటీవల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ అదే జోరు కొనసాగిస్తోంది. రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కమలం పార్టీ భారీ విజయం సాధించింది. ఇక్కడా కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. ఆ రాష్ట్రంలో మొత్తం 14 స్థానాలకు ఎన్నికలు జరగగా, 10 సీట్లు బీజేపీ ఖాతాలో చేరాయి. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లో గెలిచింది. వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పంచాయతీ సమితి, జిల్లా పరిషత్, మున్సిపల్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఓ జిల్లా పరిషత్ సీటు, 5 పంచాయతీ సమితి, 4 కౌన్సిలర్ సీట్లను సొంతం చేసుకుంది. టంక్ జిల్లాలో బీజేపీ 4640 ఓట్ల మెజారిటీతో జిల్లా పరిషత్ సీటును గెల్చుకుంది.