Lok Sabha
-
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చే వారమే
-
రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేరు: ప్రధాని మోదీ
జేబుల్లో రాజ్యాంగం పెట్టుకొని తిరిగే వారికి మన దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లకు కనిపించడం లేదు. మేం ముస్లిం సోదరీ మణులకు హక్కులు కల్పించడానికి ట్రిపుల్ తలాఖ్ చట్టం తెచ్చాం. – మోదీ న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలు బహిరంగంగా అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు మన రాజ్యాంగాన్ని, దేశ ఐక్యతను ఏనాడూ అర్థం చేసుకోలేరని అన్నారు. కొన్ని పార్టీలు (ఆమ్ ఆద్మీ పార్టీ) యువత భవిష్యత్తుకు ఆపదగా మారాయని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో ఎంతో ప్రజాధనం ఆదా అయ్యిందని పేర్కొన్నారు. జనం సొమ్ముతో తాము అద్దాల మేడలు కట్టుకోలేదని స్పష్టంచేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. పేదల గుడిసెల్లోకి వెళ్లి ఫొటో సెషన్లు పెట్టుకొని సంబరపడే కొందరు నాయకులు అదే పేదల గురించి పార్లమెంట్లో మాట్లాడడం నీరసమైన వ్యవహారంగా భావిస్తున్నారని విమర్శించారు. జేబుల్లో రాజ్యాంగం పెట్టుకొని తిరిగేవారికి మన దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లకు కనిపించడం లేదని మండిపడ్డారు. ముస్లిం సోదరీమణులకు హక్కులు కల్పించడానికి ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మా పాలనలోనే గరీబీ హఠావో.. తప్పుడు హామీలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడం మాకు అలవాటు లేదు. అభివృద్ది చేసి చూపించడమే మాకు తెలుసు. గరీబీ హఠావో నినాదం ఐదు దశాబ్దాలపాటు వినిపించింది. కానీ, జరిగిందేమీ లేదు. మేము అధికారంలోకి వచ్చాక పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. కేవలం ఐదేళ్లలో 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాం. పేదల కష్టాలు ఏమిటో మాకు తెలుసు. ఎందుకంటే మేము స్వయంగా పేదరికం అనుభవించాం. నిరుపేదల అగచాట్లు, సామాన్య ప్రజల బాధలు అర్థం చేసుకోవాలంటే స్పందించే హృదయం ఉండాలి. అది కొందరు నాయకులకు లేదు. రాజ్యాంగం నిర్దేశించినట్లు నడుచుకుంటున్నాం.రాజ్యాంగమే మాకు స్ఫూర్తి. విషపూరిత రాజకీయాలను నమ్ముకోవడం లేదు. 21వ శతాబ్దం కోసం సిద్ధం కావాలంటూ పదేపదే నినదించిన ఓ ప్రధానమంత్రి(రాజీవ్ గాం«దీ) 20వ శతాబ్దపు అవసరాలను సైతం తీర్చలేకపోయారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉందని కొందరు వ్యక్తులు(సోనియా గాం«దీ) విమర్శించడం దారుణం. దేశ ప్రథమ పౌరురాలిని, పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను కించపర్చడం సహించరానిది. రాజకీయంగా మీరు నిరాశలో ఉండొచ్చు. అంతమాత్రాన రాష్ట్రపతిని అవమానించాలా? ఇదెక్కడి పద్ధతి? మన దేశంలో ఏదైనా ఎస్సీ లేదా ఎస్టీ కుటుంబం నుంచి ఒకేసారి ముగ్గురు ఎంపీలైన సందర్భాలు ఉన్నాయా? పేదల సంక్షేమం గురించి కొందరు మాట్లాడుతున్నారు. వారి మాటలకు, చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోంది. అది భూమికి, ఆకాశానికి.. చీకటికి, వెలుతురు మధ్యన ఉన్నంత వ్యత్యాసం. ప్రజలకు రూ.40 లక్షల కోట్లు బదిలీ కొందరు నాయకులు(అరవింద్ కేజ్రీవాల్) వారి ఖరీదైన ఇళ్లల్లో స్టైల్‌గా ఉండే నీటి షవర్లు, వేడినీటి ఈత కొలనులు ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడితే మేము ప్రతి ఇంటికీ నీరు అందించడంపై దృష్టి పెట్టాం. కొందరు ప్రజల సొమ్ముతో అద్దాల మేడ కట్టుకుంటే మేము పేదలకు ఇళ్లు ఇచ్చాం. పదేళ్ల క్రితం దాకా పత్రికల్లో కుంభకోణాలు, అవినీతిపై నిత్యం వార్తలు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014 నుంచి రూ.లక్షల కోట్లు ఆదా చేశాం. సంక్షేమ పథకాల విషయంలో 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరిపారేశాం. దాంతో రూ.3 లక్షల కోట్లు ఆదా చేశాం. ప్రజల డబ్బును దేశ నిర్మాణం కోసమే ఖర్చుపెడుతున్నాం. వివిధ పథకాల కింద రూ.40 లక్షల కోట్లను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశాం. కులం గురించి మాట్లాడడం ఫ్యాషనైపోయింది మా ప్రభుత్వం ఇటీవల అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.2 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండేది కాదు. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.12 లక్షలకు పెంచాం. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించాం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. దీనివల్ల పేదలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాం. ప్రతి రంగంలోనూ వారికి మరిన్ని అవకాశాలు కలి్పస్తున్నాం. కులం గురించి మాట్లాడడం కొందరికి ప్యాషనైపోయింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల కోసం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను భారీగా పెంచాం. వేలాది సీట్లు వారికి అందుబాటులోకి వచ్చాయి. మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుంచి 780కి చేరింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
లోక్‌సభలో రాహుల్‌పై మోదీ విమర్శలు!
ఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో పసలేదంటేంటూ సోనియా, అందుకు వంత పాడిన రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ లోక్‌సభలో పరోక్షంగా స్పందించారు. లోక్‌సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు మోదీ ప్రసంగిస్తూ.. కొంతమంది నేతలు పేదలతో ఫొటో సెషన్ చేస్తారు. సభలో అదే పేదల గురించి మాట్లాడితే ఆ నేతలే ఫేస్‌ని విసుగ్గా పెడతారంటూ..కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. నాలుగోసారి దేశ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. నాలుగో సారి దేశ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. వికసిత్ భారత్ మా లక్ష్యం.10ఏళ్లలో 25కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు. వికసిత్ భారత్ సాధనే మా లక్ష్యం. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగిస్తాం. ప్రజల కష్టాలు తెలిసిన వారికే అభివృద్ధి సాధ్యమవుతుంది. నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం. 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించాం. ఐదేళ్లలో 12 కోట్ల మందికి మంచినీటి సౌకర్యం కల్పించాం. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో మేం ఏ ఒక్క తప్పుడు హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. కొందరు శీష్‌మహల్ కోసం అవినీతి చేస్తారు.ఇప్పుడు నగదు బదిలీద్వారా ప్రజలకు నేరుగా నగదు అందుతుంది.మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యం. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అంటూ స్లోగన్లు మాత్రమే ఇచ్చేవి. మేం 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేంశాం. రాష్ట్ర ప్రసంగం కొంతమందికి బోర్‌గా అనిపించింది. బీజేపీ పాలనలో ఎలాంటి స్కాం జరగలేదు. మా హయాంలో దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాం.గతంలో స్కాంలు గురించి వినేవాళ్లం. కానీ ఇప్పుడు స్కాంలు లేవు. కేవలం అభివృద్ధి గురించి మాట్లాడుకుటుంటున్నాం. ప్రపంచ గేమింగ్ రాజధానిగా భారత్ మారుతోంది. కొన్ని పార్టీలు ఎన్నికల వేళ హామీలు ఇస్తున్నాయి. తప్పుడు హామీలు ఇచ్చి యువతను మోసం చేస్తోంది. ప్రలోభాలకు గురిచేస్తోంది. అందుకే హర్యానాలో బీజేపీని మూడోసారి గెలిపించారు. ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని తప్పకుండా నెరవేర్చుంతుంది. రాజ్యంగం అంటే బీజేపీకి ప్రాణం. రాజ్యంగం విలువలకు ప్రాధాన్యం ఇస్తుంది.కొందరు నేతలు లగ్జరీగా ఉండాలని అనుకుంటారు. ఖరీదైన షవర్లు, బాత్‌టబ్‌లు కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి పేదల గరించి ఏం తెలుస్తోంది. కొంతమందికి బంగ్లాలు కొనుగోలు చేయడంపైనే ఫోకస్ చేస్తారు. మేం ఇంటింటికి నల్లాలు ఇచ్చే దానిపై ఫోకస్ పెట్టాం’’ అని వ్యాఖ్యానించారు. -
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం
-
పార్లమెంట్ సమావేశాలు.. కుంభమేళాపై చర్చకు విపక్షాల ఆందోళన
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష పార్టీల ఎంపీలు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై చర్చకు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో, సభలో నిరసనలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజులు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో భాగంగా మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై ప్రభుత్వం చర్చకు రావాలని విపక్ష పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విపక్ష ఎంపీలు సభను హోరెత్తించారు. దీంతో, ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభ్యులను కోరారు. అనంతరం, రాజ్యసభ నుంచి ప్రతిపక్ష నేతలు వాకౌట్ చేశారు. All Opposition parties' MPs in Rajya Sabha walkout from the House over the issue Prayagraj Mahakumbh stampedePhoto source: Sansad TV/YouTube pic.twitter.com/ekGB0qYIJN— ANI (@ANI) February 3, 2025మరోవైపు.. లోక్‌సభలో సైతం సభ్యులు కుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టారు. ఈ సందర్భంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, విపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ.. నినాదాలు ఆగలేదు. ఈ పరిస్థితుల మధ్యే లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి #WATCH | Opposition MPs in Lok Sabha raise slogans against Uttar Pradesh's Yogi Adityanath government over Maha Kumbh stampede issue (Video source: Sansad TV/YouTube) pic.twitter.com/8Fl2KXlY9a— ANI (@ANI) February 3, 2025 -
పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం.. విపక్ష సభ్యుల ఆందోళన
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఏడాదికి సంబంధించి బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో, విపక్ష నేతల నిరసనల మధ్య నిర్మల.. ప్రసంగిస్తున్నారు. అనంతరం, విపక్ష పార్టీల నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగాన్ని విపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీప్ అఖిలేష్ యాదవ్, పార్టీ సభ్యులు నిరసనలు తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో, స్పీకర్ వారిని నినాదాలు ఆపాలని సూచించారు. అయినప్పటికీ వారు ఆందోళనలను ఆపలేదు. అనంతరం, సభ నుంచి సభ్యులు వాకౌట్ చేసినట్టు తెలుస్తోంది. #WATCH | #UnionBudget2025 | MPs from the opposition parties walk out of Lok Sabha as Finance Minister Nirmala Sitharaman reads her budgetary speechShe began her budgetary speech amid protests by Samajwadi Party MPs including party chief Akhilesh Yadav(Source - Sansad TV) pic.twitter.com/O0qcgw3BS4— ANI (@ANI) February 1, 2025 #WATCH | Union Finance Minister Nirmala Sitharaman begins her budget speech amid protest by Samajwadi Party MPs including party chief Akhilesh Yadav(Source - Sansad TV) pic.twitter.com/8YrrXSRgzR— ANI (@ANI) February 1, 2025 -
మూడో పర్యాయం.. మూడింతల వేగం
న్యూఢిల్లీ: దేశ అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ వేగంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు, విధానాలను అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో వేగంగా మూడు రెట్లు పెరిగిందని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా అంకితభావంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభ చాంబర్లో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. 60 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రగతి ప్రయాణంలో అమృతకాలం నడుస్తోందని, ఇప్పటిదాకా సాధించిన అపూర్వమైన విజయాలతో ప్రభుత్వం దేశానికి నూతన శక్తిని ఇచ్చిందని తెలిపారు. మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో భక్తులు మరణించడం పట్ల రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళులరి్పంచారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. ద్రౌపదీ ముర్ము ప్రసంగం ఆమె మాటల్లోనే... అప్పుడే అభివృద్ధికి సార్థకత శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో వంద రాకెట్ ప్రయోగాలు పూర్తిచేయడం ప్రశంసనీయం. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగన్‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజు ఇక ఎంతోదూరంలో లేదు. కోవిడ్–19 మహమ్మారి, ఇతర దేశాల్లో యుద్ధాలు, తద్వారా అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. మన బలాన్ని ఆర్థిక వ్యవస్థ చాటి చెబుతోంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఒకే దేశం.. ఒకే పన్ను అనే విధానంతో జీఎస్టీని తీసుకొచ్చింది. దీనితో అన్ని రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతున్నాయి. అభివృద్ధి ఫలాలు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి సైతం అందాలి. అప్పుడే ఈ అభివృద్ధికి ఓ సార్థకత ఉంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. సౌభాగ్య యోజన కింద 80 కోట్ల మందికి రేషన్ సరుకులు అందజేస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో తాము గౌరవంగా జీవించగలమన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తే.. పేదరికాన్ని జయించగలమన్న ధీమా వారిలో పెరుగుతుంది. ప్రభుత్వ కృషితో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వారంతా ఒక నూతన మధ్యతరగతి వర్గంగా మారారు. దేశ పురోభివృద్ధికి వారు ఒక చోదకశక్తి. డిజిటల్ విప్లవంలో ముందంజ భారతదేశ సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. భౌతికమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే సామాజిక మౌలిక సదుపాయాల విప్లవంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత పదేళ్లలో ప్రగతిలో కొత్త అధ్యాయం లిఖించింది. డిజిటల్ విప్లవంలో మనం ముందంజలో ఉన్నాం. డిజిటల్ టెక్నాలజీ రంగంలో ఇండియా అతిపెద్ద గ్లోబల్ ప్లేయర్‌గా అవతరించింది. మన దేశంలో ప్రజలకు 5జీ సరీ్వసులు అందుతున్నాయి. ఇక మన డిజిటల్ చెల్లింపులు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో 50 శాతానికి పైగా రియల్–టైమ్ డిజిటల్ లావాదేవీలు మనదేశంలోనే జరుగుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి డిజిటల్ టెక్నాలజీని ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకుంటోంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ‘మహిళల సారథ్యంలో ప్రగతి’ అనేది ప్రభుత్వ విధానం. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోంది. 91 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆయా సంఘాలకు రూ.9 లక్షల కోట్లు అందజేసింది. వారు ఆర్థిక స్వాతంత్య్రం గణనీయంగా పెంచుకుంటున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యంతో నారీశక్తి వందన్ అధినియంను ప్రభుత్వం తీసుకొచ్చింది. రైల్వే నెట్వర్క్ ద్వారా కన్యాకుమారితో కశీ్మర్ అనుసంధానమైంది. ఉధంపూర్–బారాముల్లా–శ్రీనగర్ రైలు ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా 71 వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాన నగరాల సమీపంలో 100కుపైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.28,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని కేంద్రం సంకల్పించింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023–14లో దేశంలో రికార్డు స్థాయిలో 322 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం రైతులకు రూ.41,000 కోట్లు అందజేసింది. పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ మన దేశంలోనే ఉంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. రూ.8,000 కోట్లతో అదనంగా 52,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నూతన పరిపాలనా విధానానికి సంస్కరణ, పనితీరు, మార్పు అనేవి పర్యాయ పదాలుగా మారాయి’’ అని రాష్ట్రపతి ముర్ము స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలపై ముందడుగు‘‘బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అహరి్నశలూ కృషి చేస్తోంది. పేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వబోతోంది. గ్రామీణులకు ప్రాపర్టీ కార్డులు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. 70 ఏళ్లు దాటినవారిలో 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం వర్తింపజేస్తోంది. కీలకమైన జమిలి ఎన్నికలతోపాటు వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రభు త్వం ముందడుగు వేసింది. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ మాత్రం ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థిరత్వంలో ఒక మూలస్తంభంగా నిలిచింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. భారతదేశ బలాలు, విధానాలు, ఉద్దేశాల పట్ల ప్రపంచ దేశాలు విశ్వాసం కనబరుస్తున్నాయి. క్వాడ్, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థతోపాటు జీ20లో ఇండియాదే కీలకపాత్ర. సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకంఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసు. తాము ఒంటరిమన్న భావనను వారిలో తొలగించడానికి కృషి చేస్తోంది. ఈశాన్యంలో శాంతి సాధన కోసం పదికిపైగా ఒప్పందాలు కుదిరాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకం. దేశమంతటా అన్ని ప్రాంతాలూ సమానంగా పురోగతి సాధించాలన్నదే కేంద్రం ఉద్దేశం. అండమాన్, నికోబార్ దీవులు, లక్షదీవుల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది. అందరికీ నాణ్యమైన వైద్య సేవలుసమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు తక్కువ రుసుముతో నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ చర్యలతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే ఐదేళ్లలో మెడికల్ కాలేజీల్లో కొత్తగా 75 వేల సీట్లు రాబోతున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత పదేళ్లలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. వాటిలో నాణ్యత కూడా మెరుగుపడింది.మధ్య తరగతికి సొంత గూడుప్రభుత్వ పథకాలతో దళితులు, గిరిజనులు, బీసీలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో వారు భాగస్వాములవుతున్నారు. సొంత గూడు కలిగి ఉండాలన్నది మధ్య తరగతి ప్రజల కల. దాన్ని నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గృహరుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు తావులేకుండా ‘రెరా’ వంటి చట్టాలు తీసుకొచ్చింది. ‘అందరికీ ఇళ్లు’ అనేది ప్రభుత్వ లక్ష్యం. -
పార్లమెంట్ ముందుకు ఎకనామిక్ సర్వే
-
పాతిక లక్షల జనాభాకో లోక్ సభ సీటు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోని ప్రధాన దేశాలతో పోల్చితే ఒక లోక్‌సభ (దిగువ సభ) సీటుకు సగటు జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమే. మిగిలిన ప్రధాన దేశాల్లో ఒక లోక్‌సభ స్థానానికి సగటు జనాభా అతి తక్కువ అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ఆధారంగా వివిధ దేశాల్లో దిగువ సభకు సీట్లు, ఒక సీటుకు జనాభా, మహిళల ప్రాతినిధ్యం, ఓటింగ్ శాతాలను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. భారత దిగువ సభలో ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా 25.7 లక్షలు ఉండగా.. అమెరికాలో 7.3 లక్షలే ఉన్నట్లు తెలిపింది. ఇండోనేషియాలో 4.8 లక్షలు, జర్మనీ, ఫ్రాన్స్‌లో 1.2 లక్షల జనాభానే ఉందని తెలిపింది. మిగతా దేశాలతో పోల్చితే మన లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని నివేదిక తెలిపింది. అయితే భారత్ సహా ప్రధాన దేశాలన్నింటిలో ఓటింగ్ శాతం దాదాపు సమానంగా ఉన్నట్లు వెల్లడించింది. ఓటింగ్ శాతంలో త్వరలోనే భారత్ ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన చేరవచ్చునని తెలిపింది. దిగువ సభ ఓటింగ్ శాతం జర్మనీలో అత్యధికంగా ఉండగా, ఆ తరువాత ఫ్రాన్స్, స్పెయిన్, భారత్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
రాహుల్ గాంధీకి కోర్టు నోటీసులు
లక్నో : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బరేలీ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పంకజ్ పాఠక్ అనే వ్యక్తి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. రాహుల్ వ్యాఖ్యలు దేశంలో అంత్యర్ధం, విభజన, అశాంతిని ప్రేరేపించే అవకాశం ఉందని, న్యాయపరమైన జోక్యం అవసరమని ఆరోపిస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ముందుగా ప్రత్యేక ఎంపీ,ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తిరస్కరించింది. దీంతో తాజాగా తాను జిల్లా కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు పంపినట్లు పిటిషనర్ తెలిపారు.#WATCH | Uttar Pradesh: Bareilly District Court issues notice to Lok Sabha LoP and Congress MP Rahul Gandhi over his statement on caste census. Petitioner, Pankaj Pathak says "We felt that the statement given by Rahul Gandhi during the elections on caste census was like an… pic.twitter.com/Es8rxilbTU— ANI (@ANI) December 22, 2024 హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోహైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ గాందీ మాట్లాడారు. బీజేపీపై విమర్శులు గుప్పిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామని చెప్పారు. “ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), మైనారిటీలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి మొదట దేశవ్యాప్త కుల గణనను నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తాం’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పిటిషనర్ కోర్టుకు వెళ్లినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
లోక్ సభ నిరవధికంగా వాయిదా
-
లోక్‌సభ నిరవధిక వాయిదా
ఢిల్లీ : లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు. విపక్ష నేతల నిరసనకు పోటా పోటీగా ఎన్డీయే కూటమి నేతలు సైతం ప్లకార్డ్‌లతో ఆందోళనకు దిగారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. Lok Sabha adjourned sine die pic.twitter.com/5jgpBbnNjn— ANI (@ANI) December 20, 2024నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశం మొదటి వారంలో పలు మార్లు వాయిదా పడింది. రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై డిబేట్,బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం, ప్రియాంక గాంధీ లోక్‌సభ అరంగేట్రం వంటి అనేక అంశాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన చర్చకు దారి తీశాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం తొలి వారంలో గౌతమ్ అదానీపై అమెరికా వేసిన అభియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేయడంతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో నిరసనలకు దారి తీసింది. ఈ సెషన్లోనే 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుపై చర్చ జరిగింది. జమిలి ఎన్నికలపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఇవాళ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లోక్ సభ పంపంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం వీగింది. ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, 14 రోజుల నోటీసు లేకపోవడం,డ్రాఫ్టింగ్‌లో లోపాలతో సహా విధానపరమైన కారణాలతో అవిశ్వాస తీర్మానాన్ని పక్కన పెట్టారు. -
లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
లోక్‌సభలో జమిలి బిల్లులు
కీలక ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఏక కాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు జమిలి బిల్లులను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని రాజ్యాంగంపైనే దాడిగా విపక్షాలు అభివర్ణించాయి. మోదీ సర్కారుది ఫక్తు నియంతృత్వ ధోరణి అంటూ మండిపడ్డాయి.అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. చివరికి వ్యవహారం ఓటింగ్ దాకా వెళ్లింది. జమిలి బిల్లులపై జేపీసీలో కూలంకషంగా చర్చిద్దామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినా విపక్షాలు శాంతించలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేదని తెలిసీ మోదీ సర్కారు విఫలయత్నం చేస్తోందని ఎద్దేవా చేశాయి.న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ రాజ్యాంగ (129వ సవరణ) సవరణ బిల్లును సభ ముందుంచారు. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అంటూ కాంగ్రెస్ తదితర విపక్షాలు దుయ్యబట్టాయి. వాటి అభ్యంతరాలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రాలు అనుభవిస్తున్న ఏ అధికారాలనూ ఈ బిల్లు తగ్గించబోదని స్పష్టం చేశారు.దాదాపు 90 నిమిషాల పాటు అధికార, ప్రతిపక్షాల నడుమ వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, తృణమూల్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), మజ్లిస్ తదితర పార్టీలు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిపై ఓటింగ్‌కు పట్టుబట్టాయి. దాంతో ఎల్రక్టానిక్, పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్ జరిగింది. 269 మంది అనుకూలంగా ఓటేయడంతో బిల్లులను ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా ఏకంగా 198 మంది ఓటేయడం విశేషం. నూతన పార్లమెంటు భవనంలో ఎల్రక్టానిక్ ఓటింగ్ వ్యవస్థను ఉపయోగించడం ఇదే తొలిసారి. కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టారు.పుదుచ్చేది, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభతో పాటే నిర్వహించేందుకు వీలు కల్పించడం దీని ఉద్దేశం. ప్రతిపాదిత బిల్లులు మౌలిక నిర్మాణ సూత్రానికి గొడ్డలిపెట్టన్న విపక్షాల ఆరోపణలు నిరాధారాలని మేఘ్వాల్ అన్నారు. రాజ్యాంగ సార్వభౌమత్వం, దాని సమాఖ్య–లౌకిక స్వభావాలు, కేంద్ర–రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, న్యాయసమీక్ష వంటి కీలక సూత్రాలకు ఈ బిల్లుల ద్వారా అణుమాత్రం కూడా మార్పులు చేయబోవడం లేదని స్పష్టం చేశారు. విపక్షాల ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశపూరితాలని విమర్శించారు.వాటిని విపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. బిల్లుపై తమ అభ్యంతరాలను వారంతా సభ ముందుంచారు. వాటిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. జమిలి బిల్లుపై ప్రతి దశలోనూ లోతైన చర్చ జరగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని తెలిపారు. ‘‘జమిలి బిల్లులు కేంద్ర మంత్రివర్గం ముందుకు వచ్చినప్పుడు మోదీ అదే చెప్పారు. లోతైన చర్చ నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపాలని అభిప్రాయపడ్డారు’’ అని మంత్రి వెల్లడించారు. డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు కూడా వాటిపై జేపీసీ పరిశీలన కోరారని గుర్తు చేశారు.‘‘రాజ్యాంగ (129వ సవరణ) బిల్లుపై జేపీసీలో విస్తృతంగా చర్చ చేపట్టవచ్చు. అనంతరం జేపీసీ ఇచ్చే నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. తదనంతరం బిల్లుపై పార్లమెంటులో మరోసారి మనమంతా చర్చించుకోవచ్చు’’ అని విపక్షాలకు సూచించారు. రెండు బిల్లులను జేపీసీకి నివేదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెడతానని మేఘ్వాల్ ప్రకటించారు. ఆ మేరకు బుధవారం తీర్మానం లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశముంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సాధారణ మెజారిటీ చాలు.కానీ అవి గట్టెక్కాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రస్తుతం రెండు సభల్లోనూ అంతటి మెజారిటీ లేదు. జమిలి ఎన్నికలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ముందు 32 పార్టీలు ప్రతిపాదనకు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించడం తెలిసిందే.మూడొంతుల మెజారిటీ ఏదీ?జమిలి బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలిందని కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ అన్నారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి? ఇందులో ఏమన్నా అర్థముందా?’’ అని ప్రశ్నించారు. సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోదీ సర్కారు ప్రయతి్నంచిందని మనీశ్ తివారీ మండిపడ్డారు. ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అన్నారు. పాలనలో స్థిరత్వానికే: కేంద్రంజమిలి ఎన్నికలు భారత్‌కు కొత్తేమీ కాదని కేంద్రం పేర్కొంది. 1951 నుంచి 1967 దాకా అన్ని రాష్ట్రాల శాసనసభలకూ లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. ‘‘పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువుకు ముందే రద్దవడం వల్ల 1968, 1969 నుంచి జమి లికి బ్రేక్ పడింది’’ అని మంగళవారం ఉదయం లోక్‌సభలో జమిలి బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నాలుగో లోక్‌సభ కూడా 1970లో గడువుకు ముందే రద్దయింది. దాంతో 1971లో సాధారణ ఎన్నికలు జరిగి ఐదో లోక్‌సభ కొలువుదీరింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో దాని గడువును ఆర్టీకల్ 352 సాయంతో 1977 దాకా పొడిగించారు.అనంతర కాలంలో ఆరో, ఏడో, తొమ్మిదో, 11వ, 12వ, 13వ లోక్‌సభలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయి. ‘‘పలు రాష్ట్రాల్లో శాసనసభలకూ అదే పరిస్థితి ఎదురవుతూ వస్తోంది. దాంతో తరచూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరిగే పరిస్థితి నెలకొంది. దాంతో పార్టీలు, నేతలు, చట్టసభ్యులు, అధికారులు పాలనను పక్కన పెట్టి ఎన్నికలను ఎదుర్కోవడంలో గడపాల్సి వస్తోంది. అందుకే కోవింద్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా దేశ ప్రయోజనాల రీత్యా జమిలి ఎన్నికలను తిరిగి పట్టాలపైకి తేవాలని సంకల్పించాం. పాలనలో స్థిరత్వానికి అది వీలు కల్పిస్తుంది’’ అని కేంద్రం వివరించింది. రాజ్యాంగంపై దాడి: కాంగ్రెస్జమిలి బిల్లులను రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడిగా కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ అభివర్ణించారు. వాటిని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదని ఆయన గుర్తు చేశారు. ‘‘జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణిత కాలావధి కల్పించే ఆర్టీకల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుంది. కనుక సమాఖ్య వ్యవస్థ మౌలిక లక్షణమైన ప్రజాస్వామ్య నిర్మాణపు పునాదులనే ఈ బిల్లులు కదిలిస్తాయి’’ అని వాదించారు. దేశంలో నియంతృత్వాన్ని తేవడమే బీజేపీ ఉద్దేశమని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ ఆరోపించారు.అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును న్యూనతపరచడమేనని తృణమూల్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. తమకు నచి్చన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని టీఆర్ బాలు గుర్తు చేశారు. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదన్నారు. బిల్లులపై మాట్లాడేందుకు అధికార పక్ష సభ్యులకే స్పీకర్ ఓం బిర్లా ఎక్కువగా అవకాశమిస్తున్నారని విపక్ష సభ్యులు అభ్యంతరం వెలిబుచ్చడం ఉద్రిక్తతకు దారితీసింది.‘‘పార్లమెంటుకు మీరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారా? ఆ హక్కు ప్రతి పార్టీకీ ఉంది’’ అంటూ రిజిజు దుయ్యబట్టారు. బిల్లులకు బేషరతుగా మద్దతిస్తున్నట్టు బీజేపీ మిత్రపక్షాలు శివసేన (షిండే), టీడీపీ ప్రకటించాయి. బిల్లులను జేపీసీకి పంపాలని సుప్రియా సులే (ఎన్సీపీ–ఎస్పీ) కోరారు. ఈ బిల్లులు ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనమని అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్) ఆరోపించారు. -
లోక్‌సభలో ‘జమిలి ఎన్నికల’ బిల్లు.. సొంత పార్టీ ఎంపీలకు బీజేపీ నోటీసులు
ఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలపై బీజేపీ అధిష్టానం ఫైరయ్యింది. సుమారు 20మంది ఎంపీలకు బాధ్యతారాహిత్యం కింద నోటీసులు జారీ చేసింది.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. ఎన్డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది. అయితే, లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో 20మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరయ్యారు.గతంలోనే, జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో లోక్‌సభ సభ్యులు సభకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎంపీలు చర్చలో పాల్గొనలేదు. BIG BREAKING NEWS 🚨 One Nation One Election Bill accepted in Lok Sabha despite MASSIVE opposition by Opposition Parties.269 votes in favour and 198 votes against it.According to the bill, the “appointed date” will be after the next Lok Sabha elections in 2029, with… pic.twitter.com/xRBHnXGEBA— Times Algebra (@TimesAlgebraIND) December 17, 2024రాజ్యాంగాన్ని సవరించి ఏకకాలంలో పార్లమెంటరీ, రాష్ట్రాల ఎన్నికలను అనుమతించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాదు. కానీ, ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. జమిలి ఎన్నికలు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని, అందుకు ఆ 20 మంది బీజేపీ ఎంపీల తీరేనని ఆరోపిస్తోంది. నియమావళి ప్రకారం బిల్లులు సాధారణ మెజారిటీతో ఆమోదం లభించింది. 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది వ్యతిరేకించారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు -
బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన 149 మంది సభ్యులు
-
జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీ
-
జమిలి బిల్లుకు వేళాయే..వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ
-
నేడు లోక్‌సభలో జమిలి బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు వాటిని లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు. 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.ఆ సదుపాయమూ ఉందిజమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏదైనా రాష్ట్ర శాసనసభకు లోక్‌సభతో పాటుగా ఎన్నికలు జరపలేని పరిస్థితి ఎదురైతే ఎలా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సదరు అసెంబ్లీకి లోక్‌సభ అనంతరం ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు వీలు కల్పిస్తూ బిల్లులో సెక్షన్ 2, సబ్ క్లాజ్ 5లో నిబంధన పొందుపరిచారు. -
స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో... రాజ్యసభపై లోక్‌సభ విజయం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది. రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్‌ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్‌సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్‌లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్‌సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. -
లోక్ సభలో కాంగ్రెస్ పై మోదీ ఫైర్
-
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం
కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. గాంధీ-నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగ రక్తాన్ని కళ్లజూసిందని మండిపడ్డారు.
-
మోదీ ప్రసంగం... యమా బోరు: ప్రియాంక
న్యూఢిల్లీ: లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం విసుగు తెప్పించిందని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని ప్రసంగంలో కొత్త విషయం ఒక్కటీ లేదు. అన్నీ దశాబ్ధాల నాటి పాత విషయాలు. రెండు గణితం క్లాసులు ఒకేసారి విన్నంత బోర్‌గా ఫీలయ్యా’’ అన్నారు. ‘‘మోదీ ప్రసంగం చూసి జేపీ నడ్డా చేతులు నలుపుకున్నారు. అమిత్ షా తలపట్టుకున్నారు. పీయూష్ గోయెల్ నిద్రమత్తులోకి వెళ్లారు. ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు. మోదీ కొత్త అంశాలను ఆసక్తికరంగా చెప్పి ఉండాల్సింది’’ అన్నారు. ‘‘విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మోదీ, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సభలో ఎందుకు లేరు? అవినీతిని ఉపేక్షించమంటూ చెప్పే ప్రభుత్వం అదానీ అంశంపై చర్చకు ఎందుకు అంగీకరించడం లేదు’’ అని ఆమె ప్రశ్నించారు. -
నెహ్రూ, గాంధీ కుటుంబ పాలనలో... రాజ్యాంగానికి గాయం
కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. ‘‘గాంధీ–నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్లజూసింది. ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని పదేపదే గాయపరుస్తూనే ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘అవి దేశ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు వంటి విషపు విత్తనాలు నాటాయి. దేశ ఐక్యతనే దెబ్బతీశాయి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగాన్ని ఆ కుటుంబం సవాలు చేసింది. అందుకే 55 ఏళ్లు అధికారం వెలగబెట్టిన నెహ్రూ–కుటుంబాన్ని ఓడించి ఇంటిబాట పట్టించాం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని అన్నారు. ‘‘2014 నుంచి మా నిర్ణయాలు, విధానాలన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి. రాజ్యాంగం నిర్దేశించిన బాటలో నడుస్తున్నాం. దేశ శక్తి సామర్థ్యాలను, ఐక్యతను పెంపొందించాలన్నదే మా ఆశయం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చేశారు రాజ్యాంగాన్ని దెబ్బకొట్టడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం ఎన్నో కుట్రలు చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ ప్రధానులుగా రాజ్యాంగాన్ని దెబ్బ తీయాలని చూశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా రాజ్యాంగాన్ని నెహ్రూ సవరించారు. ఇక ఆయన కుమార్తె ఇందిర ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. పదవులు కాపాడుకోవడానికి రాజ్యాంగంలో సవరణ చేశారు. న్యాయ వ్యవస్థ గొంతు కోశారు. దేశాన్నే జైలుగా మార్చేశారు. ఎమర్జెన్సీ మచ్చ ఎన్నటికీ చెరిగేది కాదు. ఆమె కుమారుడు రాజీవ్ కూడా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టానికి సవరణలు తెచ్చారు. నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన తర్వాతి తరమూ రాజ్యాంగంపై అదే ఆట ఆడుతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన జీవోను ఓ అహంకారి (రాహుల్) ఏకంగా చించిపారేశారు. యూపీఏ హయాంలో సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించింది. ప్రధాని మన్మోహన్‌ను మించిన అధికారులు చలాయించింది. దేశ ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని మతం, విశ్వాసం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనను రాజ్యాంగ రూపకర్తలు పరిగణనలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ మాత్రం అధికార యావతో, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది’’ అంటూ తూర్పారబట్టారు. ఆ నినాదం.. అతిపెద్ద మోసం కాంగ్రెస్ ఇచి్చన గరీబీ హఠావో నినాదాన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద మోసంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఆ నినాదం లేకుండా కాంగ్రెస్ బతకలేదు. నాలుగు తరాలుగా దాన్నే నిత్యం వినిపిస్తున్నారు. కానీ ఆ నినాదంతో కాంగ్రెస్ రాజకీయంగా లాభ పడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. మా ప్రభుత్వం వచ్చాక మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాం. కాంగ్రెస్ నాయకులు పేదలను, పేదరికాన్ని కేవలం టీవీల్లో, పేపర్లలో చూసుంటారంతే. అసలైన పేదలు, అసలైన పేదరికం అంటే ఏమిటో వారికి తెలియదు’’ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగమే ఐక్యతా సాధనం సాధారణ కుటుంబాల్లో జని్మంచిన తనవంటి ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరారంటే రాజ్యాంగ బలమే కారణమని మోదీ అన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చాక దేశం ముక్కలవుతుందన్న భయాలుండేవి. వాటిని అధిగమించి ఐక్యంగా ఈ స్థాయికి చేరామంటే ఆ ఘనత రాజ్యాంగానిదే. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాక దేశ ప్రయాణం అద్భుతంగా, అసాధారణంగా సాగింది. మన ప్రాచీన ప్రజాస్వామ్య మూలాలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మన అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే తల్లి వంటిది. మన ఐక్యతకు నిస్సందేహంగా రాజ్యాంగమే ఆధారం. మహిళలకు ఓటు హక్కు రాజ్యాంగం వల్లే వచ్చింది. మహిళల ఆధ్వర్యంలోనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది’’ అని ఉద్ఘాటించారు. ‘‘నేను గుజరాత్ సీఎంగా ఉండగా రాజ్యాంగ 60 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాం. రాజ్యాంగ ప్రతిని ఏనుగుపై ఊరేగించాం. రాజ్యాంగ ఔన్నత్యాన్ని గౌరవిస్తూ చెప్పుల్లేకుండా ఏనుగు వెంట నడిచా’’ అని గుర్తు చేసుకున్నారు. 11 తీర్మానాలు ప్రధాని మోదీ లోక్‌సభలో 11 తీర్మానాలు ప్రతిపాదించారు. 1. ప్రతి ఒక్కరూ సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలి. అధికార యంత్రాంగం విధులకు కట్టుబడి ఉండాలి. 2. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకృతాభివృద్ధికి కృషి చేయాలి. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. 3. అవినీతిని తిరస్కరించాలి. దానిపై యుద్ధం చేయాలి. అవినీతిపరులకు సమాజంలో స్థానం లేదు. 4. మన చట్టాలను, నియమ నిబంధనలను గర్వకారణంగా భావించాలి. దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న చట్టాలను అంతా గౌరవించాలి. 5. వలసవాదానికి తలవంచే మనస్తత్వం నుంచి బయటకు పడాలి. మన సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం మనకు గర్వకారణం. 6. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి. పాలనలో బంధుప్రీతిని పక్కనపెట్టి ప్రతిభావంతులకే అవకాశం కలి్పంచాలి. 7. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదు. 8. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు. మతాధారిత రిజర్వేషన్లకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలి. 9. లింగ సమనత్వాన్ని, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. 10. ప్రాంతీయాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇదే మన మంత్రం. 11. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్. దేశం ఎప్పటికీ ఐక్యంగా ఉండాలి. ప్రజలంతా కలిసుంటేనే భారత్ గొప్పదేశంగా మారుతుంది.