loss of life
-
బాబు సర్కార్ మొద్దు నిద్ర.. విజయవాడ వరదల్లో భారీ ప్రాణనష్టం
సాక్షి, విజయవాడ: వరదలు సమాచారం ఉన్నా కానీ చంద్రబాబు సర్కార్ అలర్ట్ చేయకపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. 45 మంది మరణించినట్టు కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒక్క విజయవాడ నగరం, రూరర్లోనే 25 మంది మృతి చెందగా, ఎన్టీఆర్ జిల్లాలో వరదలకు 35 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉంది. 8 రోజులుగా వరద ముంపులోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఉపద్రవం ముంచుకొస్తుంటే పాలకులు మొద్దునిద్రలో ఉండటం వల్లనే విజయవాడలో వరదలకు భారీ నష్టం వాటిల్లింది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిన పాపాన్ని ఈ ప్రభుత్వం మూటకట్టుకుంది. విజయవాడ, ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారీ వరద రానుందని భారత వాతావరణ శాఖ (ఐంఎండీ) గత నెల 28నే (బుధవారం) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది.కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. శుక్రవారం, శనివారం వర్షాలు కురుస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. శనివారం(31వ తేదీ) రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అర్థరాత్రి దాటిన తరువాత భారీ వరద ముంచెత్తి విలయం సృష్టించి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది.సంబంధింత వార్త: వరదను మించిన విపత్తు బాబే!విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో వేలాదిమంది బాధితులు ఆకలి కేకలు పెడుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది నాలుగైదు రోజులుగా కనీసం అన్నం కూడా కడుపునిండా తినకుండా వరదల్లో కొట్టుమిట్టాడిన దయనీయ దృశ్యాలు అడుగడుగునా కనిపించాయి. -
ప్రకృతి శాపమా? మన పాపమా?
దేవతల రాజ్యంగా పేరుబడ్డ కేరళలోని సుందరమైన వయనాడ్ ప్రకృతి ఆగ్రహానికి గురై శ్మశాన స్థలిగా మారిన దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా భావోద్వేగం కలగకమానదు. జూలై 29 సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో అందరూ ఆదమరిచి నిద్రిస్తున్న వేళ భారీ వాన, ఉరుము లేని పిడుగులా వరుసగా భారీయెత్తున కొండచరియలు విరిగి మీద పడడంతో కేరళ ఉత్తర ప్రాంతంలోని ఆ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. కళ్ళుపొడుచుకున్నా కనిపించని చీకటిలో, ఏం జరుగుతోందో తెలిసే లోపల ఇళ్ళు కూలిపోయాయి. నిలువెత్తు బురదలో మునిగి, గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఘటనాస్థలి నుంచి కొన్ని పదుల కిలోమీటర్ల వరకు మనుషులు కొట్టుకు పోయి, ఛిద్రమైన దేహాలతో శవాలై తేలారు. మృతుల సంఖ్య 150 దాటి అంతకంతకూ పెరుగు తున్న వేళ ఇటీవల కొన్నేళ్ళుగా కేరళలో ఆకస్మిక వరదలు, భూపతనాలు పెరిగిపోవడం పట్ల చర్చ మొదలైంది. ఈ విలయంలో ప్రకృతి శాపమెంత? పాలకుల పాపమెంత? గమనిస్తే... గత ఏడేళ్ళలో దేశంలో అత్యధికంగా కొండచరియలు విరిగిపడింది కేరళలోనే! 2015 నుంచి 2022 మధ్య దేశవ్యాప్తంగా 3,782 ఘటనలు జరిగితే, వాటిలో 59.2 శాతం ఘటనలు ఒక్క మలయాళ సీమలోనే సంభవించాయి. 1961 – 2016 మధ్యతో పోలిస్తే, ఇప్పుడు ఏటా ఇలాంటి దుర్ఘటనలు, ప్రాణనష్టం అనూహ్యంగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రకృతితో పాటు మనం కూడా దీనికి కారణమేనని నిపుణులు, శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా వాతావర ణంలో వస్తున్న మార్పులూ దానికి వచ్చి చేరాయి. వాతావరణ మార్పుల వల్ల కేరళపై కమ్ముకుంటున్న క్యుములోనింబస్ మేఘాలు హఠాత్తుగా భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. అసలు కేరళలో దాదాపు సగం... భౌగోళికంగా 20 డిగ్రీలకు మించిన ఏటవాలు భూముల ప్రాంతం. అందువల్ల నేలకోత, కొండచరియలు విరిగిపడడం ఎక్కువే! దానికి తోడు కొండరాళ్ళను పట్టి ఉంచే మట్టి వదు లుగా మారి, ముప్పు పెరుగుతోంది. వాలుభూముల్లో భారీగా వానలు వస్తే, పై మట్టి బాగా వదు లైపోయి, కొండచరియలు పతనమై ప్రాణాంతకమవుతాయి. వయనాడ్‌లో ఇప్పుడు జరిగింది అదే!వయనాడ్ జిల్లాలో చిన్న పట్నమైన ముండక్కాయ్ లాంటి వాటి పరిస్థితి మరీ ఘోరం. కొండ చరియలు విరిగిపడిన ఘటనల నుంచి గత నాలుగు దశాబ్దాల్లో రెండుసార్లు (1984లో, 2019లో) ప్రాణనష్టం, ఆస్తినష్టంతో బయటపడ్డ ఆ పట్నం తాజా విలయంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాన్ని బట్టి తాజా విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 400 మందికి పైగా మరణానికి కారణమైన 2018 నాటి కేరళ వరదల తర్వాత అత్యంత దురదృష్టకరమైన విపత్తు ఇది. నిజానికి, తుపానులు, అధిక వర్షపాతం, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు ఎవరికైనా కీలకం. అనేక ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోఅందుకు అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయని కేంద్ర సర్కారు చెబుతోంది. అంతెందుకు... అధిక వర్ష పాతం గురించి కేరళను అప్రమత్తం చేస్తూ, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందే జూలై 23న ముందస్తు హెచ్చరిక చేశామంటోంది. కేరళ సర్కార్ మాత్రం ప్రమాద స్థాయి తక్కువైన ఆరెంజ్ ఎలర్ట్ మాత్రమే తమకు అందిందని అంటోంది.రాజకీయాలు, పరస్పర నిందారోపణలు పక్కనపెడితే... కేరళ సహా పడమటి కనుమలు వ్యాపించిన ప్రాంతమంతటా ఇలాంటి ప్రమాదాలు పొంచివున్నాయని కొన్నేళ్ళుగా నిపుణులు గగ్గోలు పెడుతున్నారు. 2011లోనే కేంద్రం పడమటి కనుమల పరిరక్షణకై పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ సారథ్యంలో నిపుణుల కమిటీ వేసింది. అరుదైన జీవజాలానికి ఆవాసమైన దట్టమైన అరణ్యా లున్నందు వల్ల గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళలకు విస్తరించిన పడమటి కనుమల్లో 75 శాతం మేర ప్రాంతాన్ని పర్యావరణరీత్యా సున్నితమైనదిగా ప్రకటించాలని కమిటీ సిఫార్సు చేసింది. గాడ్గిల్ కమిటీ నివేదిక ఇచ్చి 13 ఏళ్ళవుతున్నా కేరళ సహా ప్రభుత్వాలేవీ ఆ సిఫార్సుల్ని పాటించలేదు. అదేమంటే, సిఫార్సులు కఠినంగా ఉన్నాయనీ, అభివృద్ధికీ, జీవనోపాధికీ నష్టం చేస్తాయనీ సాకులు చెబుతున్నాయి. పైగా, అభివృద్ధి రేసులో పడి కొండల్ని తొలిచి, భారీ నిర్మాణాలకు దిగాయి. జలవిద్యుత్ కేంద్రాలు చేపట్టాయి. కేరళలో హోటళ్ళు, టూరిస్ట్ రిసార్ట్లు, అక్రమ తవ్వకాలకైతేఅంతే లేదు. సున్నిత పర్యావరణ ప్రాంతాల్లోని ఈ తప్పుడు అభివృద్ధి నమూనాను ఇకనైనా మార్చు కోకపోతే కష్టం. కేరళ, తమిళనాడు, కర్ణాటక – మూడు రాష్ట్రాలకూ కూడలిలో వయనాడ్ అందమైన పర్యాటక ప్రాంతమన్నది నిజమే. దేశదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అనువుగా వసతులు పెంచి, పర్యా టక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలన్న ఆకాంక్షా సహజమే. కానీ, పర్యావరణ రీత్యా అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టి, యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం సాగిస్తే అది మొదటికే మోసమన్న ఇంగితం లేకుంటే ఎలా? ప్రకృతితో సహజీవనం మరిచి, ఇటు చట్టబద్ధంగానూ, అటు చట్టవిరుద్ధంగానూ గనుల తవ్వకాలను అనుమతిస్తే అన్ని రకాలుగా విలయమే తప్ప వికాసం జరుగుతుందా? మనుషుల భద్రత కన్నా మాయదారి వ్యాపారం ఎక్కువా? అందుకే, ఒక్క మాటలో వయనాడ్ విలయం కేవలం ప్రకృతి సృష్టించినది కాదు. మనుషుల దురాశకు ఫలితం. అభి వృద్ధి పేరిట మనం సాగిస్తున్న ప్రకృతి వినాశనం తాలూకు విపరిణామం. మనిషి తన పరిధి, పరి మితి గుర్తెరిగి ప్రవర్తించకపోతే, మనుగడకే ముప్పని చెప్పే నిష్ఠురసత్యం. బాధ్యులమైన అందరం ఇకనైనా కళ్ళు తెరవాలి. ప్రకృతి పునరుజ్జీవనానికి ఆగి ఆలోచించాలి. వయనాడ్ నేర్పే పాఠం అదే! -
క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డారో.. ప్రమాదమే!
కరీంనగర్: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటే.. మరికొందరు ఆన్‌లైన్‌గేమ్స్ ఆడుతూ అదఃపాతాళానికి పోతున్నారు. క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడిన యువత ఎవరిమాట వినకుండా తయారవుతున్నారు. లక్షల రూపాయలు నష్టపోయి పెద్దలకు చెప్పుకోలేక కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రుల ఖాతాల్లో నుంచి దొంగతనాన తీసుకొని అప్పులు చెల్లిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల పెరిగిపోయాయి.నిత్యం ఆన్లైన్లో..ఆండ్రాయిడ్ ఫోన్లు, అన్లిమిటెడ్ డాటా ఉండడంతో ఎవరిని చూసిన నిత్యం ఆన్లైన్లోనే ఉంటున్నారు. రమ్మి, క్యాసినో.. తదితర కొత్తకొత్త పేర్లతో అట్రాక్ట్ చేస్తున్న ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా చేతిలో ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఇలా అలవాటుపడ్డ వాళ్లలో కొందరి మానసిక స్థితి సరిగ్గా లేకుండా పోయింది. మరికొందరైతే పెద్దల మాటలకు ఎదురుచెప్పడం, కుటుంబ సభ్యులపై దాడి చేయడం వంటి స్థితికి చేరుకుంటున్నారు.లాభాలు వస్తున్నాయనే ఆశతో..అప్పుడప్పుడే ఆన్లైన్ గేమ్స్ మొదలుపెట్టిన వారికి మొదటల్లో చిన్నపాటి లాభాలు ఆశచూపుతారు. ఇలా ఆ గేమ్స్‌కు ఆకర్షితులను చేసి క్రమంగా డబ్బులు గుంజుతుంటారు. జిల్లాలో ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడి కుదేలైన కుటుంబాలు అనేకం ఉన్నాయి. అయితే ఇలా నష్టపోయిన కుటుంబాలకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నాయి. తమ కుటుంబం పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయడం లేదు.ఆన్లైన్ గేమ్స్ ఆడి నష్టపోయిన వారు ఇలా..వేములవాడకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రైల్వేశాఖలో విధులు నిర్వర్తించేవాడు. సహచరులతో ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు. అప్పుల పాలు కావడంతో మానసికంగా కుంగిపోయి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు.ఇటీవల వేములవాడలో రూ.2కోట్లతో ఉడాయించిన పూజారి మహేశ్ కూడా ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడని స్నేహితులు తెలిపారు.వేములవాడకు చెందిన యువకులు రాజు, వెంకటేశ్, రమణ, శ్రీనివాస్.. ఆన్లైన్ గేమ్ పేరుతో క్యాసినో తదితర ఆటలవైపు మొగ్గుచూపారు. దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టపోయారు.అవగాహన కల్పిస్తున్నాం..ఆన్లైన్ గేమ్స్, సైబర్‌క్రైమ్‌లపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. కళాబృందాల ద్వారా గ్రామీణులను చైతన్యం చేస్తున్నాం యువత ఆన్లైన్ గేమ్‌లకు బానిస కావడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్కిల్ గేమ్స్ మాత్రమే ఆడాలి. అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపే ఏ గేమ్ కూడా వాడొద్దు. అలాంటి గేమ్స్ వాడితే ఆర్థికంగా నష్టపోతారు. ఇలా ంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలి. – నాగేంద్రచారి, వేములవాడ డీఎస్పీఇవి చదవండి: -
మితభాషణం
మనిషిని జంతుప్రపంచం నుండి వేరు చేసేది భాష, దానికి కారణమైన ఆలోచన, ఆలోచనకి మూలస్థానమైన మెదడు. ఇంతటి విలువైనదానిని సద్వినియోగం చేసుకోటం తెలివిగలవారి లక్షణం. కాని, దానిని దుర్వినియోగం చేసే వారిని ఏమనాలి? అన్నింటి వలెనే మాటని కూడా పొదుపుగా వాడుకోవాలి. ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’ అని నానుడి. ఇది మాటలకి కూడా వర్తిస్తుంది. అతిగా మాట్లాడటాన్ని వాగటం అంటారు. జల్పమన్నా అదే. అవి పేరుకి మాటలే కాని, వాస్తవానికి శబ్దాల సముదాయాలు మాత్రమే. అతిగా మాట్లాడుతూ ఉంటే అనవసర విషయాలు ప్రసక్త మౌతూ ఉంటాయి. ఏదో ఒకటి మాట్లాడాలనే తపన వల్ల అసత్యాలు దొర్లవచ్చు. కొన్నిసార్లు అప్రయత్నంగా నోరు జారి బయటపెట్ట కూడని విషయాలు బహిర్గతం అవుతాయి. ఆ సంగతిని గుర్తించక పోవచ్చు, కాని, ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోవటం కుదరదు. దాని వల్ల ఇబ్బందులు, కొండొకచో ప్రమాదాలు కూడా కల్గవచ్చు. శతృత్వాలు పెరిగితే మనశ్శాంతి కరువు అవుతుంది. కొంచెం నోరు సంబాళించుకుంటే ఎంత బాగుండేది? అని తరవాత ఎంతగా పశ్చాత్తాప పడినా ఏం లాభం? గతం గతః అతిగా మాట్లాడటం కూడా ఒక వ్యసనం. వ్యసనం అంటే వదిలి పెట్టలేని అలవాటు. చేస్తున్నది తప్పని తెలిసినా, చేయకుండా ఉండలేని బలహీనత వ్యసనం. వాగటం అనే బలహీనత ఉన్న వారు అవతలి వాళ్ళు విసుక్కుంటున్నారు, వినటం లేదు అని గుర్తించినా మాట్లాడటం ఆపలేరు. ఈ లక్షణం చిన్నపిల్లలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పెద్దవాళ్లు మాట్లాడ వద్దన్నా, చివరకు చేతితో నోరు మూసినా, వేళ్ళసందులలో నుండి తాము చెప్పదలచిన దానిని చెప్పేస్తారు. పిల్లలని వాగుడుకాయ అని తేలికగా తేల్చేస్తాం. పెద్దలని ఊరుకోమని అనలేం. పెద్దవారిని ఎదురుగా అనకపోయినా వాచాలుడు, వ్యర్థప్రసంగి, అధికప్రసంగి అంటూ తేలికగా మాట్లాడుతారు. నోరు అదుపులో ఉంటే ఈ చెడ్డ పేరు రాదు. కుటుంబ సభ్యుల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య, సహోద్యోగుల మధ్య, దేశాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి సత్సంబంధాల బదులు తగాదాలు, యుద్ధాలు రావటానికి కారణం చాలా వరకు అధిక ప్రసంగాలే. ‘‘మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు’’ అని సరసంగా మొదలయిన సంభాషణ చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి ఏకైక మార్గం వీలైనంత తక్కువగా మాట్లాడటం. అందుకే ‘‘ఊరుకున్నంత ఉత్తమం లేదు’’ అనే సామెత వచ్చింది. అవతలివారి రహస్యాలను కూపీ తియ్యటానికి చేసే మొదటి పని, ఉత్తమమైన పద్ధతి వారిని మాటల్లోకి దించటం. మాటల ధోరణిలో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయి వాగి, వాగి తమ వ్యక్తిగత విషయాలను, గోప్యంగా ఉంచవలసిన కుటుంబ వ్యవహారాలను, చివరకు దేశరక్షణకు సంబంధించిన రహస్యాలను కూడా బయట పెట్టిన సందర్భాలు చరిత్రలో కనపడతాయి. ఆలోచనతో పాటు విచక్షణని కూడా ఉపయోగిస్తే దేనిని వృథా చేయటం ఉండదు. మాటని వృథా చేయటం అంటే ప్రకృతి మనకి ఇచ్చిన దానిని సరిగా వాడుకోక ప్రకృతి పట్ల అపచారం చేయటం. ఎందుకంటే మాట్లాడటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. వినే వారి సమయం వృథా అవుతుంది. అందుకే అతి వాగుడు ఆయుః క్షీణం అంటారు. నోరు చేసుకుని, నోరు పెట్టుకుని బతికేవాళ్ళు తగు జాగ్రత్తలని తెసుకోకపోతే ఆయువు తరిగే ప్రమాదం ఉంది సుమా! మునుల దీర్ఘాయువు రహస్యం కూడా ఇదే. కాళిదాసు పేర్కొన్న రఘువంశ రాజుల లక్షణాలలో మితభాషణం ఒకటి. అది సత్ప్రవర్తనలో ప్రధానాంశం. మనకి నోరు ఉన్నది మాట్లాడటానికే కదా! ఎందుకు పరిమితం చేసుకోవాలి? అన్న ప్రశ్నకి మహాకవి కాళిదాసే సమాధానం కూడా చెప్పాడు – ‘‘సత్యాయ మితభాషిణాం’’ అని. సత్యాన్ని పలకటానికి మాత్రమే పెదవి విప్పేవారట. -
కార్చిచ్చు కనిపించని ఉచ్చు..!
కార్చిచ్చులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఏడాదికేడాది కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగిన క్షణాల్లోనే సమీపంలో నగరాలకు విస్తరించి దగ్ధం చేస్తున్నాయి. అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ కార్చిచ్చు బీభత్సంలో 80 మందికి పైగా మరణించారు. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి. మొదలైతే.. అంతే ► పశ్చిమ అమెరికా, దక్షిణ ఆ్రస్టేలియాలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చులన్నీ అక్కడే వ్యాపించాయి. గత కొన్నేళ్లుగా బ్రిటన్ అత్యధికంగా కార్చిచ్చుల బారినపడుతోంది. 2019లో బ్రిటన్‌లో 135 కార్చిచ్చులు వ్యాపించి 113 చదరపు మైళ్ల అడవిని దగ్ధం చేశాయి. రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలకు కూడా కార్చిచ్చు ముప్పు అధికంగా ఉంది. ► బ్రిటన్‌లో మాంచెస్టర్‌లో 2019లో సంభవించిన కార్చిచ్చు ఏకంగా మూడు వారాల పాటు కొనసాగింది. 50 లక్షల మంది వాయు కాలు ష్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో వ్యాపించిన కార్చిచ్చు వేలాది ఇళ్లను దగ్ధం చేసింది. 300 కోట్ల జంతువులు మరణించడమో లేదంటే పారిపోవడం జరిగింది. ► అమెరికాలో కాలిఫోరి్నయాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. 2020లో కార్చిచ్చు 4 లక్షల హెక్టార్ల అడవుల్ని మింగేసింది. 1200 భవనాలు దగ్ధమయ్యాయి. ► 2021లో ప్రపంచ దేశాల్లో కార్చిచ్చుల వల్ల 176 వందల కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసింది కార్చిచ్చులతో ఏర్పడిన కాలుష్యానికి ప్రపంచంలో ఏడాదికి దాదాపుగా 34 వేల మందికి ఆయుష్షు తగ్గి ముందుగానే మరణిస్తున్నారు. ► 1918లో అమెరికాలో మిన్నెసోటాలో ఏర్పడిన కార్చిచ్చు చరిత్రలో అతి పెద్దది. ఈ కార్చిచ్చు వెయ్యి మంది ప్రాణాలను బలి తీసుకుంది. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఏడాదికి 40 లక్షల చదరపు కిలోమీటర్ల అడవుల్ని కోల్పోతున్నాం. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి పెరిగిపోనున్న కార్చిచ్చులు 14% 2050 నాటికి30%, ఈ శతాబ్దం అంతానికి 50%కార్చిచ్చులు పెరుగుతాయని యూఎన్ హెచ్చరించింది. ఎందుకీ మంటలు ? ► కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చుల్లో 10 నుంచి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి, కరువు పరిస్థితులు ఏర్పడి, చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక మెరుపు మెరిసినా కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి. ► మానవ తప్పిదాల కారణంగా 85 నుంచి 90% కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. అడవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లి క్యాంప్‌ఫైర్ వేసుకొని దానిని ఆర్పేయకుండా వదిలేయడం, సిగరెట్లు పారేయడం, విద్యుత్ స్తంభాలు వంటివి కూడా కార్చిచ్చుకి కారణమవుతున్నాయి. ► ఇందనం లేదంటే మరే మండే గుణం ఉన్న పదార్థాలు చెట్లు, పొదలు, గడ్డి దుబ్బులు ఉన్న అటవీ ప్రాంత సమీపాల్లో ఉంటే కార్చిచ్చులు ఏర్పడతాయి. 2021లో కాలిఫోరి్నయాలో చమురు కారణంగా 7,396 కార్చిచ్చులు ఏర్పడి 26 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. ► ప్రస్తుతం అమెరికా హవాయి ద్వీపంలో కార్చిచ్చు మెరుపు వేగంతో వ్యాపించడానికి డొరైన్ టోర్నడో వల్ల ఏర్పడిన బలమైన గాలులే కారణం. కాలిఫోర్నియాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపించడానికి గాలులే ప్రధా న పాత్ర పోషించాయి. అగ్గి మరింత రాజేస్తున్న వాతావరణ మార్పులు సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. మానవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ రేపు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి. 1760లో పారిశ్రామిక విప్లవం వచి్చన తర్వాత భూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయాయి. దీని ప్రభావం ప్రకృతిపై తీవ్రంగా పడింది. అటవీ ప్రాంతాల్లో తేమ తగ్గిపోవడం వల్ల కార్చిచ్చులు మరింత ఎక్కువ కాలం పాటు సంభవిస్తున్నాయి. జనాభా పెరిగిపోవడం వల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకోవడంతో కార్చిచ్చులు జనావాసాలకు పాకి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అమెరికాలోని కాలిఫోరి్నయాలో అత్యధికంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి తీవ్రత మరింత పెరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఏ సమస్య అయినా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా గ్లోబల్ వారి్మంగ్ దగ్గరకే వచ్చి ఆగుతోంది. భూతాపాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో పని చేస్తే కార్చిచ్చులతో పాటు ఇతర సమస్యల్ని కూడా అధిగమించవచ్చు. చరిత్రలో భారీ కార్చిచ్చులు దేశం ఏడాది దగ్ధమైన అటవీ రష్యా 2003 2.2 కోట్ల హెక్టార్లు ఆ్రస్టేలియా 2020 1.7 కోట్ల హెక్టార్లు కెనడా 2014 45 లక్షల హెక్టార్లు అమెరికా 2004 26 లక్షల హెక్టార్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
TS: వానలు మిగిల్చిన విషాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్క ములుగు జిల్లాలోనే 30 మందికిపైగా వరదల్లో గల్లంతు అయినట్లు సమాచారం. అంతటా గల్లంతైన వాళ్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. జంపన్న వాగు ఉగ్రరూపంతో ఏడుగురు గల్లంతు అయ్యారు. వాగు పోటెత్తి కొండాయి, మల్యాల గ్రామాలను ముంచెత్తింది. ఏడుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులను మజీద్, షరీఫ్, అజ్జు, గుర్తు తెలియని ఓ మహిళ ఉన్నారు. ఇక.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొరంచ వాగు ఉధృతితో నిన్న మొరంచపల్లి గ్రామం నీట మునిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉదయం కల్లా వాగు ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు పునరావాస కేంద్రాల్లో మొరంచపల్లి గ్రామస్తులు ఉన్నారు. గల్లంతైన నలుగురు గ్రామస్తుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. భూపాలపల్లి-పరకాల-హన్మకొండ జాతీయ రహదారి మరమతు పనులు చేపట్టారు అధికారులు. మొరంచపల్లి లో వరదలకు 100కు పైగా పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేటలో విషాదం చోటుచేసుకుంది. మారేడుగొండ చెరువుకు గండిపడి ముగ్గురు సభ్యులున్న కుటుంబం కొట్టకుపోయింది. అందులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యంకాగా.. మిగతా ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వరద కారణంగా ములుగు-ఏటూరు నాగారం బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాణ నష్టం లేకుండా చూడాలంటూ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ సైతం తాజాగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే కురిసన వర్షాలు, వరదలతో.. భూపాలపల్లి, ములుగుతో పాటు ఉమ్మడి వరంగల్‌లోని మహబూబాబాద్, అలాగే సిద్ధిపేట, నిజామాబాద్, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ మరణాలు సంభవించాయి. వరదల్లో కొట్టుకుపోయి.. గోడలు కూలి.. కరెంట్‌షాక్ మరణాలు సంభవించాయి. తెలంగాణ వ్యాప్తంగా అధికారులు 14 మందే చనిపోయారని ప్రకటించినప్పటికీ.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని స్పష్టమవుతోంది. -
ప్రాణ నష్టం జరగొద్దు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు, ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వరద పరిస్థితులపై గురువారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఆయన ప్రగతిభవన్ నుంచి సమీక్షించారు. మంత్రులతో ఎప్పటి కప్పుడు ఫోన్లో మాట్లాడారు. ఎక్కడైనా ప్రమా దాలు జరిగితే వెంటనే మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధి కార యంత్రాంగం రేయింబవళ్ళు క్షేత్ర స్థాయిలో ఉంటూ రక్షణ చర్యలు చేపడుతున్నారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్‌కు ఆదేశాలు.. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు తీసుకోవా ల్సిన చర్యలను సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె సచివాల యం నుంచి వరద పరిస్థితులను సమీక్షిస్తు న్నారు. ముంపు ప్రాంతాలకు హెలికాప్టర్లు, ఆహారం, వైద్యం, రక్షణ సామగ్రి పంపించారు. పోలీసు యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలని డీజీపీ అంజనీ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు డీజీపీ రాష్ట్ర స్థాయి వరద పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్‌ఫ్లోలు ముందుగా అంచనా వేయాలి గోదావరి, ఉప నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని ఇరిగే షన్ అధికారులను సీఎం ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రాజెక్టుల సీఈలకు స్వయంగా ఫోన్ చేసి పరిస్థితులను ఆరా తీశారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా మంత్రులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఫోన్లలో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఆరా తీస్తూ సూచనలు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫోన్ చేసి గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మోరంచపల్లిలో ప్రజలను రక్షించే చర్యలను సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయ చర్యలను పర్యవేక్షించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తమ తమ జిల్లాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
అవగాహనే అస్త్రంగా..!
సాక్షి, హైదరాబాద్: వరుసగా జరుగుతున్న భారీ అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అగ్ని మాపక శాఖ అప్రమత్తమైంది. బహుళ అంతస్తుల భవనాలు, చాలా ఏళ్ల క్రితం నిర్మించిన వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణపై అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రమాదం జరిగితే ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లే అవకాశాలు ఇలాంటి చోట్లలోనే ఎక్కువగా ఉండటంతో ఈ తరహా భవన సముదాయాల్లో ఉండే వారికి అవగాహన పెంచడమే లక్ష్యంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు అగ్ని మాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే ఎలా జాగ్రత్తపడాలన్న అంశాలపై ఈ శిబిరాల్లో వివరిస్తున్నట్టు వివరించారు. అలాగే అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయకూడదన్న విషయాలు కూడా వివరిస్తున్నారు. వాణిజ్య సముదాయాలతోపాటు పెట్రోల్ బంక్‌లు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని పాత బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల్లోని దుకాణ యజమానులకు, ఆయా దుకాణాల్లో పనిచేసే వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తాజాగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రమైన పొగ కారణంగా లోపల చిక్కుకుపోవడం, ఆ సమయంలో ఎలా తప్పించుకోవాలో అవగాహన లేకపోవడంతోనూ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా వాణిజ్య సముదాయాల్లో పనిచేసే వారికి జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవలే అన్ని జిల్లాలతోపాటు రీజియన్ల ముఖ్య అగ్ని మాపక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఫైర్‌స్టేషన్ అధికారులు తమ పరిధిలోని భవనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశంపై ఆడిటింగ్ చేయడంతోపాటు, ప్రమాదాల నియంత్రణకు జాగ్రత్తలు వివరించాలని ఆదేశించారు. -
మంచి మాట: శత్రుత్వంతో శత్రుత్వం పెట్టుకుందాం
ఏ ఒకవ్యక్తిని మాత్రమో... ఏ కొంతమందిని మాత్రమో కాదు, కుటుంబాలకు కుటుంబాలను, ఊళ్లకు ఊళ్లను, రాష్ట్రాలకు రాష్ట్రాలను, దేశాలకు దేశాలను, మొత్తం ప్రపంచాన్ని వేధించేది శత్రుత్వం. ప్రతిమనిషికీ, ప్రపంచానికీ శత్రుత్వం తీరని గాయాల్ని కలిగిస్తూనే ఉంది. జీవితాలకు జీవితాలే శత్రుత్వానికి కాలి బూడిద అయిపోయాయి. శత్రుత్వం అగ్ని అయి అందరికీ అంటుకుంది, అంటుకుంటోంది... ఉన్నంతవరకూ నిప్పు కాలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా శత్రుత్వం మనిషి కడతేరిపోయేంతవరకూ రగులుతూనే ఉంటుంది. అంతేకాదు వ్యక్తులుపోయాక కూడా వాళ్ల వారసులకూ అంటుకుని శత్రుత్వం వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంది. శ్వాస తీసుకుంటున్నట్లుగా మనిషి శత్రుత్వాన్ని కూడా తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తోంది. పుట్టీపుట్టడంతోనే శత్రువును, వ్యాధిని ఎవరైతే పోగొట్టుకోడో అతడు ఎంతటి బలవంతుడైనా నశించిపోతాడని భోజ చరిత్రం చెబుతోంది. అంటే వ్యాధిని, శత్రువును లేదా శత్రుత్వాన్ని ముదరనివ్వకూడదు. సాధ్యమైనంత వేగంగా వాటిని తీర్చేసుకోవాలి. శత్రుత్వం వ్యాధిలాంటిది అని అనడం, అనుకోవడం కాదు శత్రుత్వం వ్యాధికన్నా వినాశకరమైంది అనే సత్యాన్ని మనం తప్పకుండా అవగతం చేసుకోవాలి. కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం మరికొన్ని దేశాలనూ బాధించింది, బాధిస్తోంది... కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం వల్ల జరిగిన యుద్ధాల్లో కలిగిన ప్రాణ నష్టాన్ని, సంపద నష్టాన్ని చరిత్ర మనకు తెలియజెబుతూనే ఉంది. శత్రుత్వం కారణంగా దేశ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు, విలవిలలాడిపోతున్నారు...ఇటీవలి కరోనా విలయానికి కూడా కొన్ని దేశాల శత్రుత్వమే కారణం అని కొన్ని పరిశీలనలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. సంస్కృతి పరంగానూ, సంపదపరంగానూ, విద్యపరంగానూ, అభివృద్ధి పరంగానూ ఏర్పడిన శత్రుత్వం ప్రధాన కారణం కాగా మనదేశంలోకి విదేశీ దురాక్రమణదారులు చొరబడి దేశాన్ని కొల్లగొట్టడమూ, ఆక్రమించుకోవడమూ, సామాజిక పరిస్థితిని అల్లకల్లోలం చెయ్యడమూ అందువల్ల మనదేశానికి పెద్ద ఎత్తున నష్టం, కష్టం కలగడమూ చారిత్రికసత్యంగా మనకు తెలిసిందే. కొన్ని శతాబ్దులకాలం మనదేశం పరపాలనపీడనలో దురవస్థలపాలవడానికి శత్రుత్వం ప్రధానమైన కారణం అయింది. ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా శత్రుత్వం కారణంగా ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో దురంతాలకు శత్రుత్వం ఒక్కటే ప్రాతిపదిక అయింది. శత్రుత్వం ఉంటే దురంతమే ఉంటుంది. శత్రుత్వం ప్రేరణకాగా ప్రపంచంలో ఎన్నో ఘోరమైన పరిణామాలు జరిగాయి. శత్రుత్వంవల్ల మనం ఎంత మాత్రమూ క్షేమంగా లేం. శత్రుత్వంవల్ల చాలకాలం క్రితమే మనిషితో మనిషికి ఉండాల్సిన సంబంధం లేకుండాపోయింది. శత్రుత్వం మనిషిని ఆవహించింది అందువల్ల మనం ఎంత మాత్రమూ భద్రంగా లేం. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం బుద్ధిలోకి తీసుకోవాలి. మనిషి ప్రగతి, ప్రశాంతతలను, ప్రపంచ ప్రగతి, ప్రశాంతతలను ధ్వంసం చేస్తున్న శత్రుత్వాన్ని తక్షణమే త్యజించాలి. క్షయకరమైన శత్రుత్వం మనిషి లక్షణం కాకూడదు. శత్రుత్వం మనిషి జీవనంలో భాగం కాకూడదు. ‘ఇది నాలుగురోజుల జీవితం ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం’ ఈ భావంతో తెలుగు కవి–గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఒక ఉర్దూగజల్ షేర్ రాసి, పలికారు. ఆలోచిద్దాం... మన బతుకుల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఛిద్రం చేసే శత్రుత్వం మనకు ఎందుకు? ఆలోచిద్దాం... మనం జీవించడానికి శత్రుత్వం అవసరం ఉందా? మనం శత్రుత్వాన్ని సంపూర్ణంగా వదిలేసుకుందాం. అది సాధ్యం కాకపోతే శత్రుత్వంతోనే శత్రుత్వం చేద్దాం. సాటి మనిషికీ, సమాజానికీ కాదు మనిషి శత్రుత్వానికి శత్రువైపోవాలి. మనిషికి శత్రుత్వంలో ఉన్న నిజాయితి, అభినివేశం స్నేహంలో లేకుండా పోయాయి. ఇది విధ్వంసకరమైన స్థితి. ఈ స్థితి మనకు వద్దు. మనిషి తీరు మారాలి. శత్రుత్వం ఇలలో లేకుండా పోవాలి. ఇప్పటికే మనమందరమూ శత్రుత్వం వల్ల ఆవేదన చెందుతున్నాం. ఇకనైనా సంసిద్ధులమై శత్రుత్వంతో శత్రుత్వమూ, స్నేహంతో స్నేహమూ చేస్తూ బతుకుదాం. నిజమైన మనుషులమై మనం మనకూ, ప్రపంచానికీ వీలైనంత మంచి, మేలు చేసుకుందాం. ‘ఇది నాలుగురోజుల జీవితం, ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? / నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం‘ – రోచిష్మాన్ -
IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చిపడుతున్న అకాల వరదలు, కరువులతో దేశాలకు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అపార ఆస్తి, ప్రాణ నష్టాలతో అల్లాడుతున్నాయి.æ అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తుతాయని, వాటి తీవ్రత కూడా గతం కంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పుల ప్యానల్ (ఐపీసీసీ) వేసిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ► వారాంతపు వరదలతో ఆస్ట్రేలియా అల్లాడింది. దేశంలో చాలాచోట్ల ఇంకా కుండపోత కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల పాటు అతి తీవ్ర వర్షాలు తప్పవంటూ వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ► మధ్య ఆఫ్రికా దేశమైన చాద్ రిపబ్లిక్‌ది విచిత్ర పరిస్థితి. నిన్నామొన్నటిదాకా దుర్భరమైన కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ఇప్పుడేమో గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ► థాయ్‌లాండ్‌ను కూడా నెల రోజులుగా భారీ వరదలు ఊపిరి సలపనివ్వడం లేదు. 77 రాష్ట్రాలకు గాను ఏకంగా 59 రాష్ట్రాలు వరద బారిన పడ్డాయి. 4.5 లక్షల ఇళ్లు దెబ్బ తినడమో కూలిపోవడమో జరిగింది. 40 శాతం ప్రాంతాలు ఇంకా మునకలోనే ఉన్నాయి. తాజాగా సోమవారం 8 దక్షిణాది రాష్ట్రాలకు భారీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి! ► ఫిలిప్పీన్స్దీ ఇదే పరిస్థితి. తుఫాను కారణంగా వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ► భారీ వరదలతో మెక్సికో తీరం అల్లాడుతోంది. ► భారత్‌లోనూ తుఫాన్ల దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు అల్లాడిపోయాయి. హైదరాబాద్‌నైతే కొన్ని వారాలుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కారణాలెన్నో...! గ్లోబల్ వార్మింగ్ మొదలుకుని మితిమీరిపోయిన శిలాజ ఇంధన వాడకం దాకా తాజా వాతావరణ మార్పులకు కారణాలెన్నో! ప్రధాన కాలుష్య కారణమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు 90 శాతం దాకా శిలాజ ఇంధనమే కారణమవుతోంది. అడవుల విచ్చలవిడి నరికివేత, అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న పెట్రో ఉత్పత్తుల వెలికితీత వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు మరో పదేళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రత ఏకంగా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగితే ఆశ్చర్యం లేదని ఐపీసీసీ సర్వే హెచ్చరించింది! ‘‘ఇప్పటికైతే వాతావరణ మార్పులు అకాల వర్షాలకు, భారీ వరదలకు కారణంగా మారుతున్నాయి. వర్షపాతపు తీరుతెన్నులను కూడా అవి చాలావరకు మార్చేస్తున్నాయి’’ అని వివరించింది. నైజీరియాలో వరదలు.. 600కు చేరిన మరణాలు అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఈ సీజన్లో ఆగస్ట్ నుంచి సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 603 మంది మృతి చెందారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలకు గాను 33 రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వర్షాల వల్ల ప్రాణనష్టం జరగొద్దు
సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. బుధవారం ప్రగతిభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల ప్రభావితమైన హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ప్రమాదకరంగా ఉన్న అలాంటి కట్టడాలను తొలగించే చర్యలు కొనసాగించాలని సూచించారు. కల్వర్టులు, బ్రిడ్జిలను పరిశీలించి ప్రమాదకరమైన చోట్ల హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నగరం, పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి అధికారులు కలసి వరద నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అన్ని పురపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. -
వరద గోదారిపై హైఅలర్ట్
* అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్ * అన్ని చర్యలు తీసుకోండి.. ప్రాణనష్టం జరగకూడదు * లోతట్టు ప్రాంతాలవారిని రక్షిత ప్రదేశాలకు తరలించండి * మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించాలి * రెండేళ్ల వరకు కరువుండదని వ్యాఖ్య.. వరదలపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: గోదావరికి వరద పోటెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మంత్రులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సమన్వయం చేసుకుంటూ పని చేయాలని, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా స్పందించాలన్నారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సోమవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం సేకరించాలని, అవసరమైన సూచనలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి సూచించారు. మనుషులు, మూగజీవాల ప్రాణాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. అధికారుల సూచనలు పాటించి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ప్రాజెక్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండాయని, లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని సీఎం చెప్పారు. ఇన్‌ఫ్లోలను బట్టి ఔట్‌ఫ్లోలను నిర్ధారించుకోవాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. ప్రతీ ప్రాజెక్టు వద్ద నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తంగా ఉంచి, పర్యవేక్షించాలన్నారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌తోపాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు నిండాయని, చెరువులు అలుగుపోయడంతో గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. మరో రెండేళ్ల వరకు కరువు దరిచేరని విధంగా వర్షాలున్నాయని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా నీళ్లను హైదరాబాద్ మంచినీటి అవసరాలకు వాడాలని, గండిపేట, హిమాయత్‌సాగర్ నీళ్లను యథావిధిగా ఉంచడం వల్ల నగర పరిధిలో భూగర్భ జలమట్టం పెరుగుతుందన్నారు. చెరువు కట్టలను ఎప్పటికప్పుడు గమనించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, చెరువులను చూసేందుకు వెళ్లే సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పోలీసులు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రమాదకరస్థాయికి గోదావరి! వరదలతో ఉప్పొంగుతున్న గోదావరి ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని సీఎం అన్నారు. ఎగువన మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున వరద ప్రవాహం వస్తోందని, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, సింగూరు తదితర ప్రాజెక్టులన్నీ నిండాయన్నారు. వాటి నుంచి నీరు విడుదల చేస్తున్నందున గోదావరికి గంటగంటకూ నీటి ప్రవాహం పెరుగుతుందన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకల ద్వారా భారీగా నీరు గోదావరిలోకి చేరుతోందన్నారు. అందువల్ల కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి ప్రవాహ ఉధృతి ఆదివా రం రాత్రికి 8 లక్షల క్యూసెక్కులకు చేరుతుందన్న అంచనా ఉందన్నారు. ఏటూరునాగారం వద్ద బస చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను, భద్రాచలం వద్ద ఉండి ఎప్పటికప్పుడు స్పందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సీఎం ఆదేశించారు. -
గంధవరంలో భారీ అగ్నిప్రమాదం
⇒ఆరిళ్లు, రెండు దుకాణాలు దగ్ధం ⇒తప్పిన ప్రాణ నష్టం ⇒రూ.4 లక్షల ఆస్తినష్టం ⇒ సర్వం కోల్పోయిన బాధితులు గంధవరం (చోడవరం) : గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరు పూరిళ్లు, టీ, కిళ్లీ షాపులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాద సమయంలో ఆటుగా వెళుతున్న మోటారు సైకిలిస్టు చూసి కేకలు వేయడంతో బాధితులు ప్రాణాలతో బయపడ్డారు. చోడవరం-అనకాపల్లి రోడ్డులో గంధవరం గ్రామం ఉంది. అర్ధరాత్రి అటుగా వెళుతున్న మోటారు సైకిలిస్టు రోడ్డు పక్కనే ఉన్న టీ కొట్టు నుంచి మంటలు వ్యాపించడాన్ని గమనించి పెద్దగా కేకలు వేశాడు. దీంతో ఇళ్లలో ఉన్న వారంతా హాహాకారాలు చేసుకుంటూ బయటకు పరుగుతీశారు. అగ్నికి వాయుదేవుడు తోడవడంతో క్షణాల్లో మంటలు ఇళ్లను చుట్టుముట్టాయి. కళ్ల ముందే ఇళ్లు అగ్నికి ఆహుతవడాన్ని వారు జీర్ణించుకోలేక బోరున విలపించారు. ప్రమాదంలో షేక్ పీర్ సాహెబ్ కుటుంబం సర్వం కోల్పోయింది. పల్లా అప్పలనాయుడు, పల్లా సన్నిబాబు, అప్పలర్సమ్మ, ఊసర్ల రామకృష్ణ, పల్లా అప్పయ్యమ్మల పూరిళ్లు, టీ, కిళ్లీ షాపులు కాలిబూడిదయ్యాయి. పీర్ సాహెబ్‌కు చెందిన సుమారు రూ.2 లక్షలు వరకు ఆస్తినష్టం వాటిల్లింది. స్థానిక ఎంపీటీసీ మొల్లి ప్రసాద్, సర్పంచ్ పల్లా నర్సింగరావు, స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. సమాచారం తెలుసుకున్న చోడవరం, అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశాయి. అప్పుచేసిన సొమ్ము కాలిపోయింది ‘గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. మటన్ దుకాణం ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. వేరే చోట ఇల్లు కట్టుకోవడానికి అప్పుతెచ్చిన రూ.50 వేలు, రెండు తులాల బంగారం, 12 తులాల వెండి పట్టీలు, మూడు సైకిళ్లు, నా కొడుకు పదో తరగతి, పాలిటెక్నికల్ సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలం’టూ బాధితులు షేక్ పీర్ సాహెబ్, పాతిమ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
పక్కా వ్యూహం.. ఒడిశా సొంతం
* విపత్తు నష్టాల కట్టడిలో అందరికీ ఆదర్శం * 1999 సూపర్ సైక్లోన్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగు * నష్ట నివారణకు ప్రతిసారీ ముందస్తు చర్యలు * విపత్తుల నిర్వహణకు సమగ్ర విధానం * పంచాయతీ నుంచి ప్రభుత్వం వరకు అందరికీ బాధ్యత * ఆపత్కాలంలో మూడు దశల వ్యూహం అమలు సాక్షి, విజయవాడ బ్యూరో: విపత్తుల సమయాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలను నియంత్రించడం, ప్రజలను పరిమిత ఇబ్బందులతో గట్టెక్కించడం అనేవి ప్రభుత్వాలు అనుసరించే విపత్తు నిర్వహణ విధానాలపైనే ఆధారపడి ఉంటాయి. ఈనెల 12వ తేదీన సంభవించిన హుదూద్ తుపానుకు సంబంధించి నష్ట నివారణ కోసం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ముందస్తు నష్ట నివారణ చర్యలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. అతి చిన్న రాష్ట్రం, మౌలిక వసతుల్లో మనతో ఏమాత్రం సరితూగలేని ఒడిశా విపత్తు నష్ట నివారణ చర్యల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ కంటే చాలా ముందుందని ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాటిచెబుతున్నాయి. 14 జిల్లాల్లో పదివేల మందిని పొట్టన పెట్టుకున్న 1999 సూపర్ సైక్లోన్ అనుభవం నుంచి ఒడిశా ప్రభుత్వం నేర్చుకున్న పాఠాలు, అనుసరిస్తున్న సమగ్ర విపత్తు నివారణ చర్యలు ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా మార్చాయి. గత ఏడాది పైలీన్, తాజా హుదూద్ తుపాన్ల సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని అనేక ముందు జాగ్రత్త చర్యలను ఒడిశా ప్రభుత్వం తీసుకోవడమే ఇందుకు నిదర్శనం. తుపాన్లు వచ్చే ముందు చెట్ల కొమ్మలు నరికేస్తే చెట్లు పడిపోకుండా ఉంటాయి. రవాణా వ్యవస్థకు అవరోధం ఉండదు. మొన్నటి హుదూద్‌కు ముందు ఒడిశా ప్రభుత్వం అదే చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మన ప్రభుత్వం ఆ పనిచేయలేదు. మూడు దశల వ్యూహం... విపత్తులను ఎదుర్కొనేందుకు మూడు దశల వ్యూహాన్ని పకడ్బందీ ప్రణాళికలతో ఒడిశాలో అమలు చేస్తున్నారు. తుపానుకు ముందు నష్టాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు (ప్రీ డిజాస్టర్ స్టేజ్), తుపాను వచ్చిన సమయంలో సన్నద్ధంగా ఉండి ఎదుర్కోవడం (రెస్సాన్స్ ఫేజ్), తుపాను తర్వాత పునరావాస, పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవడం. ఈ మూడు దశల్లోను స్థానిక పంచాయతీలు, ఎన్జీవోలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, రెడ్‌క్రాస్ తదితర అనేక సంస్థలను భాగస్వాముల్ని చేస్తున్నారు. వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే దానిపై స్థానిక ప్రజలతో మాక్ డ్రిల్స్ చేయిస్తున్నారు. పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ అధికారులు, సిబ్బందితోపాటు వివిధ సంస్థల నుంచి వేలాదిమంది వాలంటీర్లను తయారు చేశారు. వారికి విపత్తుల సమయంలో ఒత్తిడిని తట్టుకునే శిక్షణ కూడా ఇస్తున్నారు. వీరి వివరాలతో ఒక డేటాబేస్ తయారు చేసి అవసరమైన సమయంలో వెంటనే రంగంలోకి దించుతున్నారు. ఈ విధానం ద్వారా థానే, నీలమ్, పైలీన్ వంటి తుపానులను ఒడిశా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొని నష్టాలను తగ్గించుకోగలిగింది. మొన్నేం చేసిందంటే... హుదూద్ తుపాను ఒడిశాలోని గోపాలపురం సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ పేర్కొనడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గంజాం, గజపతి, కలహండి, మల్కజ్గిరి, కోరాపుట్, రాయగడ, నవరంగ్‌పూర్ తదితర జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తుపాను గాలులకు చెట్లు నేలకూలే ప్రమాదం ఉన్నందున రహదారుల వెంబడి చెట్ల కొమ్మలను నరికించింది. దీనివల్ల చెట్లపై గాలి ప్రభావం తగ్గి అవి అలాగే ఉన్నాయి. తుపానుకు ముందే విద్యుత్తు సరఫరా నిలిపేసి ప్రజలకు టార్చిలైట్లు అందించింది. వీధిలైట్లన్నీ తీసి భద్రపరిచింది. ప్రజలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో నీటి ట్యాంకులను పూర్తిగా నింపి సిద్ధంగా ఉంచింది. పిల్లలకు ఇబ్బంది లేకుండా టెట్రా పాలపొడి ప్యాకెట్లు, బిస్కెట్లు స్టాకు పెట్టింది. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా బంగాళా దుంపలు, ఉల్లిపాయలు ముందుగాానే నిల్వలు ఉంచింది. కరెంటు లేకపోయినా తుపానుకు సంబంధించి నిరంతరం తాజా సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ప్రతి ఇంట్లో రేడియో ఉంచుకునేలా ప్రజలను చైతన్య పరిచింది. హుదూద్‌కు ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రలో ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. 1999లో సూపర్ సైక్లోన్ నష్టాల అనంతరం అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒడిశాలో నష్టాలను పరిశీలించి వచ్చారు. కానీ మన ప్రభుత్వం తర్వాత కూడా విపత్తులను ఎదుర్కొనేందుకు సమగ్రమైన ప్రణాళికలు రూపొందించలేదు. అందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నిపుణుల మాట. -
దిష్టిబొమ్మల్లా అగ్ని మాపక కేంద్రాలు
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: అసలే ఎండాకాలం.. అగ్ని ప్రమాదం జరిగిందంటే క్షణాల్లో అంతా భస్మమై పోతుంది. ఇలాంటి సమయాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలో ఇవి దిష్టిబొమ్మల్లా మిగిలాయి. వీటిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు భారీ నష్టం వాటిల్లుతోంది. చాలా చోట్ల వాహనాలు చాలకపోవడం, రిపేర్లు, నీటి కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 వేల మంది జనాభాకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలి. కాని జిల్లాలో 12 ఫైర్ స్టేషన్లు.. 15 వాహనాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 40.40 లక్షల మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం జిల్లాకు 81 అగ్నిమాపక కేంద్రాలు ఉండాలి. కాని ఉన్నవి 12 మాత్రమే. మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసినా 54 కేంద్రాలు ఉండాల్సి ఉంది. కనీసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున కూడా లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. కర్నూలు, నంద్యాల, ఆదోని పట్టణ కేంద్రాల్లో రెండేసి వాహనాలు ఉండగా శ్రీశైలం, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ పట్టణాల్లో అగ్ని మాపక కేంద్రాలున్నాయి. నందికొట్కూరు, కోవెలకుంట్ల పాణ్యం, మంత్రాలయంలో ఏర్పాటుకు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించినా ఇప్పటి వరకు అతీగతీ లేదు. జిల్లాలో అనుబంధంగా ఎక్కడా ఆంబులెన్స్‌లు లేకపోవడం గమనార్హం. సొంత భవనాల్లోనే కేంద్రాలు ఉన్నప్పటికీ ఆదోని, నంద్యాల స్టేషన్లు శిథిలావస్థకు చేరాయి. ఆలూరు వాహనం పదేళ్లకు పైబడి సేవలందిసోంది. దీంతో ఈ వాహనంతోపాటు మరికొన్ని వాహనాలు తరచూ రిపేర్ల కారణంగా మొరాయిస్తున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష!
- అగ్నిప్రమాదాల నివారణలో అదే కీలకం - చిన్న చిన్న జాగ్రత్తలతో బతుకు భద్రం న్యూఢిల్లీ: వేసవి కాలం.. అగ్నికి ఆజ్యం పోసే కాలం. ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని వింటూనే ఉంటాం. అనుకోకుండా మన దగ్గర ప్రమాదం జరిగితే ఒక్కోసారి మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. ఆ అగ్ని ప్రమాదం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. కళ్లెదుటే సర్వస్వం బుగ్గి పాలవుతుంటే గుండెలు పగిలే వేదన అనుభవించాల్సి వస్తుంది. అప్పటి వరకు దర్జాగా జీవించిన వారు ప్రమాదం జరిగిన మరుక్షణమే కట్టుబట్టలతో రోడ్డున పడతారు. దిగువ, మధ్య తరగతి ప్రజలు నిలువ నీడ లేక అల్లాడిపోతారు. తిరిగి గూడు సమకూర్చుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఏమీ చేయలేని మనం అవి జరగకుండా మాత్రం ఎన్నైనా చేయగలం. కనీసం అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎనలేని ఆస్తులు, ప్రాణాలు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోగలం. ప్రమాదాలను నివారించే వీలు కూడా ఉంటుంది. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ప్రమాదాలు దరికి రాకుండా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒకసారి పరిశీలిద్దాం. పాఠశాలలు, ఆస్పత్రుల్లో.. - పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌లో ఆర్సీసీ లేదా కాంక్రిట్ స్లాబులనుమాత్రమే పైకప్పులుగా వాడాలి. - ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. - సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లను ఉపయోగించాలి. - పాఠశాలలు, ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తప్పించుకునేందుకు సరైన ప్రణాళిక రచించి అది అందరికీ తెలిసే విధంగా తగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. బయటకు వెళ్లే మార్గాల్లో(మెట్లు, తలుపుల వద్ద) ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి. - ఐఎస్ఐ మార్కు కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని వాడాలి. - తాటాకులు, గడ్డితో వేసిన పైకప్పు కలిగిన నిర్మాణాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్వహించరాదు. - షార్ట్‌సర్క్యూట్ జరిగితే అగ్నిప్రమాదం సంభవించకుండా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అమర్చుకోవాలి. - అగ్ని ప్రమాదం అరికట్టడానికి సరిపడా నీరు, ఫిక్సిడ్ ఫైర్ ఫైటింగ్ పరికరాలు అందుబాటులో ఉంచాలి. - ఫైర్ ఎవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకోసారి తప్పకుండా నిర్వహించాలి. కర్మాగారాల్లో.. - పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఉద్యోగులందరికీ అగ్ని ప్రమాదాల ఉనికిని గుర్తించేలా ప్రాథమిక పరిజ్ఞానం కల్పించాలి. - అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించాలి. మిషనరీ బెల్టులు, పుల్లీలు, విద్యుత్ పరికరాల నుంచి అగ్గి రవ్వలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్క్యూట్లో ఓవర్ లోడ్ వేయకూడదు. - మండే స్వభావం ఉన్న దుమ్ము, ధూళి పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - కార్మికులు పనిచేసే చోట ప్రమాదాలు సంభవిస్తే వెంటనే బయటకు వెళ్లిపోవడానికి వీలుగా ద్వారాలు ఏర్పాటు చేయాలి. వంటింట్లో.. - వంటింట్లో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. - గ్యాస్ సిలిండర్ ట్యూబ్ ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మార్చాలి. నాణ్యమైన ట్యూబ్లనే వాడాలి. - గ్యాస్ స్టౌ ఎత్తయిన ఫ్లాట్‌ఫాంపై ఉండేలా చూసుకోవాలి. - వంట గ్యాస్ వాడకం పూర్తి కాగానే రెగ్యులేటర్ వాల్వ్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలి. - గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ ఆపి వేయాలి. ఆ సమయంలో ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్‌లు, ఆన్ ఆఫ్ చేయొద్దు. వెంటనే అగ్నిమాపక, గ్యాస్ కంపెనీల సాయం కోరాలి. - మండుతున్న స్టౌలో కిరోసిన్ పోయొద్దు. వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివిస్టౌ దగ్గర నిల్వ ఉంచరాదు. గోదాముల్లో.. - వస్తు నిల్వలను చెక్క స్లీపర్లపై నిల్వ చేయాలి. - గోదాం బయట వస్తువులను నిల్వ చేయరాదు. పరిసర ప్రాంతాల్లో పొగతాగడం వంటివి నిషేధించాలి. - వివిధ రకాల వస్తువులను స్టోరేజీ ర్యాకుల్లో విడివిడిగా నిల్వ చేయాలి. - గోదాముల్లో తగినంత గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. - వస్తు నిల్వల మధ్యలో గ్యాంగ్వే, క్రాస్‌వే సెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే మంచిది. - వస్తువుల ఎగుమతి, దిగుమతి సమయాల్లో ట్రక్కులు, ఇతర వాహనాల ఇంజన్లు ఆపివేయాలి. - వస్తు నిల్వలు 4, 5 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు. తప్పనిసరి అయితే నిల్వలకు పెకప్పు కనీసం రెండు అడుగుల దూరం ఉంచాలి. - గోదాం సమీపంలో తగినంత నీరు, అగ్నిమాపక సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అగ్ని ప్రమాదం సంభవిస్తే.. - ప్రమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలి. - విద్యుత్ అగ్ని ప్రమాదం జరిగితే నీటిని ఉపయోగించకుండా పొడి ఇసుక లేదా మట్టి వాడాలి. - ఎలక్ట్రికల్ ఫైర్ జరిగినప్పుడు ముందుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. - అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పెళ్లి పందిళ్లు, ఇతర పందిళ్లు వేయాలి. - పందిళ్ల చుట్టూ కనీసం 4.5 మీటర్ల ఖాళీ స్థలాన్ని ఉంచాలి. - ఎలక్ట్రికల్ లైవ్ వైర్లు, పెండాల్స్కు కనీసం రెండు మీటర్ల దూరం ఉంచాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు - ఇంట్లోని వస్తువులు అల్మారాలు, షెల్పుల్లో సక్రమంగా ఉంచండి. ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. - చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు ఇతర మండే గుణం ఉన్న వస్తువులు, సామగ్రి అందుబాటులో లేకుండా చూడాలి. - కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలు పూర్తిగా ఆర్పి వేయాలి. - ఇంట్లో ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలు వాడాలి. - పాడైన వైర్లు వాడొద్దు. ఓవర్‌లోడ్ వేయొద్దు. ఎలక్ట్రికల్ సాకెట్లలో దాని సామర్థ్యానికి మించి ప్లగ్‌లను వాడొద్దు. - పడుకుని పొగ తాగొద్దు. ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులపై కుటుంబంతో బయటకు వెళ్తే ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి. - టపాకాయలు కాల్చే సమయంలో నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించవద్దు. - వేసవిలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎండుగడ్డి, నేలరాలిన ఎండుటాకులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఊడ్చి బయటపడేయాలి. - ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆర్పడానికి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. - వేసవికాలంలో రాత్రిళ్లు కరెంటు ఎక్కువగా పోతుంది. కరెంటు పోయినప్పుడు క్యాండిళ్లు, కిరోసిన్ దీపాలు వెలిగించి అలాగే నిద్ర పోతుంటాం. అలా కాకుండా పడుకునే ముందు వాటన్నింటిని ఆర్పి వేయాలి. తప్పదనుకుంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. - ప్రమాదవశాత్తు నిప్పంటుకుంటే భయంతో పరుగెత్తకూడదు. దుప్పట్లు, తట్టులతో మంటలను కప్పేయాలి. వీలైనంత వరకు నేలపై దొర్లాలి.