LPG tanker
-
చైనాలో ఘోర ప్రమాదం: 19 మంది మృతి
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్నేయ చైనాలో ఓ ట్రక్ పేలిపోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో 19 మంతి మృతి చెందగా, 170 మంది గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఎల్పీజీ గ్యాస్‌తో వెళ్తున్న ఓ ట్రక్ జెజియాంగ్ ప్రావిన్స్‌లోని లియాంగ్‌షాన్ గ్రామం వద్ద గల హైవే మీద పేలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, పేలిపోయిన ట్రక్‌ను హైవేకు సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోకి తరలించగా.. అక్కడ ట్రక్‌లో మరోసారి పేలుడు సంభవించినట్లు తెలిపారు. దాంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఓ భవనం పేలుడు ధాటికి శిథిలమైంది. (ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన..) ఘటనపై వెన్లింగ్ డిప్యూటీ మేయర్ ఝు మింగ్లియన్ మాట్లాడుతూ.. క్షతగాత్రులకు సాయం అందించేందుకు 2,600 మంది రెస్క్యూ సిబ్బందిని పంపినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. (కీలక దశలో చైనా వ్యాక్సిన్) -
సూడాన్‌లో భారీ అగ్నిప్రమాదం
ఖార్టూమ్: ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో పరిశ్రమ నిండా మంటలు కమ్ముకొని 18 మంది భారతీయులను బతికుండగానే కాల్చేశాయి. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని సీలా సిరామిక్ పరిశ్రమలో మంగళవారం ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా, వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు. 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సూడాన్‌లోని భారత ఎంబసీ అధికారులు అక్కడికి చేరుకొని వివరాలను సేకరించారు. ఆ పరిశ్రమలో మొత్తం 68 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు ఢిల్లీలోని అధికారులకు బుధవారం సమాచారం అందించారు. ఈ విషయం తెలిసిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదం బారిన పడిన భారతీయుల వివరాలను వెల్లడించారు. అందులో 7 మంది కాలిన గాయాలతో ఆస్పత్రిపాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. మొత్తం 34 మంది భారతీయులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వెల్లడించింది. ఆ దేశంలోని భారత ఎంబసీ 24 గంటల హెల్ప్‌లైన్ +249–921917471ను ఏర్పాటు చేసింది. సిరామిక్ పరిశ్రమలోని ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి తోడు ప్రమాదం జరిగిన చోట భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఉండడంతో ప్రమాద స్థాయి పెరిగింది. దీంతో పరిశ్రమ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. -
వ్యాట్‌ను రద్దు చేయకుంటే సమ్మె
పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ హైదరాబాద్: పెట్రోలియం, ఎల్పీజీ ట్యాంకర్లపై విధించిన విలువ ఆధారిత పన్నును ప్రభుత్వం రద్దు చేయాలని, లేకుంటే ఈ నెల 29 అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగుతామని తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కె. రాజశేఖర్, డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్, ఎల్పీజీ ట్రక్స్ ఓనర్స్ అధ్యక్షుడు సురేశ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆరీఫ్ ఉల్ ఉస్సెన్, కోశాధికారి బీఎన్ ప్రసాద్ మాట్లాడారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో రవాణా కిరాయిలపై 5 శాతం వ్యాట్‌ను విధించగా... ఈ నెల 5న తెలంగాణ ప్రభుత్వం దానిని 14.5 శాతానికి పెంచిందన్నారు. ప్రభుత్వం దీన్ని తక్షణమే ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన, ఇకపై విధించే పన్నులను ఆయిల్ కంపెనీలే భరించాలన్నారు. ఇకపై డీజిల్ ధరలు పెరిగినా, తగ్గినా అదే రోజు నుంచి కిరాయి సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జాయింట్ సెక్రటరీ కె. సుధాకర్‌రెడ్డి, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.