Macaque
-
పోలీసుల విచారణలో మెడికోలు
వేలూరు: వానరాన్ని చిత్ర హింసలు పెట్టిన అనంతరం పూడ్చి పెట్టిన కేసులో విద్యార్థుల వద్ద పోలీసులు విచారణ చేపట్టారు. వేలూరు బాగాయంలోని సీఎంసీ వసతి గృహంలోకి వచ్చిన ఓ వానరాన్ని పట్టుకుని చిత్రహింసలకు గురిచేసిన అనంతరం దాన్ని పూడ్చి పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై మూగజీవాల సంరక్షణా సలహాదారుడు సిలవన్ క్రిష్ణన్ ఫిర్యాదు మేరకు వానరం కళేబరాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేపట్టిన అధికారులు చిత్రహింసలు పెట్టిన విషయాన్ని నిర్ధారించారు. దీంతో సదరు విద్యార్థులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి వద్ద విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నలుగురు విద్యార్థులను విచారించేందుకు అటవీ అధికారులు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అరుుతే అటవీ శాఖ పరిసరాల్లో కాకుండా వేరే చోట ఈ సంఘటన చోటుచేసుకుని ఉండడం వల్ల కేసును తమకు అప్పగించాలని పోలీసులను వారు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులకు లేఖ రాసిన అటవీ అధికారులు కేసును తమకు అప్పగిస్తే అటవీ ప్రాంత మూగ జీవాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చలించిన పసి హృదయూలు
కుప్పంరూరల్ ధనార్జనే ధ్యేయం గా కాలంతో పరుగులు తీస్తున్న ఈ ఆధునిక యుుగంలో పసి హృదయూలు వూనవత్వానికి వూరుపేరుగా నిలిచాయి. వుండల పరిధిలో ని కాలనూరు గ్రావుంలో చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. ప్రవూదవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఓ వాన రం గాయుపడింది. చూసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే వానరం పడుతున్న బాధను గమనించిన కొంతమంది చిన్నారులు సపర్యలు చేశారు. గాయూలకు పసుప్పొడి పూశారు. తినడానికి తీసుకున్న వుురుకులు, పెప్పరమింట్లను ఆ వానరానికి తినిపించారు. బడికి వెళ్లడం, ఆడుకోవడం తప్ప వురో ప్రపంచం తెలియుని చిన్నారులు చలించిన తీరు అందరి నీ కదిలించింది. పెద్దలుతలదించుకోవడంతో పాటు వారికి అభినందనలు తెలిపారు.