పోర్టు భూసమీకరణకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
మచిలీపట్నం(చిలకలపూడి) : బందరు పోర్టు భూసమీకరణకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఎంఏడీఏ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ బందరు పోర్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. పోర్టుతో పాటు పారిశ్రామిక కారిడార్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. భూసమీకరణ ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. భూ యజమానులతో పాటు రైతు కూలీలకు కూడా పింఛన్లు అందిస్తామని మంత్రి వివరించారు. అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో బందరు ఆర్డీవో సాయిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), మునిసిపల్ వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, డెప్యూటీ కలెక్టర్లు సుజాత, సమజ, పద్మావతి, నరేంద్రప్రసాద్, బందరు తహసీల్దార్ బి.నారదముని పాల్గొన్నారు.