స్కైవేలు, రోడ్లకు తొలివిడత నిధులు
టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీకి సీఎం ఆదేశం
హైదరాబాద్: రాజధాని నగరంలో స్కైవేలు, మేజర్ కారిడార్లు, మేజర్ రోడ్లు, గ్రేడ్ సెపరేటర్లు, ఇతర రహదారుల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ పనులకు తొలి విడత కింద రూ.3,981 కోట్ల అంచనా వ్యయంతో 12 పనులకు టెండర్లు పిలవాలని సూచించారు. మిగిలని పనులకు కూడా దశల వారీగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
మంగళవారం సచివాలయంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని, పద్మారావు, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో పలు అంశాలపై సీఎం సమీక్షించారు. నగర వ్యాప్తంగా మొత్తం 135 కిలోమీటర్ల స్కై వేలు, 166 కిలోమీటర్ల మేజర్ కారిడార్లు, 348 కిలోమీటర్ల మేజర్ రోడ్లు, 54 గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని నిర్ణయించారు.