Manalookadu
-
వివాదానికి జవాబిస్తారా?
మ్యూజిక్ డెరైక్టర్, యాక్టర్, ‘మనలో ఒకడు’ ఆర్పీ పట్నాయక్ ఈ వారం ‘బూమ్‌బూమ్’ షోలో కనిపించనున్నారు. కాంట్రవర్సీకి భయపడని ఆర్పీ ‘బూమ్‌బూమ్’లో యాంకర్ అనసూయ రేపిన కాంట్రవర్సీకి జవాబు ఇస్తారా? మాటలు కట్ చేస్తారా? అది ఆదివారం రాత్రి 9.30 గం.కు జెమిని టీవీలో చూడవచ్చని ‘జెమినీ’ ప్రతినిధి పేర్కొన్నారు. -
ఛానళ్లతో ఢీ.. నేను రెడీ!
‘‘సంచలన వార్తల పేరుతో టీవీ ఛానళ్లు నిజాలను పక్కన పెడుతున్నాయి. ఆ మీడియా వ్యవస్థపై పోరాడిన ఓ అధ్యాపకుడు కృష్ణమూర్తి కథ ఇది. ఎవర్నీ టార్గెట్ చేయలేదు. సినిమా చూసి ఎవరైనా హర్టయితే ఆ పర్యవసానాలను ఎదుర్కోవడా నికి నేను రెడీ’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘మనలో ఒకడు’. గురజాల జగన్మోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలవుతోంది. ఆర్పీ మాట్లాడుతూ - ‘‘మీడియాలో ప్లస్సూ, మైసస్సూ.. రెండూ ఉన్నాయి. ఈ సినిమాలో మైనస్సులు చూపిస్తున్నా. నిర్మాత సెన్సార్ అవుతుందో? లేదోనని భయపడ్డారు. ఇలాంటి సినిమాలు ప్రస్తుతం అవసర మని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. తదుపరి సినిమాతీయాలనుకుంటున్నా’’ అన్నారు.