‘ఎస్-క్రాస్’ ధర తగ్గించిన మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తన ‘ఎస్-క్రాస్’ కారు దరను రూ.40,000-రూ.2,05,000 శ్రేణిలో తగ్గించింది. కంపెనీ ఎస్-క్రాస్ మోడల్‌ను 1.6 లీటర్, 1.3 లీటర్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో గతేడాది ఆగస్ట్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. అధిక ధరల కారణంగా ఈ కారు విక్రయాలు ఆశించినంత స్థాయిలో లేవు.
దీంతో కంపెనీ తాజాగా కారు ధరలను తగ్గించింది. కంపెనీ వెబ్సైట్ సమాచారం ప్రకారం.. 1.6 లీటర్ ఇంజిన్ వేరియంట్ ధర రూ.2,05,000, 1.3 లీటర్ వేరియంట్ ధర రూ.40,000-రూ.66,000 శ్రేణిలో తగ్గింది. ఎస్-క్రాస్ ధరను సవరించామని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్.కల్సి తెలిపారు. ఎస్-క్రాస్ విక్రయాలు ఆరు నెలల్లో 17,000 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ సీనియన్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ చెప్పారు.