Viral: మైనర్‌తో బాడీ మసాజ్ చేయించుకున్న క్రికెట్ కోచ్
క్రికెట్ క్రీడకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్‌కు సంబంధించిన ఈ వీడియోలో అబ్దుల్ అహద్ అనే కోచ్.. మైనర్ క్రికెటర్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ దర్శనమిచ్చాడు. యూపీలోని రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరలవ్వడంతో సదరు కోచ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్పీ సింగ్ సస్పెండ్ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు అబ్దుల్ అహద్‌పై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం అబ్దుల్ అహద్‌పై విచారణ జరుగుతుందని, డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్ఎన్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించామని యూపీ స్పోర్ట్స్ డైరెక్టర్ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. కాగా, అబ్దుల్ అహద్ రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో కోచ్‌గా విధులు నిర్వహిస్తూనే అక్కడే వార్డన్‌గా కూడా పని చేస్తున్నాడు. ఈ స్టేడియంలో క్రికెట్‌తో పాటు వాలీబాల్ క్రీడాకారులకు హాస్టల్ సదుపాయం ఉంది. వార్డన్ కూడా అయిన అబ్దుల్ అహద్ హాస్టల్లోనే మకాం వేసి తరుచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటాడని యువ క్రీడాకారులు కంప్లైంట్ చేశారు.
నెట్టింట చక్కర్ల కొడుతున్న వీడియోలో మైనర్ క్రికెటర్ ఒంటిపై షర్టు లేకుండా కోచ్‌కు అయిష్టంగా బాడీ మసాజ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో గతేడాది ఆగస్ట్‌లో రికార్డు చేసినదిగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగుచూస్తున్నాయి. స్పోర్ట్స్ హాస్టల్లలో ఉండే యువ క్రీడాకారులు, క్రీడాకారిణులు కోచ్, ఇతర సిబ్బందిపై ఫిర్యాదులు చేస్తున్నారు. కోచ్‌లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఇటీవలికాలంలో చాలా కంప్లైంట్లు రిజిస్టర్ అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.