పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు స్వాధీనం
అమృత్ సర్: మాదక ద్రవ్యాలను నిరోధించడంలో భద్రతా సిబ్బంధి మరో కీలక ముందడుగు వేశారు. పంజాబ్, పాకిస్థాన్ సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) బలగాలకు, మాదక ద్రవ్య ముఠాకు మధ్య బుధవారం పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం వారి వద్ద నుంచి భద్రతా దళాలు 21 కిలోల హెరాయిన్, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారని ఆధికారులు వెల్లడించారు.