metric tons
-
‘చెత్త’ సమస్యకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రోజురోజుకూ వెలుస్తున్న కొత్త ఆవాసాలు, కాలనీలకనుగుణంగా చెత్త కూడా పెరుగుతోంది. ఈ చెత్త ఒకేచోట గుట్టలుగా పేరుకుపోకుండా ఉండేందుకు ఎక్కడికక్కడే చిన్న మొత్తాల్లో నిల్వ చేసేందుకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు.. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా సర్కిల్‌కు మూడు వంతున 30 సర్కిళ్లకు 90 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్(ఎస్‌సీటీపీ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొన్ని సర్కిళ్లలో మూడు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు దొరకకపోవడం.. కొన్ని ప్రాంతాల్లో దొరికినా స్థానికుల నుంచి ఎదురైన వ్యతిరేకతతో ఎలాగోలా 24 ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటు చేయగలిగారు. స్థల సమస్య కారణంగా మిగతా 66 ఎస్సీటీపీలను ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ చెత్త నిర్వహణ పకడ్బందీగా సాగాలంటే ఏరోజుకారోజు తరలించేందుకు వీలుగా ఎస్సీటీపీలు లేని ప్రాంతాల్లో మొబైల్ వాహనాలను అందుబాటులో ఉంచి వాటి ద్వారా చెత్త తరలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో ఆరు వాహనాలు అదనంగా ఉంచి 72 (రెఫ్యూజి కంటైనర్) వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. వీటినే మొబైల్ ఎస్సీటీపీలుగా చెబుతోంది. కనీసం వెయ్యి చదరపు మీటర్ల స్థలం ఉన్నా ఎస్సీటీపీలను ఏర్పాటు చేయగలమని జీహెచ్ఎంసీ పేర్కొంది. అందుకోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి ఎస్సీటీపీలతోపాటు మొబైల్ ఎస్సీటీపీల వల్ల సర్కిళ్లనుంచి చెత్తను ఎప్పటికప్పుడు జవహర్‌నగర్ డంపింగ్యార్డుకుతరలిస్తునట్లు తెలిపింది. డంపింగ్‌యార్డుకు తరలించేవాహనాల్లో పోర్టబుల్ సెల్ఫ్ కాంపాక్టర్, స్టాటిక్ కాంపాక్టర్, సీల్డ్ కంటైనర్ సదుపాయాలున్నట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తుండటంతో పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొంది. -
సచివాలయ వ్యర్థాలు 62వేల మెట్రిక్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: సచివాలయ కూల్చివేతల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పునర్వినియోగించనున్నారు. అందుకుగాను జీడిమెట్లలోని కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్‌డీ) వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 20 నుంచి 31వ తేదీ వరకు 62 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించా రు. మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతాయని అంచనా. కూల్చివేతల వ్యర్థాల తరలింపు సక్రమంగా జరుగుతున్నదీ లేని దీ జీహెచ్ఎంసీ అధికారులు నిత్యం పరిశీలి స్తున్నారు. కమిషనర్ ఆదేశాలకనుగుణంగా సంబంధిత అడిషనల్ కమిషనర్, ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు. తరలింపు సందర్భంగా వాహనాలపై టార్పాలిన్లు కప్పడం, రహదారులపై వ్యర్థాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి సూచిస్తున్నారు. స్టీల్, వుడ్ వంటివి తరలింపునకు ముందే కూల్చివేతల ప్రాంతంలోనే వేరు చేస్తుండగా, జీడిమెట్లలోని ప్లాంట్‌కు తరలించాక కాంక్రీట్‌లో స్టీల్, తదితరమైనవి ఏవైనా ఉంటే వేరు చేస్తున్నారు. నగరంలో నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ జీడిమెట్లలో రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు రాంకీ సంస్థకు అనుమతినిచ్చింది. ప్రస్తుత చార్జీల మేరకు మెట్రిక్ టన్నుకు రూ.367లు. ఈ లెక్కన రెండు లక్షల మెట్రిక్ టన్నులకు రూ.7 కోట్లకు పైగా కాంట్రాక్టు సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు వంద వాహనాలను వ్యర్థాల తరలింపునకు వినియోగిస్తుండగా, ఇప్పటివరకు 2,700 ట్రిప్పుల మేర తరలించినట్లు సమాచారం. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఇటుకలు, కెర్బ్‌లు, ఇసుక వంటివి తయారు చేస్తారు. -
వరి ఉత్పత్తే 2.54 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా ఆహారధాన్యాల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ మేరకు 2020–21 వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళికలో ఉత్పత్తి అంచనాలను పొందుపర్చింది. నైరుతి రుతుపవనాలతో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు పూర్తి కావడం, నియంత్రిత సాగు పద్ధతులను అనుసరిస్తుండటం వంటి కారణాలతో బంఫర్ క్రాప్ వస్తుందని వ్యవసాయశాఖ ప్రకటించింది. ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇందులో వానాకాలంలో 1.28 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, యాసంగిలో 1.60 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. గతేడాది ఉత్పత్తితో పోలిస్తే ఈ ఏడాది 44 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉంటుందని తెలిపింది. కోటి మెట్రిక్ టన్నులు అధికంగా.. ఈసారి వరి ఉత్పత్తే 2.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని వ్యవసాయశాఖ తెలిపింది. గతేడాది కంటే కోటి మెట్రిక్ టన్నులు అధికం కావడం గమనార్హం. ఈ వానాకాలంలో 1.21 కోట్ల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 1.33 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటుందని తెలిపింది. రెండు సీజన్లలో కలిపి వరి 81.05 లక్షల ఎకరాలలో సాగవుతుందని అంచనా వేసింది. ఇక పత్తి 60.17 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 14.71 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. పప్పు ధాన్యాలు రెండు సీజన్లలో కలిపి 8.35 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తుందని కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయశాఖ పేర్కొంది. -
44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌కు సంబంధించి రైతుల నుంచి ఇప్పటివరకు 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు అంశంపై కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రెండవ, మూడవ త్రైమాసికాలకు సంబంధించి ధాన్యం నిధులు విడుదల కాకపోవడం వల్ల చెల్లింపుల్లో స్వల్ప జాప్యం జరిగిందన్నారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. బ్యాంకులు, నాబార్డ్ నుంచి అడ్వాన్సులు తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చెల్లింపులు జరపాలని ఆదేశించారని చెప్పారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను బుధవారం చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు వార్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 1902కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 1నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్ కు1వ తేదీ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కోన శశిధర్ చెప్పారు. కృష్ణా జిల్లాలో మినునులు, పెసలు పంట వేయడం వల్ల ధాన్యాన్ని ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ఎప్పుడు వీలైతే అప్పుడే ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించవచ్చన్నారు. -
లెవీ సేకరణకు...సమస్యలు హెవీ
విజయనగరం కంటోన్మెంట్ :ఖరీఫ్ సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగో లు చేసి నిత్యావసరాల పథకానికి మళ్లించేందుకు అధికారులు కొత్తగా 60 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. జిల్లాలో ఈ ఏడాది 1,10,505 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. దీంతో 2,60,876 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా. దీనిలో 76,705 మెట్రిక్ టన్నులు జిల్లాకు అవసరం మేరకు స్థానికంగా వినియోగించుకునే అవసరముంది. మిగతా 1,84,171 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయనున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన నిధుల విషయం ప్రశ్నార్థకంగా మారింది. క్వింటాకు రూ.1360 ల చొప్పున రైతులకు మద్దతు ధర చెల్లించవలసి ఉంది. అలాగే కేంద్రాల్లో వినియోగించే పరికరాల కొనుగోలుకు నిధులు కావా లి. ఈసొమ్మును ఎక్క డ నుంచి తీసుకువస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా నిధులు సమకూర్చుకున్నాయి. అయితే ఇంతవరకూ గ్రాంట్ విడుదల కాలేదు. ధాన్యం కొనుగోలుకు గత ఏడాది సెప్టెంబర్ నుంచే సన్నాహాలు ప్రారంభించిన అధికారులు అక్టోబర్ నెల ప్రారంభమైనా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సిబ్బంది కొరత... ధాన్యం సేకరణకు ఇప్పటివరకూ సిబ్బందిని కూడా గుర్తించలేదు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇద్దరు సహాయ మేనేజర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. సాంకేతిక సహాయకులు పది మంది అవసరముండగా కేవలం ఒక్కరే ఉన్నారు. ఇంకా తొమ్మిది మందిని గుర్తించాల్సి ఉంది. అలాగే ఇతర సహాయకులు మరో 60మంది ఉండగా ఒక్కరూ లేకపోవడంతో వీరందరినీ కొత్తగా నియమించుకోవాల్సి ఉంది. మొత్తంగా 72 మందికి ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉండగా 70మందిని కొనుగోలు కేం ద్రాలకు సరిపడా నియమించాల్సి ఉంది. ఆరువందల టార్పాలిన్లు అవసరం కాగా, ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద 69మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అం టే ఇంకా 531టార్పాలిన్లు కొనుగోలు చేయాల్సి ఉంది. విన్నోయింగ్ మిషన్లు 20 అవసరం కాగా, అన్నీ కొనుగోలు చేయవలసి ఉందని అధికారులు చెబుతున్నారు. తేమ కొలిచే యంత్రాలు 60కేంద్రాలకు ఒక్కొక్కటి చొప్పున ఉండాలి. కానీ ప్రస్తుతం 25 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ఇంకా 35కొనుగోలు చేయా ల్సి ఉంది. బరువు తూచే స్కే ళ్లు, తూనిక రాళ్లు కూడా దా దాపుగా లేనట్టే! ఇవి రెండే ఉండటంతో మిగతా 58 కొనుగోలు చేయాల్సిందే! హస్క్ రిమూవర్స్ మాత్రం 50 ఉన్నాయి. ఇంకా పది కొనుగోలు చేయాలి. అదేవిధంగా కాలిపర్స్ వంటి పలు పరికరాలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాల్సి ఉంది. మిల్లర్లు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లా వ్యా ప్తంగా 109మిల్లులు ఉండగా బాయిల్డ్ రైస్ మిల్లులు మరో నాలుగున్నాయి. ఈ మిల్లర్ల ద్వారా కూడా ధాన్యం కొనుగోలు చేస్తారు. కానీ వీరికి నిధుల సమస్య లేకపోయినా పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాల్సిన కేంద్రాలకు పెట్టుబడులను ఎక్కడి నుంచి తీసుకువస్తారో ఇప్పటికీ తేలలేదు. కలెక్టర్ ఎంఎం నాయక్ మాత్రం మార్కెటింగ్ శాఖ నుంచి వీటిని ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రకటించినప్పటికీ వారికి ఈ వెసులు బాటు ఉందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
యూరియా కేటాయింపులో పక్షపాతం
రాయచూరు టౌన్: జిల్లా రైతులకు అవసరమైన యూరియా కేటాయింపులో పాలకులు చూపుతున్న పక్షపాతంపై పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాకు కేటాయించిన 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల్లో ఇప్పటి వరకు 55 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే విడుదలైంది. నెలరోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల ఫలితంగా ఉన్నఫళంగా యూరియాకు డిమాండ్ పెరిగింది. గ్రామీణ వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ఎదుట రైతులు రాత్రింబవళ్లు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. జిల్లాకు వచ్చిన 55 వేల టన్నుల ఎరువుల్లో సగం బీఎస్ఎన్ఎస్ ద్వారాను, మిగిలిన సగం ఎరువుల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ జిల్లా, తాలూకా, ఫిర్కాకేంద్రాల్లో పక్షం రోజులు గడిచినా రైతులకు యూరియా దొరకడంలేదు. దీంతో దెబ్బతింటున్న తమ పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం 8 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రాగా, మరో రెండు రోజుల్లో 1500 మెట్రిక్ టన్నులు రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ విషయమై జిల్లాధికారి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ మేరకు ఓ లేఖద్వార పరిస్థితిని వివరించారు. ఇదిలా ఉండగా కొప్పళకు మాత్రం కేటాయించిన 43వేల మెట్రిక్ టన్నులకన్నా అధికంగా ఇప్పటి వరకు 54 వేల టన్నులు విడుదల చేశారు. అంటే ఆ జిల్లాకు కేటాయించిన దానికంటే 11వేల మెట్రిక్ టన్నులు అదనంగా ఆ జిల్లాకు లభించింది. కేంద్రం, రాష్ట్రంలో వే ర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉండడం వల్లే ఇలా జరుగుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు. కొప్పళ జిల్లా ఎంపీ బీజేపీ నాయకుడు కాగా, రాయచూరు ఎంపీ కాంగ్రెస్ అన్న విషయం తెలిసిందే. -
జిల్లాకు 5 వేల టన్నుల యూరియా
వారం రోజుల్లో రాక 75 వేల హెక్టార్లలో వరి సాగు జిల్లా కలెక్టర్ యువరాజ్ విశాఖ రూరల్: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సాగు విస్తీర్ణం పెరుగుతోందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువుల అదనపు కేటాయింపుల కోసం వ్యవసాయశాఖ కమిషనర్ తో మాట్లాడినట్లు చెప్పారు. ఈ వారంలో అదనంగా 5 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రానున్నట్లు వెల్లడించారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వరి 90 వేల హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా వర్షాభావ పరిస్థితులతో మూడు రోజుల క్రితం వరకు కేవలం 50 వేల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగిందన్నారు. ప్రస్తుతం వరి విస్తీర్ణం 75 వేల హెక్టార్లకు చేరుకుందన్నారు. ఆధార్ ఉంటేనే రేషన్ రేషన్‌కార్డులతో ఆధార్ సీడింగ్ 77.84 శాతం పూర్తయిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 75.62 శాతం అనుసంధానం జరగగా ఏజెన్సీలో తక్కువగా ఉందన్నారు. అర్బన్‌లో 81.5 శాతం మంది ఆధార్‌కార్డులు అందించారని మరో 4.5 శాతం మంది అనుసంధానం చేసుకొనే అవకాశముందని, మిగిలిన కార్డులన్నీ బోగస్‌గా భావిస్తున్నామన్నారు. ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి రేషన్ ఇవ్వరని చెప్పారు పెన్షన్లు శత శాతం అనుసంధానం పూర్తయినట్లు చెప్పారు. హౌసింగ్, పట్టాదార్ పుస్తకాలకు ఆధార్ సీడింగ్‌కు ఈ నెల 15 వరకు ప్రభుత్వం గడువునిచ్చిందన్నారు. మొబైల్ ఆధార్ సెంటర్లు రాగానే గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీలో ఉన్న పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రతి గురువారం గ్రామదర్శిని గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామదర్శిని కార్యక్రమం చక్కని వేదికని కలెక్టర్ యువరాజ్ పేర్కొన్నారు. జిల్లాలోని క్షేత్ర స్థాయి అధికారులతో సెట్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ గ్రామదర్శిని అమలుకు మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని కో-ఆర్డినేటింగ్ అధికారిగా నియమించామన్నారు. ప్రతి గురువారం గ్రామదర్శిని నిర్వహించాలని సూచించారు. అధికారులు గ్రామదర్శిని రోజున సంక్షేమ శాఖ వసతి గృహాల్లో రాత్రి బస చేయాలని చెప్పారు. ఇటీవల పట్టాదారు పాస్‌పుస్తకాల నమోదులో బోగస్ పాస్‌పుస్తకాలున్న ట్లు తెలిసిందని, వాటిని సృష్టించిన వారిపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని ఆదేశించారు. ఈనెల 5లోగా ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని సూచించారు. జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ నరసింహారావు, డీపీవో సుధాకర్, జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి, హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డుమా పీడీ శ్రీరాములునాయుడు పాల్గొన్నారు. వ్యవ‘సాయం’పై దృష్టి పెట్టండి నర్సీపట్నం టౌన్: వర్షాలు కురుస్తున్నందున వ్యవసాయ సంబంధ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ యువరాజ్ అధికారులను అదేశించారు. సోమవారం జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సెట్ కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడుడారు. రైతులకు కావలసిన ఎరువులపై అంచనా వేయాలని సూచించారు. ఆధార్ కార్డుల నమోదు వేగవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రికి హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్లకు పంపిస్తారని, వాటిపై వెంటనే నివేదికలు పంపాలని ఆదేశించారు. అక్టోబర్ నుంచి ప్రారంభించే ఎన్టీఆర్ సుజలస్రవంతి పథకానికి సంబంధించి ప్లాంట్ల నిర్వహణకు దేవస్థానాల వారు ముందుకు వచ్చారన్నారు. వీలైన గ్రామాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామదర్శని కార్యక్రమంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత నివ్వాలని, వసతి గృహాలలో నాణ్యమైన పౌష్టికాహారం సరఫరాను పరిశీలించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా నివారణలో అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. సెట్ కాన్ఫరెన్స్‌లో నర్సీపట్నం నుంచి ఆర్డీవో సూర్యారావు, తహసీల్దార్ పార్వతీశ్వర రావు, వివి.రమణ, సుందరావు పాల్గొన్నారు. -
3.20లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 3 లక్షల 20 వేల 176 మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. సోమవారం తన చాంబర్లో పౌర సరఫరాల అధికారులు, మిల్లర్ల సంఘం ప్రతినిధులు, ఐకేపీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 3 లక్షల 5 వేల 69 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని ఇంకా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లో నిల్వ ఉందన్నారు. ఈ ధాన్యాన్ని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పాక్షికంగా తడిసిందని, ఈ తడిసిన ధాన్యాన్ని మానవతా దృక్పథంతో మిల్లుల యజమానులు అన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. అందుకు మిల్లర్ల సంఘం ప్రతినిధులు అంగీకరించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ నాగేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ సుధాకర్, పౌర సరఫరాల శాఖ డీఎం, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.