అతిచిన్న పేస్‌మేకర్..
హూస్టన్ : ప్రపంచంలోనే అతిచిన్న పేస్‌మేకర్‌ను తక్కువ హృదయ స్పందన రేటుతో బాధపడుతున్న అమెరికాలోని ఓ రోగికి విజయవంతంగా అమర్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పేస్‌మేకర్ పరిమాణం విటమిన్ ట్యాబ్లెట్ కంటే చిన్నగా..ప్రస్తుతం వినియోగంలో ఉన్న పేస్‌మేకర్ సైజులో పదో వంతు మాత్రమే ఉంటుంది. మైక్రా ట్రాన్స్ కాథెటర్ పేసింగ్ సిస్టం (టీపీఎస్)గా వ్యవహరించే ఈ నూతన అతిచిన్న పేస్‌మేకర్‌కు అదనపు వైర్లు అవసరం లేదని, అలాగే రోగి క్రియల ఆధారంగా తన పనితీరును తనే సర్దుబాటు చేసుకుంటుందని వైద్యులు తెలిపారు.