భార్యను దారుణంగా హతమార్చిన భర్త
అర్ధవీడు (ప్రకాశం): తనను జైలుకు పంపించిందనే కోపంతో.. భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన ఎర్రగుంట రాంబాబుకు అదే గ్రామానికి చెందిన మధవి(27)తో రెండేళ్ల కిందట మూడో వివాహం జరిగింది. వివాహం అయినప్పటినుంచి తన బంగారాన్ని తాకట్టు పెట్టుకొని వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చుచేయడంతో ఆగ్రహించిన మాధవి అతన్ని జైలుకు పంపింది.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నరాంబాబు సోమవారం బెయిలు మీద బయటకు రాగానే మాగుటూరుకు వచ్చి భార్య కళ్లలో కారం కొట్టి, వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారైన నిందితుడు.. కొద్దిసేపటి కిందటే కంభం పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.