టీసీఎస్ శిక్షణ అకాడమీ ప్రారంభం..
సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ జపాన్‌కు చెందిన శిక్షణ అకాడమీని మోడీ మంగళవారమిక్కడ ప్రారంభించారు. ఇరు దేశాల్లోని ఐటీ నిపుణులకు సాంకేతిక, సాంస్కృతికపరమైన నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ అకాడమీ కృషిచేస్తుంది. ఈ సందర్బంగా 48 మంది టీసీఎస్ జపాన్ ట్రైనీల తొలి బ్యాచ్ భారత్ పర్యటనను కూడా మోడీ లాంఛనంగా ప్రారంభించారు.
‘21 శతాబ్దాన్ని నడిపిస్తున్నది సాంకేతికత, మేధోపరమైన పరిజ్ఞానమే. మీరంతా భారత్‌లో పర్యటించి తగిన విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటారని భావిస్తున్నా. టీసీఎస్‌లో మీరు ఉద్యోగులుగా మారనున్నారు. అయితే, భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు జపాన్‌కు తిరిగిరావాలని నేను ఆకాంక్షిస్తున్నా’ అని మోడీ పేర్కొన్నారు. ఈ రెండు గొప్ప దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో తాము కూడా పాలుపంచుకుంటుండటం తమకు గర్వకారణమని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్.చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు.