లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి
⇒ టీడీపీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం
⇒ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత చంద్రబాబుకు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఖాయమైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఆయనకు ఇవ్వాలని ఆదివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావే శంలో నేతలు పార్టీ అధినేత చంద్రబా బుని కోరినట్లు సమాచారం. దీనిపై ఆయన ఏమీ మాట్లాడక పోయినా ఈ విషయం ఖరారైనట్లు తెలిసింది. ఈసారి శాసనమండలిలో కచ్చితంగా లోకేష్ ఉంటారని పొలిట్ బ్యూరో నిర్ణయాలు వెల్లడించిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఏకగ్రీవంగా కోరినట్లు చెప్పారు.
సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈ అంశాన్ని లేవనెత్తి లోకేష్‌ను మండలికి పం పాలని ప్రతిపాదించగా ఇతర సభ్యులందరూ బలపరిచారు. సీఎం మాట్లాడుతూ అభ్యర్థు ల ఎంపిక తాను చూసుకుం టానని చెప్పినట్లు సమాచా రం. పాత వారితో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తానని, పార్టీకి సేవలందించిన వారికీ న్యాయం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక బాధ్యతను చంద్రబాబుకు అప్పగిస్తూ పొలిట్‌బ్యూరోలో తీర్మానించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే మనకే మంచి జరుగుతుందని నేతలకు చంద్ర బాబు వివరించారు. ఒకేసారి ఎన్నికలు జర పాలనే కేంద్రం నిర్ణయానికి మద్దతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. జగన్ కేసులపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయని తెలిసింది.