ఓరి దేవుడా!
– భక్తులు లేక వెలవెలబోతున్న నమూనా ఆలయాలు
శ్రీశైలం నుంచి సాక్షి బృందం: కృష్ణ పుష్కరాలకు శ్రీశైలంకు వచ్చే భక్తులకు కాణిపాకం వినాయకుడు, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి, బిక్కవోలు సుబ్రమణ్యస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, ఒంటిమిట్ట కొదండరామస్వామిల దర్శనం ఒకే చోట కల్పించడం కోసం నమూనా ఆలయాలు నిర్మించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలోని పుష్కర నగర్–2లో దేవదాయ శాఖ రూ. 40 లక్షలు ఖర్చూ పెట్టి నిష్ణాతులైన కళాకారులతో ఈ నమూనా ఆలయాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి భక్తులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. నమూనా ఆలయాలపై ప్రచారం చేయకపోవడం, భక్తులు వచ్చేందుకు దారులు తెలియకపోవడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్టీసీ బస్టాండ్‌కు దగ్గరలో, పాతాళగంగాకు వెళ్లేదారిలో, కళ్యాణ కట్ట సమీపంలోకానీ ఏర్పాటు చేసి ఉంటే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని పుష్కర భక్తులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ నమూనా ఆలయాలు నిర్మించడంలో ఉన్న చిత్తశుద్థి...భక్తులకు తెలిసేలా ప్రచారం చేయకపోవడంలో లేదనే విమర్శలు ఉన్నాయి. ముందుచూపు లేకుండా లేకపోవడంతో రూ. 40 లక్షల ప్రజా ధనం దుర్వినియోగమైనట్లే.