వాలీబాల్ జాతీయ జట్లు ఎంపిక
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం లో మూడు రోజు లుగా నిర్వహించిన అండర్-14 బాల బాలికల వాలీబాల్ రాష్ట్ర స్థాయి పో టీలు ఆదివారం ముగిశాయి. త్వర లో జమ్మూ-కాశ్మీర్లో జరగనున్న జాతీయస్థాయి అండర్-14 బాలబాలికల జట్టును ఎంపిక చేశారు. ఈ పోటీలకు మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో భానుచందర్(మెదక్), జి.రాజేశ్(వరంగల్), ఎండీ సయ్యద్(మెదక్), బి.వెంకటేశ్(వరంగల్), కె.వెంకటేశ్వర్‌రెడ్డి(గుంటూరు), శ్రీశైలం(మహబూబ్‌నగర్), టి.వెంకటేశ్వర్ (విజ యనగరం), డి.గణేశ్(శ్రీకాకుళం), కె.శ్రీనివాస్‌రావు(కృష్ణ), హరితేజ(మెదక్), గోపి(నిజామాబాద్), ఎం డీ సా హెబ్(మహబూబ్‌నగర్), నిఖిల్(రంగారెడ్డి), కృష్ణాప్రసాద్ (గుంటూరు), ఆదినారాయణ(శ్రీకాకుళం), అనురాగ్(హైదరాబాద్) ఎంపికయ్యారు.
బాలికల విభాగంలో...
జి.రమ్య(నిజామాబాద్), రజిత(నిజామాబా ద్), తన్మయి(కృష్ణ), మౌనిక(కృష్ణ), శ్రీవిద్య(వరంగల్), అనూష(వరంగల్), కాంచన(రంగారెడ్డి), లోహిత(కడప), శోభారాణి(శ్రీకాకుళం), శివపార్వతి(గుంటూరు), అఖిల(మహబూబ్‌నగర్), స్టాండ్‌బైగా వి.లత(నిజామాబాద్), ముస్కాన్ బేగం(కరీంనగర్), డి.లావణ్య(నెల్లూరు), ఎస్.రాజేశ్వరి(రంగారెడ్డి)లు జాతీయ స్థాయికి ఎంపికైన వారిలో ఉన్నారు.