నెట్టికంటుడి హుండీ ఆదాయం లెక్కింపు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. శ్రావణమాసం చివరి రెండు వారాలతో కలుపుకుని ఇప్పటి వరకు భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను(24 హుండీలను) ఆలయంలో లెక్కించారు. మొత్తం రూ.27,45,242 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు.
దీంతో పాటు 5 గ్రాముల బంగారం, 1600 గ్రాముల వెండిని భక్తులు కానుకల ద్వారా స్వామి వారికి సమర్పించారు. అదే విధంగా అన్నదానం హుండీ ద్వారా రూ. 11,709 రూపాయలను భక్తులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు, ఆలయ సిబ్బంది, పలు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.