'ఇప్పట్లో డేటింగ్‌కు సిద్ధంగా లేను'
లండన్: హాలీవుడ్ హీరో నిక్ కానన్.. తాను ఇప్పట్లో డేటింగ్ జోలికి వెళ్లాలను కోవడం లేదని చెబుతున్నాడు. ఆరేళ్ల వివాహజీవితం అనంతరం మరియా క్యారీతో విడిపోయిన ఈ హీరో సింగిల్‌గా ఉండటంలోనే ఆనందం ఉందంటున్నాడు. అయితే మరియా మాత్రం ఇటీవలే ఆస్ట్రేలియాకు చెందిన బిలియనీర్ జేమ్స్ ప్యాకర్‌తో తన ఎంగేజ్మెంట్ గురించి ప్రకటించింది. నిక్ కానన్, మరియా జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అమెరికన్స్ గాట్ టాలెంట్ టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నిక్.. ఇటీవలి కాలంలో తాను ఎక్కువ సమయం మెడిటేషన్లో గడుపుతున్నానని ఫీమేల్ ఫస్ట్‌తో మాట్లాడుతూ తెలిపాడు. తాను స్క్రిప్టు సిద్ధం చేస్తున్న తన తదుపరి చిత్రం కూడా డేటింగ్ నేపథ్యంలోనే ఉంటుందని, దీని కోసం డేటింగ్ గురించి మొత్తం తెలుసుకున్నానని చెప్పాడు. అయితే తాను మాత్రం ఆ ఊబిలోకి దిగదలచుకోవడం లేదని వెల్లడించాడు. ప్రస్తుతం తన గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని వేదాంత ధోరణిలో మాట్లాడాడు.